For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాల పగుళ్ళకు గల కారణాలేంటి?

అందం అంటే సాధారణంగా ఫేస్ పాక్స్ తో పాటు కాస్మెటిక్స్ కి ప్రాధాన్యతనిస్తారు చాలా మంది మహిళలు. అయితే, పాదాల అందంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఒక నానుడి ప్రకారం, మగవారిని వారి పాదరక్షలను చూసి అంచనా వేయవచ్చు అ

By Lalitha Lasya Peddada
|

అందం అంటే సాధారణంగా ఫేస్ పాక్స్ తో పాటు కాస్మెటిక్స్ కి ప్రాధాన్యతనిస్తారు చాలా మంది మహిళలు. అయితే, పాదాల అందంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఒక నానుడి ప్రకారం, మగవారిని వారి పాదరక్షలను చూసి అంచనా వేయవచ్చు అదే విధంగా ఆడవారి గురించి వారి పాదాలను చూసి అంచనా వేయవచ్చు.

ఆడవారి పాదాల అందం గురించి కవులు, రచయితలూ తమ రచనలలో ఎంతగానో వర్ణించారు. అంతే కాదు, ఆడవారి పాదాల సొగసును వర్ణిస్తూ ఎన్నో చిత్రలేఖనాలు కూడా ప్రజాదరణ పొందాయి. వీటితో పాటు , ఎన్నో వాణిజ్య ప్రకటనలలో ఆడవారి పాదాల అందాలను వర్ణించారు, వర్ణిస్తున్నారు కూడా. అయితే, అందమైన పాదాలు కలిగి ఉండటం ఏక్కువ సమయం తీసుకునే ప్రక్రియ.

What Causes Cracked Heels

వర్క్ తో బిజీ షెడ్యూల్స్ తో పాదాల గురించి పట్టించుకునే తీరికా ఓపికా చాలామందికి ఉండట్లేదు. పాదాల పగుళ్ళకు గల కారణాలను తెలుసుకుంటే తద్వారా మంచి చిట్కాల ద్వారా పరిష్కారం పొందవచ్చు.

పాదాలలో పగుళ్లు రావడానికి అనేక కారణాలుంటాయి. కొన్ని కారణాలను ఇక్కడ వివరించాము.

1. ఎక్కువ సేపు పాదాలపై బరువు పడే విధంగా నించోవడంవల్ల

1. ఎక్కువ సేపు పాదాలపై బరువు పడే విధంగా నించోవడంవల్ల

ఎక్కువ సేపు పాదాలపై బరువు పడే విధంగా నించోవడంవల్ల పాదాలపై పగుళ్లు ఏర్పడతాయి. ఇటువంటి సమస్యను అధిగమించాలంటే మీరు మెత్తగా ఉండే ఫుట్ వేర్ ను ఎంచుకోవాలి. అలాగే, ఎక్కువ సేపు నించోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మధ్య మధ్యలో కాస్త బ్రేక్స్ తీసుకుంటూ పాదాలకు కాస్త విశ్రాంతినివ్వాలి.

2.గరుకుగా ఉండే నేల

2.గరుకుగా ఉండే నేల

గరుకుగా ఉండే నేల కూడా పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడేలా చేస్తుంది. తద్వారా పాదాల పగుళ్లు ఏర్పడతాయి. కొంతకాలానికి, మడమలోని ఎముక బయటికి పెరుగుతుంది. తద్వారా విపరీతమైన నొప్పి వస్తుంది.

3. ఊబకాయం కూడా పాదాల పగుళ్ల సమస్యకు ప్రధాన కారణం.

3. ఊబకాయం కూడా పాదాల పగుళ్ల సమస్యకు ప్రధాన కారణం.

ఊబకాయం కలిగిన వాళ్ళు ఎక్కువ సేపు నించున్నా వారిని పాదాల పగుళ్ల సమస్య వేధిస్తుంది.

4. ఎప్పుడూ ఒకే రకమైన ఫుట్ వేర్

4. ఎప్పుడూ ఒకే రకమైన ఫుట్ వేర్

నిరంతరం ఒకే రకమైన ఫుట్ వేర్, ప్రత్యేకించి చదునుగా ఉన్న ఫుట్ వేర్ను వేసుకుంటూ ఉన్నా కూడా పాదాల పగుళ్ల సమస్య ఇబ్బంది పెడుతుంది. పాదాలు బయటికి కనిపించే రకంగా ఉన్న ఫుట్ వేర్ కూడా పాదాల కు పగుళ్ళను తెచ్చే అవకాశం ఉంది.

5. అలాగే, నీటిలో ఎక్కువ సేపు పాదాలు తడిసినా

5. అలాగే, నీటిలో ఎక్కువ సేపు పాదాలు తడిసినా

అలాగే, నీటిలో ఎక్కువ సేపు పాదాలు తడిసినా పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ. కొందరికి ఈ సమస్య వృత్తిపరంగా ఎదురుకావచ్చు.

6. వయసు పెరిగిన కొద్దీ

6. వయసు పెరిగిన కొద్దీ

వయసు పెరిగిన కొద్దీ పాదాల వద్దనున్న చర్మం మందంగా మారి పగుళ్ళకు దారి తీస్తుంది. అలాగే, వయసు పెరిగే కొద్దీ చర్మంలోనున్న ఎలాస్టిసిటీ దెబ్బ తిని చర్మంలోనున్న సహజమైన తేమ శాతం కూడా తగ్గిపోవడంతో పాదాల పగుళ్లు ఏర్పడతాయి.

7. ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తే

7. ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తే

ఎక్కువగా వేడి నీటితో స్నానం చేస్తే పాదాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మిగతా శరీరంపై కూడా వేడి నీటి స్నానం తన ప్రభావం చూపిస్తుంది. పెడిక్యూర్ చేయించుకునేటప్పుడు కూడా పొగలుగక్కే వేడి నీటిని దూరంగా ఉంచండి. పాదాలను ప్రతి రోజు రెండు సార్లు చక్కగా కడిగి మెత్తటి పొడి వస్త్రంతో పాదాలపై తడిలేకుండా తుడిచేయాలి. ఈ విధంగా చేస్తే పాదాల పగుళ్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

8.విటమిన్ లోపాల వల్ల

8.విటమిన్ లోపాల వల్ల

విటమిన్ లోపాల వల్ల, మధుమేహం వల్ల అలాగే థైరాయిడ్, సోరియాసిస్ వంటి సమస్యలు కూడా పాదాల పగుళ్ల సమస్యను తీసుకువస్తాయి.

9. కఠినమైన సబ్బులను వాడితే

9. కఠినమైన సబ్బులను వాడితే

కఠినమైన సబ్బులను వాడితే చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి పాదాల పగుళ్లు ఏర్పడుతాయి. కాబట్టి కఠినమైన సబ్బులను వాడడం తగ్గించండి.

10. ఎక్కువగా స్క్రబ్ చేయడంవలన

10. ఎక్కువగా స్క్రబ్ చేయడంవలన

ఎక్కువగా స్సీరుబ్ చేయడంవలన కూడా చర్మంపైనున్న పొరలు తొలగిపోవడంతో ఎక్కువగా పొడిబారే సమస్య ఏర్పడి తద్వారా పాదాల పగుళ్లు వేధిస్తాయి.

11.డీహైడ్రేషన్

11.డీహైడ్రేషన్

డీహైడ్రేషన్ సమస్య వలన కూడా పాదాల పగుళ్లు ఏర్పడతాయి. కాబట్టి కావలిసినంత మంచినీటిని తీసుకోవడం ద్వారా కూడా పాదాల పగుళ్ల సమస్యను నివారించవచ్చు.

12. పాదాలకు సొగసులద్దడానికి చిట్కాలు:

12. పాదాలకు సొగసులద్దడానికి చిట్కాలు:

క్రమబద్ధమైన పెడిక్యూర్స్ : పాదాలపై నున్న డెడ్ స్కిన్ ని తొలగించడానికి పెడిక్యూర్స్ ఉపయోగపడతాయి. అందుకే క్రమం తప్పకుండ పెడిక్యూర్ ని చేయించుకోవడం ద్వారా పాదాల సొగసును కాపాడుకోవచ్చు.

తేమ: నిద్రపోయే ముందు పాదాలను కడిగి మెత్తటి పొడి వస్త్రంతో చక్కగా తుడిచి ఆ తరువాత ఫుట్ క్రీం ని అప్లై చేయాలి. పాదాలపైనున్న చర్మాన్ని మృదువుగా చేసి పోషణ అందించుటకు ఫుట్ క్రీంస్ ఎంతగానో ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా ఈ పద్దతి పాటిస్తే వారంలో మీకు సరైన ఫలితం కనిపిస్తుంది.

మీ ఫుట్ వేర్ ని మీరు తరచూ మారుస్తూ ఉండాలి.

మీ వృత్తిపరంగా మీరు ఎక్కువ సేపు నిలబడాల్సి వచ్చినప్పుడు మీరు మృదువైన ఫుట్ వేర్ ను ఎంచుకోవాలి.

ఏదైనా ఆరోగ్య సమస్య వలన పాదాల పగుళ్లు ఏర్పడితే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన సలహాలు పాటించండి.

ఇవండీ, పాదాల సొగసును సంరక్షించుకునే మార్గాలు. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. వీటిలో ఏ చిట్కా మీకు పనిచేసిందో మాకు కామెంట్ ద్వారా తప్పక తెలియచేస్తారు కదూ.

English summary

What Causes Cracked Heels?

Poems have been written in the history about the beauty of a woman’s feet. Also, there are amazing paintings depicting female feet. Apart from all these acclaims, there are so many advertisements which boast about beautiful feet. However, having heels in the perfect condition is a time-consuming task. Regular work and busy schedules may put you off from taking break and concentrating on your feet.
Desktop Bottom Promotion