For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెదవులపై తెల్లమచ్చలను తొలగించే అద్భుత రెమెడీస్ ఇవే

|

పెదవులపై కనిపించే వైట్ స్పాట్స్ ని ఫార్డైస్ స్పాట్స్ అనంటారు. ఇవి హానికరం కాకపోయినా మీ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి.

చర్మంలోని సెబమ్ ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు ఈ స్పాట్స్ ఏర్పడతాయి. ఎక్కువగా పేరుకుపోయిన సెబమ్ అనేది బాక్టీరియా వృద్ధికి అలాగే క్రిముల ఎదుగుదలకు అనువుగా మారుతుంది. వీటిద్వారా ఇన్ఫెక్షన్స్ ఏర్పడి తెల్లమచ్చల సమస్య ఏర్పడుతుంది.

అదృష్టవశాత్తూ, ఈ వికారమైన స్పాట్స్ ను మనం సులభంగా హోంరెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. ఈరోజు బోల్డ్ స్కై లో పెదవులపై ఏర్పడే ఈ వైట్ స్పాట్స్ ను తొలగించుకునే సులభ పద్దతుల గురించి తెలుసుకుందాం. అలాగే, అవి మళ్ళీ తిరిగి రాకుండా జాగ్రత్తపడదాం.

ఈ ట్రైడ్ అండ్ టెస్టెడ్ రెమెడీస్ లో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ కలిగించే బాక్టీరియాతో పోరాడి పెదవులపై వైట్ స్పాట్స్ ను తగ్గిస్తాయి.

ఈ రెమెడీస్ గురించి ఈ ఆర్టికల్ ద్వారా వివరంగా తెలుసుకుని వాటిని పాటించి పెదవులపైన వైట్ స్పాట్స్ ను తగ్గించుకోండి.

1. వెల్లుల్లి:

1. వెల్లుల్లి:

ఎలా వాడాలి:

ఒక వెల్లుల్లి రెబ్బను క్రష్ చేసి అందులో కాస్తంత ఆల్మండ్ ఆయిల్ ని కలపండి.

ఇలా తయారైన మిశ్రమాన్ని పెదవులపై అద్దండి.

ఈ మిశ్రమాన్ని పెదవులపై కొద్ది నిమిషాలపాటు ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో పెదవులను శుభ్రపరచుకోండి.

ఈ పద్దతిని వారానికి ఒకసారి ప్రయత్నించి గొప్పఫలితాలను పొందండి.

ఇది ఎలా పనిచేస్తుంది:

వెల్లుల్లి గొప్ప యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తద్వారా, ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బాక్టీరియాతో పోరాడి స్పాట్స్ ని తొలగిస్తుంది.

2. ఆపిల్ సిడర్ వినేగార్:

2. ఆపిల్ సిడర్ వినేగార్:

ఎలా వాడాలి:

ఒక కాటన్ బాల్ ని డైల్యూట్ చేయబడిన ఆపిల్ సిడర్ వినేగార్ లో ముంచాలి.

ఆ కాటన్ బాల్ తో పెదవులపైన స్పాట్స్ పై అద్దాలి. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని పెదవులపై కనీసం అయిదు నుంచి పది నిమిషాల పాటు ఉండనివ్వాలి.

ఆ తరువాత పెదవులను గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి.

ఈ రెమెడీని వారానికి రెండు సార్లు పాటించడం ద్వారా వేగవంతంగా ఫలితాలను పొందవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది:

ఆపిల్ సిడర్ వినేగార్ లోని ఎసిడిక్ నేచర్ అనేది ఇన్ఫెక్షన్ ను రూపుమాపేందుకు తోడ్పడుతుంది. తద్వారా, వైట్ స్పాట్స్ కనుమరుగవుతాయి.

3. మజ్జిగ

3. మజ్జిగ

ఎలా వాడాలి:

ఒక కాటన్ బాల్ ని మజ్జిగలో ముంచి దాంతో ప్రభావిత ప్రాంతంపై రుద్దాలి.

పది నుంచి పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో పెదవులను శుభ్రపరచుకోవాలి.

ఈ రెమెడీని వారానికి నాలుగైదు సార్లు పాటించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది:

మజ్జిగలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు పుష్కలంగా కలవు. ఇవి బాక్టీరియాతో అలాగే ఇన్ఫెక్షన్ కారక క్రిములతో పోరాడి వికారమైన తెల్లమచ్చలను తొలగిస్తాయి.

4. జొజోబా ఎసెన్షియల్ ఆయిల్ :

4. జొజోబా ఎసెన్షియల్ ఆయిల్ :

ఎలా వాడాలి:

రెండు లేదా మూడు చుక్కల జొజోబా ఎసెన్షియల్ ఆయిల్ ను విటమిన్ ఈ ఆయిల్ తో కలపాలి.

దీనిని ప్రభావిత ప్రాంతంపై రుద్దాలి.

ఆ తరువాత పది నిమిషాలపాటు ప్రభావితప్రాంతంపైనున్న ఈ మిశ్రమాన్ని తొలగించవద్దు. పదినిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో పెదవులను శుభ్రపరచుకోవాలి.

ఈ రెమెడీని వారానికి ఒకసారి పాటించడం ద్వారా వికారమైన స్పాట్స్ నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది.

ఇది ఎలా పనిచేస్తుంది:

జొజోబా ఎసెన్షియల్ ఆయిల్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ కు పవర్ హౌస్ గా ఉండటం వలన స్పాట్స్ ని తగ్గించడంతో పాటు అవి తిరిగి రాకుండా అరికడుతుంది.

5. కొబ్బరి నూనె:

5. కొబ్బరి నూనె:

ఎలా వాడాలి:

నిద్రపోయే ముందు కాస్తంత కొబ్బరి నూనెను పెదవులపై రాయండి.

రాత్రంతా అలాగే ఉంచి మరునాడు ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి.

ఈ రెమెడీని రోజూ పాటిస్తే మంచి ఫలితం పొందవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది:

కోకోనట్ ఆయిల్ లో అనేక ఔషధ గుణాలు కలవు. ఇది సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తద్వారా బాక్టీరియాను నశింపచేస్తుంది. ఆ విధంగా వైట్ స్పాట్స్ తొలగిపోతాయి.

6. ఆలివ్ ఆయిల్:

6. ఆలివ్ ఆయిల్:

ఎలా వాడాలి:

కాస్తంత వర్జిన్ ఆలివ్ ఆయిల్ ను తీసుకుని పెదాలపై అప్లై చేసుకోండి.

గంటపాటు పెదవులపై దీనిని ఉండనిచ్చి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి.

ఈ రెమెడీని రెండు లేదా మూడు సార్లు పాటించడం ద్వారా కేవలం రెండు వారాలలోనే వైట్ స్పాట్స్ తొలగిపోతాయి.

ఇది ఎలా పనిచేస్తుంది:

మెడిసినల్ ప్రాపర్టీస్ సమృద్ధిగా లభించడం వలన ఆలివ్ ఆయిల్ అనేది వైట్ స్పాట్స్ ను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

7. ఆర్గాన్ ఆయిల్:

7. ఆర్గాన్ ఆయిల్:

ఎలా వాడాలి:

మూడు లేదా నాలుగు చుక్కల ఆర్గాన్ ఆయిల్ ను ఒక టీస్పూన్ అలోవెరా జెల్ తో కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోండి.

దీనిని ప్రభావిత ప్రాంతంపై రుద్దండి.

పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో పెదాలను శుభ్రపరుచుకోండి.

ఈ రెమెడీని వారానికి ఒకసారి పాటించడం ద్వారా గొప్ప ఫలితాలను పొందవచ్చు.

ఇది ఎలా పనిచేస్తుంది:

ఆర్గాన్ ఆయిల్ లో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి బాక్టీరియాతో పోరాడి పెదాలపై వైట్ స్పాట్స్ ను తొలగిస్తాయి.

English summary

Effective Remedies To Get Rid Of White Spots On Lips

White spots on lips are very evident. By using certain home remedies such as garlic, apple cider vinegar, buttermilk, etc., it can help reduce the spots on the lips and make your lips look soft and smooth.
Story first published:Wednesday, February 7, 2018, 11:26 [IST]
Desktop Bottom Promotion