For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎప్పుడూ అందంగా..ఫ్రెష్ గా కనబడాలంటే ఖచ్చితంగా తినాల్సిన 7 ఫుడ్స్..!!

చర్మం అందంగా కనబడకపోవడానికి ఏజింగ్ లక్షణాలు. హెల్తీ స్కిన్ అంటే, చర్మం క్లియర్ గా ఫ్రెష్ గా కనబడాలి. చర్మం అందంగా ఫ్రెష్ గా కనబడేలా చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఫ్రెష్ ఫుడ్స్ ఉన్నాయి.

By Lekhaka
|
Cleanup At Home | सर्दियों में घर पर ऐसे करें क्लीनअप | DIY | Boldsky

అందంగా కనబడుటకు చర్మ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం అంత సులభం కాదు. చర్మం వివిధ రాకలుగా దెబ్బతింటుంది. దాంతో చర్మం అందం కనబడదు. చర్మం అందంగా కనబడకపోవడానికి ఏజింగ్ లక్షణాలు. హెల్తీ స్కిన్ అంటే, చర్మం క్లియర్ గా ఫ్రెష్ గా కనబడాలి. చర్మం అందంగా ఫ్రెష్ గా కనబడేలా చేయడానికి కొన్ని ప్రత్యేకమైన ఫ్రెష్ ఫుడ్స్ ఉన్నాయి.

రీసెంట్ గా జరిపిన పరిశోనద ప్రకారం 20 మద్యవయస్సు నుండి ఏజింగ్ లక్షణాలను కనబడుతున్నట్లు కనుగొన్నారు. కాబట్టి, అంత చిన్న వయస్సులో ఏజింగ్ లక్షణాలు కనబడటం ఎవ్వరూ ఇష్టపడరు. అందుకనీ,అలాగే వదిలేయకుండా స్కిన్ ఫ్రెష్ గా, యంగ్ గా ఉంచుకోవడానికి వివిధ మార్గాలున్నాయి.

7 Healthy Foods That Can Make You Look Fresh!

ఇవే కాకుండా రెగ్యురల్ గా చిన్న పాటి వ్యాయామాలు, రోజూ సరిపడా నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. ఆల్కహాల్, స్మోగకింగ్ తీసుకునే వారు చిన్న వయస్సులోనే పెద్దవారిలా కనబడుతుంటారు. కాబట్టి, 30, 40ఏళ్ళ ముసలి వారిలా కనబడుతారు. కొంత మంది ఈవయస్సులో ఉన్న వారు యంగ్ అండ్ స్మార్ట్ గా కనబడుతారు. అవి వారు తీసుకునే ఆహారం, అలవాట్లు మీద ఆధారపడి ఉంటుంది.

వివిధ రకాల ప్రైమరీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల శరీరానికి చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ పూర్తిగా అందుతాయి. అందుకనీ రెగ్యులర్ డైట్ లో వివిధ రకాల న్యూట్రీషియన్ ఫుడ్స్ ను జోడించాలి, బెస్ట్ డైట్ ప్లాన్ చేసుకోవడం వల్ల హెల్తీ గా ఉండొచ్చు.

చర్మానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ పొందుతారు. దాంతో యంగ్ అండ్ ఫ్రెష్ గా కనబడుతారు. అమెరికన్స్ కొన్ని బేసిక్ న్యూట్రీషియన్ ఇన్ఫర్మేషన్ ను ఈ క్రింది విధంగా సూచించారు, అంటే వారు ఆరోగ్యపరంగా హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వారి చర్మం ఆరోగ్యంగా, ఫ్రెష్ గా కనబడుతుంది.కాబట్టి, హెల్తీగా, ఫ్రెష్ గా కనబడాలంటే ఈ క్రింది సూచించిన 7 హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

1. నట్స్ :

1. నట్స్ :

నట్స్ రుచికరంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. వీటని తినడం వల్ల చర్మానికి కొన్ని మంచి ఫ్యాట్స్ అందుతాయి. నట్స్ లో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ రెస్టోరేషన్ పెంచుతుంది. డ్రై స్కిన్ తో పోరాడుతుంది. ఇతర చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మం ఫ్రెష్ గా యంగ్ గా కనబడేలా చేస్తుంది. నట్స్ ను రెగ్యులర్ గా తినడం మంచిది.

2. చేపలు:

2. చేపలు:

సీఫుడ్స్ తినడం ఇష్టపడని వారు , ఇక్కడ ఒక అద్భుతమైన మార్గం ఉండి. సాల్మన్, తున, సార్డిన్స్,లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ను గ్రహిస్తుంది. ఏజింగ్ ప్రొసెస్ తో పోరాడుతుంది. ముఖ్యంగా, చేపలు బ్రెయిన్ షార్ప్ గా ఉంచుతుంది. చర్మం క్లియర్ గా యంగ్ గా మార్చుతుంది.

3. గ్రీన్ టీ :

3. గ్రీన్ టీ :

గ్రీన్ టీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఎంజైమ్స్, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో ఫొల్లెట్, మెగ్నీషియం, విటమిన్ బి, మరియు ఇతర పదార్థాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల స్కిన్ కంప్లెక్షన్ మెరుగుపడుతుంది. ఏజింగ్ లక్షణాలతో పోరాడుతుంది. కళ్ళ ఉబ్బును తగ్గిస్తుంది. పరిశోధన ప్రకారం గ్రీన్ టీ స్కిన్ క్యాన్సర్ నివారిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా గ్రీన్ టీ తాగడం వల్ల యంగ్ గా కనబడవచ్చు.

4. అవొకాడో:

4. అవొకాడో:

అవొకాడోలో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం ఏర్పడటానికి సహాయపడుతుంది. చర్మం గ్రంథుల్లో నూనెను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. క్లియర్, అండ్ స్మూత్ స్కిన్, సాప్ట్ స్కిన్ పొందడానికి అవొకాడోను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

5. బ్లాక్ బెర్రీస్, మరియు బ్లూ బెర్రీస్ :

5. బ్లాక్ బెర్రీస్, మరియు బ్లూ బెర్రీస్ :

బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ లో అద్భుతమైన రుచి కలిగి ఉంటాయి. వీటిని బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గా చెబుతారు. డ్రై స్కిన్ దురద కలగకుండా నివారిస్తుంది, స్కిన్ ఎలాసిటి మెరుగుపరుస్తుంది. అందంగా ఫ్రెష్ గా కనబడటానికి సహాయపడుతుంది.

6. ఓట్స్ :

6. ఓట్స్ :

ఓట్స్ లో సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. సోలబుల్ ఫైబర్ తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా ఉంటాయి. వీటిలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, సిలికాన్, విటమిన్ బి లు అధికంగా ఉంటాయి. ఓట్స్ ను రెగ్యులర్ డైట్ లోచేర్చుకోవడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో చర్మంలో హెల్తీగా ఉంటుంది.

7. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

7. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

క్లియర్ అండ్ ఫ్రెష్ స్కిన్ పొందడానికి మరో హెల్తీ ఫుడ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ . ఆకుకూరలు, బ్రొకోలి, ఆస్పరాగస్ వంటివి రెగ్యులర్ గా తినడం వల్ల వీటిలో ఉండే విటమిన్ ఇ మరియు ితర న్యూట్రీషియన్స్, స్కిన్ ను హెల్తీగా..క్లియర్ గా మార్చడమే కాదు, స్కిన్ సెల్స్, మజిల్స్ , టిష్యులను పెంచుతుంది. ముడుతలను నివారిస్తుంది.ః

English summary

7 Healthy Foods That Can Make You Look Fresh!

If you are on the lookout to know more about some of the best foods for clear skin, this article might interest you. Read on.
Story first published: Wednesday, January 4, 2017, 8:20 [IST]
Desktop Bottom Promotion