ఇంట్లోనే వివిధ రకాల "పెడిక్యూర్" లతో పాదారవిందం మీ సొంతం!

By Lekhaka
Subscribe to Boldsky

పాదాలకు ఖచ్చితమైన శ్రద్ధ, సంరక్షణ తీసుకోము, కానీ కొంత విరామ సమయం తరువాత వాటిని ముద్దుచేయడానికి అవి అర్హులు. సాధారణ సౌందర్య చికిత్సల్లో అందుబాటులో ఉన్న వాటిలో పెడిక్యూర్ ఒకటి, ఇది మీ పాదాలకు మంచి రకమైన గారాబాన్ని ఇస్తుంది.

వివిధ రకాల పెడిక్యూర్ లకోసం వెళ్ళడం వల్ల మీ అలసిపోయిన పాదాలను ఉపశమనం కలిగించి, పాదాలకు ఉన్న మొత్తం నొప్పులను తగ్గిస్తుంది. మీ చేతులకు, గోళ్ళకు మానిక్యూర్ ఎలా పనిచేస్తుందో, సౌందర్య ఉత్పత్తులు పునరుజ్జీవన సహాయంతో పెడిక్యూర్ మీ పాదాలకు, వెళ్ళ గోళ్ళకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఒకేదాన్ని ఎంచుకోకుండా వివిధ రకాల పెడిక్యూర్ లను ఎంచుకోవడం మంచిది, ఇది మీకు ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, పాదాల పునరుజ్జీవనంలో వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. అందువల్ల, వివిధ రకాల పెడిక్యూర్ ల గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ఇది తప్పక చదవండి.

కింద ఇచ్చిన వివిధ రకాల పెడిక్యూర్ లలో ఒకదానికి ఎంచుకోండి, దానిపై దృష్టి పెట్టండి.

మీరు ప్రయత్నించాల్సిన వివిధ రకాల పెడిక్యూర్ లు:

1. ఫిష్ పెడిక్యూర్

1. ఫిష్ పెడిక్యూర్

సాధారణ రకం పెడిక్యూర్ లలో ఈ ఫిష్ పెడిక్యూర్ ఒకటి, ఇది శరీరం నుండి డెడ్ సేల్స్ ని, మురికిని తొలగించడానికి సహాయపడుతుంది. ఫిష్ పెడిక్యూర్ విధానంలో మీరు చేపలతో నిండిన నీటిలో మీ పాదాలను ఉంచాలి. సాధారణంగా, ఈ ఫిష్ పెడిక్యూర్ లో గర్ రుఫా అనే చేపలను ఉపయోగిస్తారు, వీటికి పళ్ళు ఉండవు. ఈ చేపలు చర్మంపై మొనల ద్వారా పాదాల నుండి డెడ్ సేల్స్ ని తేలగించడానికి సహాయపాతాయి. ఈ పెడిక్యూర్ లో మసాజ్ ఉండదు, కానీ ఇది శుభ్రమైన, మృదువైన చర్మాన్ని ఖచ్చితంగా అందిస్తుంది.

2. మార్గరిటా పెడిక్యూర్

2. మార్గరిటా పెడిక్యూర్

ప్రసిద్ది చెందిన, ఖర్చుతో కూడిన పెడిక్యూర్ లలో మార్గరిటా పెదిక్యూర్ కూడా ఒకటి. ఈ పద్ధతిలో, ఉప్పు, నిమ్మకాయ ఉపయోగిస్తారు, ఇది మీ పాదాలను శుభ్రంగా, మృదువుగా చేస్తాయి. మీ పాదాలను ఎప్సం సాల్ట్, నిమ్మ, కొద్దిగా రోజ్ వాటర్ సోల్యూషన్ లో నానపెట్టడం అవసరం. మీ పాదాల అడుగులు నిదానంగా పడుతుంటే, మార్గరిటా పెడిక్యూర్ ని ఎంచుకోండి, ఇది మీ చర్మాన్ని తాజాగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, మీ పాదాలను తేమగా, చాలా ఎక్కువ సేపు హైడ్రేట్ గా ఉంచుతుంది కూడా.

3. వైన్ పెడిక్యూర్

3. వైన్ పెడిక్యూర్

వైన్ పెడిక్యూర్ గురించి మీరెప్పుడైనా విన్నారా? సరే, సాధారణం రకం పెడిక్యూర్ లలో వైన్ పెదిక్యూర్ కూడా ఒకటి. ఇది సాధారణంగా పశ్చిమ దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది, చాలా అరుదుగా హై లెవెల్ సెలూన్ లలో కనిపిస్తుంది. ఎందుకంటే, వైన్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి, ఇవి మీ చర్మం తేమగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ పాదాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. సాధారణంగా, మీ పాదాలను వైన్ లో నానపెట్టి, గ్రేప్ సీడ్ స్క్రబ్ ని ఉపయోగించండి. గ్రేప్ సీడ్ ఆయిల్ మీ చర్మాన్ని మర్దనా చేయడానికి ఉపయోగించండి. వైన్, గ్రేప్ సీడ్ స్క్రబ్, గ్రేప్ సీడ్ ఆయిల్ కలయిక మీ పాదాలకు అనేక మార్గాలలో ప్రయోజనం పొందడానికి సహాయపడుతుంది.

4. చాకొలేట్ పెడిక్యూర్

4. చాకొలేట్ పెడిక్యూర్

చాకొలేట్ ఫేషియల్ లాగా, చాకొలేట్ పెడిక్యూర్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉండే అధునాతన రకాల పెడిక్యూర్ లలో ఒకటి. మీరు చాకొలేట్ ని ఇష్టపడేవారైతే, మీ చర్మంపై చాకొలేట్ ని ఉపయోగించడానికి ప్రాధాన్యతనిస్తే, అయితే ఈ పెడిక్యూర్ కేవలం మీకోసమే. ఈ పెడిక్యూర్ లో చాకొలేట్ స్క్రబ్, చాకొలేట్ ఫుట్ సోక్, చాకొలేట్ క్రీమ్, చాకొలేట్ మాస్క్ ఉపయోగిస్తారు.

5. స్పా పెడిక్యూర్

5. స్పా పెడిక్యూర్

ఈ స్పా పెడిక్యూర్ మరో ప్రసిద్ధ రకమైన పెడిక్యూర్ ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. స్పా పెడిక్యూర్ లో అరోమా థెరపీ ఆయిల్ లి ఉపయోగిస్తారు, ఇది మీ పాదాలను ఆరోగ్యంగా, తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ఆరోమాటిక్ స్క్రబ్ ని మీ పాదాలు పూర్తిగా ఎక్స్ఫోలియేట్ కావడానికి ఉపయోగిస్తారు. స్పా పెడిక్యూర్ విధానంలో అరోమా థెరపీ ఆయిల్, స్టీమ్ ని ఉపయోగిస్తారు.

6. అథ్లెటిక్ పెడిక్యూర్

6. అథ్లెటిక్ పెడిక్యూర్

ఈ అథ్లెటిక్ పెడిక్యూర్ ని పురుషులు, స్త్రీలు ఇద్దరూ ఎంచుకోవచ్చు. అథ్లెటిక్ పెడిక్యూర్ సాధారణంగా చాలా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది, ఇది పాదాల నుండి నొప్పి ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది కండరాలకు విశ్రాంతిని ఇచ్చి, నొప్పినుండి ఉపశమనం కలిగిస్తుంది. అథ్లెటిక్ పెడిక్యూర్ లో నానపెట్టడం, స్క్రబ్బింగ్, అదనపు పెలుసులు ఉంటాయి, ఇవి మీ పాదాలను శుభ్రంగా, ఆరోగ్యవంతంగా చేయడానికి సహాయపడతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.

7. ఐస్ క్రీమ్ పెడిక్యూర్

7. ఐస్ క్రీమ్ పెడిక్యూర్

ఐస్ క్రీమ్ పెడిక్యూర్ అనేది పాదాలకు చేసే ప్రత్యేకమైన చికిత్స, ఇది మీ చర్మం మంచి మార్గంలో విలాసవంతంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ రకమైన విధానంలో మీ పాదాలను ఐస్ క్రీమ్ స్కూప్ లాగా కనిపించే ఒక బాత్ బాల్ లో ఉంచాలి. సాధారణంగా, ఈ రకమైన పెడిక్యూర్ లో వెనిల్ల, చాకొలేట్, స్ట్రాబెర్రీ లేదా ఇతర రకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లతో కలిపిన స్క్రబ్ లను ఉపయోగిస్తారు. మీ చర్మం పగిలిన తరువాత, ఇది పాదాల ఐసింగ్ మాయిశ్చరైజింగ్ చికిత్సను కలిగి ఉంటుంది, ఇది సాధారణంగా పాలు ఆధారిత క్రీమ్ తో చేసిన ఔషధం.

8. సాధారణ పెడిక్యూర్

8. సాధారణ పెడిక్యూర్

సాధారణ స్క్రబ్ లు, సాధారణ క్రీములను ఉపయోగించి మీ పాదాలను శుభ్రం చేస్తే సాధారణ పెడిక్యూర్ అంటారు. ఇది చర్మం పైపొరను మృదువుగా చేయడానికి సహాయపడుతుంది అంతేకాకుండా డెడ్ స్కిన్ సెల్స్ ని తేలికగా తొలగిస్తుంది. సాధారణంగా, మీరు సున్నితమైన మాయిశ్చరైజర్ ని అప్లై చేసి ఎక్కువ సేపు మసాజ్ చేయించు కుంటారు. మీరు కేవలం ఉపశమనం మాత్రమే కావాలి అనుకుంటే ఇది చాలా మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Different Types Of Pedicures You Should Try

    Going in for different kinds of pedicures will help pamper your tired feet, reducing all the pain that may affect the feet. Just like how manicure involves taking care of your hand and nails, pedicure involves pampering your feet and toe nails with the help of rejuvenating beauty products.
    Story first published: Saturday, May 27, 2017, 8:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more