స్కిన్, హెయిర్ కోసం ఆవనూనెతో అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్..!!

By Lekhaka
Subscribe to Boldsky

ఆవనూనెలోని బ్యూటి బెనిఫిట్స్ గురించి మీరెప్పుడైనా విన్నారా ? ఆవనూనె చర్మం మరియు జుట్టు సంరక్షణలో అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఆవనూనెలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ప్, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అందుకే ఆవనూనెను బ్యూటీ, మరియు హెయిర్ సంరక్షణకు ఉపయోగించే నూనెల్లో ఒక ఆరోగ్యకరమైన నూనెగా సూచిస్తుంటారు . అనేక చర్మం మరియు జుట్టు సమస్యలను నివారించుకోవడం కోసం పురాతన కాలం నుండి దీన్ని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు .

 Amazing Benefits Of Adding Mustard Oil To Your Beauty Regime

మస్టర్డ్ ఆయిల్ ను బ్యూటికోసం వినియోగిస్తారని మీరు అస్సలు ఊహించి ఉండరు. స్కిన్ , హెయిర్ బ్యూటీ కోసం ఆవనూనెను ఏవిధంగా ఉపయోగించాలని, ఎలా ఉపయోగపడుతుందన్న విషయం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. దాంతో మీరు ఖచ్చితంగా మస్టర్డ్ ఆయిల్ ను డైలీ స్కిన్ కేర్ తప్పనిసరిగా దీన్ని చేర్చుకుంటారు. మస్టర్డ్ ఆయిల్ తో పొండే బ్యూటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం...

నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది

నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది

మార్కెట్లో అందుబాటులో ఉండే సన్ స్క్రీన్ గురించి మనందరికీ తెలుసు, అయితే మస్టర్డ్ ఆయిల్ కూడా ఒక నేచురల్ సన్ స్క్రీన్ లా ఎలా పనిచేస్తుంది. అదెలా సాద్యం అంటే, ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఆవనూనెలో ఉండే విటమిన్ ఇ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. హానికరమైన యూవీ కిరణాల నుండి , వాతావరణంలోని టాక్సిన్స్ నుండి రక్షణ కల్పించడంలో విటమిన్ ఇ గ్రేట్ గా సహాయపడుతుంది. మస్టర్డ్ ఆయిల్ ను సన్ స్క్రీన్ గా ఉపయోగించాలంటే, ఈమాజికల్ ఆయిల్ ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

పెదాల పగుళ్ళను నివారిస్తుంది

పెదాల పగుళ్ళను నివారిస్తుంది

పెదాల పగుళ్ళను నివారించడంలో ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ముఖ్యంగా వింటర్ సీజన్ లో ఈ సమస్యను అత్యంత సమర్థవంతంగా నివారిస్తుంది. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ను అందవ్వడంలో లిప్ బామ్స్ ఫెయిల్ అయితే, కొద్దిగా కాటన్ తీసుకుని, మస్టర్డ్ ఆయిల్లో డిప్ చేయాలి. తర్వాత పెదాల మీద అప్లై చేసి మర్ధన చేయాలి. మస్టర్డ్ ఆయిల్ నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పెదాల పగుళ్ళను సులభంగా నివారిస్తుంది.

డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది:

డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది:

మస్టర్డ్ ఆయిల్ ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తొలగిపోతాయి. డార్క్ స్పాట్స్ తో పాటు, స్పాట్స్ వల్ల ఏర్పడ్డ మచ్చలు కూడా తొలగిపోతాయి. అందుకు మీరు చేయాల్సిందల్లా, కొద్దిగా శెనగపిండి తీసుకుని అందులో, కొద్దిగా ఆముదం నూనె మిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసి, పేస్ట్ అయ్యే వరకూ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. నేచురల్ గా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డార్క్ స్పాట్స్ తో పాటు, మచ్చలు కూడా తొలగిపోతాయి.

 తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారిస్తుంది:

ఆముదం నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది. ఈ నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ ను, ఆవనూనెను సమంగా తీసుకుని రెండూ బాగా మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. మసాజ్ చేసి, వేడినీటిలో డిప్ చేసి టవల్ ను తలకు చుట్టాలి. అరగంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఆవనూనెను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు అధికం, జుట్టు సంరక్షణలో కూడా గొప్పగా సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో మస్టర్డ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఇంకా ఆవనూనెలో అద్భుతమైన ఫ్యాటీయాసిడ్స్ క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినిరల్స్ అన్నీ జుట్టు పెరుగుదలకు గొప్పగా సహాయపడి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

దంతాలు తెల్లగా మార్చుతాయి:

దంతాలు తెల్లగా మార్చుతాయి:

కొద్ది ఆవనూనె తీసుకుని దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని దంతాల మీద అప్లై చేసి మర్ధ చేయాలి. మస్టర్డ్ ఆయిల్ దంతాలను వైట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చిగుళ్ళ సమస్యలను నివారిస్తుంది. రెగ్యులర్ గా చేస్తుంటే దంతాలు స్ట్రాంగ్ గా, తెల్లగా మెరుస్తుంటాయి.

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మస్టర్డ్ ఆయిల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షనాలు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆవనూనెను తలకు అప్లై చేసి రెగ్యులర్ గా మసాజ్ చేస్తుంటే, తలలో డ్రై ఫ్లేక్స్ నివారించబడుతాయి, అదే సమయంలో జుట్టు పెరుగుదలకు బూస్ట్ లా పనిచేస్తుంది.

ఇది నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది

ఇది నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది

ఆవనూనెను ముఖంలో ఉండే మురికిని, మలినాలను తొలగిస్తుంది. చర్మ రంద్రాలు తెరచుకునేలా చేస్తుంది. అలాగే ఆవనూనె శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, టాక్సిన్స్, అవాంఛిత సాల్ట్ మరియు శరీరంలో అవాంఛిత వాటర్ కంటెంట్ ను తొలగిస్తుంది. మస్టర్డ్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, కొన్ని క్షణాల్లోనే చర్మంను శుభ్రం చేస్తుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Amazing Benefits Of Adding Mustard Oil To Your Beauty Regime

    Have you ever heard about the beauty benefits of mustard oil for skin and hair? Being a rich source of omega-3 and omega-6 fatty acids, vitamin E and antioxidants, mustard oil is considered as one of the healthiest oils to be used on skin and hair. Mustard oil has been used since ages in Ayurveda to treat several skin and hair problems.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more