అందమైన చర్మ సౌందర్యంతో మెరిసిపోవడానికి సువానతో బాడీ మసాజ్ ఆయిల్స్..

Posted By: Lekhaka
Subscribe to Boldsky

గతంలో బాడీ మసాజ్ ఆయిల్స్ ను చాలా ప్రత్యేకంగా కొన్ని హెర్బల్ మొక్కలను నుండి తయారుచేస్తారు. వీటినే చర్మానికి అప్లై చేస్తుంటారు. అయితే ప్రతస్తుత కాలంలో రెగ్యులర్ గా ఉపయోగించే ఎసెన్షియల్ ఆయిల్స్ నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఉండే కొన్ని రకాల నూనెలు చర్మానికి పోసణ, హైడ్రేషన్ అందివ్వడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే అదే నూనెలో ఆరోగ్యానికి కూడా తగినన్ని ప్రయోజనాలను అందిస్తాయి.

ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ను కూడా కరెక్ట్ గా ఎంపిక చేసుకోవడంతో ఫర్ఫెక్ట్ గా పనిచేస్తాయి . కాంతి వంతమైన చర్మసౌందర్యాన్ని అందిస్తాయి. కొన్ని బాడీ మసాజ్ ఆయిల్ చాలా తేలికగా ఉంటాయి. ఇవి చర్మంలోకి చాలా సులభంగా శోషింపబడుతాయి. స్కిన్ లేయర్స్ కు కావల్సిన పోషణను అందివ్వడతో పాటు స్కిన్ సెల్స్ రిలాక్స్ అవుతాయి. కేవలం ఒక్క చర్మ సంరక్షణలో కాదు, బాడీ స్ట్రెస్ తగ్గిస్తుంది. ఇతర అండర్ లైయింగ్ ప్రొబ్లెమ్స్ ను నివారిస్తుంది. మైండ్ ను ప్రశాంత పరుస్తుంది.

కొన్ని బెస్ట్ బాడీ మసాజ్ ఆయిల్స్ ను ఈక్రింది విధంగా పరిచయం చేయడం జరిగింది...

ఆవనూనె:

ఆవనూనె:

ఆవనూనెలో బ్రెస్ట్ ఫ్రిమ్మింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కొద్దిగా మస్టర్డ్ నూనె తీసుకుని, బాడీ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. అప్ వార్డ్ డైరెక్షన్ లో మసాజ్ చేయాలి. ఈనూనెను మరీ వేడి చేయకూడదు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్లో శ్యాచురేటెడ్ మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి స్కిన్ లేయర్స్ లోకి డీప్ గా చొచ్చుకుని పోయి, స్కిన్ సెల్ ను డ్యామేజ్ ను నివారిస్తుంది. కొత్త కణాలను ఏర్పరుస్తుంది. ఎలా పనిచేస్తుంది: ఒక కప్పు ఆలివ్ ఆయిల్లో కొన్ని చుక్కల బాదం ఆయిల్, ల్యావెండర్ ఆయిల్, రోజ్ హిప్ ఆయిల్ మిక్స్ చేసి, రెండు నిముషాలు వేడి చేయాలి.తర్వాత చర్మానికి అప్లై చేసి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం ఆయిల్ ను డ్రై అయిన బాదం పప్పు నుండి తయారుచేస్తారు, దీన్ని చర్మానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. బాదం ఆయిల్లో నేచురల్ మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మంను తేమగా, మాయిశ్చరైజింగ్ గా మార్చుతుంది. బాదం ఆయిల్ డ్రై స్కిన్ నివారిస్తుంది. చర్మానికి రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే ముడతలను మాయం చేస్తుంది.

అవొకాడో ఆయిల్ :

అవొకాడో ఆయిల్ :

అవొకాడో ఆయిల్లో విటమిన్ బి1, బి5 మరియు లెసిథిన్ లు పుష్కలంగా ఉన్నాయి, వీటన్నింటిలో చర్మానికి ఉపయోగపడే ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం మీద చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తుంది: ఒక టేబుల్ స్పూన్ అవొకాడో ఆయిల్లో 10 చుక్కల మైర్రె ఎసెన్సియల్ ఆయిల్ మిక్స్ చేసి, బాడీకి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట అలాగే ఉంచి, తర్వాత స్క్రబ్ చేసి 5 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితోస్నానం చేయాలి.

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ :

గ్రేప్ సీడ్ ఆయిల్ ఫ్రిమ్మింగ్ ఆయిల్. ఇందులో విటమిన్ ఇ , యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రిజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి టైట్ చేస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది. ఎలా పనిచేస్తుంది: గ్రేప్ సీడ్ ఆయిల్లో కొద్దిగా కోకబట్టర్ ను మిక్స్ చేయాలి. ఈ రెండు బాగా కలిసేలా మిక్స్ చేయాలి. బాడీ మాయిశ్చరైజ్ చేస్తుంది.

ఆముదం నూనె:

ఆముదం నూనె:

ఆముదం నూనెలో నేచురల్ లింపాటిక్స్ ఉండటం వల్ల ఇది శరీరంలో అవాంచిన ఫ్యాట్ ను కరిగిస్తుంది. స్కిన్ రీజనరేట్ చేస్తుంది. చర్మం లైట్ గా మార్చుతుంది. ఎలా పనిచేస్తుంది: రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనెను వేడి చేసి, అందలలో రెండు చుక్కల రోజ్మెర్రీ ఆయిల్ ను ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నూనెను బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. 2 గంటల తర్వాత స్నానం చేయాలి.

జోజోబా ఆయిల్ :

జోజోబా ఆయిల్ :

జోజోబా ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మానికి కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇది డ్యామేజ్ అయిన చర్మకణాలను నివారిస్తుంది. దాంతో చర్మం తేమగా , సపెల్ గా మారుతుంది. ఎలా పనిచేస్తుంది: ఈ స్కిన్ టైటనింగ్ హెర్బల్ ఆయిల్లో బాడీలోషన్ మిక్స్ చేసి, బాగా షేక్ చేయాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయం శరీరానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. లేదా స్నానం చేసిన తర్వాత శరీరానికి అప్లై చేసుకోవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె లో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, . ఇవి చర్మంలో కొత్త కణాల ఏర్పాటుకు గ్రేట్ గా పనిచేస్తుంది. సాగిన చర్మాన్ని నివారిస్తుంది. ఎలా పనిచేస్తుంది: కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి, బాడీ మొత్తం అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయం స్నానం చేయడం వల్ల స్కిన్ సాప్ట్ గా తేమగా కనబడుతుంది.

English summary

8 Best Massage Oils For A Firm Body

Oil massage is one such solution that has been forever known as a great body-firming technique. Body oils can work wonders in toning the body and reviving the freshness of the dull-looking skin, making it appear youthful, radiant and flawless. Here is a list of the best body firming oils to attain a toned look.
Story first published: Wednesday, April 26, 2017, 12:00 [IST]