For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో పాదాలను కాపాడుకోవడానికి ఉపయోగపడే, 7 అద్బుతమైన గృహ చిట్కాలు

|

బీచ్ సీజన్ పక్కకు వెళ్లి, వర్షాకాలంతో భర్తీ అవుతున్న సమయం. అనగా మన ఆరోగ్యం, చర్మం, మరియు జుట్టు మొదలైన అనేక సమస్యల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవలసిన సమయం నెలకొన్నదని అర్ధం. అవునా? వీటన్నిటికి జాగ్రత్తలు తీసుకుంటారు సరే, మరి పాదాల సంగతేమిటి? అనేకమంది తరచుగా పాదాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు. అందుకే, కొన్ని మార్కెట్లో లభించే ప్రత్యేకించబడిన క్రీములకు డిమాండ్లు పెరుగుతున్నాయి.

వాస్తవానికి వర్షాకాలంలో, మన పాదాలు ఎక్కువగా మురికిబారిన పడుతుంటాయి. క్రమంగా మట్టి మరియు దుమ్ము కారణంగా అంటువ్యాధులు మరియు అలెర్జీలతో సావాసాలు ఎక్కువగా ఉంటాయి. పాదాలు శరీరంలో అత్యంత కీలకమైన భాగం, కావున వీటిపట్ల మరింత శ్రద్ధ కలిగిఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

7 home remedies to pamper the feet in the rainy season

డాక్టర్ అప్రతిమ్ గోయల్, చర్మవ్యాధి నిపుణులు మరియు లేజర్ సర్జన్ డైరెక్టర్, క్యూటిస్ స్కిన్ స్టూడియో, ముంబై., వారు చెప్పిన వివరాల ప్రకారం "వర్షంలో నడవడం ఎవరికైనా సరదాగానే ఉంటుంది. కానీ మీ శరీరంలో ప్రధానంగా మీ పాదాలు ఎక్కువగా మురికి బారిన పడుతున్నాయని గ్రహించడం తప్పనిసరి. లేనిచో లెప్టోస్పిరోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి అంటువ్యాధుల బారినపడే అవకాశాలు పెరగడానికి దారితీస్తుంది. తరచుగా దుమ్ము, ధూళి, మురికి వంటివాటికి బహిర్గతమైన కాళ్ళను శుభ్రపరుస్తూ, కాలి వేళ్ల మధ్య పొడి టవల్ ఉపయోగించి ఎల్లప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి”

వర్షాకాలంలో పాదాల సంరక్షణకు సూచించదగిన 7 ప్రధాన గృహ నివారణలను ఇక్కడ పొందుపరచబడ్డాయి:

# 1. మీ వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో హెన్నా

# 1. మీ వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో హెన్నా

మీ వేళ్ళ మధ్యలో ఉన్న పగుళ్లలో హెన్నా (మెహెందీ) ఆకుల పేస్ట్ ను దరఖాస్తు చేసుకుని, పూర్తిగా పొడిగా మారేంత వరకు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసి, టవల్తో పొడిగా చేయండి.

# 2. పసుపును ప్రభావిత ప్రాంతంలో

# 2. పసుపును ప్రభావిత ప్రాంతంలో

మనందరికీ యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటివైరల్ లక్షణాల పరంగా పసుపు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలుసు. క్రమంగా, పసుపును కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్లను వదిలించుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతుంది. పైన చెప్పిన విధానం ప్రకారం, పసుపును ప్రభావిత ప్రాంతంలో నీటితో మిశ్రమంగా చేసి వర్తించి పొడిగా మారిన తర్వాత శుభ్రం చేయండి. త్వరలోనే మంచి ఫలితాలను చూడగలరు.

# 3.నిమ్మ రసం మరియు వెనిగర్

# 3.నిమ్మ రసం మరియు వెనిగర్

మీ పాదాల దగ్గర దురదగా ఉన్న ఎడల, కొద్దిగా నిమ్మ రసం మరియు వెనిగర్ కలిపి వర్తించడం మంచిది.

# 4. ఉల్లిపాయ రసం

# 4. ఉల్లిపాయ రసం

మీరు కాలి వేళ్ళ మధ్య కొంత ఉల్లిపాయ రసం తీసుకుని కూడా మసాజ్ చేయవచ్చు. ఈ పద్ధతి, మిమ్ములను దురద మరియు "అథ్లెట్స్ ఫుట్" (టినియా పెడిస్) నుండి ఉపశమనం ఇవ్వడంలో సహాయం చేస్తుంది. ఈ అథ్లెట్స్ ఫుట్ సమస్య కాళ్ళలో ప్రధానంగా వేళ్ళ మద్య భాగంలో జనిస్తుంది. ప్రధానంగా ఎక్కువగా షూస్ ధరించే వాళ్ళకు, చమట, మురికి కారణంగా తలెత్తుతుంది. ఈ సమస్యను తగ్గించడంలో ఉల్లిపాయ ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పబడింది.

# 5. పుదీనా

# 5. పుదీనా

పుదీనా ఒక సహజ సిద్దమైన డియోడరెంట్ వలె ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, మంచి క్రిమినాశక తత్వాలను యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కావున ఈ వర్షాకాలంలో, ఇటువంటి పుదీనా ఆధారిత క్రీములు, ఫేస్ ఫాక్స్ లేదా స్క్రబ్స్ ఉపయోగించవలసినదిగా సిఫార్సు చేస్తున్నాము.

# 6. తులసి

# 6. తులసి

తులసి ఆధారిత ఫుట్ ప్యాక్స్ మీద కూడా దృష్టి సారించండి. ఇవి మీ పాదాలను ఇన్ఫెక్షన్ ఆధారిత సమస్యల బారినుండి కాపాడడంలో అద్భుతంగా పనిచేయగలవు.

# 7.వేప ఆకులు

# 7.వేప ఆకులు

పాదాల దుర్వాసనతో పోరాడటానికి, వేప ఆకులు మరియు ఒక టీస్పూన్ పెప్పర్మింట్ ఆయిల్ వేసి కలిపిన వెచ్చని నీటిలో, మీ పాదాలను 10 నుండి 20 నిమిషాలపాటు అలాగే ఉండనివ్వండి. తర్వాత, మీ పాదాలను శుభ్రంగా పొడిగా తుడిచిన తర్వాత టాల్కం పౌడర్ వేసి విశ్రాంతినివ్వండి. ఈ పద్ధతి క్రమంగా అనుసరించడం ద్వారా చెమట మరియు దుర్వాసన క్రమంగా తగ్గుతుందని చెప్పబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

7 home remedies to pamper the feet in the rainy season

Walking in the rain may be fun, but don’t forget that your feet are a vulnerable and exposed part of the body, and are prone to infections like leptospirosis, fungal infections and so on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more