ఆలియాని యువతుల ఫ్యాషన్ ఐకాన్ గా నిరూపించే పది లుక్స్

Subscribe to Boldsky

హిందీ చలన చిత్ర పరిశ్రమలో చాలా కొద్దిమంది నటీమణులు మాత్రమే తమ అందం మరియు అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగున్నారు. అటువంటి వారిలో ఆలియా భట్ అగ్రస్థానంలో ఉంది. ఆమె ఇరవై ఐదవ జన్మదిన సందర్భంగా ఆమె బెస్ట్ లుక్స్ కొన్ని మీకోసం. ఈ "హైవే" నటి తన అద్భుతమైన నటన కౌశలంతో, అలరించే ఫ్యాషన్ సెన్స్ తో అనతి కాలంలోనే స్టార్ డంను సొంతం చేసుకుంది.

ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న ఆమెను, సోషల్ మీడియాలో అనుసరించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇన్స్టాగ్రామ్ లో ఇరవై మిలియన్ పైచిలుకు మరియు ట్విట్టర్ లో 16 మిలియన్ పై చిలుకు అభిమానులు ఆమెను అనుసరిస్తున్నారు. ఆ అభిమానులందరిని తన ఆకర్షణతో ఎలా కట్టిపడేయాలో ఆమెకు బాగా తెలుసు.

HBD! Alias 10 Best Looks

ఆమె మొదటి సినిమాలోనే చాలాకితనం కలిగిన అందమైన టీనేజర్ పాత్రలో ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించింది. ఆ సినిమాలో ఆమె ప్రదర్శించిన ఫ్యాషన్ సెన్స్ కు యువత దాసోహం అన్నారు. ఆమె ఏ దుస్తులు ధరించినా, కొన్ని లక్షల మంది టీనేజ్ ఆమ్మాయిలు అవి తమ వార్డ్ రోబ్ లో తప్పక ఉండాల్సిందే అనుకున్నారు.

ఆలియా భట్ ఏనాడు అతిగా అలంకరణలకు పోలేదు. ఎందుకంటే తనకు తన దుస్తులతో మేకప్ మరియు ఆక్సెసరీలను ఎలా సమన్వయపరచుకోవాలో , ఏ సందర్భంలో ఎలా తయారవ్వాలో ఆమెకు బాగా తెలుసు.

అలాంటి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆమె ఆహార్యం తీరుతెన్నులు కొన్ని ఇక్కడ ఈ తరానికి ప్రేరణనివ్వటం కోసం ప్రస్తావిస్తున్నాం.

1. హాలీవుడ్ లుక్:

1. హాలీవుడ్ లుక్:

ఇంటర్నెట్ లో ఇటీవల ఈ లుక్ యువతకు ఊపిరి సలపనివ్వట్లేదు. గోధుమ రంగు కుచ్చుళ్లు తేలుతున్న అలల మాదిరిగా ఉంటే దానిపై ఆమె వేసుకున్న పెద్ద కాలర్ ఉన్న ఓవర్ కోట్ ఆమెను హాలీవుడ్ సుందరిలా ఆవిష్కరించింది.

2. బటర్ ఫ్లై లుక్:

2. బటర్ ఫ్లై లుక్:

ఇది ఆలియా యొక్క పాత చిత్రమే అయినా టీనజర్లకు ప్రేరణ ఇవ్వగల సత్తా ఉంది.ఇందులో వస్త్రధారణ క్యాజువల్ గా ఉన్నప్పటికీ ఎంతో స్టయిలిష్ గా ఉంది. శిరోజాలంకరణ కూడా స్టయిలిష్ గా ఉంది.

3. ఫార్మల్ లుక్:

3. ఫార్మల్ లుక్:

ఆఫీసులకు వెళ్ళే యువతులకు ఈ లుక్ చాలా బాగుంటుంది. మీటింగులు, కార్పొరేట్ ఈవెంట్లు మొదలైన వాటికి ఎలాంటి వస్త్రధారణ నప్పుతుందో ఆలియా దగ్గర నేర్చుకుంటే సరి !

4. కాంబో లుక్:

4. కాంబో లుక్:

ఫార్మల్ మరియు క్యాజువల్ ల మేళన ఈ లుక్. ఇందులో ఒక క్యాజువల్ డెనిమ్ కు జతగా ఫార్మల్ ష్రగ్ వేసుకుని, జుట్టును పోనీ టైల్ గా కట్టి , కాళ్లకు పోయింటెడ్ బెల్లరీనాస్ వేసుకుంది. చూపులకే మతి పోయేట్టు ఉంది.

5. ఎలిగెంట్ లుక్:

5. ఎలిగెంట్ లుక్:

ఈ లుక్ చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది. ఆమె ధరించిన గాలికి తేలియాడే ఎర్రని కుచ్చుల గౌన్, దానికి నప్పే విధంగా పెదవులపై పూసుకున్న ముదురు ఎరుపురంగు లిప్ స్టిక్, పైకి నున్నగా దువ్వి పెట్టిన ముడి ఒకదానికి ఒకటి అద్భుతంగా కుదిరాయి. ఈ లుక్

శృంగారానికి, పొందికతనానికి పరిపూర్ణ సమ్మేళనం అని చెప్పొచ్చు.

6. ట్రెడిషనల్ లుక్:

6. ట్రెడిషనల్ లుక్:

లాక్మే ఫ్యాషన్ వీక్లో మనీష్ మల్హోత్రాచే డిజైన్ చేయబడిన నెట్టెడ్ లెహెంగా ధరించిన ఆలియాని ఎవరు మాత్రం మర్చిపోగలరు! కాస్త తక్కువగా మేకప్ వేసుకున్నా, చూపరులను ఆ లుక్ తో కట్టి పడేసింది. ఆలియా రాంప్ పై హొయలుపోతుంటే దేశమంతా కళ్ళప్పగించి చూసింది. ర్యాంప్ పై నుండి సరాసరి ప్రేక్షకుల గుండెల్లోకి అడుగుపెట్టింది.

7. కూల్ చిక్ లుక్:

7. కూల్ చిక్ లుక్:

ఆలియా భట్ ప్రయాణ సమయంలో ఎయిర్ పోర్టుకు వేసుకునే దుస్తులు క్యాజువల్ ఫ్యాషన్ కు తలమానికంగా చెప్పొచ్చు. ఎటువంటి క్యాజువల్ దుస్తులతో అయినా తనకు తానే మేటి అన్నట్లు ఉంటుంది. స్టయిల్ మరియు ఆత్మవిశ్వాసంలో ఆమెపై నెగ్గడం ఎవరికైనా అసాధ్యం. .

8. డ్రీమీ లుక్:

8. డ్రీమీ లుక్:

మెరుపుల గౌన్ లో కాటుక పెట్టకున్నా ఆకట్టుకునే సోగ కళ్ళు, కాంతులీనే మేనిఛాయతో దివి నుండి భువికేగిన అప్సరసను తలపించేలా ఉంది.

9. సెక్సీ లుక్:

9. సెక్సీ లుక్:

ఇది ఇంతకు మునుపు లుక్ కు పూర్తిగా భిన్నమైనది. ఈ లుక్ లో బాంబ్ షెల్ మాదిరిగా ఉంది

వివిధ రంగులతో యువత మతిపోగొట్టడమెలా? అని ఆలియాని అడిగి తెలుసుకోవలసిందే!

10. గో-టూ లుక్:

10. గో-టూ లుక్:

ఇది సరైన రంగుల మేళనకు మరియు మేకప్ కు పరిపూర్ణమైన ఉదాహరణ. క్యాజువల్ గా బయటకు,సినిమాలకు ,షికార్లకు లేదా పార్టీకి వెళ్ళాలనుకుంతున్నారా? అయితే ఈ లుక్ ను రెండవ ఆలోచన లేకుండా అనుసరించండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    HBD! Alia's 10 Best Looks

    HBD! Alia's 10 Best Looks,There are very few actresses in the Hindi film industry who can pull both cute and hot with perfection, and Alia Bhatt tops the list. On her 25th birthday, let's check out some of her best looks.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more