మీ సన్ స్క్రీన్ పై ఉన్న ఎస్ పిఎఫ్ అంటే ఏంటో అని ఎప్పుడైనా ఆలోచించారా?

By: Deepti
Subscribe to Boldsky

సౌందర్యనిపుణులు మీ చర్మానికి సన్ స్క్రీన్ ఎంతో ముఖ్యమని చెబుతూనే ఉంటారు. మీ చర్మానికి యువి కిరణాలనుంచి రక్షణ లేకుండా కాలు బయటపెట్టద్దని మీకూ చాలామంది చెప్పే ఉంటారు.

మీరు సరియైన రక్షణలేకుండా బయటకి వెళ్ళి, మీ చర్మాన్ని పెద్ద అపాయంలో పడేస్తున్నారు. సాధారణంగా జరిగే ట్యాన్, సమయానికి ముందే వయస్సు మీరటం, నల్ల వలయాలు వంటివే కాక శక్తిమంతమైన అతినీలలోహిత కిరణాలు మీ చర్మపు పొరలలోకి ప్రవేశించి, డిఎన్ ఎని కూడా మార్చేసి, చర్మ క్యాన్సర్ కి కూడా దారితీయవచ్చు !

మాకు తెలుసు,మీరు ఇది చదివాక తప్పక సన్ స్క్రీన్ కొనటానికి వెళ్తారు. కానీ ఒక నిమిషం ఆగండి. ఈ రోజుల్లో, మనకి ప్రతి రంగంలో ఎంచుకోటానికి చాలా అవకాశాలున్నాయి. మరి మనకి సరియైన సన్ స్క్రీన్ ఏది అని ఎలా తెలుస్తుంది?

Ever Wondered What SPF On Your Sunscreen Implies

ఇదిగో, ఈ వ్యాసంలో మంచి సన్ స్క్రీన్ కొనడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.

డేంజర్ : సన్ స్క్రీన్ లోషన్ వాడితే స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా...?!

మొదటి విషయం ఆ సన్ స్క్రీన్ గూర్చి తెలుసుకోవాల్సింది ఎస్ పిఎఫ్ లేదా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ గురించి. అదేంటి అని అడుగుతున్నారా? ఆగండి, మొత్తం చదవండి.

ఎస్ పిఎఫ్/ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?

ఎస్ పిఎఫ్ అంటే మీ సన్ స్క్రీన్, మీ చర్మాన్ని యువిఎ మరియు యువిబి కిరణాల నుంచి ఎంతవరకు కాపాడుతుందనే కొలమానం. మార్కెట్లో ఎస్ పిఎఫ్ 15 నుంచి మొదలుకొని అనేక రకాల సన్ స్క్రీన్ లు దొరుకుతాయి. ఎస్పిఎఫ్ 15 అంటే అది మీ చర్మాన్ని 150 నిమిషాలు ఎండ నుంచి కాపాడుతుందని అర్థం.

అది 93% యువిబి కిరణాలను నిరోధిస్తుంది. చర్మం సరియైన రక్షణలేకపోతే 15నిమిషాల తర్వాత నుంచి మాడిపోవటం మెల్లిగా మొదలవుతుంది.

Ever Wondered What SPF On Your Sunscreen Implies

దీనితో పోల్చుకుంటే, ఎస్పిఎఫ్ 30 90% యువిబి కిరణాలను నిరోధిస్తుంది. ఎక్కువ ఎస్పిఎఫ్ ఉంటే ఎక్కువ రక్షణనిస్తుందనే మూఢనమ్మకం ఇక తొలగినట్టే.

ఎస్పిఎఫ్ అంటే కేవలం మీకు కన్పించేదే కాదు. ఎస్పిఎఫ్ 15, ఎస్పిఎఫ్ 30 కన్నా రెట్టింపు రక్షణనిస్తుందనే ఆలోచన సాధారణం. కానీ అది అలా పనిచేయదు.

కమిలిన చర్మాన్ని నివారించే నేచురల్ సన్ స్క్రీన్ లోషన్స్

ఎక్కువ నెంబరు వున్న ఎస్పిఎఫ్ ను ఎంచుకోవటం కన్నా, చర్మ నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే సన్ స్క్రీన్ ల ఎంపికలో మరో ముఖ్య విషయం, మరలా దాని వాడకం. మీరు ఎస్పిఎఫ్ 15 లేదా 50 ది వాడారా అని ముఖ్యం కాదు, రెండు గంటలకొకసారి మళ్ళీ వాడకపోతే అది ఎలాంటిదైనా ఉపయోగం లేదు.

సన్ స్క్రీన్ ఎంచుకోవాలసినపుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

సన్ స్క్రీన్ కొనేటప్పుడు చూసుకోవాల్సిన విషయం దాని మన్నిక. నీటి నుంచి, చెమట నుంచి నిరోధాన్నిచ్చి మళ్ళీ రాసుకునేదాకా దాదాపు రెండు గంటలపాటు నిలబడగలగాలి.

ఇంకా, మీరు ఎంత సన్ స్క్రీన్ రాసుకుంటారు అనేది కూడా ముఖ్యమే. చాలామంది తక్కువ రాసుకుంటారు. రాయాల్సిన దానికన్నా ¼ లేదా ½ వంతు మాత్రమే రాస్తే సగం రక్షణ మాత్రమే లభిస్తుంది.

ఎస్పిఎఫ్ 30 సన్ స్క్రీన్ ను సూచించిన దానికంటే సగమే వాడితే అది మీకు ఎస్పిఎఫ్ 15 రక్షణ మాత్రమే ఇస్తుంది. చర్మవైద్యుల ప్రకారం చర్మంపై 2మిల్లీగ్రాములు/ చదరపు సెం.మీ. ప్రాంతంలో పట్టేంత సన్ స్క్రీన్ ను రాయాలి.

ఏది ఏమైనా, ఏ ఉత్పత్తులు ఎంచుకున్నా, అవి నీటిని నిరోధించే వాటిగా ఉన్నాయో లేదో చూసుకోండి. బయటకి వెళ్ళే అరగంట ముందు సన్ స్క్రీన్ ను రాసుకోండి, అలా దానికి చర్మంలో ఇంకటానికి సమయం దొరుకుతుంది. రెండు గంటలకొకసారి సన్ స్క్రీన్ రాసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. చర్మాన్ని సూర్యుడి నుంచి రక్షించుకోండి, అది మిమ్మల్ని జీవితాంతం రక్షిస్తుంది.

English summary

Ever Wondered What SPF On Your Sunscreen Implies?

Read to know the importance of applying sunscreen to your body.
Subscribe Newsletter