మెడ నలుపు పోవాలంటే వీటిని మిస్ చేయకుండా ఉపయోగించుకోండి..

By: Mallikarjuna
Subscribe to Boldsky

చక్కటి రూపురేఖలతో చూడముచ్చటగా ఉన్నవారు కూడా మెడభాగం నల్లగా ఉంటే ఆందోళన చెందవలసిందే. చీర, చుడీదార్‌ ఏ అందమైన డ్రెస్‌ వేసుకున్నా మెడ నల్లగా కనిపిస్తూ వుంటుంది. ముఖంతో పోల్చుకుంటే ఎండ పడే భాగాలన్నీ కొంచెం రంగు తక్కువగానే ఉంటాయి. మెడ, మోచేతుల నుంచి వేళ్ళ చివర్లు, పాదాలు కొంత రంగు తగ్గుతాయి.

చాలా మంది మహిళలు ముఖం మీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ మెడ అందంగా పరిశుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖం అందం మీద కూడా పడుతుందని బ్యూటీగీషియన్లు అంటున్నారు. ముఖంతో పాటు మెడ అందం కూడా ముఖ్యమేనని వారు చెబుతున్నారు. ముఖంతో సమానంగా మెడ అందంగా ఉంచుకోవడాని కొన్ని సులభ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటితో మీ మెడ సౌందర్యంను పెంపొందించుకోవచ్చు.

వన్ వీక్ లో డార్క్ నెక్ ను నివారించుకోవడానికి సింపుల్ గా బేకింగ్ సోడా చిట్కా..!!

డార్క్ నెక్ ట్రీట్మెంట్ లో అనేక బ్యూటీ బ్రాండ్స్ ఉన్నాయి. అయితే వీటిలో క్రీములు, క్లెన్సర్లు అంతగా పనిచేయవచ్చు. వీటి స్థానంలో న్యాచురల్ పదార్థాలైన బేకింగ్ సోడా, ఓట్ మీల్, సాండిల్ ఉండ్ పౌడర్ వంటివి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం ఎక్స్ ఫోయేట్ అవుతుంది.

వీటితో మెడ వద్ద చర్మ రంగును మార్చుకోవడంతో పాటు, మెడకు తగిన తేమను అందివ్వాలి. అందుకోసం ఈ న్యాచురల్ పదార్థాలను సింగిల్ గా ఉపయోగించడం కానీ, లేదా వీటికి మరో ఎఫెక్టివ్ న్యాచురల్ పదార్థాలతో కలిపి కానీ ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క పదార్థం తప్పకుండా స్కిన్ టోన్ మార్చుతుంది. రెండు మూడు వారాల్లోనే మంచి మార్పును తీసుకొస్తాయి. మరి డార్క్ నెక్ ను నివారించే ఆ సింపుల్ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం..

మెడ నలుపును మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

1. అలోయి వెరా జెల్ మరియు బేకింగ్ సోడా ప్యాక్

1. అలోయి వెరా జెల్ మరియు బేకింగ్ సోడా ప్యాక్

- బేకింగ్ సోడా ½ టీస్పూన్ తో అలోవేరా జెల్ 1 టేబుల్ స్పూన్ కలపాలి.

- ఈ రెండూ బాగా మిక్స్ చేసి మెడ ప్రాంతంలో ప్యాక్ లా వేసుకోండి.

-30 నిమిషాలు డ్రైగా మారనివ్వాలి.

- అరగంట తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి.

2. బంగాళాదుంప జ్యూస్ మరియు వోట్మీల్ ప్యాక్

2. బంగాళాదుంప జ్యూస్ మరియు వోట్మీల్ ప్యాక్

- బంగాళాదుంప రసం యొక్క 2-3 టేబుల్ స్పూన్లు తీసుకుని, 2 టేబుల్ స్పూన్ల వండిన వోట్మీల్ తో కలపాలి.

- రెండూ బాగా కలిపి మీ మెడ మీద ప్యాక్ వేసుకోవాలి.

- ఈ ప్యాక్ 20-25 నిముషాల వరకూ అలాగే న్యాచురల్ గా ఎండనివ్వాలి.

- తర్వాత చల్లటి నీటితో కడగాలి.

3. శాండ్వూడ్ పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ ప్యాక్

3. శాండ్వూడ్ పౌడర్ అండ్ లెమన్ జ్యూస్ ప్యాక్

- నిమ్మ రసం 2-3 టీస్పూన్లు తో గంధపు పొడి 1 టీస్పూన్ చేర్చండి.

- రెండూ బాగా కలిపి మీ మెడపై ఈ ప్యాక్ ను వేసుకోవాలి..

- 30 నిమిషాలు డ్రైగా మారనివ్వాలి.

- అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడగాలి.

4. బాదం నూనె మరియు గ్రీన్ టీ ప్యాక్

4. బాదం నూనె మరియు గ్రీన్ టీ ప్యాక్

- 1 టేబుల్ స్పూన్ బాదం నూనెలో ఒక టీస్పూన్ గ్రీన్ టీ కలపండి.

- మెడ ప్రాంతంలో నల్లగా ఉన్న ప్రదేశంలో దీన్ని ప్యాక్ లా వేసుకోవాలి.

- ఈ ప్యాక్ 20 నిమిషాలు తడి ఆరనివ్వాలి.

- ఇరవై నిముషాల తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి.

5. పసుపు పౌడర్ మరియు విటమిన్ E ఆయిల్ ప్యాక్

5. పసుపు పౌడర్ మరియు విటమిన్ E ఆయిల్ ప్యాక్

- ½ పసుపు పొడిని ,2టీస్పూన్ల విటమిన్ E ఆయిల్ తో మిక్స్ చేయాలి.

- మీ మెడ పాలిపోయిన చర్మంపై ఈ ప్యాక్ ను అప్లై చేయాలి.

- 15-20 నిముషాల పాటు తడి పూర్తిగా ఆరనివ్వాలి.

- అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

6. ఆలివ్ ఆయిల్ మరియు ఆపిల్ సైడర్ వినెగార్ ప్యాక్

6. ఆలివ్ ఆయిల్ మరియు ఆపిల్ సైడర్ వినెగార్ ప్యాక్

- ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు ½ టీస్పూన్ ఆపిల్ సైడర్ వినెగార్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి.

- ఈ ప్యాక్ వేసుకోవడానికి ముందు మెడను శుభ్రం చేసుకోవాలి.

- 30-35 నిమిషాలు ప్యాక్ డ్రై అయ్యే వరకూ ఉంచాలి.

- అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

7. బియ్యం పిండి మరియు తేనె ప్యాక్

7. బియ్యం పిండి మరియు తేనె ప్యాక్

తేనె 2 టేబుల్ స్పూన్లు , బియ్యం పిండి ఒక టీస్పూన్ తీసుకోవాలి.

- ఈ రెండు పదార్థాలు బాగా కలిపి, మెడ మీద నల్లగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

- 30 నిముషాల అలాగే ఉంచాలి.

- తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

8. టమోటో పల్ప్ మరియు యోగర్ట్ ప్యాక్

8. టమోటో పల్ప్ మరియు యోగర్ట్ ప్యాక్

- టమోటా గుజ్జు 2 టీస్పూన్లు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి.

- మెడపై నల్లగా ఉన్న ప్రదేశంలో దీన్ని అప్లై చేయాలి.

- ఇది 20 నిముషాల పాటు అలాగే ఉండనివ్వాలి.

- తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

9. పాలు మరియు ఆరెంజ్ పీల్ పౌడర్ ప్యాక్

9. పాలు మరియు ఆరెంజ్ పీల్ పౌడర్ ప్యాక్

- ఒక గిన్నెలో పాలు 2 టేబుల్ స్పూన్లు మరియు నారింజ తొక్క పౌడర్ 2 టీస్పూన్లు తీసుకోవాలి..

- ఈ రెండు పదార్థాలు బాగా మిక్స్ చేసిపేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న మెడ మీద అప్లై చేయాలి

- 30 నిముషాలు అలాగే ఉంచి , పూర్తిగా తడి ఆరనివ్వాలి.

- అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

10. బొప్పాయి పల్ప్ మరియు స్ట్రాబెర్రీస్ ప్యాక్

10. బొప్పాయి పల్ప్ మరియు స్ట్రాబెర్రీస్ ప్యాక్

- బొప్పాయి పల్ప్ 2 టీస్పూన్లు బయటకు తీయండి మరియు స్ట్రాబెర్రీ రసం యొక్క అదే పరిమాణంలో కలపండి.

- ప్రభావిత ప్రాంతంలో ప్యాక్ అప్లై చేయాలి..

- ఇది 30-35 నిమిషాలు డ్రైగా మారనివ్వాలి.

- అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

11.సెనగపిండి మరియు రోజ్ వాటర్ ప్యాక్

11.సెనగపిండి మరియు రోజ్ వాటర్ ప్యాక్

- గులాబీ నీటి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని అందులో ఒక టీస్పూన్ సెనగపిండిని కలపాలి.

-ఈ ప్యాక్ ను మెడ నలుపుగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి..

- 20-25 నిమిషాలు డ్రైగా మారనివ్వాలి.

- అరగంట తర్వాత చల్లటి నీటితోశుభ్రం చేసుకోవాలి.

12. కొబ్బరి పాలు దోసకాయ ప్యాక్

12. కొబ్బరి పాలు దోసకాయ ప్యాక్

సగం దోసకాయను తురిమి, అందులో కొబ్బరి పాలు 2 టేబుల్ స్పూన్లు కలపాలి.

- మెడ మొత్తం పూర్తిగా ప్యాక్ వేసుకోవాలి.

- ఈ ప్యాక్ ను అరగంట పాటు అలాగే ఉంచాలి.

- అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Miraculous Homemade Packs For Getting Rid Of Dark Neck

These are the best ways to get rid of dark neck discoloration.
Story first published: Tuesday, October 3, 2017, 17:30 [IST]
Subscribe Newsletter