కాళ్ళు అందంగా..నునుపుగా, మెరుస్తూ కనిపించాలంటే ఈ నూనెలు వాడండి..

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

వాక్సింగ్ మరియు షేవింగ్ వంటి హెయిర్ రిమూవల్ ప్రక్రియలు చర్మాన్ని నిస్తేజంగా మరియు నిగారింపు లేని కాళ్లకి కారణం కావచ్చు. చాలామంది మహిళలు మోకాల పొడవు దుస్తులు లేదా షార్ట్స్ ధరించకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

మీ కాళ్ళ చర్మం నిస్తేజంగా మరియు అనారోగ్యకరమైనదిగా కనిపిస్తుండటం వలన మీరు చాలా చిన్న దుస్తులు ధరించడానికి సంకోచిస్తున్నారా! అయితే ఈ పోస్ట్ మీకు ఖచ్చితంగా అవసరమవుతుంది. మోడల్స్ కాళ్ళ లాగా అందమైన మెరిసే కాళ్ళను పొందడానికి సహాయపడే సహజమైన సహజ నూనెల లిస్ట్ ని మీకోసం బోల్డ్ స్కై తెలపడం జరిగింది.

డ్రైగా...రఫ్ గా ఉండే స్కిన్ ను బేబీ సాఫ్ట్ స్కిన్ గా మార్చే 10 బెస్ట్ నేచురల్ ఆయిల్స్

Natural Oils You Can Use To Get Shiny Legs

సహజ నూనెలు సాంప్రదాయ నివారణలు కొన్ని తరాల నుండి మంచి ప్రాచుర్యాన్ని పొందాయి మరియు వాటి వలన చర్మానికి కలిగే ప్రయోజన లక్షణాల వలన ప్రసిద్ధి చెందాయి. వీటిలో మీ కాళ్ళపై చర్మం మీద అద్భుతాలను చేయగల మెరిసే మరియు గ్లో-పెంచే ఏజెంట్లను కలిగి ఉంటాయి.

మరి ఆ సహజ నూనెలు ఏంటో పరిశీలించండి మరియు తక్షణ ఫలితాల కోసం మీ చర్మంపై మీరు ఎలా ఉపయోగించాలో దాని మార్గాల గురించి చదివి తెలుసుకోండి.

1.కొబ్బరి నూనె

1.కొబ్బరి నూనె

కొబ్బరి నూనె మెరిసే కాళ్ళ ను పొందడానికి అల్టిమేట్ రెమెడీ. ఇందులో అనేక కాంపౌండ్స్ కలిగి ఉండటం వలన ఇది మీ చర్మం ఉపరితలం నుండి నిగారింపుని పెంచుతుంది మరియు అది వెలుపల నుండి ప్రకాశిస్తుంది. రోజువారీగా, కొబ్బరి నూనెతో మీ కాళ్ళను రుద్దండి మరియు రాత్రి అంతా అలానే వదిలివేయండి. ఈ పద్ధతి మీ కాళ్ళపై సెలబ్రిటీ లాంటి మెరిసే కాళ్ళని పొందడంలో సహాయపడుతుంది.

2. ఆలివ్ ఆయిల్

2. ఆలివ్ ఆయిల్

ఇది బ్రహ్మాండంగా మెరిసే కాళ్ళను పొందడానికి మీ శరీర సంరక్షణ నియమావళిలో చేర్చడానికి అర్హమైన మరొక అద్భుతమైన నూనె. కొన్ని సంవత్సరాల నుండి వాడుతున్నారు, ఆలివ్ నూనె వలన మీ చర్మం లో కలిగే మార్పుని చూసి మీరు బహుశా పొగడకుండా ఉండలేరు. మీ కాళ్ళ మీద ఆలివ్ నూనె తో మసాజ్ చేసి మెరిసే మరియు మృదువుగా కనిపించే కాళ్ళని మీ సొంతం చేసుకోండి. మంచి ఫలితాలను పొందడానికి మీ షవర్ తీసుకోవడానికి ముందు రోజువారీ ఈ సహజ నూనెను ఉపయోగించడానికి ప్రయత్నించండి.

3.ఆవాల నూనె

3.ఆవాల నూనె

ఆవాల నూనె యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లను కలిగి ఉంటుంది, ఇది మీ కాళ్ళ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మీ రోజువారీ మాయిశ్చరైజర్ కు 1/4 టీస్పూన్ మస్టర్డ్ ఆయిల్ ని కలపండి. ప్రకాశవంతమైన కాళ్ల ను పొందడానికి ప్రతిరోజు ఈ పద్ధతిని ప్రయత్నించండి.

డ్యామేజ్ హెయిర్ నివారించే హోం మేడ్ నేచురల్ ఆయిల్స్

4. విటమిన్ E ఆయిల్

4. విటమిన్ E ఆయిల్

కాళ్ళపై మెరిసే చర్మం తీసుకోవడానికి ఉపయోగించే ఒక సహజ నూనె విటమిన్ E నూనె. చర్మం లోపలి నుండి చర్మం ఉపరితలం వరకు ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక అద్భుతమైన నాటురల్ రెమెడీ. కేవలం విటమిన్ E క్యాప్సూల్స్ నుండి ఆయిల్ ని తీసి, మీ కాళ్ళ మీద అప్లై చేయండి. ప్రతి వారంలో, మీరు ఈ సహజ నూనెను కనీసం 3-4 సార్లు మీ కాళ్ళ మీద అందంగా మెరిసే చర్మం పొందడానికి ప్రయత్నించవచ్చు.

5. జోజోబా ఆయిల్

5. జోజోబా ఆయిల్

మీ కాళ్ళ చర్మానికి సహజమైన మెరుపును తీసుకురావడానికి ఉపయోగించే సహజ నూనె జొజోబా ఆయిల్. ఇది ఎల్లప్పుడూ మీ కాళ్ళపై చర్మం మెరిసేలా చేస్తుంది మరియు దాని నిర్మాణం స్మూత్ గా వుండి మరియు మృదువైనదిగా చేస్తుంది, ఇది గ్లో- పెంచే ఆయిల్గా పరిగణించబడుతుంది. కేవలం జొజోబా చమురు కొన్ని చుక్కలను మీ రెగ్యులర్ మాయిశ్చరైజర్ కి, మీ కాళ్ళపై స్మెర్ గా ఉపయోగించండి. మంచి నీటితో శుభ్రం చేయడానికి ముందు 20-25 నిమిషాలు అలానే వదిలివేయండి.

English summary

5 Natural Oils You Can Use To Get Shiny Legs

Check out how natural oils help you to get those shinny legs.
Story first published: Tuesday, November 7, 2017, 20:30 [IST]
Subscribe Newsletter