For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలు తెలుసుకోవాలనుకుంటున్న 10 గూగుల్ బ్యూటీ ప్రశ్నలకు సమాధానాలు!

By Ashwini Pappireddy
|

గూగుల్ లో అందానికి సంబంధించిన ప్రశ్నల గురించి వెతకడాన్ని దాచిపెట్టాల్సిన పని లేదు. అందరు పురుషులు మరియు మహిళలు అదే చేస్తారు. ఎందుకంటే కొన్ని అందానికి సంబంధించిన ప్రశ్నల గురించిప్రశ్నలు వక్తిగతానికి సంబంధినవి మరియు కొన్నిసార్లు మనం వాటిని ఇతరులతో చర్చించడం సౌకర్యంగా అనిపించదు.

గూగుల్ లో అందానికి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాల కోసం వెతుకుతున్న ఈ ట్రెండ్ ని ఆధారం గా చేసుకొని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోని వారు అత్యంత సాధారణంగా గూగుల్ సెర్చ్ లో అందం గురించి అడిగిన టాప్ 10 ప్రశ్నలు, వాటి సమాధానాలను మీ కోసం ఇక్కడ తెలియజేయడం జరిగింది.

 ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే! ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే!

అలాగని, ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం చాలా కస్టమేమి కాదు అయినప్పటికీ, వీటి గురించి గూగుల్ లో వెతుకున్నారు. మహిళలు వారి అందం అవసరాల గురించి ఆలోచించటం మరియు వాటి గురించి ఆందోళన చెందుతున్నారు.

ఇదిగో ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన అందం, దానికి సంబంధించిన 10 ప్రశ్నలకు సమాధానాలు చాల సులభ పద్ధతిలో ఇవ్వబడ్డాయి. దీనిద్వారా ఇంక ముందు మీరు ఎలాంటి అయోమయం చెందాల్సిన అవసరం లేదు.

మీ స్కిన్ టైప్ ఏది అని మీరు ఎలా కనుకుంటారు?

మీ స్కిన్ టైప్ ఏది అని మీరు ఎలా కనుకుంటారు?

సమాధానం: స్కిన్ టెస్ట్ మీ చర్మం రకం తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక శాస్త్రీయ మార్గం, ఇది వైద్య చర్మ పరీక్ష చేసుకోవడం ద్వారా మాత్రమే తెలుస్తుంది.

స్కిన్ టెస్ట్ ని మీరు ప్రాచీన పద్ధతిని వుపయోగించి ఇంట్లోనే చేసుకోవచ్చు.ఇందులో భాగంగా ఒక బ్లాట్టింగ్ పేపర్ ని ఉపయోగిస్తారు. ఈ కాగితాన్ని మీ చర్మం మీద వివిధ ప్రాంతాలలో అంటించి దానిమీద లైట్ పడేలాగా ఉంచండి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువగా ఉంటే మీ చర్మం ఆయిలీ స్కిన్ అనీ,ఆయిల్ కానీ తక్కువగా ఉంటె మీది పొడి చర్మం అని అర్థం చేసుకోవాలి. మీ బుగ్గలు పొడి గా వున్నా మరియు

ముక్కు ఆయిలీగా అనిపించినా చూసి ఆశ్చర్యపోకండి.

మీరు ఇంటిదగ్గరే చేసుకొనే ఇంకొక స్కిన్ టెస్ట్, మీ ముఖాన్ని బాగా శుభ్రంగా కడుకోండి మరియు కడిగిన ముఖాన్ని ఒక గంట సేపు ఉంచి తర్వాత దాన్ని గమనించండి. ఒక గంట తర్వాత మీ ముఖం ఆయిల్ మరియు జిడ్డుని కలిగి ఉంటే, మీరు జిడ్డు చర్మం ని కలిగి ఉంటారు. ఎటువంటి మార్పు లేకపోతే, మీరు పొడి చర్మం ని కలిగివుంటారు. మీ ముక్కు మరియు నొసలు వద్ద ఈ గ్యాప్ లో కొద్దిగా మెరుస్తూ ఉంటే, అప్పుడు మీది సాధారణ చర్మం అని గుర్తించాలి.

ఫెయిర్ స్కిన్ ని పొందడం ఎలా?

ఫెయిర్ స్కిన్ ని పొందడం ఎలా?

సమాధానం: మీ లైఫ్స్టైల్ ని మార్చండి!

లేడీస్ తరచుగా పౌడర్, ఫౌండేషన్ వంటి సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తుంటారు, అవి మీకు మంచి చర్మం ఇస్తాయని అనుకుంటారు. ఇది చాలా తప్పు. సహజ చర్మం పొందడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం ముఖ్యం. మీరు చేయవలసిందల్లా కావాల్సినంత నీరు త్రాగటం,పళ్ళు మరియు జ్యూస్ లను తీసుకోవడం ,బ్యాలన్సుడ్ డైట్ మరియు వ్యాయామం చేయడం ముఖ్యం. అందమైన చర్మం పొందటానికి

కొంతమంది మహిళలు మంచి ఫలితాల కోసం ఇంటిలో అందుబాటులో వున్న వాటిని వాడుతూ వుంటారు.

వేగంగా జుట్టు పెరగడం ఎలా?

వేగంగా జుట్టు పెరగడం ఎలా?

సమాధానం:జుట్టుని జాగ్రత్తగా చూసుకోవాలి!

రోజంతా మీ జుట్టుని కఠినంగా మరియు మొరటుగా వాలిడిపెట్టేసి,ఇప్పుడు జుట్టు పొడవు పెరగడం గురించి

గూగుల్ లో వెతకడం ఎంత వరకు కరెక్ట్! మీ జుట్టును పెరగడానికి, మీ జుట్టుకు మంచి పోషకాన్ని అందించి, సహజ నూనెల నుండి రక్షణ కల్పించండి. ఇంకా మీ జుట్టు పెరుగుదల కోసం మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు కొంత సమయం వేచి ఉండటం మంచిది. జుట్టు పెరుగుదల అనేది ఒక రోజులోనే జరిగే ప్రక్రియ కాదు.జుట్టు పెరుగుతున్న రోజుల్లో, కొందరు మహిళలు, జుట్టును కత్తిరించడం ఆపండి. కానీ ఒకటిగమనించండి, సకాలంలో జుట్టు కత్తిరించడం వలన నిజానికి జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

పచ్చబొట్టు చర్మానికి హాని చేస్తుందా?

పచ్చబొట్టు చర్మానికి హాని చేస్తుందా?

సమాధానం: మీ ఓన్ రిస్క్ టాటూ వేసుకున్న ప్రతి ఒక్కరికి చర్మ సమస్యలను ఎదుర్కోకపోవచ్చు.కానీ మళ్ళీ, ఒక ముఖ్యమైన భాగం లోశాశ్వత మైన పచ్చబొట్టు వేసుకోవడం వలన వారి చర్మ సమస్యలను మరింత పెంచిందని పిర్యాదులున్నాయి. సో, పచ్చబొట్టు వేసుకోవాలా వద్దా,ఒకవేళ చేసుకున్నాక దానివలన కలిగే ప్రభావాలను భరించడం అనేది మీ పర్సనల్ ఛాయస్. మీరు పూర్తిగా సురక్షితంగా ఉండాలనుకుంటే, అలా చేయకండి. మీరు దీన్ని నిజంగా చేయాలనుకుంటే,చేసుకోండి. కానీ పచ్చబొట్టు చేసేటప్పుడు మీ చర్మాన్ని పాడు చేయని మంచి పచ్చబొట్టు పార్లర్ మరియు కళాకారుడిని ఎంచుకునేలా చూసుకోండి.

కాన్సెల్ర్ ని ఎలా అప్లై చేయాలి?

కాన్సెల్ర్ ని ఎలా అప్లై చేయాలి?

సమాధానం: ఒక రోజు ముందు ఇది ప్రాక్టీస్ చేయండి.

ఒక కాన్సెల్ర్ ని అప్లై చేయడం అనే కళ నైపుణ్యం ని ఏ స్త్రీ ఒక రోజు లోనే చేయలేదు.

ఇది మనం ఉపయోగించే కాన్సెల్ర్యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది. కాన్సెల్ర్ ముఖ్యంగా అందరి మహిళలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎవరైతే చర్మంపై మార్కులు లేదా మచ్చలతో బాధపడుతున్న మహిళలు తప్పనిసరిగా ఒక కాన్సెల్ర్ కలిగి ఉండాలి. ఒక కాన్సెల్ర్ ని కొనుక్కునే ముందు, అది మీ చర్మం టోన్ కి సరిపోతుందా లేదా మరియు మీకు ఉపయోగపడుతుందో లేదో అని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేయండి. కాన్సెల్ర్ అనేక రకాలుగా వస్తారు, వీటిని కొనుగోలు చేయడానికి ముందు మీరు వాటిని చెక్ చేసి కొనడం మంచిది.

15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై 15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. మొటిమలు, మచ్చలు బై బై

బాడీ హెయిర్ ని రిమోవ్ చేయడానికి ఈ పద్ధతిని అనుసరించాలి?

బాడీ హెయిర్ ని రిమోవ్ చేయడానికి ఈ పద్ధతిని అనుసరించాలి?

సమాధానం: శరీర భాగంపై ఆధారపడి ఉంటుంది.

శరీరం మీద జుట్టు ను తొలగించడానికి ఎలాంటి పద్ధతి లేదు. అయితే, శరీరం జుట్టు ని తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీరు శరీర జుట్టును ఏ మార్గం ద్వారా తొలగించాలనేది మీ చర్మం మరియు జుట్టు పెరుగుదల యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది . కనుబొమ్మలకు థ్రెడింగ్ లేదా ట్వీకింగ్ ద్వారా తొలగించవచ్చు; చేతులు లేదా కాళ్ళు కోసం, వ్యాక్సింగ్ ని వాడవచ్చు. ఒకవేళ మీరు లేజర్ హెయిర్ రిమూవల్ కోసం ప్లాన్ చేస్తున్నటైతే, మంచి మరియు అనుభవం ఉన్న కాస్మెటిక్ సర్జన్ ని సలహా తీసుకోవడం మంచిది.

ఎంత తరచుగా నా జుట్టు కి షాంపూ చేయాలి?

ఎంత తరచుగా నా జుట్టు కి షాంపూ చేయాలి?

సమాధానం: మీ జుట్టు యొక్క పరిస్థితిపై ఆధారపడి.

మీ రూమ్మేట్ వారానికి రెండుసార్లు షాంపూ చేస్తే , మీరు చేయాల్సిన అవసరం లేదు. జుట్టు మరియు తల మురికిగా మారినప్పుడు షాంపూ చేయాలి. ప్రతి షాంపూ సెషన్ కి మధ్య సమాన విరామం వలన జుట్టు బాగా పెరగడం లో దోహదం చేస్తుంది. షాంపూతో పాటు,ఆయిల్, కండీషనర్, వాల్యూమర్ మరియు ఇతర హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడవచ్చు. రోజువారీ జుట్టు షాంపూ చేయడం కొంత ఫ్రీక్ అవుట్ కావచ్చు. కానీ మీ జుట్టు ప్రతి రోజు నిజంగా బాగుందనుకుంటే, అప్పుడు రోజూ షాంపూ చేయడం వలన ఎలాంటి హాని కలగదు.సో, మొదట మీ జుట్టు యొక్క ప్రస్తుత స్థితిని చెక్ చేయండి మరియు తరువాత షాంపూ ఎంత తరచుగా చేయాలని నిర్ణయించుకోండి.

ఐబాగ్స్ ని వదిలించుకోవడం ఎలా?

ఐబాగ్స్ ని వదిలించుకోవడం ఎలా?

సమాధానం: ఇది ఇంట్లో చేసుకొనే చికిత్స.

సౌందర్య సంబంధానికి సంబంధించిన గూగుల్ ప్రశ్నలలో, ఐబాగ్స్ అనేది మహిళలను కలవర పెడుతున్న ఒక సాధారణ ఆందోళన. మీరు ఐబాగ్స్ ని కలిగినట్లైయితే, దోసకాయ, బంగాళాదుంప, ఐస్ వంటి సాధారణ పద్దతుల లేదా మీ స్లీపింగ్ షెడ్యూల్ను మార్చుకోవచ్చు. ఐబాగ్స్ మీద ఎలాంటి ప్రయోగాలు చేయకండి.ఇది మీ కళ్ళ ఫై నేరుగా ప్రభావితం చేస్తుంది. ఐబాగ్స్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే, ఒక చర్మవ్యాధి నిపుణుడు సందర్శించండి.

స్మోకీ ఐ మేకప్ చేసుకోవడం ఎలా?

స్మోకీ ఐ మేకప్ చేసుకోవడం ఎలా?

సమాధానం: ఇది ఆన్లైన్ చూసి తెలుసుకోండి.

అన్ని వెబ్ సైట్స్ లో, స్మోకీ కళ్ళు ఎలా చేయాలో అనేదానికి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిలో ఒకదానిని అనుసరించి స్టెప్ బై స్టెప్ చేయడం ద్వారా మీరు ఖచ్చితమైన స్మోకీ కళ్ళు ను చూడవచ్చు. ఒకవేళ మీరు స్మోకీ కళ్ళ కోసం చేసే ప్రయత్నం లో ఒకే సమయంలో రెండు పద్ధతులను అనుసరిస్తే ఫలితం ఆనందకరంగా ఉండకపోవచ్చు. స్మోకి కళ్ళను చేస్తున్నప్పుడు, మీ కళ్ళ కు ఎలాంటి

ప్రమాదాన్ని కలిగించని కంటి కాస్మొటిక్స్ ని మాత్రమే ఉపయోగించండి.

ముడుతలు లేని చర్మాన్ని పొందడానికి ఎం చేయాలి?

ముడుతలు లేని చర్మాన్ని పొందడానికి ఎం చేయాలి?

సమాధానము:మొదటి దశ నుండి శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించండి.

30 సంవత్సరాల పైబడిన తర్వాత మీ ప్రయత్నాలను ప్రారంభించినప్పుడు మాత్రమే ముడుతలు లేని చర్మం సాధ్యమవుతుంది. ముడతలు మీకు నిజంగా రావాలని మీరు కోరుకుంటే అప్పుడు ముడుతలను వదిలించుకోవడానికి చూడండి, అలాంటప్పుడు మీరు తప్పు మార్గంలో ఉన్నారనే అర్థం.

ముడుతలు మొదటి లక్షణం నుదిటిపై సన్నని గీత తో ప్రారంభమవుతుంది.వెబ్లో ముడుతలు లేని చర్మం ఎలా పొందాలో మీకు చెప్పే అనేక ఇంటి చిట్కాలు వున్నాయి. మంచి ఫలితాల కోసం మీరు ఎంతో ఓపికతో ప్రయత్నిస్తూ వేచి ఉండాల్సి వస్తుంది.

English summary

Common Beauty Questions | Googled Beauty Questions | Answers To Beauty Questions

Most Googled beauty questions answered in a list, for your ease.
Story first published:Friday, September 8, 2017, 14:25 [IST]
Desktop Bottom Promotion