కీరదోస కాయతో కళ్ళకు ఉపయోగాలు, కంటి సమస్యలను నివారించే కీరదోసకాయ

Posted By:
Subscribe to Boldsky

కళ్లు దేవుడు మనిషికి ఇచ్చిన ఒక అద్భుత వరం. కళ్లతోటి ప్రపంచంలో ఎన్నో అద్భుతాలను చూడవచ్చు. అటువంటి కళ్ళు మన శరీరంలో ఒక భాగం కావడం ఒక మ్యాజిక్. ఎందుకంటే కళ్లతోనే హావ భావాలు తెలుపవచ్చు. ఒక మాట మాట్లాడకుండానే కళ్లతోనే ఎమోషన్స్ ను ఎక్స్ ప్రెస్ చేయవచ్చు.

ఒక వ్యక్తిని కలిసినప్పుడు మొదట వారి కళ్ల మీదకే చూపు వెలుతుంది. కాబట్టి, కళ్ళు అందంగా..ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కళ్ళు ఎప్పుడూ ఫ్రెష్ గా కనబడాలి. అప్పుడే కళ్ళ అందం తెలుస్తుంది. కళ్ళు ఆకారం, రంగు ఏవిధంగా ఉన్నదన్నది ముఖ్య విషయం కాదు, కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉన్నయన్నదే ముఖ్యం. కొన్ని సందర్భాల్లో కళ్ళు ఎక్కువ ఒత్తిడి గురైనప్పుడు, కళ్ళు మిమ్మల్ని డల్ గా, బాధాకరంగా కనబడేలా చేస్తాయి.కళ్ళ క్రింద క్యారీ బ్యాగుల్లా చర్మం వదులుగా కనబడుతుంది, ముడుతలు లేదా కళ్ళ ఉబ్బు ముఖ అందాన్ని పాడుచేస్తుంది.

కీరదోస కాయతో కళ్ళకు ఉపయోగాలు, కంటి సమస్యలను నివారించే కీరదోసకాయ

కళ్ళు అందంగా మార్చుకోవడానికి, కళ్ళ అందాన్ని పాడు చేసే సమస్యలను నివారించుకోవడానికి కీరదోసకాయ వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఇది నేచురల్ గా , ఎఫెక్టివ్ గా కళ్ళ మీద పనిచేస్తుంది. కళ్ళ మీద కీరదోసకాయ ముక్కలను పెట్టుకోవడం మనం అరుదుగా చూస్తూనే ఉంటాము. ఇది కళ్ళకు గ్రేట్ రిలీఫ్ ఇస్తుంది. అలసిన కళ్ళకు ఉపశమనం కలిగిస్తుంది. కీరదోసకాయ కళ్ళ క్రింద చర్మానికి విశ్రాంతి కలిగిస్తుంది. కీరదోసకాయను కళ్ళకు ఏవిధంగా ఉపయోగించాలి తెలుసుకుందాం..

రెగ్యులర్ గా కీరదోస, గుమ్మడి జ్యూస్ తాగితే, ఒక్క నెలలో కలిగే అద్భుత ప్రయోజనాలు..!

కళ్ళ ఉబ్బు, వాపు తగ్గిస్తుంది:

కళ్ళ ఉబ్బు, వాపు తగ్గిస్తుంది:

కీరదోసకాయలో ఆస్కార్బిక్ మరియు కాఫిక్ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల కళ్ళక్రింద చర్మంలో వాటర్ ను తగ్గిస్తుంది.

కీరదోసకాయను సన్నని స్లైస్ గా కట్ చేసి, రెండు స్లైస్ ను రెండు కళ్ళ మీద ఉంచి, విశ్రాంతి తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే వాపు, కళ్ళ ఉబ్బు తగ్గుతుంది.

కళ్ళ చీకాకును నివారిస్తుంది:

కళ్ళ చీకాకును నివారిస్తుంది:

ఏదైనా కీటకం, లేదా దోమలు కుట్టినప్పుడు అలర్జీ వల్ల వచ్చే నొప్పిని నివారించడంలో కీరదోసకాయ గ్రేట్ గా సహాయపడుతుంది.

కీరదోసకాయలో ఉండే విటమిన్ , యాంటీఆక్సిడెంట్స్ కళ్ళ ఇరిటేషన్ తగ్గిస్తుంది. కుకుంబర్ జ్యూస్ లో కాటన్ డిప్ చేసి, కాటన్ ను కంటి మీద ఉంచి విశ్రాంతి తీసుకోవాలి.

చర్మ సౌందర్యాన్ని పెంచే కీరదోసకాయ ఫేస్ ప్యాక్స్...!

కళ్ళకు రిఫ్రెష్ నెస్ వస్తుంది:

కళ్ళకు రిఫ్రెష్ నెస్ వస్తుంది:

కీరదోసకాయ అద్భుతమైన స్కిన్ కేర్ ప్రొడక్ట్. ఇది చర్మానికి తగిన తేమను అందిస్తుంది. ఇందులో ఉండే 95శాతం వాటర్ కంటెంట్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దాంతో కళ్ళు రిఫ్రెష్ అవుతాయి

కళ్ళ క్రింది ముడుతలను నివారిస్తుంది:

కళ్ళ క్రింది ముడుతలను నివారిస్తుంది:

మహిళల ముఖంలో యాంటీఏజింగ్ మరియు ముడతల వల్ల ముఖ అందం పాడవుతుంది. కీరదోసకాయలో ఉండే విటమిన్ ఇ , పొటాసియం, యాంటీఏజింగ్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది. దాంతో ముడుతలు తగ్గుతాయి. ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి. కీరదోసకాయను తురిమి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలో ముడుతలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. తప్పకుండా మార్పును గమనిస్తారు.

 కళ్ళ క్రింద చర్మం వదులవకుండా నివారిస్తుంది:

కళ్ళ క్రింద చర్మం వదులవకుండా నివారిస్తుంది:

కీరదోసకాయ చర్మ కాంతిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మం సాగకుండా, వదులవకుండా నివారిస్తుంది. రెండు కీరదోసకాయ స్లైస్ గా కట్ చేసి, కళ్ళ మీద పెట్టి, విశ్రాంతి తీసుకోవాలి. రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కీరా జ్యూస్ లో దాగున్న అమేజింగ్ బ్యూటీ సీక్రెట్స్..!!

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:

కీరదోసకాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కీరదోసకాయను చేర్చుకోవడంతో పాటు, కళ్ళకు అప్లై చేయడం వల్ల కూడా డబుల్ బెనిఫిట్స్ పొందవచ్చు.

English summary

6 ways cucumber slices can benefit your eyes

Placing cucumber on your eyes has several beauty benefits, as it helps to reduce puffiness of the eyes and gives solutions for many eye-related problems.
Story first published: Monday, July 24, 2017, 16:42 [IST]
Subscribe Newsletter