మీ లోపలి తొడల భాగాన్ని సహజంగా తెల్లబర్చే ఇంటి చిట్కాలు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

బీచ్ లలో సెలవలు గడపటానికి వెళ్ళినపుడు బికినీ వేసుకోటానికి మీ లోపలి తొడలు నల్లగా ఉన్నాయని వేసుకోవటం మానేస్తున్నారా? అలా అయితే మేము చెప్పేది వినండి, మీకొక్కరికే ఆ సమస్య లేదు. 10 మంది స్త్రీలలో 9 మంది ఇదే సమస్యతో బాధపడతారు.

దీని కారణాలు చాలా ఉంటాయి. లోపలి తొడల భాగంలో మురికి పేరుకుపోవటం, మృతకణాలు, అనుక్షణం ఒరిపిడి వంటివి సాధారణ కారణాలు.

Effective Remedies To Lighten Your Dark Inner Thighs Naturally

మీ లోపలి తొడలను సహజంగా తెల్లబరిచే ప్రభావవంతమైన చిట్కాలు

అదృష్టవశాత్తూ, ఈ సమస్యకు సులభంగానే చికిత్స చేయవచ్చు, అది కూడా ఎక్కువ డబ్బు ఖర్చుచేయకుండానే చేయవచ్చు. కొన్ని సహజ చిట్కాలను మీ దినచర్యలో భాగం చేసి మీ నల్లబారిన తొడలను మెరుగుపర్చుకోండి.

ఈ చిట్కాలు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాయి మరియు చర్మరంగు మార్పిడి సమస్యలలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఇక్కడ ఆ చిట్కాలు, అవి ఎలా వాడాలో పొందుపరిచాం. వీటితో ప్రయత్నం చేసి ఇకనుంచి మీ కాళ్ళను ఏ జంకూ లేకుండా ప్రదర్శించండి...

1.బంగాళదుంప

1.బంగాళదుంప

బంగాళదుంపలోని సహజమైన బ్లీచింగ్ గుణాలు ఈ చర్మ రంగు మార్పు సమస్యకి చక్కగా సరిపోతాయి. ఒక ఆలూ ముక్కను మీ లోపలి తొడల భాగంలో స్నానం చేసే ముందు 5-10 నిమిషాలు రుద్దండి. వారానికి 4-5 సార్లు ఇలా చేసి కావాల్సిన ఫలితాలు పొందండి.

2.బియ్యం పిండి

2.బియ్యం పిండి

బియ్యం పిండి కూడా లోపలి తొడల వంటి భాగాలలో నల్లచర్మపు రంగు మార్చే అద్భుతమైన చిట్కా. ఒక చెంచా బియ్యం పిండిని 2 చెంచాల పాలతో కలపండి. ఈ పేస్టును ఆ చోటపై కొన్ని నిమిషాలు రుద్ది మసాజ్ చేయండి. అయ్యాక గోరువెచ్చని నీరుతో కడగండి.

3. నిమ్మరసం

3. నిమ్మరసం

చర్మం తెల్లబర్చే విషయాలలో నిమ్మరసం వాడతారని అందరికీ తెలిసిన విషయమే. నిమ్మరసాన్ని లోపలి తొడలంతా రాసి, గోరు వెచ్చని నీరుతో కడిగే ముందు 5-10 నిమిషాలు వదిలేయండి. ఇది వారంలో ఎన్నిసార్లైనా చేసి మంచి ఫలితాలు పొందవచ్చు.

4.ఆలోవెరా జెల్

4.ఆలోవెరా జెల్

మరో అద్భుతమైన చిట్కా ఆలోవెరా జెల్. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దీనితో మీ లోపలి తొడ భాగాలను వెంటనే నల్లబడడం నుంచి దూరం చేయవచ్చు. సింపుల్ గా ఆలోవెరా జెల్ ను ఆ ప్రాంతమంతా పట్టించి అరగంట సేపు అలా వదిలేయండి. తర్వాత చల్ల నీళ్ళతో కడిగేయండి. దీన్ని మీరు రోజులోనే అనేకసార్లు ప్రయత్నించి మంచి ఫలితాలు పొందవచ్చు.

5. పెరుగు

5. పెరుగు

లాక్టిక్ యాసిడ్ ఉండే పెరుగు లోపలి తొడల భాగంలో రంగు మెరుగవ్వటానికి వాడే మరో ఇంటి చిట్కా. తాజా పెరుగును ఆ ప్రాంతం అంతా పట్టించండి. పావుగంట సేపు అలా ఉంచి గోరువెచ్చని నీరుతో కడిగేయండి. దీన్ని రోజుకోసారి వాడి మంచి ఫలితాలు చూడండి.

6.పసుపు

6.పసుపు

ఇది సాంప్రదాయ భారతీయ చిట్కా, ఇందులో ఉండే విటమిన్లు లోపలి తొడల భాగం రూపాన్ని మెరుగుపరుస్తాయి. చిటికెడు పసుపును 1 చెంచా రోజ్ వాటర్ తో కలిపి ఆ పేస్టును ఆ ప్రాంతమంతా పట్టించండి. 10-15 నిముషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేసి ఫలితాలు మీరే చూడండి.

7. దోసకాయ

7. దోసకాయ

దోసకాయలో వివిధ చర్మ రంగు మెరుగుపర్చే లక్షణాలు ఉండటం వలన మీ లోపలి తొడలను కూడా రంగు మార్చటంలో సాయపడుతుంది. దోసకాయ పేస్టును ఆ ప్రాంతం అంతా పూసి 15 నిమిషాలు వదిలేయండి. తర్వాత గోరువెచ్చని నీరుతో కడిగేయండి. ఇలా రోజూ చేయటం వలన సానుకూల ఫలితాలను చూస్తారు.

8. కొబ్బరి నూనె

8. కొబ్బరి నూనె

పోషక గుణాలున్న ఈ సహజ నూనె కూడా లోపలి తొడల భాగంలో ఉన్న నల్లదనాన్ని పోగొట్టడానికి మరో శక్తివంతమైన పదార్థం. కొబ్బరినూనెతో ఆ ప్రాంతంలో ప్రతిరోజు పడుకునే ముందు మసాజ్ చేయండి. పొద్దున్నే గోరువెచ్చని నీరుతో స్నానం చేయండి. ఇలా రోజూ చేయటం వలన లోపలి తొడల భాగంలో రంగు కూడా మిగతా చోట్ల చర్మపు రంగులాగా సమానంగా వచ్చేస్తుంది.

English summary

Effective Remedies To Lighten Your Dark Inner Thighs Naturally

Do you shy away from donning bikinis on beach vacations because of the appearance of your inner thighs? If so, then trust us when we say that you're not the only one. As 9 out of 10 women are plagued with this unsightly skin condition. Well you don't have to worry much as there are several home remedies that really
Story first published: Thursday, December 21, 2017, 8:30 [IST]