5 మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ యాక్టర్స్ బ్యూటీ సీక్రెట్స్!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ప్రముఖ బాలీవుడ్ మహిళల లాగా అందంగా కనిపించడానికి ఎం చేయాలి?కేవలం మేక్ అప్ కాకుండా, ఈ ఆకర్షణీయమైన మహిళలు మంచి ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టు కోసం ఎంతో కఠినమైన డైట్ ని అనుసరిస్తారు.అందమైన భారతీయ మహిళల అందం యొక్క రహస్యాల గురించి మరిన్ని విషయాలను

తెలుసుకోవడానికి చదవండి....

భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు...!

మాధురీ దీక్షిత్

హిందీ చలన చిత్ర పరిశ్రమలో మాధురీ తొలిసారిగా అడుగుపెట్టినప్పటినుండి ఆమె తన సౌందర్యాన్ని కాలానికి అనుగుణంగా అనుసరించింది.సాధారణంగా సహజంగా ఉండటం వలన సమస్యలు తొలగిపోతాయని ఆమె గట్టి నమ్మకం.ఆమె రోజుకు రెండు సార్లు అనగా, ఉదయం మరియు రాత్రిలో ఆమె పూర్తిగా ముఖం కడుగుతుంది మరియు ఒక పసుపుపచ్చని ద్రవాన్ని అప్లై చేస్తుంది.ఆమె చర్మం కండిషన్ ఆధారంగా రోజువారీ రాత్రిపూట నైట్ క్రీమ్స్ ని వాడుతుంది మరియు అకేషన్ కి తగినట్లు టోనర్ను అరుదుగా ఉపయోగిస్తుంది. ఆమె జుట్టు అందంగా పొడవుగా కనిపించడానికి ఆమె నూనెలు అప్లై చేస్తుంది మరియు ఒక తేలికపాటి షాంపూ తో వాటిని కడుగుతుంది. పోషకాహారంలో, మాధురి కాస్టర్ లేదా ఆలివ్ నూనె, మయోన్నైస్ మరియు పండ్ల తో ఇంట్లో నే తయారు చేసిన జుట్టు ప్యాక్ మీద ఆధారపడుతుంది. వారం రోజులలో ఆరు రోజులు వర్కౌట్స్ చేస్తుంది మరియు ఆమె ఫిట్నెస్ కి ముఖ్యమైన కారణం ఆమె పాటించే డైట్ అని చెప్పవచ్చు.

beauty

రేఖా

రేఖా ఒక బహుముఖ నటి మాత్రమే కాదు కానీ ఆమె అమితమైన అందాన్ని తన సొంతం చేసుకున్న ఏజ్ లెస్ బ్యూటీ కూడా.రేఖ ఒక సింపుల్ నియమాన్ని అనుసరిస్తుంది.సాధారణ శుభ్రత తో పాటుగా, టోనింగ్ మరియు మోయిస్తూరైజింగ్ నుండి, చర్మ సమస్యలు నివారించడానికి, ఆమె పడుకోవడానికి ముందు ఖచ్చితంగా ఆమె మేకప్ ని తొలగించడం చేస్తారు.ఆమె ఆరోగ్యమైన చర్మం కోసం స్పా మరియు తైలమర్ధన చికిత్సపై ఆధారపడతారు. ఆమె కొబ్బరి నూనెతో ఆమె జుట్టును మసాజ్ చేస్తుంది మరియు గుడ్డు, పెరుగు మరియు తేనెతో చేసిన జుట్టు ప్యాక్ను ఉపయోగిస్తుంది. ఆమె ఒక శాకాహారి మరియు తాజా పళ్ళు మరియు కూరగాయలు మరియు నట్స్ లను పుష్కలంగా తింటుంది. ఆమె కూడా తగినంత నీరు తాగుతారు.రెగ్యులర్ వ్యాయామాలు, తొందరగా డిన్నర్ ఫినిష్ చేయడం మరియు సమయానికి పడుకోవడం వలన ఆమె మంచి ఆకారంలో ఉండటానికి ముఖ్యమైన కారణం గా చెప్పవచ్చు.

beauty

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్ ఒక ఆరోగ్యకరమైన జీవనశైలికి ఆమె మనోహరమైన రూపం కోసం బాగా శ్రద్ధ తీసుకుంటుంది.

నటీమణి సరైన పోషకాహారాన్ని తింటుంది మరియు తగినంత నీరు త్రాగుతుంటుంది. ఉదయం నిద్రలేవగానే ఆమె చేసే మొట్టమొదటి పని నాలుగు గ్లాసుల నీటిని తాగటమే. వీటితోపాటు వీట్ గ్రాస్ పొడి మరియు అకాయ్ బెర్రీ వంటి కొన్ని ఆరోగ్యకరమైన పదార్ధాలను ఆమె తీసుకుంటారు. ఆమె గ్రీన్ టీ కూడా తాగుతారు మరియు కాల్చిన చేప ను తింటుంది. ఆమె జుట్టు అందంగా కనిపించడానికి ఆయిల్స్ ని అప్లై చేస్తుంది మరియు స్పా చికిత్స కోసం వెళుతుంది. చర్మ సమస్యలను నివారించడానికి, ఆమె మట్టి ప్యాక్స్ మరియు సౌందర్య నూనెలను ఉపయోగిస్తుంది. నిద్రపోవడానికి ముందు క్లీన్సర్ ని అలంకరణలను తీసివేయడానికి ఉపయోగిస్తుంది.

"గే" గా ఉన్న సెలబ్రెటీలు ఎలాంటి టార్చర్ పడ్డారు..!

beauty

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా యొక్క అందమైన చర్మం మరియు జుట్టు యొక్క రహస్య ఇంట్లో పాటించే బ్యూటీ చికిత్స. నటి తన చర్మం పొడి బారకుండా ఉండటానికి తేమ కోసం బియ్యం పిండి మరియు తేనె తో ఇంట్లోనే తయారు చేసిన దానిని ముఖం స్కర్బ్ లా వాడుతుంది. ఆమె ముఖ చర్మం తేమగా మరియు ప్రకాశించేలా ఉండటానికి యోగర్ట్ తో తయారుచేసిన పేస్ ప్యాక్ను ఉపయోగిస్తుంది. ప్రతిరోజు ఆమె పడుకోవడానికి ముందు తన జుట్టు కి కొబ్బరి నూనెను అప్లై చేస్తుంది. ఆమె నీరు పుష్కలంగా త్రాగుతుంది మరియు ఆమె ఆరోగ్యం మరియు చర్మం మంచిగా ఆరోగ్యంగా ఉంచడానికి వివిధ రకాల విటమిన్ సప్లిమెంట్లను తీసుకుంటుంది.

beauty

ఐశ్వర్య రాయ్

ఐశ్వర్య రాయ్ తన అందంతో ప్రపంచం మొత్తం ప్రసిద్ధి చెందింది. ఈ ఆకర్షణీయమైన నటి ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తుంది. ఆమె సరైన ఆహార పదార్థాలను రోజువారీ సరైన పరిమాణంలో తీసుకుంటుంది మరియు రోజు వ్యాయామాలు చేస్తుంది.అత్యవసర శుద్ది, టోనింగ్ మరియు తేమ తో కూడిన చర్మ సంరక్షణ తో పాటు, ఆమె జుట్టు మరియు చర్మాలను అందంగా ఉంచడానికి ఇంట్లో తయారు చేసే సౌందర్య చికిత్సలను ఉపయోగిస్తుంది. ఆమె బాగా అలసిపోయిన లేదా స్ట్రెస్ అయిన రోజు తర్వాత, ఆమె చర్మం ని

దోసకాయ రసం తో స్మూత్ చేస్తుంది. ఆమె బియ్యం పిండితో ముఖం ప్యాక్ ను అప్లై చేసుకుంటారు

మరియు పాలు మరియు పెరుగులను చర్మం తేమగా ఉంచడంలో ఉపయోగించుకుంటుంది. ఆమె నీరు పుష్కలంగా త్రాగుతారు మరియు ఆమె తన రోజుని తేనె మరియు నిమ్మకాయలతో కలిపిన హాట్ వాటర్ ని త్రాగటం తో మొదలు పెడతారు.

beauty

కరీనా కపూర్

కరీనా కపూర్ ఆరోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్ వ్యాయామాలు మరియు మంచిగా నిద్రపోవడమే ఆమె అందమైన చర్మ మరియు జుట్టు యొక్క రహస్యాలు. ఆమె రసాయనాలతో తయారుచేసిన సౌందర్య వస్తువులకు దూరంగా వుంటారు. కరీనా కొబ్బరినూనె, ఆలివ్, కాస్టర్ మరియు బాదం నూనెతో తయారుచేయబడిన మిశ్రమంతో తన జుట్టుని సంరక్షిస్తుంది. ఆమె శాఖాహార డైట్ ని ఫాలో అవుతారు మరియు రోజుకి ఆరు నుండి ఎనిమిది గ్లాస్ ల నీటిని త్రాగుతారు.

English summary

Most Beautiful Bollywood Actresses Beauty Secrets

What does it take to look gorgeous like the leading ladies of Bollywood? Apart from makeup, these glamorous women follow a strict beauty routine to keep their skin and hair in good health. Read on to discover the beauty secrets of the most beautiful Indian women.
Story first published: Thursday, August 24, 2017, 12:05 [IST]