ముఖంలో మొటిమలు - కళ్ల క్రింద నల్లని వలయాలను పోగొట్టే ‘‘వేపాకు’’

Posted By: Staff
Subscribe to Boldsky

అందమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరికి నిర్జీవమైన చర్మం ఇబ్బందిపెడుతుంటే.. మరికొందరు మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటారు. కొంతమందికి చాలా జిడ్డు తత్వం కలిగిన చర్మం, ఇంకొంతమందికి చాలా పొడిబారిన చర్మం ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సమస్య నుంచి బయటపడటానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది.

చర్మం సంరక్షణకు న్యాచురల్ రెమిడీస్ ఉపయోగిస్తేనే మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖంపై మచ్చలు, మొటిమలు వేధిస్తుంటే.. యాంటీ బయోటిక్ గా పనిచేసే.. వేప ఉపయోగించడం మంచిది. వేపను ఒక ట్రెడిషినల్ మెడిసిన్ గా పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. అనేక చర్మ సమస్యలను, అల్సర్, చికెన్ పాక్స్ తలలో దురద వంటి సమస్యలను నివారించడంలో ఇది సహజంగా పనిచేస్తుంది.

జుట్టుురాలడం నుండి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ నివారించే ఆయుర్వేదిక్ రెమెడీ వేప

వేప అనగానే చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కానీ.. చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా చాలా పవర్ ఫుల్ గా మనిచేస్తుంది. జుట్టు సంరక్షణలో చక్కగా పనిచేసే వేప.. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ నివారించడంలోనూ.. చక్కగా ఉపయోగపడుతుంది. రోజూ స్నానం చేసే నీటిలో కూడా కొన్ని వేపఆకులను వేసి స్నానం చేయడం వల్ల అనేక చర్మ వ్యాధులను నివారించుకోవచ్చు.

పురాత కాలంలో పల్లెలు, గ్రామల్లోని వారు వేప పుల్లతో దంతాలను శుభ్రం చేసుకునే వారు. వేపలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల ఇది అన్నిఏజ్ గ్రూపుల వారిలో చర్మ..జుట్టు సమస్యలను నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. మరి మీ చర్మ జుట్టు సమస్యలను నివారించుకోవడానికి నేచురల్ ట్రీట్మెంట్ కోసం చూస్తుంటే కనుక వెంటనే లేలేత వేప ఆకులను మీ రెగ్యులర్ బ్యూటిలో భాగం చేసుకోండి.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందడానికి వేపతో 12 ఫేస్ మాస్కులు..!

ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టును పొందడానికి వేపను ఉపయోగించే 10 మార్గాలు ..

1. మొటిమలను నివారించే వేప ఫేస్ ప్యాక్:

1. మొటిమలను నివారించే వేప ఫేస్ ప్యాక్:

కొన్ని లేత వేప ఆకులను కొద్దిగా నీళ్లలో వేసి ఒక గంట సేపు నానబెట్టాలి. ఒక గంట తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖంలో ఉన్న మొటిమల మీద అప్లై చేసి, ఒక గంట తర్వత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

2. జుట్టుకు వేపనూనె:

2. జుట్టుకు వేపనూనె:

250గ్రాములు కొబ్బరి నూనెలో గుప్పెడు వేపఆకులను వేసి బాగా మరిగించాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి 5-6 గంటల సేపు అలాగే ఉంచడం వల్ల వేప ఆకుల్లోని రసం కొబ్బరి నూనె బాగా పీల్చుకుంటుంది. తర్వాత నూనెను వడగట్టి నిల్వచేసుకుని, రాత్రుల్లో తలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తర్వాతి రోజు ఉదయం తలస్నానం చేసుకోవాలి. రోజువిడిచి రోజు తలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.

3. హెల్తీ స్కిన్ :

3. హెల్తీ స్కిన్ :

స్నానం చేసేటప్పుడు , స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేప ఆకులను తీసుకుని నీళ్ళ వేసి ఉంచాలి. 5 నిముషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది

4. వేపతో ఫేస్ ప్యాక్ :

4. వేపతో ఫేస్ ప్యాక్ :

ఒక టీస్పూన్ వేప పౌడర్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ తులసి పౌడర్ , ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ వేసుకుంటే మొటిమలు, మచ్చలు, కళ్ల క్రింది బాగంలో నల్లని వలయాలు తొలగిపోతాయి.

5. ఆటలమ్మా(చికెన్ పాక్స్ )ను నివారిస్తుంది:

5. ఆటలమ్మా(చికెన్ పాక్స్ )ను నివారిస్తుంది:

వేప ఆకులను నీటిలో వేసి బాయిల్ చేయాలి. చల్లగా అయిత తర్వాత వడగట్టుకోవాలి. ఒక కాటన్ బాల్ తీసుకుని, ఈ నీటిలో డిప్ చేసి చర్మం ఎర్రగా కందిన చోట లేదా బాడీ మొత్తం అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

6. వేపతో హెయిర్ మాస్క్ :

6. వేపతో హెయిర్ మాస్క్ :

ఒక టీస్పూన్ వేప పౌడర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని రెండూ కలిసేలా బాగా మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

7. ఎగ్జిమా(తామరను)నివారిస్తుంది:

7. ఎగ్జిమా(తామరను)నివారిస్తుంది:

వేప చెట్టు బెరడు తీసుకుని, నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం దీన్ని స్మూత్ గా పేస్ట్ చేయాలి. ఎగ్జిమా (తామర)ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం దురద చీకాకు నుండి ఇన్ స్టాంట్ గా ఉపవమనం కలిగిస్తుంది.

8. డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది:

8. డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది:

వేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, దాన్ని నుండి రసాన్ని వేరుచేసి, అందులో రెండు కాటన్ పాడ్స్ వేసి ఉంచి కొద్ది సమయం తర్వాత బయటకు తీస, కాటన్ ను పిండి, తర్వాత కళ్ల మీద పర్చుకోవాలి. 10 నిముషాలు ఇలా చేయడం వల్ల కళ్ల అలసట, డార్క్ సర్కిల్స్ నుండి రిలాక్డ్స్ గా ఫీలవుతారు.

9. నేచురల్ హెయిర్ కండీషనర్ :

9. నేచురల్ హెయిర్ కండీషనర్ :

వేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. తర్వాత కొద్ది తేనె కూడా మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి

10. గాయాలను మాన్పుతుంది:

10. గాయాలను మాన్పుతుంది:

ఒక టీస్పూన్ వేప పౌడర్ లో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి గాయాల మీద అప్లై చేయాలి. ఇది చాలా ఎఫెక్టివ్ గా గాయాలను మాన్పుతుంది.

English summary

10 Ways To Use Neem For Healthy Skin & Hair

Neem is a traditional medicine used to cure skin disorders, chicken pox, ulcers and an itchy scalp. There are certain ways on how to use neem on skin and hair, taka a look at these and try them out.
Subscribe Newsletter