For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మల్లె పూలతో చర్మ కాంతి, చర్మ సౌందర్యం రెట్టింపు!

By Super Admin
|

మల్లెపూలు సౌందర్యాన్ని పెంపొందించే లక్షణాలు కలిగి ఉండడం వల్ల వాటిని అనేక సౌందర్య ఉత్పత్తులలో సాధారణంగా ఉపయోగిస్తారు. మల్లెపూల నుండి వచ్చే సువాసన ఏవీ ఓడించలేవు. ఈ ఆర్టికిల్ మల్లెపూలను ఉపయోగించి కొన్ని మంచి సౌందర్య చిట్కాల జాబితాను తెలియచేస్తుంది.

మల్లె పువ్వులు సువాసనలతో ఘుభాళిస్తాయి. దీన్ని అరేబియన్ జాస్మిన్ అని కూడా అంటారు. ఈ మల్లెపూలు వాటి ఆకు ఆకారం, వాటి పూల నిర్మాణం ఆధారంగా వివిధరకాలుగా విభజించబడ్డాయి.

వీటితో పెర్ఫ్యూమ్ లు తయారుచేయడమే కాకుండా, ఈ మల్లెపూలను సౌందర్య ఉత్పత్తులలో వాడే పదార్ధంగా ఉపయోగించడం ఆశ్చర్యం. ఇక్కడ అనేక ప్రభావవంతమైన సౌందర్య చిట్కాలు ఉన్నాయి, ఈ మల్లెపూలను ఉపయోగించే ప్రయత్నం చేస్తే ఆశ్చర్యపోయేట్టు చేస్తాయి.

మీ చర్మంపై అద్భుతాలు చేసే ఈ చిన్ని తెల్ల పువ్వు దాదాపు అందరి ఇళ్ళల్లో కనిపిస్తుంది. ఎక్కువ సౌందర్య చిట్కాలలో ఉపయోగించే ఈ మల్లెపూలు తేమ లక్షణాలను కలిగిఉంటాయి. ఈ పూలను నేరుగా వాడడమే కాకుండా, ఉపశమనం కోసం దీని వాసనను ఉపయోగించి కూడా చేయవచ్చు.

మల్లెపూవులను సౌందర్యం పరంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

1.మీ జుట్టును అలంకరించుకోవచ్చు

1.మీ జుట్టును అలంకరించుకోవచ్చు

ముఖ్యంగా భారతదేశంలో అమ్మాయిలూ మల్లెపూలను ఉపయోగించే అత్యంత సాధారణ మార్గం ఇదే. ఇది మిమ్మల్ని అందంగా, సంప్రదాయంగా కనిపించేట్టు చేస్తుంది. మీ జుట్టు తాజాగా ఉంచడానికి మల్లెపూల సువాసనను భర్తీచేసే వేరే పెర్ఫ్యూమ్ లేదు.

2.ఫేస్ పాక్ లాగా

2.ఫేస్ పాక్ లాగా

మల్లెపూవ్వు రెక్కలు చాలా స్వచ్చంగా ఉంటాయి, దీనితో అద్భుతమైన ఫేస్ ప్యాక్ చేయవచ్చు. ఈ పేస్ట్ ని నేరుగా చర్మంపై అప్లై చేసి, 10 నుండి 15 పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి.

3.వయసుని తగ్గించడానికి

3.వయసుని తగ్గించడానికి

మల్లెపూలలో పోడిచర్మానికి తేమ కలిగించే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. ఇది మీ పోడిచర్మ సమస్యలను పరిష్కరిస్తుంది, లేకపోతే ముడతలు, డెడ్ స్కిన్ సేల్స్ పెరుగుతాయి.

4.స్నానం చేసినపుడు తాజాదనం కోసం

4.స్నానం చేసినపుడు తాజాదనం కోసం

మీ నీటి తొట్టెలో మల్లెపూల రెక్కలను కలపండి. ఈ నీటితో స్నానం చేస్తే చాలా తాజాగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. మల్లెపూల రెక్కలతో చేసిన మిశ్రమాన్ని నీటిలో కలిపితే అదే ప్రభావం పొందవచ్చు.

5 సన్ డామేజ్ కి చికిత్స

5 సన్ డామేజ్ కి చికిత్స

మీరు ఎండలో రోజంతా తిరిగి అలసిపోయిన తరువాత మీ ముఖానికి మల్లెపూలతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ మిశ్రమాన్ని పూయండి. ఇది మీకు తక్షణ తాజాదనం ఇస్తుంది.

6.యాక్నేకి చికిత్స

6.యాక్నేకి చికిత్స

మీకు యాక్నే సమస్య ఉండి ఎవైనా మాయిశ్చరైజర్ లు వాడడానికి భయపడుతుంటే, మల్లెపువ్వు మీ సమస్యను నివారిస్తుంది. ఈ పూలరేకులతో పేస్ట్ తయారుచేసి, నేరుగా ముఖానికి అప్లై చేయండి.

7.సున్నితమైన చర్మం కోసం

7.సున్నితమైన చర్మం కోసం

మల్లెపువ్వు తేమతో కూడిన లక్షణాలను అధికంగా కలిగి ఉండడం వల్ల మల్లెపూల పేస్ట్ ను చర్మాన్ని మృదువుగా, సున్నితంగా చేస్తుంది. మల్లెపూల సారం కలిగిన ఇతర ఉత్పత్తులు కూడా అదే ప్రభావాన్ని ఇస్తాయి.

8.శరీర దుర్గంధాన్ని పోగొడుతుంది

8.శరీర దుర్గంధాన్ని పోగొడుతుంది

మల్లెపూలు శరీర దుర్గంధంపై పోరాడే అద్భుతమైన ఎంపిక. ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకునే బాడీ స్ప్రే కోసం జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ చాలా మంచిది. దీనికోసం ఒక బాటిల్ లో జాస్మిన్ ఆయిల్ ని నీటితో కలపండి. ఇది మీరు మల్లెపువ్వు ను ఉపయోగించి ప్రయత్నించే అత్యంత ప్రభావంతమైన సౌందర్య చిట్కాలలో ఒకటి.

9.జుట్టు కండిషనింగ్ కోసం

9.జుట్టు కండిషనింగ్ కోసం

తేమ లక్షణాలు కలిగిన మల్లెపువ్వును మీ జుట్టుకు కండిషనర్ గా కూడా ఉపయోగించవచ్చు. మల్లెపూలను వేడినీళ్ళలో నానబెట్టి, చల్లారనివ్వండి. ఒకసారి చల్లబడిన తరువాత, మీ జుట్టుకు పూయండి.

English summary

9 Beauty Hacks Using Mogra Flower (jasmine)That You Will Thank Us For!

Mogra flower (jasmine) is commonly used in many beauty products due to its beauty-boosting properties. Nothing can beat the fragrance produced by mogra flowers. This article lists some of the best beauty hacks using mogra flowers.
Desktop Bottom Promotion