కాళ్ళ మీద వున్న చర్మాన్ని స్మూత్ గా మార్చడం ఎలా?

Written By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

అందంగా పొడవాటి సొగసైన కాళ్ళ చర్మాన్ని ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు? కదా! కానీ కొన్ని సార్లు కాళ్లమీద పెరిగిన వెంట్రుకలు, దదుర్లు మరియు రాషెస్ వలన మీ చర్మం సాఫ్ట్ గా లేకపోగా మీకు నిరాశని కలిగించవచ్చు. కానీ మీరు ఇప్పుడు దానిగురించి దిగులు చెందాల్చిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్రింద ఉన్న కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా మీ కాళ్ల చర్మాన్ని సున్నితంగా సాఫ్ట్ గా తయారుచేసుకోవచ్చు.

మనలో చాలా మంది శరీరం మీద వున్న హెయిర్ ని తొలగించడం వల్ల మెరిసే కాళ్ళ చర్మాన్ని పొందగలమని అపోహ పడుతుంటారు. కానీ కొన్నిసార్లు, చర్మం మీద హెయిర్ ని తొలగించిన తరవాత కూడా కఠినమైన చర్మాన్ని చూస్తుంటాం.

కాబట్టి, ఈ చర్మ సమస్య కి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అదెలా అంటే మేము చెప్పే కొన్ని సలహాలని పాటించడం ద్వారా మీరు కోరుకున్న అందమైన కాళ్ళను మీ సొంతం చేసుకోవచ్చు.

అప్పుడు మీకు నచ్చిన పొట్టి దుస్తులను ధరించి హ్యాపీ గా ఉండవచ్చు. ఏమంటారు మరి అవేంటో తెలుసుకుందామా ఇప్పుడు..

1. ఎక్సఫోలియాట్ :

1. ఎక్సఫోలియాట్ :

ఎలాగైతే మీరు మీ ముఖం మీద వున్న మృతకణాలని తొలగించడం అలాగే మీ శరీరం మీద వున్న చర్మం మీద వున్న మృతకణాలని తొలగించడం అంతే అవసరం. కాబట్టి ప్రతివారం మీ చర్మాన్ని స్కర్బ్ చేయడం ముఖ్యం. ఇంకా మీరు షేవ్ లేదా వాక్స్ చేయడానికి ముందే స్కర్బ్ చేయడం మంచిది ఇలా చేయడం వలన మీరు లోపల పెరుగుతున్న జుట్టును కూడా నివారించవచ్చు.

2. షేవింగ్:

2. షేవింగ్:

షేవింగ్ చేసే సమయంలో, బేబీ ఆయిల్ ని షేవింగ్ క్రీంగా ఉపయోగించుకోండి, ఇది నిజంగా మీకు సున్నితమైన చర్మంను ఇస్తుంది. ఆయిల్ రేజర్ మీ చర్మం మధ్య ఒక కవచాన్ని సృష్టిస్తుంది మరియు చర్మాన్ని రక్షిస్తుంది, బేబీ ఆయిల్ లో వుండే విటమిన్ చర్మాన్ని పోషిస్తుంది.

3. ఇన్-షవర్ ఆయిల్స్ ఉపయోగించండి:

3. ఇన్-షవర్ ఆయిల్స్ ఉపయోగించండి:

మీరు షవర్ తీసుకోవడానికి ముందు, ఏదైనా ఒక నూనె ని శరీరానికి ఉపయోగించండి. ఇలా చమురుతో మీ చర్మం మీద మసాజ్ చేయడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది మరియు చర్మం కణాలు చాలా త్వరగా పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది అన్ని చర్మ రకాలకు మంచిది.

4. తేమ:

4. తేమ:

ఒకసారి మీ షవర్ పూర్తయిన తర్వాత, మీ చర్మం మీద తేమగా వున్నప్పుడే మాయిశ్చరైజర్ను ఉపయోగించండి. ఇది మీ చర్మం పొడిబారిపోయి పగిలిపోకుండా మరియు కఠినంగా మారకుండా చేస్తుంది. కాళ్ళ కి మీద మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ను ఉపయోగించడం వలన ఇది మీ కాళ్ళ చర్మాన్ని రోజంతా సున్నితంగా సాఫ్ట్ గా ఉంచుతుంది.

5. ఇంగ్రౌన్ హెయిర్ ని తీయకండి:

5. ఇంగ్రౌన్ హెయిర్ ని తీయకండి:

మీ కాళ్ళ మీద వున్న పెరుగుతున్న హెయిర్ ని తొలగించడం వంటివి చేయడం వలన మచ్చలు ఏర్పడే ప్రమాదముంది. కాబట్టి దీనిని నివారించండి.మీరు ఒకవేళ ఇంగ్రౌన్ హెయిర్ ని కలిగి ఉంటే, మీ చర్మాన్ని ఎక్సఫోలియాట్ చేసి, తరువాత జుట్టుని తొలగించడానికి బదులుగా ఉపశమనం కోసం అలో వేరా జెల్ ని ఉపయోగించండి.

English summary

How To Make Skin On Legs Smoother

Here is how you can make the skin on your legs smoother.
Subscribe Newsletter