సెలెబ్రిటీల్లా మీ కాళ్ళు కూడా మెరవాలంటే ఈ హ్యక్స్ ను మీరు ప్రయత్నించి తీరాలి

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

టీవీలో సెలెబ్రిటీస్ ని చూస్తే మీరొక విషయం గమనించే ఉంటారు. వారు షార్ట్స్ లేదా స్కర్ట్స్ వేసుకున్నప్పుడు వారి కాళ్ళు అందంగా మెరిసిపోతాయి. అలాగే, మీ కాళ్ళు కూడా మెరవాలని మీరనుకుంటే ఈ ఆర్టికల్ మీ కోసమే. ఈ అద్భుతమైన హ్యక్స్ ను పాటించడం ద్వారా సెలెబ్రిటీస్ వంటి మెరిసే కాళ్ళను పొందవచ్చు.

కాళ్ళు అందంగా కనిపించడానికి ఎంతో ప్రక్రియ జరుగుతుంది. నిజానికి, కాళ్ళను అందంగా ఉంచుకోవడం ద్వారా సెలెబ్రిటీస్ ప్రజలకి ఒక ఉదాహరణగా నిలుస్తారు. అందుకే, సెలెబ్రిటీస్ ను ట్రెండ్ సెట్టర్స్ అనంటారు. అయితే, మీరు కూడా సెలెబ్రిటీస్ లాగే మెరిసే కాళ్లతో సొగసులు దిద్దుకోవచ్చు. ఇందుకు, మీరు కాస్తంత శ్రమపడటం తప్పనిసరి.

ఇందులో ఎక్కువ భాగం స్కిన్ కేర్ రొటీన్ పైనే ఆధారపడి ఉంది. సెలెబ్రిటీస్ ఆన్ స్క్రీన్ పై వచ్చినందుకు కచ్చితంగా శరీరం మొత్తానికి మేకప్ వేసుకుంటారు. అయితే, మీకు మేమది సూచించడం లేదు. శరీరం మొత్తానికి మేకప్ వేయడం కాస్తంత శ్రమతో కూడిన పని. అయితే, కొన్ని సులభమైన హ్యక్స్ తో మీరు మీ కాళ్ళను సెలెబ్రిటీల వంటి మెరిసే కాళ్ళలా తయారుచేసుకోవచ్చు.

Hacks To Make Your Legs Shine Like A Celebrity

ఇవన్నీ ఎంతో సులభమైన హ్యక్స్. వీటిని మీ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోండి. నిజానికి, ఇలా వీటిని పాటిస్తే, ఈ చిట్కాలు మీరు అలవాటు పడిపోతారు.

సెలెబ్రిటీస్ వంటి మెరిసే కాళ్ళను పొందడం కోసం ఈ చిట్కాలను పాటించండి. ఈ చిట్కాలను పరిశీలించండి మరి.

1. ఎక్స్ఫోలియెట్ :

1. ఎక్స్ఫోలియెట్ :

స్క్రబ్బింగ్ కేవలం ముఖానికి పరిమితం కాకూడదు. శరీరం మొత్తానికి స్క్రబ్బింగ్ అవసరమే. మీ చర్మాన్ని పాలిష్ చేసి చర్మంపై పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించేందుకు స్క్రబింగ్ ఉపయోగపడుతుంది. అలాగే, ఇంగ్రోన్ హెయిర్ ను అరికట్టేందుకు కూడా స్క్రబ్బింగ్ తోడ్పడుతుంది. మృదువైన, మెరిసే కాళ్ళ కోసం స్క్రబ్బింగ్ తప్పనిసరి.

2. డ్రై బ్రష్:

2. డ్రై బ్రష్:

డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించేందుకు డ్రై బ్రష్ టెక్నీక్ ను కూడా పాటించాలి. సెల్లులైట్ సమస్యను కూడా ఈ టెక్నీక్ అరికడుతుంది. మెరిసే కాళ్ళను పొందాలనుకుంటే విజబుల్ సెల్యులైట్ మీకు అవాంతరంగా కనిపిస్తుంది.

 3. ఇన్ - షవర్ ఆయిల్:

3. ఇన్ - షవర్ ఆయిల్:

షవర్ చేసే ముందు శరీరానికి ఆయిల్ ని పట్టించండి. తద్వారా, విపరీతమైన పొడిబారిన సమస్యను అరికట్టవచ్చు. అలాగే, మెరిసే కాళ్ళను పొందేందుకు ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది.

4. బాడీ బటర్:

4. బాడీ బటర్:

చర్మాన్ని తరచూ మాయిశ్చరైజ్ చేయడం ద్వారా మెరిసే కాళ్ళను పొందవచ్చనుకుంటే పొరపాటే. అదనంగా, మీరు బాడీ బటర్ ను ఎంచుకోవాలి. బాడీ బటర్స్ అనేవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరుపుని రోజంతా ఉండేలా చేస్తాయి. ఆ విధంగా చర్మాన్ని లోలోపల నుంచి హైడ్రేట్ చేసి మీ కాళ్లకు మెరుపుని అందిస్తాయి.

5. గ్లిజరిన్ :

5. గ్లిజరిన్ :

మీ చర్మం విపరీతంగా పొడిబారినట్లైతే, గ్లిజరిన్ పై మీరు ఆధారపడాలి. సున్నితమైన చర్మంపై కూడా ఈ టెక్నీక్ అద్భుతంగా పనిచేసింది. తద్వారా, పొడిబారిన చర్మం వలన కలిగే ర్యాషెస్ ను మీరు అరికట్టవచ్చు. సెలెబ్రిటీల వంటి మెరిసే కాళ్ళను సొంతం చేసుకోవడానికి ఈ చిట్కాను పాటించడం తప్పనిసరి.

6. షిమ్మర్ లోషన్:

6. షిమ్మర్ లోషన్:

చివరగా కాస్తంత మేకప్ మీకు హానీ చేయదు. కాబట్టి, తగినంత షిమ్మర్ లోషన్ ను కాళ్లపై అప్లై చేయండి. కాంతిపడే ప్రదేశాలపై ఫోకస్ చేయండి. ఈ పద్దతులను పాటించి సెలెబ్రిటీల వంటి అందమైన కాళ్ళను సొంతం చేసుకోండి.

English summary

Hacks To Make Your Legs Shine Like A Celebrity

Hacks To Make Your Legs Shine Like A Celebrity,Here's how you can get shiny legs like celebrity's
Story first published: Sunday, February 4, 2018, 12:00 [IST]
Subscribe Newsletter