చర్మంలో ఎలాంటి మచ్చలు లేకుండా ఇంట్లోనే స్వయంగా సాల్ట్ బాడీ స్ర్కబ్ తయారీ

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

రాళ్ళ ఉప్పు చర్మాన్ని మెరుగుపరిచే లక్షణాలను కలిగివుంది. ఈ సాంప్రదాయ చర్మ సంరక్షణ పదార్ధము అనేక సమస్యలకు చికిత్స చేయగలదు మరియు మచ్చలు లేని చర్మాన్ని పొందడానికి ఇది సహాయపడుతుంది.

రాళ్ళ ఉప్పు మీ చర్మానికి రక్షణను కల్పిస్తుంది మరియు ఇది చర్మాన్ని క్లీన్ గా మరియు క్లియర్ ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో వున్న శక్తివంతమైన అనామ్లజనకాలు మరియు ఎఫ్లోఎలైటింగ్ ఏజెంట్స్ మీ చర్మం నుండి విషాన్ని మరియు మలినాలను తొలగిస్తాయి. ఈ మలినాలు మీ చర్మాన్ని తరచూ అంటురోగాలకు గురయేలా చేస్తాయి అంతే కాకుండా మీ సహజ సౌందర్యాన్ని కూడా నాశనం చేస్తుంది.

చర్మఛాయను కాంతివంత చేసే టాప్ 10 బాడీ స్ర్కబ్స్

మీ చర్మం ఎలాంటి డర్ట్ పట్టకుండా మురికిగా లేకుండా ఉండాలనుకుంటున్నారా అయితే మీ చర్మం మీద వున్న మురికి తొలగించడానికి సి సాల్ట్ ని ఉపయోగించాలి. అందులోను దీనిని ఇతర సహజ పదార్ధాలతో కలిపి వాడటం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును.

మీ చర్మం ఎలాంటి డర్ట్ పట్టకుండా మురికిగా లేకుండా ఉండాలనుకుంటున్నారా అయితే మీ చర్మం మీద వున్న మురికి తొలగించడానికి సి సాల్ట్ ని ఉపయోగించాలి. అందులోను దీనిని ఇతర సహజ పదార్ధాలతో కలిపి వాడటం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చును.

బయట అందుబాటులో వుండే కమర్షియల్ స్క్రబ్స్ తో పోలిస్తే ఈ సి సాల్ట్ స్కర్బ్ ని మీ ఇంట్లోనే ఎంతో సులభమైన పద్దతిలో తయారుచేసుకోవచ్చు మరియు దీనిని క్యారీ చేయడం కూడా సులభమే.

ఇక్కడ, మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని మరియు ఆకృతిని పెంచే కొన్ని సముద్ర ఉప్పు స్కర్బ్స్ లిస్ట్ నిమీకోసం తెలియజేశాము అవేంటో తెలుసుకోవడానికి చదవడం కంటిన్యూ చేయండి.

గమనిక: క్రింద తెలిపిన స్కర్బ్స్ ని మీ చర్మానికి అప్లై చేసే ముందు టెస్ట్ చేసుకొని వాడటం తప్పనిసరి.

ఇంట్లోనే తయారుచేసుకొనే 11 నేచురల్ బాడీ స్క్రబ్స్

1.సముద్రపు ఉప్పు + కొబ్బరి నూనె

1.సముద్రపు ఉప్పు + కొబ్బరి నూనె

3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె ని 2 టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పు తో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ చర్మానికి అప్లై చేసి 5-10 నిమిషాల పాటు మసాజ్ చేయండి కాస్సేపటి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఇంట్లో నే తయారుచేసుకునే స్కర్బ్ ని ప్రతి వారం రెగ్యులర్ గా వాడటం వలన మీ చర్మం లోని మలినాలను తొలగించి మీ చర్మం శుభ్రంగా మరియు స్పష్టంగా ఉండటంలో సహాయపడుతుంది.

2.సముద్రపు ఉప్పు + కాఫీ గ్రౌండ్స్

2.సముద్రపు ఉప్పు + కాఫీ గ్రౌండ్స్

ఒక గిన్నెలో, 3 టేబుల్ స్పూన్ల సి సాల్ట్, 2 టీస్పూన్ల కాఫీ పొడి మరియు 2 టేబుల్ స్పూన్ల కాచి వడగట్టి చల్లార్చిన నీటిని కలపాలి. ఒక స్పూన్ సహాయంతో వీటిని బాగా కలిపిన తరువాత, మీ చర్మానికి అప్లై చేసి కాస్సేపు నెమ్మెదిగా మసాజ్ చేయాలి. కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. మీ చర్మం నుండి మృత చర్మ కణాలను తొలగించడానికి ఈ స్కర్బ్ ని ప్రతి వారం ఉపయోగించాలి.

3.సముద్రపు ఉప్పు + నిమ్మ రసం

3.సముద్రపు ఉప్పు + నిమ్మ రసం

4 టేబుల్ స్పూన్ల నిమ్మ రసంతో 3 టేబుల్ స్పూన్ల సముద్రపు ఉప్పును కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ చర్మం మీద అప్లై చేసి 5-10 నిమిషాల పాటు ప్రశాంతంగా మర్దనా చేయాలి. కాస్సేపు ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఈ ఇంట్లో తయారు చేసే స్కర్బ్ ని ప్రతి వారం క్రమం తప్పకుండా వాడటం వలన మీ చర్మం మంచి కలర్ రావడం తో పాటు మరియు గ్లో కూడా వస్తుంది.

4.సముద్రపు ఉప్పు + వోట్మీల్ మరియు ఆలివ్ ఆయిల్

4.సముద్రపు ఉప్పు + వోట్మీల్ మరియు ఆలివ్ ఆయిల్

1 టేబుల్ స్పూన్ వోట్మీల్ మరియు 3 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పులో 4 టేబుల్ స్పూన్ ల ఆలివ్ నూనె తో కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి సుమారు 10-15 నిమిషాలు స్క్రబ్బింగ్ తరువాత, దానిని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించవచ్చు. నెలలో రెండుసార్లు, మీ చర్మం ఎప్పటికప్పుడు బాగా తేమగా ఉండేలా చూడడానికి ఈ స్కర్బ్ ని ఉపయోగించాలి.

5. సముద్ర ఉప్పు + బ్రౌన్ షుగర్ మరియు రోజ్ వాటర్

5. సముద్ర ఉప్పు + బ్రౌన్ షుగర్ మరియు రోజ్ వాటర్

2 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, 3 టీస్పూన్ల బ్రౌన్ షుగర్ మరియు 4 టేబుల్ స్పూన్ల గులాబీ నీటిని కలపడం ద్వారా ఈ స్కర్బ్ ని రెడీ చేయవచ్చు. ఇప్పడు ఈ స్కర్బ్ ని మీ చర్మం అప్లై చేసుకొని సుమారు 10 నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయాలి. కాస్సేపు ఉంచి తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. నెలలో రోజూ ఇలా చేయడం ద్వారా మీ చర్మం యొక్క ఆకృతిని మృదువుగా చేయండి.

6. సముద్రపు ఉప్పు + ఆపిల్ పళ్లరసం వినెగార్

6. సముద్రపు ఉప్పు + ఆపిల్ పళ్లరసం వినెగార్

1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వినెగార్ మరియు 1 టేబుల్ స్పూన్స స్వేదనజలం మరియు 3 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పుతో కలపడం ద్వారా ఈ స్కర్బ్ ని తయారు చేసి మీ స్కిన్ ని మెరుగుపర్చండి. మృదువుగా మీ చర్మంపై చర్మాన్ని అప్లై చేసి, వెచ్చని నీటితో ఒక షవర్ తీసుకొనే ముందు 10 నిమిషాలపాటు ఆరనివ్వండి. ప్రతిరోజు ఈ అద్భుతమైన స్కర్బ్ ని ఉపయోగించడం ద్వారా సూపర్ సప్లిమెంట్ చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

7. సముద్ర ఉప్పు + అలోయి వెరా జెల్

7. సముద్ర ఉప్పు + అలోయి వెరా జెల్

4 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పులో 3 టేబుల్ స్పూన్ల అలో వేరా జెల్ ని కలపాలి. ఇలా తయారుచేసిన తరువాత, మీ చర్మం మీద అంతా రాసుకోవాలి మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు 5 నిముషాల పాటు మసాజ్ చేయండి. మీ చర్మానికి ప్రతిరోజూ ఈ స్కర్బ్ ని వాడటం ద్వారా మీ చర్మం మీద వుండే నల్లమచ్చలని సులభంగా తొలగించవచ్చు.

8. రాళ్ల ఉప్పు + బాదం నూనె

8. రాళ్ల ఉప్పు + బాదం నూనె

3 టేబుల్ స్పూన్ల రాళ్ళ ఉప్పులో 2 టేబుల్ స్పూన్స్ బాదం నూనెని కలపడం ద్వారా ఈ తదుపరి అద్భుతమైన స్కర్బ్ ని తయారుచేయవచ్చు. దీనిని మీ చర్మం మీద అప్లై చేసి 10 నిముషాల పాటు మసాజ్ చేసి నీటితో శుభ్రం చేయండి. వీక్లీ ఈ సులభమైన స్కర్బ్ ని వుపయోగించి మీ చర్మం మీద వున్న మురికిని తొలగించండి.

English summary

sea salt body scrubs for flawless skin | homemade scrubs for flawless skin | DIY sea salt body scrubs

Here is the DIY sea salt scrubs for flawless skin, take a look.