For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో స్కిన్ ట్యాన్(నల్లగా మారిన చర్మాన్ని)తెల్లగా మార్చే గులాబీ, పంచదార బాడీ స్క్రబ్

బాడీ స్ర్కబ్ అంటానే గ్లోయింగ్ స్కిన్ అనేవిషయం గుర్తుకు రావాలి. ఎందుకంటే బాడీ స్ర్కబ్ తో మన శరీరం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మరియు క్లియర్ గా కనబడుతుంది.

By Lekhaka
|

సహజంగా వాతావరణంలో మార్పులతో పాటు చర్మంలో మార్పులు వస్తుంటాయి. చలికి చర్మం పగుళ్ళు ఏర్పడుతుంది. అదే ఎండకాలంలో చర్మం టానింగ్ కు గురి అవుతుంది. డార్క్ గా మారుతుంది? ఇటువంటి టానింగ్ స్కిన్ ను నివారించుకోవడానికి ఒక ఎఫెక్టివ్ హో రెమెడీ ఉంది. ఇది అరగంటలో స్కిన్ టాన్ ను నివారిస్తుంది.

అయితే, డీటానింగ్ కోసం ఈ క్రింది సూచించిన నేచురల్ డీటానింగ్ మాస్క్ లు ఉపయోగించడం వల్ల చర్మం మీద డార్క్ ప్యాచ్ లు తొలగిపోతాయి. టానింగ్ నివారించబడుతుంది. స్కిన్ టానింగ్ కు సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకోవాలి. చర్మంలో మెలనిన్ అనే పింగ్మెంట్ చర్మ రంగులో మార్పు తీసుకొస్తుంది.ఎప్పుడైతే సూర్య రశ్మి నుండి వెలువడే యూవీకిరణాలు, మెలనిన్ ఓవర్ గా స్రవించడం వల్ల స్కిన్ డార్క్ గా మారుతుంది. దీన్నే స్కిన్ టానింగ్ అంటారు. స్కిన్ టానింగ్ నివారించుకోవడానికి బాడీ స్ర్కబ్ గ్రేట్ గా సహాయపడుతుంది.

DIY: Rose Body Scrub To Treat Skin Tan During Summers

బాడీ స్ర్కబ్ అంటానే గ్లోయింగ్ స్కిన్ అనేవిషయం గుర్తుకు రావాలి. ఎందుకంటే బాడీ స్ర్కబ్ తో మన శరీరం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మరియు క్లియర్ గా కనబడుతుంది. బాడీ స్క్రబ్ కోసం మార్కెట్లో కమర్సియల్ గా లేదా రసాయనికంగా ఉత్పత్తి అయిన బాడీ స్ర్కబ్స్ కాకుండా, తాజాగా మనం ఇంట్లో తయారుచేసుకొనే బాడీ స్ర్కబ్స్ మన చర్మానికి చాలా తాజాగా మరియు ఫ్రెష్ గా మరియు యవ్వంగా ఉంచుతుంది.

స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మీరు బ్రాండ్ ప్రొడక్ట్స్ కు పోకుండా, ఇంట్లో తాజాగా అందుబాటులో ఉండే బెస్ట్ హోం మేడ్ బాడీ స్ర్కబ్స్ ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకు చాలా సింపుల్ మరియు బాడీ స్ర్కబ్స్ చాలా ఉన్నాయి. మన ఇంట్లో అందుబాటులో ఉండే ఈ బేసిక్ పదార్థాలతోనే మన చర్మం యొక్క రంగును మార్చుకోవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు.

చర్మం యొక్క ఒక నిజమైన ఆకర్షణ ఎలా అంటే ఇంట్లో ఉండే బాడీ స్ర్కబ్బింగ్ పదార్థాలన్ని నేచురల్ గా మనకు లభించినవి, ఇవి చర్మానికి ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కాబట్టి, మీ చర్మం కమిలిందనో లేదా సన్ టాన్ కు గురైందనో, చర్మం నల్లబడుతోందనో చింతించక, మీ వర్రీస్ అన్నీ కట్టి పెట్టి, ఈ నేచురల్ బాడీ స్ర్కబ్స్ ను ఉపయోగించి ఫలితాన్ని చూడండి...

కావల్సిన పదార్థాలు:

కావల్సిన పదార్థాలు:

- ఫ్రెష్ గా ఉండే రోజా పువ్వు రేకులు

- ఒక కప్పు పంచదార

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

- ఫ్రెష్ గా ఉండే గులాబీలను తీసుకుని వాటి నుండి సున్నితంగా రేకులను వేరుచేయాలి. గుప్పెడు గులాబీ రేకులకు ఒక కప్పు పంచదార సరిపోతుంది.

- ఇప్పుడు ఒక కప్పు పంచదార తీసుకోవాలి.

- ఈ రెండింటి మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.

అంతే గులాబీ బాడీ స్క్రబ్ రెడీ, దీన్ని ఉపయోగించడం చాలా సులభం. కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కూడా జోడించుకోవవచ్చు. దీన్ని బాడీ స్క్ర్రబ్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ బాడీ స్క్రబ్ వల్ల అద్భుత మైన గ్గోయింగ్ స్కిన్ పొందవచ్చు, టాన్ కూడా తగ్గిస్తుంది.

రోజ్ బాడీ స్క్రబ్బర్ తో ప్రయోజనాలు :

రోజ్ బాడీ స్క్రబ్బర్ తో ప్రయోజనాలు :

- ఈ రోజ్ స్క్రబ్ ను రెగ్యులర్ గా రోజూ ఉపయోగిస్తుంటే, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

- బ్లాక్ అయిన చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి శుభ్రం చేసి, మురికిని తొలగించి, మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది.

- రోజ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల, బాడీ ట్యాన్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారి్తుంది, ముఖ్యంగా వేసవిలో ఇది బాగా పనిచేస్తుంది.

గులాబీలతో ప్రయోజనాలు :

గులాబీలతో ప్రయోజనాలు :

- గులాబీలో ఉండే ఎఫెక్టివ్ లక్షణాలు స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది.

- ఇంకా చర్మంలో డ్రైనెస్ తగ్గిస్తుంది. సాప్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

- గులాబీలలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.

- గులాబీలను స్కిన్ కేర్ లో ఉపయోగించిటం వల్ల స్కిన్ బ్రేక్ అవుట్స్ ను తొలగిస్తుంది.

- అలాగే గులాబీలో హైపర్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది..

- చర్మంను శుభ్రం చేయడంలో, చర్మానికి కావల్సిన మాయిశ్చరైజింగ్ అందివ్వడంలో గులాబీలు అద్భుతంగా సహాయపడుతాయి.

- ఇంకా ఇది నేచురల్ సన్ స్క్రీన్ లా పనిచేస్తుంది. ఇద యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కలిగిస్తుంది.

చర్మానికి పంచదార అందించే ప్రయోజనాలు :

చర్మానికి పంచదార అందించే ప్రయోజనాలు :

- ముఖ చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

- ఇంకా ఇది చర్మంలో డీప్ గా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.ఇది చర్మంలో మురికిని, ఇతర మలినాలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

- పంచదారలో ఉండే గ్లైకోలిక్ యాసిడ్, చర్మంను పూర్తిగా మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడుతుంది.

-ఇంకా పంచదారలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సి ఆసిడ్ హెల్తీ , గ్లోయింగ్ స్కిన్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

- ఇంకా చర్మంలో మూసుకుపోయిన చర్మ రంద్రాలను శుభ్రంచేస్తుంది, చర్మంలో జిడ్డు , ఆయిల్ నెస్ లేకుండా నివారిస్తుంది.

English summary

DIY: Rose Body Scrub To Treat Skin Tan During Summers

Summer is here and it is almost the time when your skin gets tanned. Skin tanning is one of the common summer struggles we all suffer from in summer days.
Desktop Bottom Promotion