చంకల్లో నలుపు పోగొట్టుకోవడానికి 10 వంటింటి వస్తువులు

By: Mallikarjuna
Subscribe to Boldsky

అండర్ ఆర్మ డార్క్ నెస్(చంకల్లో నలుపు )కొంత మంది పెద్దగా పట్టించుకోరు, కొంత మందికి మాత్రం ఈ సమస్యను ఒక పీడలకళలా భావిస్తారు.

ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఏం చేయాలి? చంకల్లో నలుపును ఎలా తగ్గించుకోవాలి? స్లీవ్ లెస్ టాప్స్, డ్రెస్సులను ధరించాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు.

చంకల్లో నపులు ఇతరులు చూస్తారని కాదు, కానీ అది మీ పరిశుభ్రతను తెలియజేస్తుంది. లేదా మీరు సరైన స్కిన్ కేర్ తీసుకోవడం లేదని సూచిస్తుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది.

ముఖ్యంగా, ఈ సమస్యను ప్రారంభదశలోనే నివారించకపోతే, ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి, చంకల్లో నలుపు ప్రారంభదశలోనే నివారించడానికి కొన్ని వంటగదిలోనే పదార్థాలు సహాయపడుతాయి. ఇవి తప్పకుండా మీ సమస్యను తగ్గిస్తుంది.

బంగాళదుంప

బంగాళదుంప

చంకల్లో బంగాళదుంపను అప్లై చేసి, నలుపు తగ్గించుకోవచ్చు

పద్ధతి 1: బంగాళదుం తీసుకుని, 15-20నిముషాలు రుద్దాలి.

పద్దతి 2: బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేసి చంకల్లో అప్లై చేయాలి. 15-20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ

కీరదోసకాయ

బంగాళదుంపలాగే మరో బ్లీచింగ్ లక్షణాలు కలది కీరదోసకాయ.

a) కీరదోసకాయను సన్నగా స్లైస్ గా కట్ చేసి చంకల్లో మసాజ్ చేయాలి.

b) అలాగే కీరదోసకాయ రసాన్ని కూడా చంకల్లో అప్లై చేసి మసాజ్ చేయాలి 15-20 .

ఒకే ఒక నెలలో మీచేతులు సన్నబడేలా చేసే ఫుడ్ హ్యాబిట్స్..!

నిమ్మరసం

నిమ్మరసం

చంకల్లో చర్మం నల్లగా మారడానికి ముఖ్య కారణం చెమట. చెమట వల్ల నల్లగా మారిన చర్మాన్ని నిమ్మరసం బాగుచేస్తుంది.

పద్దతి 1: నిమ్మరసంను చంకల్లో అప్లై చేసి సున్నితంగా కొద్ది నిముషాల మసాజ్ చేసి, 10 నిముషాల తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.

పద్దతి 2: అలాగే నిమ్మరసం కలిపిన ఇతర పదార్థాలతో కూడా చంకల్లో నలుపు తగ్గించుకోవచ్చు. నిమ్మరసంలో కొద్దిగా పెరుగు, తేనె, మరియు పసుపు కలపాలి. అన్నీ బాగా కలిసే వరకూ మిక్స్ చేసి తర్వాత ఈ మిశ్రమాన్ని చంకల్లో అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

సన్ ఫ్లవర్ ఆయిల్

సన్ ఫ్లవర్ ఆయిల్

చంకల్లో నలుపు తగ్గించడంలో సన్ ఫ్లవర్ ఆయిల్ ఉత్తమ హోం రెమెడీ.

a) కొద్దిగా సన్ ఫ్లవర్ ఆయిల్ చేతిలోనికి తీసుకుని చంకల్లో అప్లై చేసి మసాజ్ చేయాలి.

b) అదనపు ప్రయోజనాలకోసం, సన్ ఫ్లవర్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి, చంకల్లోచర్మంపై అప్లై చేసి మసాజ్ చేయాలి.

c) ఈ నూనెను రోజుకు మూడుసార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ స్కిన్ డ్యామేజ్ సెల్స్ ను నివారిస్తుంది.

a) బొప్పాయి గుజ్జు లేదా జ్యూస్ ను చంకల్లో అప్లై చేసి మసాజ్ చేసి, కొద్దిసేపటి తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.

b) మరో మార్గం, బొప్పాయి ముక్కతో చంకల్లో మసాజ్ చేసి, కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అండర్ ఆర్మ్ స్ట్రెచ్ మార్క్స్ తొలగించటానికి సింపుల్ టిప్స్

యాపిల్స్

యాపిల్స్

ఎహెచ్ ఎ కంటెంట్ ఉన్న యాపిల్స్ వల్ల పాడైన చర్మ కణాలకు మరమత్తు చేస్తుంది. బ్యాక్టీరియాను నివారిస్తుంది.

a) యాపిల్ ను మెత్తగా పేస్ట్ చేసి, చంకల్లో అప్లై చేసి, మర్దన చేయాలి.

b) 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పాలు లేదా పెరుగు

పాలు లేదా పెరుగు

చంకల్లో నలుపు తగ్గించడంలో పాలు లేదా పెరుగు రెండూ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ డెడ్ అండ్ డ్యామేజ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.

a) పాలను అప్లై చేయడానికి, పచ్చిపాలను తీసుకుని, చంకల్లో అప్లై చేసి మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

b) పెరుగు, చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు. పెరుగులో కొద్దిగా తేనె, పసుపు కలిపి ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు.

బహుమూలల్లో వెంట్రులక తొలగింపుకు బెస్ట్ హోం టిప్స్

శెనగపిండి

శెనగపిండి

శెనగపిండి డార్క్ అండర్ ఆర్మ్ ను నివారించడలో బెస్ట్ కిచెన్ రెమెడీ.

a) శెనగపిండికి కొద్దిగా నీళ్ళు కలపి, పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను చంకల్లో అప్లై చేయాలి.

b) శెనగపిండిలో కొద్దిగా పాలు కలిపి తర్వాత చంకల్లో అప్లై చేయాలి. ీ రెమెడీని వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పంచదార:

పంచదార:

పంచదార స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. చంకల్లో నలుపు పోగొడుతుంది .

a) పంచదారలో కొద్దిగా తేనె కలిపి మసాజ్ చేయాలి.

b) ఎక్కువ ప్రెజర్ తో మసాజ్ చేయకుండా, చారలు పడకుండా నివారించాలి.

పసుపు:

పసుపు:

చర్మంలో అదభుత మార్పు తీసుకురావడంలో పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది. పసుపును వివిధ రకాలుగా ఉపయోగించి చంకల్లో ప్యాక్ వేసుకోవచ్చు.

a) పచ్చిపాలలో కొద్దిగా పసుపు కలిపి, పేస్ట్ లా చేసి చంకల్లో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.

b) పసుపులో కొద్దిగా తేనె, పసుపు కలిపి చంకల్లో ప్యాక్ వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

English summary

10 Kitchen Ingredients That You Can Use To Lighten Your Dark Underarms

Most importantly, if dark underarms are not treated at a novice stage, the problem can further deteriorate. Now that you plan to pay attention to your dark underarm problem and try to treat it, here is our set of kitchen ingredient remedies that you can begin with.
Story first published: Wednesday, July 26, 2017, 10:00 [IST]
Subscribe Newsletter