Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
పగిలిన పెదవుల కోసం సులభంగా ఇంట్లో తయారుచేసుకోగలిగే లిప్ స్క్రబ్స్
పగిలిన పెదవులు, ఎండిపోయిన పెదవులు ఎవరికైనా సమస్యే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షాపుల్లో కొనే లిప్ బామ్ లు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తాయి కానీ శాశ్వతంగా ఈ చిరాకు తెప్పించే సమస్య నుంచి బయటపడటానికి
పగిలిన పెదవులు, ఎండిపోయిన పెదవులు ఎవరికైనా సమస్యే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షాపుల్లో కొనే లిప్ బామ్ లు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తాయి కానీ శాశ్వతంగా ఈ చిరాకు తెప్పించే సమస్య నుంచి బయటపడటానికి సమస్య మూలం నుంచే పరిష్కారం వెతకాలి.
మీ పెదవులు పగలటానికి, ఎండిపోవటానికి వివిధ కారణాలు ఉంటాయి. అందులో కొన్ని మృతచర్మ కణాలు మరియు మురికి పేరుకుపోవటం, అనారోగ్యకర జీవనవిధానాలు అయిన పొగతాగడం, మద్యం సేవించటం వంటివి, అలర్జీ మరియు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు.
ఈ కారణాలను పరిష్కరించటానికి చర్మనిపుణులు స్త్రీలను తమ పెదవులను తరచుగా ఎక్స్ ఫోలియేట్ చేసుకోమని సూచిస్తున్నారు. ఈ సింపుల్ పద్ధతి మీ పెదవుల సమస్యలను తగ్గించటంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.

ఈ అందానికి సంబంధించిన పద్ధతి పాటించడం కోసం లిప్ స్క్రబ్ అవసరమవుతుంది. మీరు దీన్ని షాపులో అయినా కొనుక్కోవచ్చు లేదా మీ సొంతగానే తయారుచేసుకోవచ్చు.
ఏమైనా, మీ సొంత లిప్ స్క్రబ్ లను మీరే తయారుచేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంట్లో తయారుచేసే లిప్ స్క్రబ్ లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. ఇవి సురక్షితమైనవి, చవకైనవి, మరియు కృత్రిమ రసాయనాలు కూడా ఉండవు.
ఈ రోజు బోల్డ్ స్కైలో మేము మీ పగిలిన పెదవులను పోగొట్టే లిప్ స్క్రబ్ లను ఇంటిలోనే ఎలా తయారుచేసుకోవచ్చో వివరిస్తాం.
ఇక్కడ వాడిన పదార్థాలు అన్నీ పోషకవిలువలు, తేమ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి మీ పెదవులను మెత్తగా, మృదువుగా మార్చి పగుళ్ళను తగ్గిస్తాయి.
పెదవుల స్క్రబ్స్ వివిధ తయారీలను చూడండి ;

1. బాదం నూనెతో ఓట్ మీల్
1 చెంచా వండిన ఓట్ మీల్ ను అరచెంచా బాదం నూనెను కలపండి.
దీన్ని మీ పెదవుల మీద మెల్లగా రుద్దండి.
ఐదు నిమిషాల తర్వాత చల్లనీరుతో కడిగేయండి.
వారం లోపల మీరు ఇలా 3-4 సార్లు చేసి మంచి ఫలితాలను పొందండి.

2. వెనిలా ఎసెన్స్ తో బౌన్ షుగర్
అరచెంచా బ్రౌన్ షుగర్ ను 1 చెంచా వెనిలా ఎసెన్స్ తో కలపండి.
ఈ మిశ్రమాన్ని పెదవులపై రాసి, 5 నిమిషాల పాటు మెల్లగా రుద్దండి.
గోరువెచ్చని నీరుతో కడిగేయండి.
వారానికి 2-3 సార్లు ఇలా చేసి పెదవుల పగుళ్ళను తగ్గించుకోండి.

3. పెప్పర్ మింట్ ఆకులతో కోకో పొడి
10-12 పెప్పర్ మింట్ ఆకులను నలిపి, రోజ్ వాటర్ ను జతచేయండి.
ఈ మిశ్రమాన్ని అరచెంచా కోకోపౌడర్ తో కలిపి పేస్టులా చేయండి.
దీన్ని మీ పెదవులపై మెల్లగా రుద్దండి.
గోరువెచ్చని నీరుతో కడిగేసి, వారం పాటు ఇలాగే చేసి మంచి ఫలితాలు పొందండి.

4. షియా బటర్ తో పుదీనా ఆకులు
8-9 పుదీనా ఆకులను నలిపి అరచెంచా షియా బటర్ తో కలపండి.
దీన్ని మీ పెదవులపై రాసి మెల్లగా రుద్దండి. కొన్ని నిముషాల పాటు ఉంచాక, గోరువెచ్చటి నీరుతో కడిగేయండి.
ఈ ఇంటిలో తయారుచేసుకునే స్క్రబ్ ను వారానికోసారి వాడి మెత్తని మరియు మృదువైన పెదవులను మీ సొంతం చేసుకోండి.

5. పంచదార మరియు నిమ్మరసంతో కొబ్బరి నూనె
1చెంచా కొబ్బరి నూనె, పంచదార మరియు అరచెంచా తాజా నిమ్మరసాన్ని కలపండి.
ఈ మిశ్రమాన్ని మీ పెదవులపై రాసి అక్కడ పేరుకున్న మురికి, మృతకణాలను తొలగించండి.
అలా చేసేసాక మీ పెదవులను గోరువెచ్చని నీరుతో కడిగేయండి.
నెలలో 3-4 సార్లు ఈ అద్భుత స్క్రబ్ ను వాడి మంచి ఫలితాలను పొందండి.

6.ఆలివ్ నూనెతో కాఫీ గింజలు
అరచెంచా కాఫీగింజల పొడిని 1 చెంచా ఆలివ్ నూనెతో కలపండి.
ఈ మిశ్రమాన్ని మెల్లగా మీ పెదవులపై 5 నిమిషాల పాటు రుద్దండి.
అయ్యాక మీ పెదవులను గోరువెచ్చని నీరుతో కడిగేయండి.
వారానికి రెండుసార్లు ఇలా సులభమైన స్క్రబ్ ను వాడి మెత్తని, పింక్ పెదవులను పొందండి.

7.దాల్చినచెక్కతో తేనె
1/3చెంచా దాల్చిన చెక్క పొడిని 1 చెంచా తేనెతో కషాయం తయారుచేయండి.
దీన్ని మీ పెదవులపై రాసి 5-10 నిమిషాల పాటు రుద్ది, గోరువెచ్చని నీటితో కడిగేయండి.
ఈ ఇంట్లో తయారుచేసుకునే స్క్రబ్ ను వారానికోసారి వాడి, మీ పెదవులకి తగినంత తేమ ఉండేలా చూడండి.



Click it and Unblock the Notifications