చర్మంపై బ్రౌన్ స్పాట్స్ ని తొలగించేందుకు అద్భుతమైన రెమెడీస్

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీ చర్మంపై దట్టమైన బ్రౌన్ స్పాట్స్ ఉన్నాయా? ఈ బ్రౌన్ స్పాట్స్ మీ చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయా? వీటిని తొలగించుకునేందుకు మీరు రకరకాల క్రీములతో పాటు ప్యాచెస్ ని ప్రయత్నించి విఫలమయ్యారా? ఈ బ్రౌన్ స్పాట్స్ నుంచి ఉపశమనం కోసం ఇంకా ప్రయత్నాలు సాగిస్తున్నారా?

వీటన్నిటికీ మీరు అవునని సమాధానం చెబితే ఈ ఆర్టికల్ ప్రత్యేకించి మీ కోసమే? ఈ రోజు బోల్డ్ స్కై లో మొండి బ్రౌన్ స్పాట్స్ ని తొలగించేందుకై సులభమైన చిట్కాలను పొందుబరచాము.

brown spots on skin

చర్మంపైనుండే బ్రౌన్ స్పాట్స్ ని తొలగించేందుకై చిట్కాలు

ఈ రెమెడీస్ గురించి మీకు వివరించే ముందు ఏయే కారకాల వలన చర్మంపై బ్రౌన్ స్పాట్స్ ఏర్పడతాయో తెలుసుకుందాం. కొన్ని అంతర్గత కారకాలు కాగా మరికొన్ని బాహ్య కారకాలు. విపరీతమైన ఎండలో బయటికి వెళ్లడం, విటమిన్ లోపాలు, ఒత్తిడి వంటివి కొన్ని సాధారణ కారణాలు.

ఈ బ్రౌన్ స్పాట్స్ అనేవి హానీకరమైనవి కాకపోయినా ఇవి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే, బ్రౌన్ స్పాట్స్ కలిగి ఉండటం వలన అమ్మాయిలు కాస్త ఇబ్బందికి గురవుతారు.

ఈ బ్రౌన్ స్పాట్స్ ని తొలగించాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా సాంప్రదాయ సౌందర్య చిట్కాలపై ఆధారపడవలసిందే. ఈ సాంప్రదాయ సౌందర్య చిట్కాలు నేటి కెమికల్ బ్యూటీ ప్రోడక్ట్స్ కన్నా అద్భుతమైన ఫలితాలను అందిస్తాయని మీరు గుర్తించాలి.

ఇక్కడ, బ్రౌన్ స్పాట్స్ నుంచి మీకు ఉపశమనం కలిగించే అద్భుతమైన చిట్కాలను పొందుబరిచాము.

1. ఆపిల్ సిడర్ వినేగార్

1. ఆపిల్ సిడర్ వినేగార్

కాస్తంత ఆపిల్ సిడర్ వినేగార్ ని డిస్టిల్డ్ వాటర్ తో కలపండి.

ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ని ముంచి దాంతో చర్మంపైనున్న బ్రౌన్ స్పాట్స్ పై రుద్దండి.

ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రదేశంపై కనీసం పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉండనిచ్చి ఆ తరువాత చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రపరచండి.

ఈ హోమ్ ట్రీట్మెంట్ ను కనీసం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు పాటిస్తే చర్మంపైనున్న మొండి మచ్చల నుంచి విముక్తి లభిస్తుంది.

2. మజ్జిగ

2. మజ్జిగ

తాజాగా తయారుచేసిన మజ్జిగలో కాటన్ ప్యాడ్ ని ముంచండి.

ఈ కాటన్ ప్యాడ్ ని పదిహేను నిమిషాల వరకు ప్రభావిత ప్రదేశంపై ఉండనివ్వండి.

ఆ తరువాత, మీ చర్మాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి.

ఈ రెమెడీని వారానికి రెండు మూడు సార్లు పాటించినట్లయితే ఆశించిన ఫలితం మీ సొంతమవుతుంది.

3. క్యాస్టర్ ఆయిల్

3. క్యాస్టర్ ఆయిల్

కాస్తంత క్యాస్టర్ ఆయిల్ ను తీసుకుని చర్మంపైన ప్రభావిత ప్రదేశంపై రుద్దండి.

ఈ ఆయిల్ ని పదిహేను నిమిషాల వరకు మీ చర్మముపై ఉండనివ్వండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

వారానికి మూడు సార్లు ఈ రెమెడీని పాటించినట్లయితే చర్మంపైనున్న బ్రౌన్ స్పాట్స్ మటుమాయం అవుతాయి.

4. టమాటో

4. టమాటో

తాజా టమాటో గుజ్జుని తీసుకుని ప్రభావిత ప్రదేశంపై సున్నితంగా రుద్దండి.

ఈ టమాటో గుజ్జుని మీ చర్మంపై కనీసం 20 నుంచి 25 నిమిషాల వరకు ఉండనివ్వండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచండి.

ఈ ప్రాసెస్ ని రోజూ పాటించడం వలన చర్మంపైనున్న బ్రౌన్ స్పాట్స్ తొలగిపోతాయి.

5. నిమ్మరసం

5. నిమ్మరసం

రెండు టీస్పూన్ల తాజా నిమ్మరసాన్ని తీసుకుని చర్మంపైనున్న బ్రౌన్ స్పాట్స్ పై రుద్దండి.

పది నుంచి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరుచుకోండి.

వారంలో నాలుగైదు సార్లు ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

6. శాండల్ వుడ్ పౌడర్

6. శాండల్ వుడ్ పౌడర్

ఒక టీస్పూన్ శాండల్ వుడ్ పౌడర్ ని ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ తో కలిపండి.

ఈ మిశ్రమాన్ని బ్రౌన్ స్పాట్స్ పై రుద్దండి.

పదిహేను నిమిషాల వరకు మీ చర్మంపై నున్న ఈ మిశ్రమాన్ని కదపవద్దు. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచండి.

ఈ సాంప్రదాయ సౌందర్య చిట్కాని వారానికి రెండు మూడుసార్లు పాటిస్తే మెరుగైన ఫలితాలను గమనించవచ్చు.

7. పెరుగు

7. పెరుగు

తాజా పెరుగుని చర్మంపైన సమస్యాత్మక ప్రదేశంపై రుద్దండి.

పది నుంచి పదిహేను నిమిషాలవరకు అలాగే ఉంచండి.

ఆ తరువాత, చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రం చేసి తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.

ఈ అద్భుతమైన రెమెడీని రోజూ పాటించడం ద్వారా గొప్ప ఫలితాలను పొందవచ్చు.

8. అలో వెరా

8. అలో వెరా

తాజా అలో వెరా జెల్ ను తీసుకుని చర్మంపైన ప్రభావిత ప్రదేశంపై రుద్దండి.

ఈ సహజ సిద్ధమైన పదార్థాన్ని ప్రభావిత ప్రదేశంపై పదిహేను నిమిషాల పాటు ఉండనివ్వండి.

ఆ తరువాత, గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచండి.

ఈ రెమెడీని రోజులో అనేకసార్లు పాటిస్తే వేగవంతంగా ఆశించిన ఫలితాలను గమనించవచ్చు.

English summary

Amazing Remedies To Get Rid Of Brown Spots On Skin

Do you have prominent brown spots on your skin? Have you already tried a majority of spot-correcting creams and patches? Are you still looking for a way to get rid of these spots? Natural remedies are the best solution for this. Using these natural ingredients can visibly reduce brown spots on skin.