For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖంలో హెయిర్ కనబడనివ్వకుండా చేసే హోం రెమెడీస్

By Bharath Reddy
|

వెంట్రుకలు ఆడవారి తలపై బాగా ఉంటే ఎంతో అందం. అవి వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. కానీ చేతులు, కాళ్లు, ముఖంపై వస్తే అవే అవాంఛిత రోమాలు. కొందరు ఆడవాళ్లను వేధించే సమస్య ముఖంపై వెంట్రుకలు రావడం. ఇవి వారిని అందవికారంగా మార్చివేస్తాయి. ఇలాంటివారు ఎంత అందంగా ఉన్నా కూడా ఈ లోటు అందాన్ని తగ్గించేస్తుంది. ఈ అవాంచిత రోమాలతో మహిళలు చాలా ఇబ్బందులుపడుతుంటారు. చాలామంది సిగ్గుతో నలిగిపోతూ, బాధపడుతూ పదిమందిలోకి రావాలంటే కుంచించుకుపోతుంటారు. కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల కొందరిలో ఈ సమస్య తలెత్తుతుంటుంది.

అలాగే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిల్లో అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తాయి. శరీరం లో ఈస్ట్రోజెన్ స్థాయిలను బట్టి కూడా ఇవి వస్తుంటాయి. దీంతో భయపడిపోయి ఈ ముఖం పై రోమాలను తొలగించుకోవటానికి మార్కెట్ లో లభించే అన్ని రకాల ఉత్పత్తులను మగువలు వాడేస్తుంటారు. అలాగే ఇప్పటికే దగ్గరలో ఉన్న బ్యూటీ సెలూన్ కి వెళ్లి అవాంఛిత రోమాలకి చికిత్స చేయిస్తారు. అయినా ఫలితం ఉండదు. మళ్లీ వెంట్రుకలు పెరుగుతూనే ఉంటాయి. దీని నివారణకు ఆధునిక వైద్య విధానాల్లో అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నా అవి దుష్ర్పభావాలు చూపుతాయనే భావన చాలామందిలో ఉంది. అందువల్ల వీటిని చాలామంది వినియోగించడం లేదు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కాంతివంతమైన, అందమైన ముఖంతో అందరి ముందు తలెత్తుకుని తిరొగొచ్చు. ఈ కింది చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే అవాంఛిత రోమాలు పూర్తిగా తొలగిపోతాయి.

1 . పసుపు పేస్ట్ చాలా పవర్

1 . పసుపు పేస్ట్ చాలా పవర్

సంప్రదాయపరంగా అనేక చర్మ వ్యాధులకు పసుపుతో చెక్ పెట్టేయొచ్చు. అవాంచి రోమాలను తొలగించడంలో ఇది చాలా పవర్ ఫుల్ గా పని చేస్తుంది. 1-2 టీ స్పూన్ల పసుపు తీసుకుని దాన్లో తగినన్ని పాలు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను అవాంచిత రోమాలు ఉన్న చోట పూయాలి. ఆ తర్వాత 20 నిమిషాలకు వేడి నీళ్లతో కడిగే యాలి. అలా కొద్ది రోజుల పాటు చేస్తే ఆ రోమాలన్నీ తొలగిపోతాయి. ఈ చిట్కా ముఖంపై సన్నని వెంట్రుకలు ఉన్నవాళ్లకే పనిచేస్తుంది. ఒకవేళ వెంట్రుకలు మందంగా ఉంటే పసుపులో శనగపిండి, బియ్యంపిండి, దంచిన ఓట్లు కూడా కలుపుకుని అప్లై చేయాలి. అలాగే ఒక చెంచాడు పసుపును తీసుకుని దాన్ని రోజ్ వాటర్ లో వేసి నాననివ్వాలి. కొద్ది సేపటి తర్వాత దాన్ని పేస్ట్ లా చేసుకుని అప్లయ్ చేసుకోవాలి. 20 నిమిషాలు లేదా పూర్తిగా ఆరే వరకు ఉంచి ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి.

2. శనగపిండి

2. శనగపిండి

శనగ పిండిని నీరు లేదా పాలలో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. దీనికి ఒక చెంచాలో నాల్గో వంతు పసుపును కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వెంట్రుకలు పెరిగే ప్రాంతంలో పూయండి. అయితే పేస్ట్ ను వెంట్రుకలు పెరిగే దిశకి వ్యతిరేకంగా పూయాలి. బాగా ఎండిపోయే వరకు అలానే ఉంచండి. ఇది ఎండటానికి 20-25 నిమిషముల సమయం తీసుకుంటుంది. అలాగే పొడి చర్మ తత్వం ఉన్నవారు అర కప్పు శనగపిండిలో అరకప్పు పాలు, ఒక టీస్పూన్‌ పసుపు, తాజా పాల మీగడ కలిపి పేస్ట్‌ను తయారు చేసుకుని అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్ల నీళ్లతో కడుక్కోవాలి.

3. బంగాళదుంపలు,కందిపప్పు

3. బంగాళదుంపలు,కందిపప్పు

బంగాళదుంపలోల్ల సహజ బ్లీచ్ గుణాలు ఉంటాయి. వీటి గుజ్జును కందులతో కలిపి రాసుకుంటే హెయిర్ పై ప్రభావం చూపుతుంది. కందిపప్పును రాత్రివేళ నానపెట్టి, ఆ పప్పును గ్రైండ్‌ చేసి, మెత్తని పేస్టులా చేయాలి. చెక్కు తీసిన బంగాళా దుంపల గుజ్జును కంది పేస్టులో కలపాలి. దానిలో రెండు తాజా నిమ్మకాయల రసం పోసి పిండిని కలపాలి. ఒక టీ స్పూను తేనె కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాల పైన అంటించి అరగంట వరకు ఉంచాలి. బాగా ఆరిన తర్వాత నీటితో తడిపి తీసివేయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి చేయాలి. పూర్తిగా ఆరాక చేతి వేళ్లతో రుద్దుతూ పేస్ట్‌ను వదిలించాలి. ఈ పొడి రాలేటప్పుడు దాంతోపాటు అవాంఛిత రోమాలు కూడా రాలిపోతాయి.

4. నిమ్మరసం

4. నిమ్మరసం

పంచదార, నిమ్మరసం, తేనెను సమ భాగాల్లో కలిపి, సన్నని మంటపై రెండు మూడు నిమిషాల పాటు వేడిచేసి పల్చగా, నున్నగా జారేట్టు అయ్యాక చల్లార్చాలి. అవసరమైన భాగాలను శుభ్రపరిచి వెంట్రుకలు వచ్చే దిశగా రాయాలి. ఆ పేస్టు పైన గుడ్డను అంటించి, వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేకంగా లాగితే, వెంట్రుకలు ఊడి వస్తాయి. అలాగే రెండు టీస్పూన్ల చక్కెర, రెండు టీ స్పూన్ల తాజా నిమ్మరసం, నీళ్లు తీసుకుని చక్కెర కరిగేవరకూ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15- 20 నిమిషాలాగి వేళ్లతో సున్నితంగా రుద్దుతూ కడిగేయాలి. ఇలా వారానికి 2 - 3 సార్లు చేస్తే ముఖం మీది రోమాలు తగ్గుముఖం పడతాయి.

5. పచ్చి బొప్పాయి

5. పచ్చి బొప్పాయి

అన్ని రకాల చర్మ తత్వాలు ఉన్నవారికి బొప్పాయి అనువైనది. దీనిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. పచ్చి బొప్పాయి తొక్కుతీసి మెత్తగా రుబ్బుకోవాలి. రెండు టేబుల్‌ స్పూన్ల బొప్పాయి గుజ్జులో అర టీస్పూను పసుపు కలిపి ఈ మిశ్రమంతో 15 నిమిషాలపాటు ఫేస్‌ మసాజ్‌ చేయాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తుంటే ముఖం మీది అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. అలాగే రెండు చెంచాల బొప్పాయి పిండి, మూడు చెంచాల అలోవెరా జెల్, ఒక చెంచాడు ఆవనూనె, పావు చెంచా శనగపిండి, పావు చెంచాడు పసుపు, రెండు చుక్కల వంట నూనెను కలుపుకోవాలి. దాన్ని అన్ వాంటెడ్ హెయిర్ పై రాసుకుని 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత పొడి వస్త్రాన్ని తీసుకుని ప్యాక్ ను తొలగించుకోవాలి. తర్వాత కడిగేసుకుని, ఆలీవ్ ఆయిల్ లేదా బేబీ ఆయిల్ రెండు చుక్కలు చేతిలోకి తీసుకుని ప్యాక్ తీసేసిన ప్రదేశంలో రాసుకోవాలి. వారానికి రెండు నుంచి మూడు సార్లు మూడు నెలల పాటు ఇలా చేస్తే అన్ వాంటెడ్ హెయిర్ పూర్తిగా తొలిగిపోతుంది.

6. గుడ్డు ఎంతో గుడ్

6. గుడ్డు ఎంతో గుడ్

గుడ్డులో తెల్లసొనకు ముఖంపై ఉన్న రోమాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఒక గుడ్డు తెల్ల సొన, చక్కెర ఒక టేబుల్‌స్పూన్‌, మొక్కజొన్న పిండి 1/2 టేబుల్‌ స్పూను తీసుకుని మెత్తని పేస్ట్‌లా మారేవరకూ గిలక్కొట్టాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత మాస్క్‌ ముఖ చర్మానికి అతుక్కుని ఉంటుంది. ఇప్పుడు ఈ మాస్క్‌ని ఎంతో జాగ్రత్తగా వేళ్లతో తీసేయాలి. ఇలా చేస్తున్నప్పుడు మాస్క్‌తోపాటు వెంట్రుకలు కూడా పోతాయి. అప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినా మంచి ఫలితం ఉంటుంది.

7 . తెల్ల మిరియాలు, కర్పూరం

7 . తెల్ల మిరియాలు, కర్పూరం

ఈ రెండు పదార్థాలు శరీరంపై ఎక్కడ పూసిన బాగా మంట పుడుతుంది. ఇవి ఘాటుగా ఉంటాయి కాబట్టి వీటితో తయారుచేసిన మాస్క్‌ను కాళ్లపై ఉండే అవాంఛిత రోమాలను తొలగించడానికే ఉపయోగించాలి. 2 టేబుల్‌ స్పూన్ల తెల్ల మిరియాలు (పొడి చేసుకోవాలి), 2 టీస్పూన్ల కర్పూరం, బాదం నూనె కొన్ని చుక్కలు కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. కాళ్లకు అప్లై చేసి 10-15 నిమిషాలాగి కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే అవాంఛిత రోమాలన్నీ తగ్గిపోతాయి.

8 .అరటితో అద్భుతంగా పని చేస్తుంది

8 .అరటితో అద్భుతంగా పని చేస్తుంది

అరటి, ఓట్ల మిశ్రమం అవాంఛిత రోమాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. బాగా నూరిన అరటి పండును మెత్తని గుజ్జుగా చేసి, రెండు చెంచాల ఓట్‌మీల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని అవసరమైన చోట చేతి వేళ్లను చన్నీళ్లలో ముంచి 15- 20 నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ రుద్ది కడగాలి. వారానికి రెండు మూడుసార్లు ఇలా చేస్తే, అవాంఛిత రోమాల సమస్య తొలగిపోతుంది.

9. ఉల్లిగడ్డ , తులసి

9. ఉల్లిగడ్డ , తులసి

చర్మాన్ని అందంగా మార్చే గుణాలు ఉల్లిగడ్డలో ఉన్నాయి. అలాగే అన్ వాంటెడ్ హెయిర్ ను కూడా తొలగించడానికి ఇది ఎంతో సాయపడుతుంది. ఉల్లికి తులసి ఆకులు జత చేయాలి. రెండు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని తీసుకుని ముక్కలు చేసుకోవాలి. వాటిని పది తులసి ఆకుల్ని కలిసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను అప్లయ్ చేసుకుని 25 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. వారానికి మూడు సార్లు చేసుకోవడం వల్ల రెండు నెలల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

10. తనకా పౌడర్, కుసుమ నూనె

10. తనకా పౌడర్, కుసుమ నూనె

ఆయుర్వేద షాపుల్లో తనకా పౌడర్ అని లభ్యమవుతుంది. తనకా అనే చెట్టు బెరడు నుంచి దీన్ని తయారు చేస్తారు. అలాగే కుసుమ నూనెను కూడా తీసుకోవాలి. ముందుగా అన్ వాంటెడ్ హెయిర్ ను క్రీము లేదా షేవర్ తో తీసేయాలి. తర్వాత తనకా పొడిని కుసుమ నూనెలో వేసి కలుపుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఆ పేస్ట్ ను అన్ వాంటెడ్ హెయిర్ ను తొలగించిన చోట అప్లయ్ చేసుకోవాలి. నాలుగు గంటల పాటు అలానే ఉంచేయాలి. ఆ తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా వంద రోజుల పాటు చేయాలి. మధ్యలో ఒక్కరోజు కూడా మిస్ కావొద్దు. దాంతో అన్ వాంటెడ్ హెయిర్ తిరిగి అక్కడ ఇక రాదు. అలాగే నువ్వుల నూనెను గానీ, పల్లీనూనెను గానీ, అవాంఛిత రోమాలపై రాసి, ఆ భాగాన్ని బాగా మర్ధన చేసి మెత్తని శనగ పిండిని రాసి బాగా నొక్కి నలుగు పెట్టాలి. వారానికి ఒకటి రెండు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

English summary

10 Easy ways to lighten facial hair naturally

10 Easy ways to lighten facial hair naturally. Know more about..Read on..
Desktop Bottom Promotion