For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ళ మీద డార్క్ స్పాట్స్ ను తొలగించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

కాళ్ళ మీద డార్క్ స్పాట్స్ ను పర్మనెంట్ గా తొలగించలేము కానీ, వాటి కనబనివ్వకుండా లైట్ మార్చేయవచ్చు. అందుకు కొన్ని నేచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే...

By Lekhaka
|

అమ్మాయిల అందం అంటే టాప్ టు బాటమ్ ఆరోగ్యంగా...అందంగా..నాజూగ్గా తీర్చి దిద్దుకోవడమే. ముఖం, చేతులు, కాళ్ళు అన్నీ అందంగా నాజుగ్గా కనబడాలని కోరుకుంటారు. స్లీవ్ లెస్ లో చేతుల ఎలా అందంగా కనబడాలనుకుంటారో, అదే విధంగా షార్ట్స్ వేసుకొన్నప్పుడు కాళ్ళు కూడా అందంగా కనబడాలని కోరుకుంటారు. కొంత మంది సెలబ్రెటీలు, మోడల్స్, మ్యాగజైన్ కవర్ పేజ్ మీద, టీవీ కమర్షియల్స్ లో చాలా అందంగా కనబడుతుంటారు. అయితే రియాల్టీలో అలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. షార్ట్ వేసుకున్నప్పుడు, కాళ్ల మీద నల్ల మచ్చలు, గాయాలు, స్కార్స్ కనబడితే చాలా అసహ్యంగా ఉంటుంది.

10 Home Remedies To Get Rid Of Dark Spots On Legs

కాళ్ళ మీద నల్ల మచ్చలు కనబడితే చాలా ఇబ్బంది కరంగా ఫీలవుతుంటారు. డార్క్ స్పాట్స్ ఈ సమస్యతో ప్రతి 5గురిలో ఒకరు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఇది ఒక సహజ సమస్య. అలాగే ఎండకు ఎక్కువగా స్కిన్ ఎక్స్ పోజ్ అవ్వడం వల్ల హైపర్ పిగ్మెంటేషన్ కారణంగా డార్క్ స్పాట్స్ కనబడుతుంటాయి. చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల ఏజింగ్ సమస్య , సరైన చర్మ సంరక్షణ తీసుకోకపోవడం వల్ల డార్క్ స్పాట్ ఏర్పడుతుంటాయి.

ముఖంలో డార్క్ స్పాట్స్ తో విసిగెత్తి పోయారా..ఇవిగో సులభ చిట్కాలు

అలాగే స్కార్స్ రేజర్స్ ఉపయోగించడం వల్ల , చిన్ననాటి గాయాల వల్ల మరియు కొన్ని స్కిన్ అలర్జీల వల్ల స్కార్స్ ఏర్పడుతుంటాయి. కాళ్ళ మీద గాయాలు చాలా అసహ్యంగా కనబడుతాయి. ఇటువంటి డార్క్ స్పాట్స్ కేవలం కాళ్ళ మీద మాత్రమే కాదు, చెస్ట్, బ్యాక్ , హ్యాండ్స్ మీద కూడా ఏర్పడుతాయి.

డార్క్ స్పాట్స్ ను పర్మనెంట్ గా తొలగించలేము కానీ, వాటి కనబనివ్వకుండా లైట్ మార్చేయవచ్చు. అందుకు కొన్ని నేచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే...

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసంలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల నిమ్మరసాన్ని కాళ్ళకు అప్లై చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చర్మంను క్లియర్ గా మార్చుతాయి. డార్క్ స్పాట్స్ ఉన్న ప్రదేశంలో నిమ్మరసంను నేరుగా అప్లై చేయి మర్ధ చేయాలి. రాత్రి, ఉదయం రెండు సార్లు అప్లై చేస్తుంటే ఒక వారంలో మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర :

అలోవెర :

అలోవెరలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పగిలిన చర్మ కణాలను నయం చేయడం మాత్రమే కాదు, డార్క్ స్పాట్స్ ను లైట్ గా మార్చుతాయి. ఫ్రెష్ గా ఉన్న అలోవెర జ్యూస్ తీసుకుని అందులో కాటన్ బాల్ డిప్ చేసి, డార్క్ స్పాట్స్ మీద అప్లై చేసి వదిలేయాలి. స్కిన్ స్ట్రెచ్ అవ్వడం ప్రారంభమైన వెంటనే నీళ్ళతో కడిగేసుకోవాలి.

పసుపు:

పసుపు:

పసుపులో కుర్కుమిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్స్ తో సమానం మొండిగా మారిన స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ లో అరటీస్పూన్ పసుపు అప్లై చేసి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి అప్లై చేయాలి.డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మజ్జిగ:

మజ్జిగ:

మజ్జిగలో ల్యాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మానికి తేమను, ఫోషణను అందిస్తుంది.

కాటన్ బాల్ ను బట్టర్ మిల్క్ లో డిప్ చేసి నేరుగా డార్క్ స్పాట్స్ మీద అప్లై చేయాలి. కొన్ని నిముషాలు అలా ఉంచి డ్రైగా మారిన తర్వాత క్లీన్ చేయాలి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలోని డెడ్ సెల్స్ నుతొలగించి,డార్క్ స్పాట్స్ ను లైట్ గా మార్చుతుది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, డఅందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి, నేరుగా ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. తర్వాత బాడీ లోషన్ అప్లై చేయాలి.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో యాక్టివ్ ఎంజైమ్స్ అధికంగా ఉంటాయి. దీన్ని డార్క్ స్పాట్స్ మీత అప్లై చేయడం వల్ల మొండి మచ్చలు తొలగిపోతాయి. ఎలాంటి ఇరిటేషన్ ఉండదు. డార్క్ స్పాట్స్ మీద బొప్పాయి పేస్ట్ ను అప్లై చేసి 20 నిముసాల తర్వాత కడిగి శుభ్రం చేసుకోవాలి.

తేనె:

తేనె:

తేనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి, ఇంకా గ్లూకోజ్ కూడా ఉంది. దీన్ని చర్మానికి అప్లై చేస్తే పిగ్మెంటేషన్ తగ్గి, స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. రెండు టీస్పూన్ల తేనె లో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా మిక్స్ చేసి.స్మూత్ పేస్ట్ లా చేసి చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత హాట్ టవల్ ను వ్రాప్ చేయాలి. డ్రై అయిన తర్వాత కొన్ని చుక్కల నీళ్ళు చిలకరించి స్క్రబ్ చేసి కడిగేయాలి.

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ లో విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి, ఇవి స్కార్క్స్ ను ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. ఒక టీస్పూన్ టమోటో జ్యూస్ లో అరటీస్పూన్ తేనె మిక్స్ చేసి మసాజ్ చేయాలి.అప్లై చేసి 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో్శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. క్యాప్రిలిక్ యాసిడ్ , క్యాప్రిక్ యాసిడ్ మొటిమలు, ఏజింగ్ లక్షణాలు, మోలిక్యులర్ డీజనరేషన్ వంటి లక్షణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెతో రాత్రిల్లో కాళ్ళకు అప్లూ చేసి మసాజ్ చేసుకోవాలి. ఇది స్కార్స్ ను లైట్ గా మార్చడం మాత్రమే కాదు, స్కిన్ స్మూత్ గా మార్చుతుంది.

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ :

రోజ్ వాటర్ లో యాంటీ సెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు అదికంగా ఉన్నాయి. ఇవి డ్రైస్కిన్ నివారించి డార్క్ స్పాట్స్ ను మాయం చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లో అరటీస్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేసి, అందులో కాటన్ డిప్ చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

10 Home Remedies To Get Rid Of Dark Spots On Legs

Let's admit it. Those smooth long legs that glint under the light is a thing for the glossy magazine covers and TV commercials; reality is radically different. Reality is that we do not have long legs, and our partially smooth legs are often riddled with dark spots, marks and stubborn scars!
Desktop Bottom Promotion