For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వయసును తక్కువ చేసి చూపేంచేందుకు ఎనిమిది మార్గాలు

|

వయస్సు పెరగడం అనేది ఒక సహజ ప్రక్రియ అని మనందరికీ తెలిసిందే! దానిని మనం నియంత్రించలేము, కానీ నెమ్మదింపచేయగలము. మన దగ్గర ఒక టైం మెషిన్ ఉంది ఉంటే, సమయాన్ని వెనక్కి తీసుకెళ్లి, ఎప్పటికి యవ్వనంతో మిసమిసలాడేలా చేసుకునేవాళ్ళం.

కానీ అది జరిగే పని కాదని మనందరికీ తెలుసు. హుందాగా ముఖంపై ముడుతలు, సన్నని గీతలు మొదలైన వయస్సు పెరగడంతో వచ్చే మార్పులను ఆహ్వానిస్తే, జీవితం అందంగా, ఆనందంగా ఉంటుంది. కానీ వయస్సుతో వచ్చే మార్పులు నెమ్మదిగా వచ్చేటట్టు చేస్తేలేదా కాలాన్ని కాస్తంత మోసం చేస్తే? ఈ ఆలోచన అద్భుతంగా ఉంది కదా!

8 Useful Tips To Look Younger Than Your Age

ఈ రోజు మీకు ఎనిమిది చిట్కాల ద్వారా ఎలా మీ వయస్సు తక్కువగా ఉండేట్లు, కనిపించవచ్చో తెలియజేస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. ఈ చిట్కాలను పాటిస్తే, మీ వయస్సును ఎవరూ గుర్తించలేరు, ఎందుకంటే మీ వయస్సులో కూడా యవ్వనం ఎదుటివారికి కనిపిస్తూ ఉంటుంది. అయితే మరెందుకు ఆలస్యం. ఆ ఎనిమిది చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం, రండి.

1. సరైన చర్మ సంరక్షణ చర్యలు చేపట్టండి

1. సరైన చర్మ సంరక్షణ చర్యలు చేపట్టండి

వయస్సు పెరుగుతున్న కొద్దీ మీ చర్మం తేమను మరియు సాగే గుణం కోల్పోతుంది. దీనివలన చర్మం పై ముడుతలు, గీతలు, మచ్చలుకళ్ళ కింద ఉబ్బటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీ వయస్డు తగ్గినట్లు కనిపించాలంటే, ముందుగా మీ చర్మాన్నికి అవసరమైన తేమను అందివ్వడమే! దీని కొరకు మీరు చేయవలసినదల్లా, నీటిని అధికంగా తాగుతూ, ప్రతిరోజూ సన్ స్క్రీన్ రాసుకోవడమే.

2. తగిన విశ్రాంతి తీసుకోండి:

2. తగిన విశ్రాంతి తీసుకోండి:

సరైన నిద్రతో కొల్లాజన్ ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ తగినంత ఉత్పత్తి అవుతుంది. మెవెరు కనుక సరిగా నిద్రపోకపోతే, కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ఇవి చూడటానికి వికారంగా ఉంటాయి.

కళ్ళ కింద సంచుల్లాగా ఏర్పడకుండా ఉండాలంటే, రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. కాని కొన్నిసార్లు ఎనిమిది గంటల పాటు పడుకోవడం వీలుపడదు. కనుక మీ కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడతాయి. దీనిని దాచిపెట్టడానికి, మా వద్ద ఒక కిటుకు ఉంది.

3. సరైన కన్సీలర్ ను వాడండి:

3. సరైన కన్సీలర్ ను వాడండి:

కన్సీలర్ ను అధికంగా మెత్తుకోవడం వలనఈ ముఖంపై అట్టల లాగా, ఇంకా వయసు పైబడినట్లు కనిపిస్తారు. కొన్నిసార్లు మేనిఛాయ తక్కువగా ఉన్నచోట బాగా కనపడాలనే ఉద్దేశ్యంతో కన్సీలర్ ను ఎక్కువగా పూసుకుంటారు. ఇది చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా మేకప్ ఎక్కువగా చేసుకున్నప్పుడు తప్పితే, కన్సీలర్ ఎక్కువగా రాసుకోకూడదు. లైట్ వెయిట్ గా కనిపించే క్రీమీ కన్సీలర్ వాడితే, మీ ముఖం మీద ముడుతలు, గీతలతో కలిసిపోతుంది.

4. కళ్ళు వాలినట్లు కనపడకుండా ఐ షేడో వాడండి:

4. కళ్ళు వాలినట్లు కనపడకుండా ఐ షేడో వాడండి:

వయస్సు పెరగడం వల్ల చర్మం బిగుతును కోల్పోవడం వలన కళ్ళు కూడా జారినట్టు అవుతాయి. కళ్ళు ఇలా ఉంటే, వయస్సు మీద పడినట్లు కనిపిస్తుంది.చాలామంది ఐ-లిఫ్ట్ శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడరు. మరి సర్జన్ ను సంప్రదించకుండా కళ్ళ అందాన్ని పెంచుకోవడమెట్లా? దానికి సమాధానం మీ డ్రెస్సింగ్ టేబుల్ మీది ఐ షాడో.

ఐషాడో ద్వారా మీ కనులను మీకు నచ్చిన రీతిలో వాలినట్లు కనపడకుండా తీర్చిదిద్దుకోవచ్చు. దీని కొరకు, మీరు ముందుగా, తేలికపాటి రంగు కల క్రీమీ ఐషాడోను కనురెప్ప పై భాగానికి, ఆ రంగులోని కొద్దిపాటి గాఢమైన ఛాయను కనురెప్పలు రాసుకోవాలి.

5. కనుబొమ్మలను మందంగా దిద్దుకోండి:

5. కనుబొమ్మలను మందంగా దిద్దుకోండి:

వయసు పెరగడంతో, కనుబొమ్మలు పలుచబడతాయి. దీని వలన మీరు తప్పక వయసు పైబడ్డ వారిలా కనిపిస్తారు. యవ్వనంగా కనపడటానికి ఒత్తైన కనుబొమ్మలను కలిగి ఉన్నట్లు భ్రమ కలిగించాలి. మీ కనుబొమ్మల రంగుకు నప్పే, ఐ లైనర్ మరియు టాప్ కలర్ ఐ షేడో ఈ విషయంలో మీకు సహకరిస్తాయి. కనుబొమ్మలు పలుచగా ఉన్నచోట, సహజమైన కనుబొమ్మల వెంట్రుకల తీరు ఏర్పడేందుకు బ్రష్ ను పైదిశగా కదుపుతూ పోవాలి. చివరిగా పిగ్మెంటెడ్ ఐబ్రో జెల్ రాసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

6. మీ ముఖానికి మెరుపును జోడించండి:

6. మీ ముఖానికి మెరుపును జోడించండి:

చర్మం మెరవడంతో పాటు మృదువుగా ఉంటే చూడటానికి చిన్నవారిలా కనిపిస్తారు. దీనికై మీరు ల్యూమినైజింగ్ సీరం వాడండి. AHA మరియు హయాల్యురోనిక్ ఆమ్లం కలిగి ఉన్న సీరంను దీనికై ఉపయోగించండి. దీనివలన మీ ముఖం మృదువుగా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ సీరం మీ చర్మం తేమను కోల్పోకుండా చేసి, మెరుపులీనేలా చేస్తుంది.

7. జుట్టుకు నూనె పెట్టుకోండి:

7. జుట్టుకు నూనె పెట్టుకోండి:

చిక్కులతో కూడి, పొడిబారిన జుట్టు మీ వయసును ఎక్కువ చేసి చూపిస్తుంది. జుట్టుకు తరచుగా రంగు వేసుకోవడం వలన కూడా, మెరుపును కోల్పోతుంది. కనుక మీరు చిన్న వయసు వారిలా కనిపించాలంటే, తలరుద్దుకున్న తరువాత నూనె పెట్టుకోండి. ఆర్గాన్ లేదా మొరాకన్ ఆయిల్, వేడి వలన నష్టపోయిన మీ జట్టులోని ప్రోటీన్లను మెరుగు పరచి, జుట్టు ఆరోగ్యవంతంగా మరియు ధృఢంగా కనపడేటట్టు చేస్తుంది. టవల్ తో తుడుచుకుని, జుట్టును ఆరపెట్టుకున్న వెంటనే కొన్ని చుక్కల నూనెను తీసుకుని జుట్టును రుద్దుకుంటే, తేడా మీకే తెలుస్తుంది.

8. ఉత్సాహం నింపుకోండి:

8. ఉత్సాహం నింపుకోండి:

మీ ముఖం మాత్రమే కాక, మీ శరీరం అంతా వయస్సు పెరుగుతున్న కొద్దీ బిగుతు కోల్పోతుంది. కనుక శరీరాన్ని యవ్వనంగా కనపడేటట్టు చేయాలంటే ఉత్సాహంగా ఉంటూ, అందుకు తగిన దుస్తులు ఉదాహరణకు, 98% కాటన్ మరియు 2% లిక్రా ఉండే వస్త్రాలతో తయారు చేసిన జీన్స్ ధరించడం వంటివి చేయాలి. వస్త్రధారణలో కొద్దిపాటి మార్పులు చేస్తే, మీ ముఖంతో పాటు శరీరం కూడా యవ్వనంగా కనిపిస్తుంది.

English summary

8 Useful Tips To Look Younger Than Your Age

Growing old gracefully, the fine lines, wrinkles on your face is a proof that you've lived a fun, beautiful and a non-chaotic life. With age, your skin will tend to lose its moisture and elasticity and will cause fine lines and wrinkles. The best way to slow down the ageing process is by making sure that your skin is hydrated and moisturized all the time.
Story first published: Monday, July 2, 2018, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more