For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా ఏసీలలో కూర్చోవడం వల్ల చర్మానికి, జుట్టుకి కలిగే హాని..!

By Swathi
|

మనం ఫుడ్ లేకుండా, నీళ్లు లేకుండా, గాలి లేకుండా బతకలేం. అలాగే ప్రస్తుత జనరేషన్ ఏసీ లేకుండా కూడా బతకలేకపోతోంది. ఆఫీస్, ఇళ్లు, కారు, మెట్రో, బస్ అన్నింటిలోనూ, ఎక్కడచూసినా.. ఏసీలు ఉండాల్సిందే. కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ చల్లటి గాలి.. జుట్టుకి, చర్మానికి చాలా హాని చేస్తోంది.

బాడీ పెయిన్స్, డ్రై స్కిన్, పగిలిన పెదాలకు.. ఏసీలే కారణమని తెలుసుకోవాలి. నమ్మలేకపోతున్నారా ? నిజమే.. మీ జుట్టు, చర్మానికి ఏసీలు మీకు తెలియకుండానే చాలా హాని చేస్తున్నాయి. అవేంటో మీరే తెలుసుకోండి.

డ్రై స్కిన్

డ్రై స్కిన్

ఏసీల వాతావరణంలో మీ శరీరం 21 నుంచి 26 డిగ్రీల టెంపరేచర్ కి ఎక్స్ పోజ్ అవుతుంది. ఇది శరీర సాధారణ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే ఇది ఆయిల్ గ్లాండ్స్ లో సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం డ్రైగా, బిగుతుగా మారుతుంది.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

సోరియాసిస్, ఎగ్జిమా, సియానొసిస్, వేళ్లలో నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవాళ్లు ఏసీలలో గడిపితే.. లక్షణాలు మరింత ఎక్కువ అవుతాయి. సమస్య మరింత ఇబ్బందిపెడుతుంది.

త్వరగా ముడతలు పడటం

త్వరగా ముడతలు పడటం

చర్మం డ్రైగా మారడం వల్ల చర్మంలో త్వరగా వయసు లక్షణాలు కనిపిస్తాయి. రోజంతా ఏసీలలో గడిపినప్పుడు శరీరం న్యాచురల్ సెబమ్ ను ఉత్పత్తి చేయలేకపోతుంది. దీనివల్ల చర్మం డీహైడ్రేట్ కి గురవుతుంది. చర్మం మాయిశ్చరైజర్ ని కోల్పోవడం వల్ల.. ముడతలు, ఫైన్ లైన్స్ ఏర్పడతాయి.

డ్రై హెయిర్

డ్రై హెయిర్

ఆర్టిఫిషియల్ ఎయిర్ చర్మాన్నే కాదు.. జుట్టుని కూడా డ్రైగా మార్చేస్తుంది. ఏసీ రూమ్ లలో ఉంటూ, బయటకు వెళ్తూ ఉండటం వల్ల.. వేడి, చల్లటి టెంపరేచర్ ని ఎక్స్ పీరియన్స్ చేయడం వల్ల.. జుట్టు డ్రైగా మారుతుంది. దీనివల్ల చుండ్రు, స్కాల్ప్ లో దురద సమస్యలు ఎదురవుతాయి.

పగిలిన పెదాలు

పగిలిన పెదాలు

ఏసీల వల్ల వచ్చే డ్రై ఎయిర్ మీ పెదాలను డ్రైగా, పగిలేలా చేస్తాయి. హైడ్రేటెడ్ స్కిన్ దీనికి ప్రధాన కారణం. అయితే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఏసీల చర్మం, జుట్టుపై పడే దుష్ర్పభావాలను అరికట్టవచ్చు.

నీళ్లు తాగడం

నీళ్లు తాగడం

ప్రతిరోజూ ఖచ్చితంగా 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. చర్మం మాయిశ్చరైజర్ ని కోల్పోకుండా ఉంటుంది.

క్రీమ్

క్రీమ్

ముఖానికి, చేతులు, శరీరానికి చాలా మందంగా హైడ్రేటింగ్ క్రీం ఖచ్చితంగా అప్లై చేయాలి.

పెదాలకు

పెదాలకు

పెదాలకు తరచుగా లిప్ బామ్ అప్లై చేస్తూ ఉండటం వల్ల.. పెదాలు మాయిశ్చరైజర్ ని కోల్పోకుండా ఉంటాయి.

జాకెట్

జాకెట్

ఏసీలలో కూర్చున్నంతసేపూ.. చర్మాన్ని, జుట్టుని కవర్ చేసుకోవాలి. షాల్వ్ లేదా లైట్ జాకెట్ వేసుకుంటే.. మంచిది.

కాఫీ, టీ

కాఫీ, టీ

ఆఫీస్ లలో వర్క్ చేసేటప్పుడు వర్క్ ప్రెజర్ ని, టెన్షన్ ని తగ్గించుకోవడానికి కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్త పడాలి.

కళ్లు

కళ్లు

కళ్లు అలసిపోకుండా, మంట పుట్టడం, నీళ్లు కారడం వంటి సమస్యలు ఎదురవకూడదంటే.. కంట్లో డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి.

తలనొప్పి

తలనొప్పి

ఎయిర్ కండిషనర్స్ వల్ల చర్మం, జుట్టుకే కాదు.. ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

English summary

What Sitting in the AC All Day is Doing to Your Hair and Skin

What Sitting in the AC All Day is Doing to Your Hair and Skin. The artificial cold air is harming your hair and skin. Yes, blame the air-conditioner for your body pain, dry skin and chapped lips.
Story first published: Wednesday, September 21, 2016, 11:22 [IST]
Desktop Bottom Promotion