ముఖంలో, శరీరం మీద ఏర్పడ్డ మొటిమలు, మచ్చలను తొలగించే న్యాచురల్ రెమెడీస్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

మొటమలు చర్మంలో చాలా ఇబ్బంది కలిగించే సమస్య. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో వస్తుంటాయి . ఇవి ఎక్కువగా ముఖంలోనే కబడుతాయి. అదే విధంగా మెడ, భుజాలు, వీపు, మోచేతుల వద్ద ఏర్పడుతుంటాయి. ఇలాంటి మొటిమలను వెంటనే నివారించకపోతే పర్మనెంట్ గా మచ్చలు ఏర్పడుతాయి.

హార్మోనుల్లో మార్పు వల్ల , టీనేజ్ లో వారికి మొటిమలు ఇబ్బంది కలిగిస్తాయి . కొందరిలో ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, చాక్లెట్ వల్ల తరచూ మొటిమలు ఏర్పడుతాయి.అయితే వీటికి సరైన నిరూపణలేవీ లేవు . మొటిమలకు మరో కారణం కూడా ఉంది, చర్మం మురికి పడటం వల్ల కూడా ఇలా జరగుతుంది . మొటిమలకు ఒత్తిడి కారణకాదు కానీ, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది.

కొవ్వు ఉండే గ్రంథులు బ్యాక్టీరియాతో బ్లాక్ అయినప్పుడు.. మొటిమలు ఏర్పడతాయి. అలాగే దుర్వాసన వస్తుంది. వీటిని అలాగే వదిలేస్తే.. చాలా నొప్పి కలిగిస్తాయి. స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తాయి. శరీరం మీద ఏర్పడే కొన్ని రకాల మొటిమలు, వాటి తాలూకు మచ్చలకు స్కిన్ క్యాన్సర్ కు దారితీస్తాయి. ఇవి కేవలం ముఖంపైన మాత్రమే కాదు.. మెడ వెనక, మెడపై, భుజాలు, వీపుపై కూడా వస్తాయి.

అటువంటి పరిస్థితి ఏర్పడకుండా మొటిమలు తొలగించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిని ఒక్కసారి ట్రై చేశారంటే.. పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికిందని భావిస్తారు.

 అరటి తొక్క

అరటి తొక్క

అరటి తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ముఖంలో మెలనోసైట్ గుణాలను తగ్గిస్తుంది. అరటి తొక్కను తీసుకుని నేరుగా మొటిమలు, మచ్చల మీదఅ అప్లై చేయాలి. 24గంటల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా అరటితొక్కను ఉపయోగించడం వల్ల చర్మం మచ్చలను ఎఫెక్టివ్ గా సులభంగా తొలగిస్తుంది.

ఆముదం

ఆముదం

ఆముదంను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మంలో మచ్చలు సులభంగా తొలగిపోతాయి. కాటన్ బాల్ ను ఆముదం నూనెలో డిప్ చేసి మచ్చల మీద అప్లై చేయాలి. 12 గంటల తర్వతా శుభ్రం చేసుకోవాలి. ఆముదంలో ఉండే గుణాలు ఎంజైమ్స్ ను బ్రేక్ చేస్తుంది, దాంతో మచ్చలు డ్రైగా మారుతాయి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

యాపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగించడం వల్ల మొటిమలు, మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే నిధానంగా బర్న్ అవుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఇన్ఫెక్షన్స్ ను నివారస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో కాటన్ డిప్ చేసి నేరుగా మచ్చల మీద అప్లై చేయాలి. ఇలా పది రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పైన్ ఆపిల్

పైన్ ఆపిల్

పైనాపిల్లో ఉండే ఎంజైమ్స్ మొటిమలు, మచ్చలకు కారణమయ్యే ఎంజైమ్స్ ను నివారిస్తుంది. శరీరంలో మచ్చలను తొలగిస్తుంది. కొద్దిగా పైనాపిల్ జ్యూస్ తీసుకిని, మచ్చల మీద అప్లై చేయాలి. కొద్ది సేపు వెయిట్ చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

తేనె

తేనె

తేనెలో ఇన్ఫెక్షన్ నివారించే సత్తా ఉంటుంది. ఇది చర్మంపై ఉండే క్రిములను తొలగిస్తుంది. చర్మ సమస్యలను తేలికగా నివారిస్తుంది. 1 టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి. తర్వాత 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయాలి.

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్

టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ తీసుకుని కాటన్ బాల్ పై వేయాలి. దాన్ని మొటిమలపై అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల.. వాపు తగ్గుతుంది, మొటిమ మచ్చలేకుండా పోతుంది.

ఫ్లాక్ సీడ్ ఆియల్ :

ఫ్లాక్ సీడ్ ఆియల్ :

ఫ్లాక్ సీడ్స్ ను మెత్తగా పౌడర్ చేసి, అందులో ఫ్లాక్ సీడ్ ఆయిల్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. అలాగే కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసి మచ్చల మీద అప్లై చేయాలి. 24 గంటలు అలాగే ఉండనిచ్చి, తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. మోల్స్ ను పూర్తిగా డ్రై అవుట్ చేస్తుంది

ఉల్లిపాయ జ్యూస్ :

ఉల్లిపాయ జ్యూస్ :

ఉల్లిపాయ రసం ఎఫెక్టివ్ హోం రెమెడీ. మచ్చలను తొలగించడం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాటన్ ను ఉల్లిపాయ రసంలో డిప్ చేసి, మచ్చల మీద నేరుగా అప్లై చేయాలి. అవసరం అయితే ఉల్లిరసం కూడా మిక్స్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల ఎఫెక్టివ్ గా మచ్చలను తొలగిస్తుంది. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఉల్లిపాయ రసానికి తేనె చేర్చి ఉపయోగించాలి.

ఫ్రాంకిసెన్ ఆయిల్

ఫ్రాంకిసెన్ ఆయిల్

ఫ్రాంకిసెన్స్ ఆయిల్ గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఇది మొటిమలు, మచ్చలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది మొటిమలను నివారించడంలో న్యాచురల్ ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. దాంతో మచ్చలను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. దీన్నిమచ్చల మీద అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే ఈ నూనెకు ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజులో రెండు సార్లు చేస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

అలోవెర జెల్

అలోవెర జెల్

ఈ మ్యాజికల్ ప్రొడక్ట్ గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో అసిడిక్స్ లక్షణాలు ఉండవు. ఫ్రెష్ గా ఉండే అలోవెరను కట్ చేసి జెల్ తీసి, నేరుగా మచ్చల మీద అప్లై చేయాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

English summary

Natural Remedy To Treat Moles On Face And Body

Moles are usually not harmful; however, some of them may turn out to be cancerous. Read here to know about the ways to treat moles on face and body and prevent them from growing any further.
Subscribe Newsletter