అండర్ ఆర్మ్స్ ని మృదువుగా చేసే అద్భుతమైన రెమెడీస్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

మీ అండర్ ఆర్మ్స్ వద్ద చర్మం కఠినంగా, ఎగుడుదిగుడుగా ఉంటుందా? ఈ విషయం మిమ్మల్ని ఎక్కువగా దిగులుకిగురిచేస్తుందా? అయితే, ఇవాళ్టి ఈ పోస్ట్ ప్రత్యేకించి మీ కోసమే. ఈ రోజు బోల్డ్ స్కై లో అండర్ ఆర్మ్స్ వద్ద చర్మాన్ని మృదువుగా చేసుకునేందుకు సులభమైన నేచురల్ రెమెడీస్ ను తెలియచేస్తున్నాము.

ఈ రెమెడీస్ సహజసిద్ధమైనవి అలాగే సురక్షితమైనవి. అతి ముఖ్యంగా, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలిగినవి. అందువల్ల, మీ చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటు మీ చర్మంపై పేరుకుపోయిన దుమ్మూ ధూళిని తొలగించి చర్మరంధ్రాలను శుభ్రపరిచేందుకు ఈ రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి.

ప్రాచీనకాలం నుంచి ఈ సహజసిద్ధమైన రెమెడీస్ ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ అండర్ ఆర్మ్స్ ని మృదువుగా మార్చుకోవడం కోసం ఈ రెమెడీస్ ని వాడుతున్నారు.

నిజానికి, ఈ హోమ్ రెమెడీస్ ను క్రమం తప్పకుండా పాటించడం వలన చర్మం మృదువుగా మారడంతో పాటు చర్మంపైనున్న నలుపు క్రమంగా తొలగిపోతుంది. అండర్ ఆర్మ్ కి సంబంధించిన సమస్యలన్నిటికీ ఈ రెమెడీస్ చక్కటి పరిష్కారంగా పనికొస్తాయి.

మీరు చేయవలసిందల్లా మీ వంటింటిలోని ఉండే ఈ అద్భుతమైన పదార్థాలను గుర్తించి ఈ రెమెడీస్ ను ప్రయత్నించండి. తద్వారా అద్భుతమైన ఫలితాలను పొందండి. ఈ రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఆల్మండ్ ఆయిల్:

ఆల్మండ్ ఆయిల్:

ఆల్మండ్ ఆయిల్ లో కలిగిన చర్మ సంరక్షణ విలువలు చర్మాన్ని మృదువుగా చేసేందుకు అద్భుతంగా తోడ్పడుతాయి. కొంత ఆయిల్ ను చేతిలోకి తీసుకుని మృదువుగా ఆర్మ్ పిట్స్ పైన అప్లై చేయండి. ఆ తరువాత, కొన్ని గంటల తరువాత గోరువెచ్చటి నీటితో ఆర్మ్ పిట్స్ ను శుభ్రపరుచుకోండి. ప్రతి రోజూ ఈ రెమెడీని పాటిస్తే మీ అండర్ ఆర్మ్స్ వద్ద చర్మం కోమలంగా మరియు మృదువుగా మారుతుంది.

మిల్క్ క్రీం:

మిల్క్ క్రీం:

మిల్క్ క్రీం అనేది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందువలన, ఆర్మ్ పిట్స్ వద్ద కఠినమైన చర్మానికి తగినంత తేమనందించి కోమలంగా తయారుచేయడానికి మిల్క్ క్రీం తనదైన పాత్ర పోషిస్తుంది. కాస్తంత తాజా మిల్క్ క్రీం ను తీసుకుని అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయండి.

ఒక గంట తరువాత తడివస్త్రాన్ని తీసుకుని అండర్ అర్మ్స్ ని శుభ్రపరచండి. ఈ పద్దతిని రోజూ పాటించడం వలన గొప్ప ఫలితాలను పొందవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరినూనె అనేది సహజసిద్ధమైన బ్యూటీ ప్రాడక్ట్ గా మనకి సుపరిచితమే. దీనిలో విటమిన్లతో పాటు న్యూట్రియెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. కొబ్బరినూనెలో నున్న ఈ గుణాలు చర్మంపైనున్న దుమ్మూ ధూళిని తొలగించి చర్మాన్ని కోమలంగా మరియు మృదువుగా తయారుచేస్తాయి.

నిద్రకు ఉపక్రమించే ముందు కాస్తంత కొబ్బరినూనెతో అండర్ ఆర్మ్స్ వద్ద మసాజ్ చేయండి. మరుసటి ఉదయం, గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి. ప్రతి రోజూ, ఈ పద్దతిలో అండర్ ఆర్మ్స్ ని మసాజ్ చేయడంతో కఠినమైన చర్మం కోమలంగా మారుతుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగులో అద్భుతమైన చర్మ సంరక్షణ పోషక విలువలున్నాయి. వీటన్నిటివలన, పెరుగు అనేది చర్మానికి మృదుత్వాన్ని అందించే అద్భుతమైన రెమెడీగా ప్రత్యేక స్థానాన్ని పొందింది.

కాస్తంత తాజా పెరుగుని అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయాలి. ఒక గంట తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచాలి. ఆశించిన ఫలితాలను పొందడం కోసం, ఈ రెమెడీని వారానికి మూడు లేదా నాలుగు సార్లు వాడాలి.

తేనె:

తేనె:

తేనెలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే తేనెను మహాద్భుతమైన రెమెడీగా పేర్కొనవచ్చు. ఈ ప్రాపర్టీస్ వలన చర్మంపై పేరుకుపోయిన దుమ్మూ ధూళి తొలగిపోతాయి. తద్వారా, మృదువైన మరియు కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది.

ప్రభావిత ప్రదేశంపై కాస్తంత తెనెను అప్లై చేయాలి. దాదాపు 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో అండర్ ఆర్మ్స్ ని శుభ్రపరచాలి. వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి.

బొప్పాయి:

బొప్పాయి:

చర్మ సంరక్షణ ఎంజైమ్స్ బొప్పాయిలో సమృద్ధిగా ఉన్నాయి. అందువలన, బొప్పాయి అనేది చర్మ సంరక్షణలో అద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది.

బొప్పాయి గుజ్జును ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలి. వారానికి రెండు సార్లు ఈ పద్దతిని అనుసరిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

శాండల్వుడ్ పౌడర్:

శాండల్వుడ్ పౌడర్:

చర్మంపై దద్దుర్లకి అద్భుతమైన చికిత్సగా శాండల్వుడ్ ను పేర్కొంటారన్న విషయం తెలిసినదే. అయితే, శాండల్వుడ్ లోనున్న చర్మసంరక్షణ గుణాలు చర్మాన్ని మృదువుగా చేయడంలో తమదైన పాత్ర పోషిస్తాయి. అందువలన, అండర్ ఆర్మ్స్ వద్ద నున్న కఠినమైన చర్మాన్ని కోమలంగా చేయడానికి శాండల్వుడ్ అమితంగా తోడ్పడుతుంది.

కాస్తంత శాండల్వుడ్ పౌడర్ ను నీళ్ళల్లో కలిపి పేస్ట్ లా చేసుకుని ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి.

20 నుంచి 25 నిమిషాల తరువాత తడివస్త్రంతో అండర్ ఆర్మ్స్ ని శుభ్రపరచుకోండి. ఆశించిన ఫలితాలను పొందటం కోసం ఈ రెమెడీని వారానికి 3 నుంచి 4 సార్లు ప్రయత్నించాలి.

English summary

Wonderful Remedies To Soften Skin On Your Underarms

Is the skin on your underarm rough and bumpy? Does that make you conscious? And the best solution for this problem is by treating your skin with some amazing home remedies.
Story first published: Wednesday, December 13, 2017, 12:00 [IST]
Subscribe Newsletter