ఇంటివద్దే సరైన పద్దతిలో మ్యానిక్యూర్ ని చేసుకోవడమెలా?

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

చక్కటి రిలాక్సేషన్ ను ఎవరు కోరుకోరూ? అయితే, బిజీ షెడ్యూల్స్ వలన రిలాక్సేషన్ ని పొందే ఆస్కారమే ఉండటం లేదు. అయితే, రిలాక్సేషన్ కేవలం విశ్రాంతి తీసుకుంటేనే లభిస్తుందా? మన అందానికి మెరుగులు దిద్దుకోవంలో కూడా రిలాక్సేషన్ లభిస్తుంది. అవును, రొటీన్ కి భిన్నంగా పార్లర్ కి వెళ్లకుండా మన అందానికి మనమే మెరుగులు దిద్దుకుంటే బావుంటుంది కదా!

పార్లర్ ట్రీట్మెంట్స్ కూడా ఖరీదైనవి. కష్టపడి సంపాదించిన సొమ్మును వాటికి ధారపోసే కంటే మనమే కొన్ని టెక్నీక్స్ ని పాటిస్తూ అందానికి మెరుగులు దిద్దుకుంటే బాగుంటుంది కదా! ఇంటివద్దే సులభమైన పద్దతులను పాటిస్తూ సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చు.

How To Give Yourself A Manicure At Home

మేనిక్యూర్ ని ఇంటివద్దే చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ స్టైల్ మానిక్యూర్ ని చేసుకునే సులభమైన చిట్కాలను మేము తెలియచేస్తాము. మీరు మానిక్యూర్ కి అవసరమైన వాటిని మార్కెట్ లోంచి తెచ్చుకోవచ్చు.

ప్రతి ఒక్కరికీ తమ చేతిని అలాగే గోళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలని ఉంటుంది. అయితే, మనలో చాలా మంది ఫేస్ ప్యాక్స్ ని వాడి ముఖానికి ఇచ్చినంత కేర్ ని చేతులకు ఇవ్వరు. చేతులు తరచూ ఇలా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటాయి.

ఇంటివద్దే సరైన పద్దతిలో మ్యానిక్యూర్ ని చేసుకోవడమెలా?

ఇంటివద్దే హాయిగా మానిక్యూర్ ని చేసుకునే విధానాన్ని మేము ఈ రోజు ఈ ఆర్టికల్ లో సరళంగా వివరించాము. ప్రతి రోజు ఎంతో శ్రమకు గురయ్యే మీ చేతులకి ప్రేమని అదరణని అందివ్వండి. మీరు మానిక్యూర్ ని అందించడానికి స్పెషల్ గా అపాయింట్మెంట్ తీసుకొనవసరం లేదు. మీరే స్వయంగా చేసుకుంటున్నారు కాబట్టి మీకెప్పుడు వీలయితే అప్పుడు మానిక్యూర్ ని చేసుకోవచ్చు.

కాబట్టి, ఇక్కడ మానిక్యూర్ ని సులభంగా చేసుకునే చిట్కాలను పొందుబరిచాము.

1. ట్రిమ్:

1. ట్రిమ్:

నైల్ క్లిప్పర్ తో మీ నెయిల్స్ ను ట్రిమ్ చేసుకోండి. సరైన సైజ్ మరియు షేప్ లో వాటిని ట్రిమ్ చేయండి. గుర్తుంచుకోండి, నెయిల్స్ ఎంత పొడుగ్గా ఉంటే అంత అపరిశుభ్రంగా ఉండే అవకాశం కలదు. ఇంకా, గోళ్లు చిట్లిపోయి విరిగిపోయే ప్రమాదం కూడా కలదు. పొడుగాటి నెయిల్స్ కు సరైన సంరక్షణ అవసరం. ఆ సంరక్షణని అందివ్వలేని వారు గోళ్ళను పొడుగ్గా పెంచుకోకపోవడం మంచిది. కాబట్టి, నెయిల్స్ ను మీడియం లెంత్ వరకు ట్రిమ్ చేసుకోండి.

2. క్యూటికల్ ఆయిల్:

2. క్యూటికల్ ఆయిల్:

క్యూటికల్ ఆయిల్ లేదా ఏదైనా ఆయిల్ ను ఉపయోగించి నెయిల్ బెడ్ ను మాయిశ్చరైజ్ చేయండి. తద్వారా చిరాకు పుట్టించే క్యూటికల్స్ ని మృదువుగా మార్చుకోవచ్చు. అలాగే ఏదైనా మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తో కొబ్బరి నూనెను మిక్స్ చేసి ఈ బ్లెండ్ ని కూడా మీరు వాడవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ అనేది చక్కటి అరోమాను అందిస్తుంది. మానిక్యూర్ ఎక్స్పీరియెన్స్ ని సుగంధభరితం చేస్తుంది.

3. సోక్ చేయండి:

3. సోక్ చేయండి:

క్యూటికల్స్ ని మాయిశ్చరైజ్ చేశాక వాటిని మృదువుగా చేసేందుకు మీరు మీ చేతిని సోక్ చేయాలి. ఒక బౌల్ ని తీసుకుని దానిలో గోరువెచ్చటి నీటిని తీసుకోండి. లావెండర్ వంటి ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ను అందులో జోడించండి. ఈ నీటిలో మీ వేళ్ళని కొద్ది నిమిషాల పాటు ఉంచితే క్యూటికల్స్ అనేవి మృదువుగా మారతాయి.

4. బ్రష్:

4. బ్రష్:

ఇప్పుడు ఏదైనా బ్రష్ ని ఆలాగే క్యూటికల్ స్టిక్ ని తీసుకోండి. వీటిని ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించవచ్చు. ఆలాగే క్యూటికల్స్ ని వెనక్కి తోయవచ్చు. అయితే, క్యూటికల్ స్టిక్ ని వాడేటప్పుడు జాగ్రత్త వహించండి. లేదంటే, చర్మానికి గుచ్చుకుని గాయం కావచ్చు. అలాగే మెత్తని కుచ్చు కలిగిన బ్రష్ ని వాడటం అవసరం. చేతులపై ఉన్న చర్మం డెలికేట్ కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే, బ్రషింగ్ ని చేసెటప్పుడు సున్నితంగా డీల్ చేయాలి.

5. మాయిశ్చర్:

5. మాయిశ్చర్:

డెడ్ స్కిన్ రిమూవల్ తరువాత మీ చేతులను మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. ఇందుకు నెయిల్ క్రీమ్ ను వాడండి. లేదంటే, ఫేస్ క్రీమ్ లేదా బాడీ మాయిశ్చరైజర్ ని కూడా ప్రయత్నించవచ్చు. చేతులను మాయిశ్చరైజ్ చేయడం ముఖ్యం. ఎందుకంటే చేతులలో ఆయిల్ అనేది ఉత్పత్తి అవదు. అందువలన మాయిశ్చరైజర్ ద్వారా తేమను అందించాలి.

6. ఫైల్:

6. ఫైల్:

ఇప్పుడు ఫైల్ ని వాడటం ద్వారా షార్ప్ ఎడ్జెస్ ని కొంత షేప్ లోకి తెచ్చుకోవచ్చు. మీకు నచ్చిన ఏదైనా షేప్ ని మీరు ఎంచుకోవచ్చు. రౌండ్, ఆల్మండ్ లేదా స్క్వేర్ షేప్ వంటి ఏదైనా షేప్ లో నెయిల్స్ ని షేప్ చేసుకోండి. అయితే, స్క్వేర్ షేప్ లో ఉన్న గోళ్లు త్వరగా చిట్లిపోయే ప్రమాదం ఉంది.

7. బేస్ కోట్:

7. బేస్ కోట్:

మీకు నచ్చిన నెయిల్ షేప్ ను మీరు తెచ్చుకున్నాక, ఇప్పుడు ట్రాన్స్పరెంట్ బేస్ కోట్ ను అప్లై చేయాలి. తద్వారా, ఆ తరువాత అప్లై చేసే నెయిల్ కలర్స్ నుంచి మీ నెయిల్స్ ను రక్షించుకోవచ్చు. అలాగే బేస్ కోట్స్ వలన నెయిల్ పాలిష్ అనేది ఎక్కువ కాలం గోళ్లపై నిలిచి ఉంటుంది. మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని బేస్ కోట్స్ వలన గోళ్లు దృఢంగా మారే అవకాశం కూడా కలదు. కాబట్టి, మీ గోళ్లు చిట్లిపోయినట్టు, విరిగిపోయినట్టు ఉంటే బేస్ కోస్ట్స్ ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు.

8. నెయిల్ పాలిష్:

8. నెయిల్ పాలిష్:

మానిక్యూర్ లో ఈ పార్ట్ అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే, వివిధ కలర్స్ లో అలాగే ఫినిష్ లలో పాలిష్ లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. జెల్ ఫినిషలను గానీ లేదా మిర్రర్ క్రోమ్ ఫినిష్ లను గానీ మీరు ఎంచుకోవచ్చు. వీటిలో అనేకమైన ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇప్పుడు, మానిక్యూర్ ని ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు. ఇప్పుడు వీటిని ప్రయత్నించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇటువంటి ఎన్నో ఎమేజింగ్ బ్యూటీ అప్డేట్స్ కోసం బోల్డ్ స్కై ని అనుసరించండి మరి!

English summary

How To Give Yourself A Manicure At Home

Most women concentrate more on their looks and at times neglect to take enough care of their hands. Manicure is one such thing where you don't have to head to the parlour and instead find the best DIY recipes and pamper your fingers. Some of the simple tips that you can follow is trimming your nails, using cuticle oils, etc.
Story first published: Friday, February 23, 2018, 14:00 [IST]