బేబి సాప్ట్ లిప్స్ ( మృదువైన పెదవులను)పొందడానికి హోం రెమెడీస్

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

ఉష్ణోగ్రతలు పడిపోవటం మీ పెదవుల ఆరోగ్యం,రూపంపై ప్రభావం చూపవచ్చు. అది మీ పెదవులు పగిలిపోయి, గట్టిగా మారేట్లా చేయవచ్చు.

మీ పెదవులపై చర్మం సున్నితమైనది కాబట్టి పై సమస్యలను పట్టించుకోకపోతే మీ పెదవుల స్థితి ఇంకా పాడవుతుంది.

అందుకనే, ఈ సమస్యని వెంటనే పరిష్కరించుకోండి మరియు దానికి ఇంటిచిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి.

ఈ చిట్కాలు 100% సహజమైనవి, సురక్షితమైనవి మరియు చవకైనవి మరియు ముఖ్యంగా మీ పెదవులను మెత్తగా మార్చడానికి ఎక్కువ ప్రభావం చూపేవి.

Get Baby-Soft Lips By Using These Home Remedies

అందుకని, ఈ రోజు బోల్డ్ స్కైలో ఈ సీజన్లో చిన్నపిల్లల వంటి పెదవులను పొందటానికి మీకోసం ఇంటిచిట్కాల లిస్టును తీసుకొచ్చాం. షాపుల్లో కొన్న పెదవుల బామ్ కూడా వీటి ముందు దిగదుడుపే.

మీ అందసంరక్షణా కార్యక్రమంలో భాగంగా ఈ చిట్కాలను చూడండి.

గమనిక ; మీ పెదవులకి వీటిని వాడేముందు మీ చేతిపై ప్యాచ్ టెస్ట్ తప్పకచేసి ఏది పడుతుందో చూడండి.

సాఫ్ట్ అండ్ పింక్ లిప్స్ పొంద‌డానికి తేనె, ఆలివ్ ఆయిల్ స్క్ర‌బ్

1. నెయ్యి

1. నెయ్యి

దేశవాళి నెయ్యి మీ పెదవులను మెత్తపరిచే ఎన్నోతరాల నుంచి వస్తున్న విధానం. దానిలో వున్న తేమగుణాలు కఠినంగా మారిన, పగిలిన పెదవులతో పోరాడతాయి.

ఎలా వాడాలి ; కొంచెం దేశవాళీ నెయ్యిని మీ పెదవులపై రాసి అలా వదిలేయండి. రోజుకి రెండుసార్లు ఇలా రాస్తే పెదవులు మృదువుగా మారతాయి.

2. పొడి చేసిన పంచదార

2. పొడి చేసిన పంచదార

పంచదార మీ పెదవులపై పేరుకున్న మృతచర్మాన్ని తొలగించే మంచి పదార్థం. ఫలితంగా మీ పెదవులు మృదువుగా మారతాయి.

ఎలా వాడాలి ; అరచెంచా పంచదారను ఒక చెంచా గులాబినీళ్ళతో కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులంతటా రాయండి. కొద్దినిమిషాల తర్వాత నీరుతో దాన్ని కడిగేయండి. రోజుకి 3-4సార్లు ఇలా చేస్తే పెదవులు మృదువుగా మారతాయి.

3. దానిమ్మ రసం

3. దానిమ్మ రసం

పెదవులకి వాడినప్పుడు, దానిమ్మరసం మాయిశ్చరైజింగ్ మరియు కండీషనింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. మృదువుగా మార్చటమే కాక, దానిమ్మరసం మీ పెదవులను సహజంగా పింక్ రంగులోకి కూడా మారుస్తుంది.

ఎలా వాడాలి ; దూదిని దానిమ్మరసంలో ముంచి మీ పెదవులపై వత్తండి. ఒక అరగంట అలా వుంచి, చల్లనీరుతో కడిగేయండి. రోజుకి ఒకసారి అలాచేసి అందమైన పెదవులను మీ సొంతం చేసుకోండి.

సాఫ్ట్ అండ్ బేబీ లిప్స్ ను పొందడం కోసం సులభ టిప్స్..?

4. చల్లని పాలు

4. చల్లని పాలు

పాలలోని పోషకాలు మీ పెదవులను మృదువుగా, మెత్తగా చేస్తాయి. ఈ ఇంటిచిట్కాను ఏడాది పొడుగునా పెదవుల సంరక్షణ కోసం పాటించవచ్చు.

ఎలా వాడాలి ; చల్లనిపాలను మెల్లగా పెదవులు మొత్తం రాయండి. 15 నిమిషాలు కడిగేముందు ఎండనివ్వండి. దీన్ని రోజుకి రెండుసార్లు పాటించవచ్చు.

5. బీట్ రూట్

5. బీట్ రూట్

అన్ని పెదవుల సమస్యలకి అద్భుతమైన పరిష్కారంగా బీట్ రూట్ ను మీ పెదవుల సంరక్షణలో ఉపయోగించవచ్చు.

ఎలా వాడాలి ; బీట్ రూట్ సన్నని ముక్క తరిగి మీ పెదవుల మీద మొత్తం రాయండి. కొన్ని నిముషాలు అలానే రాసి, చల్లనీరుతో కడిగేయండి. రోజుకి 2-3 సార్లు ఇలా చేసి మృదువైన, పింక్ పెదవులు సహజంగా పొందండి.

6. తేనె

6. తేనె

సహజ మాయిశ్చరైజర్ గా తేనె మీ కఠిన పెదవులకి అద్భుతాలు చేయగలదు. చర్మాన్ని మృదువుపరిచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉండి మీ సమస్యను చిటికెలో పరిష్కరిస్తాయి.

ఎలా వాడాలి ; కొంచెం తేనెను మీ పెదవులపై రాసుకోండి. పది నిముషాలు అలానే ఉంచి చల్లనీరుతో కడిగేయండి. లిప్ బామ్ కడిగిన తర్వాత రాసుకోండి.

7.బాదం నూనె

7.బాదం నూనె

మరొక పెదవులను సహజంగా మృదువుపర్చే వస్తువుగా బాదం నూనెను మీ లిస్టులో చేర్చుకోవచ్చు. ఈ సహజమైన నూనె ప్రతిరోజూ వాడి మొద్దుబారిన పెదవుల సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ఎలా వాడాలి ; 3 నుంచి 4 చుక్కల బాదం నూనెను పెదవులపై రాసి రాత్రంతా ఉంచేయండి. మరుసటిరోజు పొద్దున కడిగేసి పింక్ రంగులో చంటిపిల్లల లాంటి పెదవులను చూసి ఆశ్చర్యపోండి.

8. ఆలివ్ నూనె

8. ఆలివ్ నూనె

ఆలివ్ నూనె కూడా ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్న వస్తువు. ఈ నూనె షాపులో కొన్న బామ్ లకన్నా ప్రభావవంతమైన సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

ఎలా వాడాలి ; కొంచెం ఆలివ్ నూనెను అరచేతిలో పోసుకుని, వేళ్ళతో పెదవులపై ఆ నూనెను అద్దుకోండి. రోజు 3-4 సార్లు లిప్ బామ్ లా వాడి ఫలితాలను చూడండి.

9. ఆలోవెరా జెల్

9. ఆలోవెరా జెల్

ఈ లిస్టులో ఆఖరి ఇంటిచిట్కా అమోఘమైన ఆలోవెరా జెల్. ఈ చిట్కా తప్పక మీ పెదవులను మొత్తంగా అందంగా మార్చేస్తుంది. అది పెదవులను మృదువుగా మార్చటమే కాక పెదవులపై ఉన్న నల్లచర్మాన్ని కూడా పోగొడుతుంది.

ఎలా వాడాలి ; ఆలోవెరా చెట్టు నుంచి కొంచెం జెల్ తీసుకుని మీ పెదవులపై అద్దుకోండి. అరగంటపాటు అలా ఉండనిచ్చి మామూలు నీరుతో కడిగేయండి. రోజువారి దీన్ని ప్రయత్నిస్తే మంచి ఫలితాలుంటాయి.

English summary

Get Baby-Soft Lips By Using These Home Remedies

Natural remedies are the best ways to get baby-soft lips. Read to know more.
Subscribe Newsletter