Latest Updates
-
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్!
పాదాలపై ఉండే ట్యాన్ ను తొలగించుకోవడమెలా?
పాదాలపై ఉండే ట్యాన్ ను తొలగించుకోవడమెలా?
మన పాదాలు మన వ్యక్తిత్వాన్ని చాలా తెలియచేస్తాయి. కాబట్టి, ఎవరి పాదాలనైనా చూసి వ్యక్తిత్వాన్ని నిర్థారించాలనుకుంటున్నారా? అయితే, ముందుగా మీ పాదాల గురించి శ్రద్ధ తీసుకోండి. పాదాలపై ట్యానింగ్ ను తొలగించుకోండి. పాదాలపై ట్యానింగ్ సమస్య పాదాల అందాన్ని దెబ్బతీస్తుంది.
పాదాల సంరక్షణకి సమయాన్ని కేటాయించే వారు మీలో ఎంతమంది ఉన్నారు? మనలో చాలా మంది పాదాలపై ఉండే చర్మం గురించి దిగులు చెందుతూ ఉంటాము. అయినా, పాదాల సంరక్షణని ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. చేతులపై ఉండే చర్మంలాగానే పాదాలపై ఉండే చర్మాన్ని కూడా సంరక్షించుకోవాలి. లేదంటే, డార్క్ గా మారుతుంది. ట్యానింగ్ కి గురవుతుంది. సరైన సంరక్షణ ద్వారా పాదాల సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
ఫీట్ ట్యానింగ్ కి ముఖ్య కారణం అనేది తీవ్రంగా ఎండకు గురవడం, ముఖ్యంగా ఎండా కాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది.

కెమికల్స్ తో నిండిన కాస్మెటిక్స్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి కూడా పాదాల ట్యానింగ్ కి దారితీస్తాయి. హైజీన్ గా ఉండకపోవడం, వాతావరణ కాలుష్యము వంటివి కూడా పాదాల సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి.
డార్క్ ట్యాన్ లైన్స్ ఫార్మ్ అవుతాయి. వీటికి తోడు ఆయా ప్రదేశాల్లో దురద లేదా మంట కలుగుతుంది. సన్ బర్న్స్ కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. అందువలన, చర్మ సంరక్షణ అనేది అత్యంత ముఖ్యమైనది. అప్పుడే, మీ చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుంది. లేదంటే, చర్మం నిస్తేజంగా, జీవం లేకుండా మారుతుంది. చర్మ సంరక్షణకై హోమ్ రెమెడీస్ కి మించినవి ఏముంటాయి చెప్పండి?
ఇక్కడ కొన్ని అద్భుతమైన హోమ్ రెమెడీస్ ను పొందుబరిచాము. ఇవి పాదాలపై ఉండే ట్యాన్ ను సహజంగా తొలగిస్తాయి. ఇంటి వద్దే ఈ రెమెడీస్ ను పాటించవచ్చు.

దోశకాయ:
కావలసిన పదార్థాలు:
అర దోశకాయ
ఒక స్పూన్ చక్కెర
ఎలా చేయాలి:
1. దోశకాయను చిక్కటి పల్ప్ గా మారే వరకు బ్లెండ్ చేసుకోండి.
2. దోశకాయ పల్ప్ లో ఒక స్పూన్ చక్కెర ను జోడించండి.
3. ఈ మాస్క్ ను పాదాలపై అప్లై చేసి పది నిమిషాల వరకు ఉంచండి.
4. దీన్ని చల్లటి నీళ్లతో శుభ్రపరచి తడిని తుడవండి.
ఈ మాస్క్ ని ఒకసారి తయారుచేసుకుని రిఫ్రిజిరేటర్ లో భద్రపరచుకుని కొన్ని సార్లు వాడవచ్చు.

బేకింగ్ సోడా:
కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా
నీళ్లు
ఎలా చేయాలి:
1. ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని అలాగే నీళ్ళని ఒక పాత్రలోకి తీసుకోండి.
2. ఈ మిశ్రమాన్ని కాళ్లపై స్క్రబ్ చేయండి. సర్క్యూలర్ మోషన్ లో మసాజ్ చేయండి.
3. నార్మల్ వాటర్ తో రిన్స్ చేయండి.

తేనె మరియు పైనాపిల్:
కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల పైనాపిల్ గుజ్జు
1 టేబుల్ స్పూన్ తేనె
ఎలా చేయాలి:
1. తేనెను అలాగే పైనాపిల్ ను బాగా కలపండి.
2. ఈ ప్యాక్ ను పాదాలపై అప్లై చేయండి. పది నుంచి పదినిమిషాల వరకు ఈ ప్యాక్ ను పాదాలపై ఉండనివ్వండి.
3. వాటర్ తో సాధారణ పద్దతిలో రిన్స్ చేయండి.
ఈ ప్రాసెస్ ని రోజు విడిచి రోజు పాటించడం ద్వారా వేగవంతమైన అలాగే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

నిమ్మ మరియు తేనె:
కావలసిన పదార్థాలు:
1 టేబుల్ స్పూన్ శనగపిండి
1 స్పూన్ తేనె
2 స్పూన్ల నిమ్మ
చిటికెడు పసుపు
ఎలా చేయాలి:
1. పదార్థాలన్నిటినీ ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలపై అప్లై చేసుకోండి.
2. ఇరవై నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో పాదాలను శుభ్రపరుచుకోండి.
ఈ పద్దతిని వారానికి రెండు సార్లు పాటిస్తే వేగవంతమైన ఆలాగే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు.

పాలు మరియు శాండల్ వుడ్ పౌడర్
కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల శాండల్ పౌడర్
4 టేబుల్ స్పూన్స్ పాలు (పచ్చివి)
ఎలా చేయాలి:
1. రెండు టేబుల్ స్పూన్ల శాండల్ వుడ్ పౌడర్ లో నాలుగు టేబుల్ స్పూన���ల పచ్చి పాలను జోడించండి.
2. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకోండి. దీనిని ట్యాన్డ్ పాదాలపై అప్లై చేయండి.
3. దీనిని చర్మంపై 15 నుంచి 20 నిమిషాల పాటు అప్ వార్డ్ మోషన్ లో మెల్లగా మసాజ్ చేయండి. చల్లటి నీళ్లతో ఈ ప్యాక్ ను తొలగించండి.
వారానికి ఒకసారి ఈ పద్దతిని పాటించండి.

మజ్జిగ:
కావలసిన పదార్థాలు:
ఒక టేబుల్ స్పూన్ మజ్జిగ
చిటికెడు పసుపు
ఎలా చేయాలి:
1. ఒక టేబుల్ స్పూన్ మజ్జిగలో చిటికెడు పసుపును జోడించి బాగా కలపండి.
2. ఈ లోషన్ ను మీ పాదాలపై అప్లై చేయండి.
3. అరగంట పాటు ఈ ప్యాక్ ను పాదాలపై అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత సాధారణ నీటితో సున్నితంగా మసాజ్ చేస్తూ ఈ ప్యాక్ ను తొలగించండి.
ఈ రెమెడీను ప్రతి రోజూ రెండు వారాలపాటు పాటిస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయి.

ఆలుగడ్డ రసం
కావలసిన పదార్థాలు:
1 ఆలుగడ్డ
ఎలా చేయాలి:
1. అలుగడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
2. అలుగడ్డను తురిమి అందులోంచి రసాన్ని సేకరించాలి.
3. దీన్ని ఒక కాటన్ ప్యాడ్ సహాయంతో పాదాలపై అప్లై చేయాలి.
4. పదిహేను నుంచి ఇరవై నిమిషాలపాటు దీనిని పాదాలపై అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత నార్మల్ వాటర్ తో వాష్ చేయాలి.

బొప్పాయి మరియు నిమ్మరసం
కావలసిన పదార్థాలు
ఒకటి లేదా రెండు పీస్ ల బొప్పాయి
2 లేదా మూడు చుక్కల నిమ్మరసం
ఎలా చేయాలి:
1. ఒకటి లేదా రెండు బొప్పాయి ముక్కలను తీసుకుని వాటిని బ్లెండర్ లో వేసి చిక్కటి గుజ్జుగా తయారుచేసుకోవాలి.
2. ఇప్పుడు అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి.
3. ఈ చిక్కటి పేస్ట్ ను పాదాలపై అప్లై చేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచాలి.
చివరగా చల్లటి నీటితో ఈ ప్యాక్ ను తొలగించి పాదాల తడిని తుడుచుకోవాలి. ఈ ప్యాక్ అనేది డార్క్ ప్యాచెస్ ను తొలగించేందుకు తోడ్పడుతుంది.
ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుంది.

పెరుగు:
కావలసిన పదార్థాలు:
ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు
2 టీస్పూన్ల నిమ్మరసం
ఎలా చేయాలి:
1. ఈ రెండిటినీ బాగా కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాదాలపై అప్లై చేసుకోవాలి.
2. ఇరవై నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి ఆ తరువాత నీళ్లతో రిన్స్ చేయాలి.
ఈ రెమెడీను ప్రతి రోజూ పాటించడం వలన వేగవంతమైన మరియు మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు.

వాటర్ మెలన్ మరియు తేనె:
కావాల్సిన పదార్థాలు:
రెండు టేబుల్ స్పూన్ల వాటర్ మెలన్ జ్యూస్
రెండు టేబుల్ స్పూన్ల తేనె
ఎలా చేయాలి:
1. తేనె మరియు చల్లటి వాటర్ మెలన్ జ్యూస్ ను సమాన మొత్తంలో తీసుకోండి.
2. ఈ రెండిటినీ బాగా కలపండి. మొదటగా, మీ పాదాలని శుభ్రపరచుకుని తడిని తుడుచుకోండి.
3. ఇప్పుడు ఈ ప్యాక్ ను పాదాలపై అప్లై చేయండి. ముప్పై నిమిషాల వరకు పాదాలపై ఈ ప్యాక్ ను ఉండనిచ్చి ఆ తరువాత వాష్ చేయండి.



Click it and Unblock the Notifications











