చర్మ, జుట్టు సమస్యల నివారణకు ఒకే రకమైన నేచురల్ రెమెడీస్

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఈ ఆధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం లేదంటుంటారు. అలాంటిది ఇక చర్మం, జుట్టు ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎక్కడిది అనే వారి సంఖ్య పెద్దగానే ఉంటుంది. ఎప్పుడు అందంగా, ఫర్ఫెక్ట్ గా కనబడాలంటే చర్మం, జుట్టు సంరక్షణ కోసం సమయం, ఎనర్జీ, కొన్ని సందర్భాల్లో డబ్బు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది.

చర్మం, జుట్టు రక్షణ కోసం మనం ఎప్పుడూ న్యాచురల్ రెమెడీస్ ను ఉపయోగిస్తుంటాము. న్యాచురల్ రెమెడీస్ లో వివిధ రకాల పదార్థాలను జుట్టు, చర్మ ఆరోగ్యానికి, అందానికి ఉపయోగిస్తుంటాము. చర్మానికి, జుట్టుకు విడివిడిగా ఉపయోగించే పదార్థాలు చాలా ఉన్నా, ఒకే సమయంలో ఒకే సారి రెండు సమస్యకు ఉపయోగపడే పదార్థాలు కూడా ఉన్నాయి.

ముఖంలో జిడ్డు తగ్గించే సులభ మార్గాలు!

ఈ హోం మేడ్ న్యాచురల్ పదార్థాలు చర్మం, జుట్టు సమస్యలను నివారించడంలో సహాయపడుతాయి. అవేంటో తెలుసుకుందాం...

1. కొబ్బరి నూనె:

1. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె జుట్టుకు మరియు చర్మానికి సహాయపడుతుంది. చర్మానికి, జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అందుకు సహాయపడుతాయి.

జుట్టుకు :

జుట్టుకు :

కొబ్బరి నూనె, అవొకాడో మాస్క్ :

పొడిజుట్టు, చిక్కుబడిన జుట్టును నివారించి జుట్టును సాప్ట్ గా మరియు షైనీగా మార్చుతుంది

కావల్సిన పదార్థాలు:

½ కప్పు కొబ్బరి నూనె

అవొకాడో (బాగా పండినది)

పద్దతి :

1. అవొకాడో కట్ చేసి, లోపలి గుజ్జు తియ్యాలి

2. గుజ్జు తీసి, ఒక గిన్నెలో వేసుకుని, కొబ్బరి నూనె మిక్స్ చేయాలి

3. ఈ పేస్ట్ ను జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి.

4. 15 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

చర్మానికి :

చర్మానికి :

కొబ్బరి నూనె, నిమ్మరసం :

కొబ్బరి నూనె, నిమ్మరసం కాంబినేషన్ చర్మంలో డార్క్ స్పాట్స్ తొలగిస్తుంది. చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది

కావల్సిన పదార్థాలు

1 టీస్పూన్ కొబ్బరి నూనె

1/2టీస్పూన్ ఫ్రెష్ లెమన్ జ్యూస్

పద్ధతి :

1. ఈ రెండు పదార్థాలను ఒక బౌల్లో తీసుకోవాలి.

2. రెండా బాగా మిక్స్ చేసి, రాత్రి నిద్రించే ముందు ముఖానికి పట్టించాలి.

3. ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మెరుస్తుంటుంది.

2)ఆలివ్ ఆయిల్ :

2)ఆలివ్ ఆయిల్ :

చర్మం, జుట్ట ఆరోగ్యానికి, అందానికి మరో హోం రెమెడీ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ జుట్టు రాలడం తగ్గిస్తుంది, హెయిర్ ఫాలీ సెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఎక్కువగా ఉండే చర్మంను యూత్ ఫుల్ గా మార్చుతుంది.

నుదటిపై పింపుల్స్ ను తొలగించే 9 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

జుట్టుకి :

జుట్టుకి :

ఆలివ్ ఆయిల్, ఎగ్ మాస్క్:

ఆలివ్ ఆయిల్ జుట్టుకు కావల్సిన తేమను అందిస్తే, గుడ్డు జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరుగుతుంది

కావల్సిన పదార్థాలు

1/2ఆలివ్ ఆయిల్

1 తేనె

1 గుడ్డు

పద్దతి:

1. ఒక బౌల్ తీసుకుని అందులో పైన సూచించిన మూడు పదార్థాలను వేయాలి.

2. తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా అప్లై చేయాలి.

3. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

చర్మానికి :

చర్మానికి :

ఆలివ్ ఆయిల్, పెరుగు మాస్క్ :

ఈ కాంబినేషన్ మాస్క్ చర్మంలో మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది

కావల్సిన పదార్థాలు

2 ఆలివ్ ఆయిల్

1/3rd కప్పు పెరుగు

పద్ధతి :

1. పైన సూచించిన పదార్థాలను ఒక బౌల్లో తీసుకోవాలి

2. ముఖానికి అప్లై చేయాలి. 3. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

3) అలోవెర జెల్

3) అలోవెర జెల్

చర్మం మరియు జుట్టుకు కలబంద అద్భుతంగా ఉపయోగడపడుతుంది. మొటిమలను, సన్ బర్న్, సన్ టాన్ నివారించడంలో గ్రేట్ రెమెడీ. జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. చుండ్రు నివారిస్తుంది

జుట్టుకు :

జుట్టుకు :

కలబంద, నిమ్మరసం మాస్క్

కలబంద తలలో చుండ్రు నివారిస్తుంది. నిమ్మరసం తలను శుభ్రం చేస్తుంది. ః

కావల్సిన పదార్థాలు :

కలబంద: 1 ఆకు

నిమ్మరసం : 1టేబుల్ స్పూన్

పద్ధతి :

1. కలబంద ఆకును సగానికి కట్ చేసి లోపల ఉండే గుజ్జును ఒక బౌల్లోకి తీసుకోవాలి.

2. అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి

3. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి.

4. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

చర్మానికి :

చర్మానికి :

కలబంద, రోజ్ వాటర్

కలబంద, రోజ్ వాటర్ రెండూ మంచి కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నాయి, ఇవి సన్ బర్న్ నివారిస్తాయి. నిమ్మరసం స్కిన్ టాన్ ను పోగొడుతుంది.

కావల్సిన పదార్థాలు :

½ అలోవెర

1 రోజ్ వాటర్

1 నిమ్మరసం

పద్దతి:

1. అలోవెర జెల్ ను తీసుకోవాలి

2. ఒక మిక్సింగ్ బౌల్లో అలోవెర జెల్, రోజ్ వాటర్, నిమ్మరసం వేయాలి

3. ఈ మూడు బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

4. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి

4) గ్రీన్ టీ

4) గ్రీన్ టీ

గ్రీన్ టీలో, చర్మ, జుట్టు ఆరోగ్యానికి, అందానికి సహాయపడే ప్రయోజనాలెన్నో దాగున్నాయి. జుట్టు పెరుగుదలకు మంచి రెమెడీ. గ్రీన్ టీలో ఉండే క్యాటచిన్స్ జుట్టు రాలడం తగ్గిస్తుంది. యూవీ కిరణాల నుండి చర్మం పాడవకుండా చర్మంను కాపాడుతుంది. ఇది ఏజింగ్ లక్షణాలను కూడా నివారిస్తుంది.

జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు..!

జుట్టుకోసం :

జుట్టుకోసం :

గ్రీన్ టీ రైస్

ఈ పద్దతి వల్ల జుట్టు కావల్సిన పోషన అందుతుంది. జుట్టు రాలడం తగ్గుతంది

కావల్సినపదార్థాలు :

3-4 గ్రీన్ టీబ్యాగ్స్

2 గ్లాసుల నీళ్ళు

పద్దతి :

1. రెండు గ్లాసుల నీళ్ళను బౌల్లో పోసి, అందులో గ్రీన్ టీ బ్యాగ్ లో వేసి బాగా ఉడికించాలి

2. పది నిముషాలు బాగా ఉడికించాలి.

3. పది నిముషాల తర్వాత తటీ బ్యాగులను పక్కకు తీసి చల్లార్చాలి

4. ఈ గ్రీన్ టీ వాటర్ ను తలారా పోసుకుని 15 నిముషాలు అలాగే ఉండాలి .

5) 15 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

చర్మం కోసం :

చర్మం కోసం :

గ్రీన్ టీ, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్ :

గ్రీన్ టీ, ఓట్ మీల్ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల స్కిన్ స్ట్రక్చర్ మెరుగుపడుతుంది. చర్మం చూడటానికి యంగ్ గా కనబడుతుంది.

కావల్సిన పదార్థాలు

1 గ్రీన్ టీ బ్యాగ్

2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్ పౌడర్

పద్దతి :

1. 1/2కప్పు గ్రీన్ టీని రెడీ చేసుకోవాలి

2. ఇప్పుడు ఓట్ మీల్ పౌడర్ తీసుకుని గ్రీన్ టీలో నిధానంగా వేస్తూ కలియబెట్టాలి.

3. మెత్తటి పేస్ట్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి

4. ఫేస్ ప్యాక్ గా వేసుకున్న తర్వాత 15 నిముషాల వరకూ అలాగే ఉండాలి

5. 15 నిముషాల తర్వాత చన్నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

natural remedies for skin | natural remedies for hair | remedies for both skin and hair

Here are certain natural remedies that work both on skin and hair. Take a look.
Subscribe Newsletter