కర్పూరంలో దాగున్న బ్యూటీ సీక్రెట్స్!

Posted By:
Subscribe to Boldsky

కర్పూరం (Camphor) ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పదార్థము. , శుభప్రదమైన కర్పూరం అనాదికాలం నుండి వినియోగంలో ఉంది. వెలుగుతున్న కార్పూర హారతిని చూస్తే భారతీయుల హృదయాలు ఆధ్యాత్మికతతో ఓలలాడతాయి. ఇది వెలిగించిన ప్రాంతంలో ప్రశాంతమైన, ఉత్సాహకరమైన ఫీలింగ్ కలుగుతుంది. భారత దేశంలో అన్ని ప్రాంతాలవారు కర్పూరం శుభకార్యాలకు తప్పనిసరిగా వాడతారు.పరిమళాలను వెదజల్లే కర్పూరం ఆలయాలలో హరతి ఇవ్వడానికి వినియోగించడం చిరకాలం నుండి వస్తుంది.

కర్పూరం

కర్పూరంలో గొప్ప ఔషధ గుణాలున్నాయి. ఒక ఘాటైన సువాసన గల కర్పూరం రసాయనిక ఆకర్షణ మాత్రమే కాదు. కర్పూరంను జుట్టు మరియు చర్మ సమస్యల చికిత్సకు కొన్ని దశాబ్దాల నుండి ఉపయోగిస్తున్నారు. ఇందులో అనేక బ్యూటీ బెనిఫిట్స్ ఉండటం వల్ల దీన్ని వివిధ రకాల ఆయుర్వేద బ్యూటీ ట్రీట్మెంట్స్ కోసం ఉపయోగిస్తున్నారు. కర్పూరం వాడితే శుభప్రదమే కాదు అందం, ఆరోగ్యం కూడా మెరుగుపడుతాయని సైంటిస్టులు పరిశోధనాత్మకంగా గుర్తించారు. అయితే కర్పూరంను చర్మ, కేశ సౌందర్యంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

1. కర్పూరం చర్మ దురుదను తగ్గిస్తుంది:

1. కర్పూరం చర్మ దురుదను తగ్గిస్తుంది:

చర్మంలో దురద, చిరాకు వంటి సమస్యల నివారణకు కర్పూరంను ఉపయోగించవచ్చు. ఈ సమస్య ఉన్న ప్రదేశంలో కర్పూరంను మర్ధన చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పొడి చర్మం ఉన్నవారు తరచూ చర్మం దురద, రెడ్ నెస్, స్కిన్ ఇరిటేషన్ సమస్యలు కలిగి ఉంటారు. దీన్ని చాలా సులభంగా ట్రీట్ చేయవచ్చు.

కొద్దిగా కర్పూరం తీసుకుని, కొబ్బరి నూనెలో వేసి వేడి చేయాలి. కర్పూరం పూర్తిగా కరిగిన తర్వాత ముఖం, శరీరానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2. కర్పూరం మొటిమలను నివారిస్తుంది:

2. కర్పూరం మొటిమలను నివారిస్తుంది:

కర్పూరం డ్రైస్కిన్, చర్మంలో దురదను మాత్రమే నివారించడం కాదు, మొటిమలను కూడా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. కొన్ని తులసి ఆకులు తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత అందులో రెండు మూడు చుక్కల కర్పూరం ఆయిల్ వేసి మిక్స్ చేసి, మొటిమల మీద అప్లై చేయాలి. అరగంట ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తులసి, కర్పూరం మాస్క్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మొటిమలు సులభంగా తగ్గించుకోవచ్చు.

3. కర్పూరం సన్ బర్న్ నివారిస్తుంది::

3. కర్పూరం సన్ బర్న్ నివారిస్తుంది::

వేసవి సీజన్ లో వేడి వాతావరణం వల్ల సన్ బర్న్ నివారించబడుతుంది. చర్మ సంరక్షణలో కర్పూరంను రెగ్యులర్ గా చేర్చుకోవడం వల్ల సన్ బర్న్ సమస్య ఉండదు. ఒక స్పూన్ అలోవెర జెల్ రెండు స్పూన్ల కర్పూరం ాయిల్ , చిటికెడు పసుపు తీసుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేసి సన్ బర్న్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సన్ బర్న్ సమస్య ఉండదు . సన్ బర్న్ మాత్రమే కాదు, సన్ ట్యాన్ కూడా తొలగిస్తుంది.

4. కర్పూరం తలలో దురద తగ్గిస్తుంది:

4. కర్పూరం తలలో దురద తగ్గిస్తుంది:

తలకు కర్పూరం నూనెను ఉపయోగించడం వల్ల , వివిధ రకాలగా ప్రయోజనాలను అందిస్తుంది. డ్రై హెయిర్ ను నివారిస్తుంది. తలలో దురద తగ్గిస్తుంది.

కొద్దిగా కర్పూరం ఆయిల్ తీసుకుని, అంతే మోతాదులో కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. ఈ రెండూ వేడి చేసి తలకు అప్లై చేసి వేడినీటిలో డిప్ చేసి టవల్ ను తలకు చుట్టాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

5. కర్పూరం చుండ్రు నివారిస్తుంది:

5. కర్పూరం చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారించడంలో కర్పూరం గ్రేట్ రెమెడీ. కర్పూరంలో ఉండే యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటీర లక్షణలు తలలో దురద తగ్గించడంతో పాటు, చుండ్రును పూర్తిగా నివారిస్తుంది. చుండ్రు నివారించుకోవడం కోసం కర్పూరం నూనెను షాంపు మరియు కండీషనర్ కు జోడించి ఉపయోగించుకోవచ్చు.

6. కర్పూరం హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

6. కర్పూరం హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:

జుట్టు పల్చబడటం, జుట్టు రాలే సమస్యలతో బాధపడుతుంటే, కర్పూరం ఆయిల్ ఈ సమస్యలకు చెక్ పెడుతుంది. ఈ న్యాచురల్ పదార్థం హెయిర్ ఫాలీసెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. జుట్టు రాలడం నివారిస్తుంది. కర్పూరం ఆయిల్ ను రెగ్యులర్ గా జుట్టుకు అప్లై చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అరకప్పు మయోనైజ్ లో కొద్దిగా కర్పూరం ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

 7. కర్పూరం పాదాల పగుళ్ళను నివారిస్తుంది:

7. కర్పూరం పాదాల పగుళ్ళను నివారిస్తుంది:

పొడిబారిన, పగిలిన పాదాలను నివారించడంలో కర్పూరం ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. పాదాల పగుళ్ళ సమస్యను పూర్తిగా నివారించడంలో కర్పూరం ఆయిల్ ను వార్మ్ వాటర్ లో వేసి ఆ నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచాలి. 15నిముషాల తర్వాత నీటిలో నుండి బయటకు తీసి, పొడి టవల్ తో తుడవాలి. ఇలా ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Overall Beauty Benefits Of Camphor

Due to therapeutic properties found in camphor, it can help to benefit your skin and hair in several ways. Read to know about the beauty uses of camphor for skin and hair care.
Story first published: Tuesday, June 13, 2017, 20:00 [IST]
Subscribe Newsletter