అందంగా కనబడాలంటే కోకనట్ సోప్ ట్రై చేయండి..

Posted By: Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

మార్కెట్లో లభించే వివిధ సబ్బులు మీ అందాన్ని కాపాడలేకపోయాయా? వాటిని ఉపయోగించి విసుగు చెందారా? అయితే మీరు ఎప్పుడైనా కొబ్బరి పాల సబ్బును ఉపయోగించారా ? మనం రోజూ వినియోగించే సబ్బులకు దీనికి చాలా తేడా ఉందండోయ్. తాజా కొబ్బరి పాలతో ఉండే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అవన్నీ మనకు తెలిసినవే.

కొబ్బరి పాలు చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అయితే కొబ్బరి పాలు మిక్స్ అయిన ప్రతి సబ్బు ద్వారా ఇలాంటి ప్రయోజనాలున్నాయనుకుంటే పొరపాటే. స్వచ్ఛమైన కొబ్బరి పాలతో తయారు చేసిన సబ్బుల ద్వారానే మనం ఈ బెనిఫిట్స్ పొందగలుగుతాం.

కోకనట్ సోప్ తో మీ అందాన్ని మెరుగుపరుచుకోండి

చర్మాన్ని బాగా శుభ్రం చేస్తాయి

చర్మాన్ని బాగా శుభ్రం చేస్తాయి

కొబ్బరి పాల సబ్బు చర్మం పొడిబారకుండా చేస్తుంది. చర్మానికి మేలు చేసే గుణాలు ఈ సబ్బులో ఎక్కువగా ఉండడం వల్ల అవి చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా వీటిలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న అన్ని రకాల మలినాలను (మురికి, దుమ్ము, మృత కణాలు, మొదలైన వాటిని ) తొలగించేందుకు సహాయపడతాయి. చర్మం సహజంగా హైడ్రేషన్ కలిగి ఉండేలా కూడా ఈ సబ్బు తోడ్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది చర్మాన్ని సున్నితంగా మార్చడానికి, మంచి ఫేస్ క్లీనర్ గా బాగా ఉపయోగపడుతుంది.

మాశ్చరైజేషన్

మాశ్చరైజేషన్

అధిక పోషకాలు, ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండే కొబ్బరి పాల సబ్బులు నిస్తేజంగా, పొడిగా ఉండే చర్మానికి వెంటనే హైడ్రేషన్ కలిగిస్తాయి. మిగతా సబ్బుల్ని ఒక్కసారి చర్మంపై రుద్దామంటే చర్మం కాస్త పొడిగా మారుతుంది. కానీ వీటితో ఆ సమస్య ఉండదు. ఎన్నిసార్లు వీటిని ఉపయోగించిన చర్మం పొడిబారదు. కొబ్బరి పాలలో మంచి మాశ్చరైజింగ్ గుణాలుండడం వల్ల అవి చర్మం కోల్పొయిన తేమను తిరిగి పునరుద్ధరిండానికి ఎంతో సహాయం చేస్తాయి. దీంతో మీ చర్మం ఎప్పుడూ మృదువుగా ఉంటుంది.

యవ్వనంగా ఉంటారు

యవ్వనంగా ఉంటారు

కొబ్బరి పాల సబ్బును నిరంతరం ఉపయోగించడం వల్ల మీరు ఎప్పుడూ యవ్వనంగా కనపడతారు. ఇందులో శక్తివంతమైన అనామ్లజనకాలుంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. నిత్యావసర సూక్ష్మపోషకాలు,సెలీనియం, ఐరన్, రాగి, జింక్ వంటివి కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యగా ఉంచేందుకు ఇవి తోడ్పడుతాయి. అలాగే వీటిలో మంచి పోషణ గుణాలుంటాయి. చర్మంపై ఉండే ముడుతలను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. సూర్య కిరణాల వల్ల కలిగే నష్టాలను, వయస్సు పెరగడంతో వచ్చే మచ్చలు, తదితర వాటిని కొబ్బరి పాల సబ్బు నియంత్రిస్తుంది.

మొటిమలకు చెక్

మొటిమలకు చెక్

ఇంతకు ముందు చెప్పినట్లుగా కొబ్బరి పాలు సబ్బు చర్మం లోతుల్లోకి వెళ్లి శుద్ధి చేస్తుంది. మొటిమల నివారణలో నంబర్ వన్ గా ఇది పని చేస్తుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. లారిక్ యాసిడ్, కాప్రిలిక్ యాసిడ్, కాప్రిక్ యాసిడ్ మొదలైనవి ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణకుఎంతో సహకరిస్తాయి. మొటిమలు తగ్గడానికి కూడా బాగా పని చేస్తాయి. అలాగే ఈ కొవ్వు ఆమ్లాల్లోని కొన్ని అనామ్లజనకాలుగా పని చేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ నష్టాలను తగ్గిస్తాయి. అలాగే మచ్చలను తొలగించడానికి బాగా పని చేస్తాయి.

స్కిన్ ఇన్ఫెక్షన్స్

స్కిన్ ఇన్ఫెక్షన్స్

కొబ్బరి పాలలోని లారీ యాసిడ్ యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి పాలు సబ్బులు స్కిన్ ఇన్ఫెక్షన్స్ నిరోధిస్తాయి. తామర, ఇతర చర్మవ్యాధులు దరి చేరకుండా చేస్తాయి.

చర్మాన్ని బాగు చేయడంలో నంబర్ వన్

చర్మాన్ని బాగు చేయడంలో నంబర్ వన్

దెబ్బతిన్న చర్మాన్ని బాగు చేయడంలో కొబ్బరి పాల సబ్బు నంబర్ వన్ గా పని చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అలాగే అనేక ఇతర ముఖ్యమైన పోషకాలను ఉండడం వల్ల చర్మంలోని కణాలు వేగంగా పని చేసేందుకు, అలాగే డ్యామేజీ అయిన చర్మం వెంటనే బాగు అయ్యేలా చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. చర్మంపై ఉండే గాయాలను, కాలిన ప్రాంతాలను, పగిలిన చర్మాన్ని బాగు చేయడంలో కొబ్బరి పాల సబ్బు బాగా పని చేస్తుంది.

డ్యామేజీ హెయిర్ ను కాపాడుతుంది

డ్యామేజీ హెయిర్ ను కాపాడుతుంది

కొబ్బరి పాలలో ఉండే ప్రోటీన్లు మీ జుట్టు కూడా మంచి పోషకాలను ఇస్తాయి. కాబట్టి ఈ సబ్బును మీ కేశ సంరక్షణకు కూడా వాడండి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు అత్యధిక పోషణను అందిస్తాయి.అలాగే డ్యామేజీ అయిన జుట్టుకు మళ్లీ జీవం పోస్తాయి.

పొడిబారిన జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి

పొడిబారిన జుట్టుకు ఆరోగ్యాన్ని ఇస్తాయి

కొబ్బరి పాలలోని ఫ్యాటీ యాసిడ్స్ చర్మంలో తేమను పెంచడానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మీ జుట్టు పొడిబారినట్లయితే మీరు ఒక్కసారి కొబ్బరి పాలు సబ్బును ఉపయోగించి చూడండి. మీ హెయిర్ కోల్పొయిన తేమను, షైనింగ్ ను మళ్లీ తిరిగి పొందుతుంది.

చుండ్రుని నివారించవచ్చు

చుండ్రుని నివారించవచ్చు

కొబ్బరి పాలు సబ్బుల్లో అధికంగా ఉండే పోషక పదార్ధాలు మీ తలపై ఉండే చుండ్రుని నివారించడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ సబ్బు మీ మాడును ఇది ఎప్పుడు తేమగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. పొడి బారకుండా ఉంచుతుంది. దీని వల్ల మీరు చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు.

చర్మం, జుట్టుకు ఇది మంచి పోషకాహారి

చర్మం, జుట్టుకు ఇది మంచి పోషకాహారి

ఇక చివరిగా చెప్పేది ఏమంటే.. కొబ్బరి పాల సబ్బు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. . మైక్రోబియల్ దాడిని తట్టుకోవటానికి కావాల్సినంతా తేమను ఇది అందిస్తుంది. మన సౌందర్య రక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతంది. దీంతో సహజ పద్ధతిలో మీరు అందాన్ని సొంతం చేసుకోవొచ్చు. ఇవండీ.. కొబ్బరి పాల సబ్బు వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు. మరిఇంకెందుకు ఆలస్యం.. ఈ రోజు నుంచే మీ రెగ్యులర్ సబ్బును పక్కన పెట్టి కొబ్బరి పాలతో తయారైన సబ్బును ఉపయోగించడం మొదలుపెట్టండి.

English summary

Top 10 Benefits Of Coconut Soap

You must have heard a lot about the beauty benefits of fresh coconut milk. But have you ever tried coconut milk soap? Well, these are quite different from regular soaps as they infuse all the goodness of pure and fresh coconut milk into the skin and hair without depleting their natural oils. But that’s not all coconut milk soap can do! There is much more that you can expect from it!