పాదాల పగుళ్లు కనిపించగానే ఈ చిట్కాలను మొదలు పెట్టండి..

Posted By:
Subscribe to Boldsky

పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తున్నాయా? శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాల పగుళ్ళు వచ్చి సతమతమవుతున్నారా? చలికాలం ఎంత జాగ్రత్తగా ఉన్నా పాదాల మీద పగుళ్లు ఏర్పడుతున్నాయా.... వీటిని నిర్లక్ష్యం చేస్తే చర్మం ఊడి గాయాలుగా మారి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి.

అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చికిత్స కు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలున్నాయి. పాదాల పగుళ్ళతో బాధపడే వారికి గృహ చికిత్సా విధానాలు. మరి అవేంటో చూద్దామా..!

పాదాల పగుళ్లు మాయం చేసే ఎఫెక్టివ్ టిప్స్

వంటనూనెతో:

వంటనూనెతో:

నువ్వుల నూనె, శనగ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, కొబ్బరి నూనె... ఇలా ఎలాంటి వంటనూనెనైనా పాదాలకు ఉపయోగించవచ్చు. అయితే చర్మంలోకి చొచ్చుకుపోయి మంచి ఫలితం దక్కాలంటే రాత్రి పడుకునేముందు మాత్రమే ఈ నూనెలను పాదాలకు అప్లై చేయాలి.

నూనెలను మర్దించేముందు...

నూనెలను మర్దించేముందు...

పాదాలను ప్యూమిస్‌ స్టోన్‌తో రుద్ది మృత చర్మం, మురికి వదిలించాలి. తర్వాత శుభ్రంగా కడిగి తుడినూనె అప్లై చేయాలి. తర్వాత సాక్స్‌ వేసుకుని పడుకోవాలి. తెల్లారేసరికి పాదాలు మృదువుగా మారి ఉంటాయి. ఇలా క్రమం తప్పక కొన్ని రోజులపాటు చేస్తే పాదాలు పగుళ్లు వదిలి నునుపుగా తయారవుతాయి.

బియ్యం పిండితో:

బియ్యం పిండితో:

ఎక్స్‌ఫ్లోలియేటింగ్‌ వల్ల పొడిబారి, పగిలిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఎక్స్‌ఫోలియేటింగ్‌ స్క్రబ్‌గా బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది.

బియ్యం పిండికి కొద్ది చుక్కల తేనె, యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. పాదాల మీద పగుళ్లు ఎక్కువగా ఉంటే బాదం లేదా ఆలివ్‌ ఆయిల్‌ చేర్చాలి.

గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టి ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడినూనె పూసుకుని సాక్స్‌ వేసుకుని పడుకోవాలి.

వేపాకుతో:

వేపాకుతో:

యాంటీఫంగల్‌ లక్షణాలుండే వేప పాదాల పగుళ్లను కూడా వదిలిస్తుంది. గుప్పెడు వేపాకుకు స్పూను పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి.

ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దించాలి.

వింటర్లో పాదాల సంరక్షణ..పాదాలు పగల కుండా డెడ్ స్కిన్ తొలగించే సింపుల్ టిప్స్ ..

రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్‌:

రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్‌:

పాదాల పగుళ్లకు అద్భుతమైన చికిత్స రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్‌ కాంబినేషన్‌. గ్లిజరిన్‌ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తే రోజ్‌ వాటర్‌లోని ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. కాబట్టి ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి రోజూ నిద్రకు ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.

ప్యారాఫిన్‌ వ్యాక్స్‌:

ప్యారాఫిన్‌ వ్యాక్స్‌:

పగుళ్లు పెద్దవై బాధపెడుతూ ఉంటే ప్యారాఫిన్‌ వ్యాక్స్‌తో తక్షణ ఉపశమనం లభిస్తుంది. పారాఫిన్‌ వ్యాక్స్‌కు ఆవ నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి వేడిచేయాలి. వ్యాక్స్‌ పూర్తిగా కరిగేంతవరకూ వేడిచేసి పూర్తిగా చల్లార్చాలి. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేయాలి.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవాలి:

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవాలి:

పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్‌ సెల్స్‌కు చెక్‌ పెట్టవచ్చు.

గోరింటాకు:

గోరింటాకు:

గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్‌ పెట్టవచ్చు.

పాదాల పగుళ్ళు మాయం చేసే 5 బెస్ట్ హోం రెమెడీస్

బొప్పాయి పేస్ట్ :

బొప్పాయి పేస్ట్ :

బొప్పాయి గుజ్జుకు కొద్దిగా పసుపు కలిపి ఈ పేస్ట్ ను పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆముదం-కొబ్బరి నూనె:

ఆముదం-కొబ్బరి నూనె:

అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు.

English summary

10 Natural Remedies For Cracked Heels

Cracked heels can result from any number of reasons. Shoes that don’t fit quite right, microbial infection of calluses, simply standing too much, or even a nutrient deficiency are all possible culprits. No matter the cause, these fissures in the epidermis are often both unsightly and painful to bear.
Story first published: Tuesday, August 29, 2017, 16:39 [IST]
Subscribe Newsletter