పాదాలను క్లీన్ చేసుకోవడమెలా? ఈ సులభ పద్ధతులను పాటించడం ద్వారా పాదాల అందాన్ని రెట్టింపు చేయవచ్చు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

అందమైన, మృదువైన పాదాలను పొందాలని ఎవరికుండదు? మనలో చాలా మంది డ్రై లేదా ఫ్లేకీ స్కిన్ సమస్యతో ఇబ్బంది పడతారు. ఈ సమస్య ముఖ్యంగా పాదాలపై కనిపిస్తే పాదాల సౌందర్యం దెబ్బతింటుంది. నిజమే కదా?

పాదాల సౌందర్యాన్ని సంరక్షించుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే, పాదాలు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి.

Foot care tips

ఫుట్ కేర్ టిప్స్

చాలా మంది కేవలం ముఖాన్ని అలాగే చేతులను అందంగా ఉంచుకునేందుకు శ్రద్ధ పెడతారు. రకరకాల క్రీమ్స్ ను వాడతారు. పాదాలపై అశ్రద్ధ కనబరుస్తారు.

మార్కెట్ లో అనేక రెడీ మేడ్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పాదాలపై వీటిని అప్లై చేస్తే పాదాల సౌందర్యం మెరుగవుతుంది. అయితే, ఖర్చుతో కూడుకున్న పని ఇది. అలాగే, తరచూ పార్లర్ కి వెళ్లి పెడిక్యూర్ చేయించుకోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఆరోగ్యకరమైన అలాగే అందమైన పాదాలను పొందేందుకు ఫుట్ కేర్ రొటీన్ ను పాటించడం ముఖ్యం. ఇంట్లోనే, క్రమం తప్పకుండా సరైన ఫుట్ కేర్ రొటీన్ ను పాటిస్తే అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.

పాదాల సహజసిద్ధమైన అందాన్ని పెంపొందించడానికి అనేక ఫుట్ కేర్ టిప్స్ మరియు ట్రిక్స్ మీకు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని పాటించడం ద్వారా పాదాల నొప్పులను తగ్గించుకుని, బాక్టీరియల్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణను పొందవచ్చు. అలాగే, పాదాలకు తగినంత మాయిశ్చరైజర్ ను అందించవచ్చు.

అవును! ఈ ఆర్టికల్ లో పాదాలను మృదువుగా అలాగే అందంగా మార్చే చిట్కాలను పొందుబరిచాము.

మాయిశ్చరైజింగ్:

మాయిశ్చరైజింగ్:

పాదాల అందాన్ని మెయింటెయిన్ చేయడంలో మాయిశ్చరైజింగ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ పాదాలు రోజంతా స్ట్రెయిన్ అవుతాయి. ముఖ్యంగా మీరు ట్రావెలింగ్ జాబ్ చేస్తున్నట్టయితే పాదాలపై మీరు మరింత శ్రద్ధ కనబరచాలి. అందువలన, రోజంతా పాదాలను మాయిశ్చరైజ్ చేయాలి.

ఫిట్ అయ్యే షూస్ నే ధరించండి:

ఫిట్ అయ్యే షూస్ నే ధరించండి:

సౌకర్యవంతమైన, వెల్ ఫిట్టింగ్ షూస్ ని మాత్రమే ధరించాలి. చిన్న షూస్ ని ధరిస్తే పాదాలపై బొబ్బలు ఏర్పడతాయి. కాబట్టి, కొత్త షూస్ ని కొనేటప్పుడు చక్కటి సౌకర్యవంతమైన షూస్ ని ఎంచుకోండి. అలాగే, ఎప్పుడూ కరక్ట్ పెయిర్ షూస్ ని ఎంచుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఎండ నుంచి పాదాలను ప్రొటెక్ట్ చేయండి:

ఎండ నుంచి పాదాలను ప్రొటెక్ట్ చేయండి:

స్కిన్ కేర్ లో సన్ క్రీమ్ పాత్ర అనిర్వచనీయం. బయటికి వెళ్ళేటపోపుడు ఎస్ పీ ఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ సన్ స్క్రీన్ ను వాడాలి. తద్వారా పాదాలపై హానికర యువీ రేస్ పడకుండా జాగ్రత్త పడవచ్చు. రోజు పూర్తయినప్పుడు మీ పాదాలను ఒక టబ్బుడు వెచ్చటి నీటిలో ఉంచి టవల్ తో వైప్ చేయాలి.

నెయిల్ పాలిష్ ను రిమూవ్ చేయాలి:

నెయిల్ పాలిష్ ను రిమూవ్ చేయాలి:

కొత్త నెయిల్ పాలిష్ ను అప్లై చేసే ముందు పాత నెయిల్ పాలిష్ ను తొలగించడం మరచిపోకండి. మీకు కుదిరితే, పాలిష్ లేకుండా గోళ్లను కొన్ని గంటల వరకు ఉంచండి. ఆ తరువాత పాలిష్ ను అప్లై చేస్తే గోళ్లు బలపడతాయి. రిమూవర్ తో పాత నెయిల్ పాలిష్ ను తొలగించడం మంచిది.

స్క్రబ్:

స్క్రబ్:

మీ పాదాలు మృదువుగా అలాగే కోమలంగా ఉండేందుకు పాదాలపై ఉన్న డెడ్ స్కిన్ ను రిమూవ్ చేయడం తప్పనిసరి. స్క్రబ్బింగ్ చేస్తున్నప్పుడు పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చేసుకోండి. మీరు ఇంట్లోనే ఈ స్క్రబ్ ను సులభంగా వాడవచ్చు.

ఎలా వాడాలి:

ఎలా వాడాలి:

షుగర్ లేదా సాల్ట్ ను బేబీ ఆయిల్ లో కలిపి చిక్కటి మిశ్రమంలా తయారుచేసి హోంమేడ్ ఫుట్ స్క్రబ్ ను తయారుచేసుకోవచ్చు. ఈ పేస్ట్ ను పాదాలపై అప్లై చేసి ఆ తరువాత 5 నిమిషాల పాటు సర్క్యూలర్ మోషన్స్ లో మసాజ్ చేయాలి. ఆ తరువాత ప్యూమిస్ స్టోన్ స్క్రబ్ తో స్క్రబ్బింగ్ ను ఫినిష్ చేయండి. మీ పాదాలను చల్లటి నీటిలో రిన్స్ చేయాలి. ఆ తరువాత టవల్ తో తుడుచుకుని ఫుట్ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.

టో నెయిల్స్ ను ట్రిమ్ చేయండి:

టో నెయిల్స్ ను ట్రిమ్ చేయండి:

మీ నెయిల్స్ ను మరీ చిన్నగా ట్రిమ్ చేయకండి. అలా చేస్తే నడిచేటప్పుడు అసౌకర్యం తలెత్తుతుంది. ఈ సమస్యలను తగ్గించుకునేందుకు టో నెయిల్స్ ను తరచూ ట్రిమ్ చేసుకోండి. టో నెయిల్స్ ను స్ట్రెయిట్ గా అలాగే కార్నర్స్ లో స్మూత్ గా ట్రిమ్ చేయండి.

ప్రతి రోజూ మసాజ్ చేయండి:

ప్రతి రోజూ మసాజ్ చేయండి:

తరచూ ఫుట్ మసాజ్ ని చేయడం వలన పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫుట్ ప్రాబ్లెమ్స్ తలెత్తవు. రోజుకు 5 నిముషాల మీ బిజీ షెడ్యూల్ నుంచి పాదాల మసాజ్ కు కేటాయించండి. వార్మ్ ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ ను వాడండి.

English summary

How To Keep Your Feet Clean?

Food products can have vastly different effects on hunger, hormones and how many calories you burn. Some food products that you get today are worse because they don't provide nutrients to the body. The foods to stop eating to lose weight are high-calorie coffee drinks, artificial sweeteners, pizza, French fries, potato chips, MSG foods, etc..
Story first published: Tuesday, April 10, 2018, 16:00 [IST]