For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుదీనా ఆకులతో డార్క్ సర్కిల్స్ తొలగించవచ్చా ?

పుదీనా ఆకులతో డార్క్ సర్కిల్స్ తొలగించవచ్చా ?

|

కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ నిజానికి కొంత మేర మనకు ఆందోళన కలిగించే అంశంగా ఉంటుంది. ప్రధానంగా వ్యక్తి వ్యక్తిత్వ స్థాయిల మీద కూడా ప్రభావాన్ని చూపుతుంది. ఈ డార్క్ సర్కిల్స్, ముఖాన్ని నిర్జీవంగా చేయడమే కాకుండా, ఇతరులతో వ్యవహరించునప్పుడు ఇబ్బందిగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం, అధిక మద్యపానం లేదా ధూమపానం మరియు హార్మోన్ల సమస్యల వంటి అనేక కారణాల వలన ఈ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. ఇది వృద్ధాప్యం వలన కూడా సంభవించవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ప్రకృతిలో సహజ సిద్దంగానే ఉన్న కొన్ని నివారణలను అనుసరించడం ద్వారా ఈ వలయాలను నివారించవచ్చు.

డార్క్ సర్కిల్స్ కనపడకుండా దాచేందుకు ఉపయోగపడే, లేపనాలు లేదా ఇతర కాస్మెటిక్ ఉత్పత్తులలో అధికభాగం అన్ని చర్మ రకాలకు సరిపోవు. కొన్ని సున్నితమైన చర్మ రకాలు అలెర్జీలకు సైతం గురవుతుంటాయి. కావున ఈ డార్క్ సర్కిల్స్ తొలగించుటలో, ఎవరికీ ఎటువంటి నష్టం కలిగించని ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఖచ్చితంగా అవసరంగా ఉంటుంది. వాటిలో ఒకటి పుదీనా ఆకులు.

How To Remove Dark Circles With Mint Leaves?

పుదీనా ఆకులు మెంథాల్ కలిగి ఉండి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. కళ్ళ కింద నరాలలో మంచి రక్త ప్రసరణ జరిగేలా సహాయపడుతుంది. అంతేకాకుండా, పుదీనా ఆకులలోని విటమిన్ -సి చర్మం యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఈ పుదీనా ఆకులను డార్క్ సర్కిల్స్ తొలగించుటలో ఎలా ఉపయోగించాలో చూద్దాం.

పుదీనా, టమోటో మరియు నిమ్మకాయ :

పుదీనా, టమోటో మరియు నిమ్మకాయ :

చర్మం నిర్విషీకరణలో టమోటా మరియు నిమ్మకాయలలోని బ్లీచింగ్ లక్షణాలు అత్యుత్తమమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. మీరు చేయవలసినదల్లా సగం కోసిన టమోటా మరియు పుదీనా ఆకుల మిశ్రమం చేయడమే. తదుపరి దశలో తాజా నిమ్మ రసం మరియు చిటికెడు ఉప్పును జోడించి, అన్ని పదార్ధాలను చక్కగా కలపండి. దీనిని మీ కళ్ళ క్రింద వలయాకారంలో వర్తించండి. పూర్తిగా పొడిగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరచండి. వారంలో కనీసం రెండు సార్లు అనుసరించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలరు.

పుదీనా మరియు బంగాళాదుంప :

పుదీనా మరియు బంగాళాదుంప :

బంగాళాదుంపలోని బ్లీచింగ్ ప్రాపర్టీస్, చర్మ సౌందర్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ మిశ్రమానికి ఒక బంగాళాదుంప మరియు కొన్ని తాజా పుదీనా ఆకులు అవసరం. బంగాళదుంపను పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించండి. దీనిలో పుదీనా ఆకులను వేసి, బ్లెండర్లో మిశ్రమంగా కలపండి. మిశ్రమం మృదువుగా వచ్చేలా చూడండి. దీనిలో ఒక కాటన్ పాడ్ ఉంచి, ఒక గంటసేపు డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచి, శీతలపరచండి. మీ కళ్ళ క్రింద ఈ కాటన్ ప్యాడ్ ఉంచి, మరొక 15-20 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి.

Most Read:నీ వక్షోజాలకు దీన్ని పూసుకో బాగా లావు అవుతాయి, బ్రా తీసి పూయబోయాడుMost Read:నీ వక్షోజాలకు దీన్ని పూసుకో బాగా లావు అవుతాయి, బ్రా తీసి పూయబోయాడు

పుదీనా ఆకులు మరియు లెమన్ జ్యూస్ :

పుదీనా ఆకులు మరియు లెమన్ జ్యూస్ :

ఇది అన్నింటికన్నా సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారంగా చెప్పబడుతుంది. తాజా పుదీనా ఆకులు కొన్నింటిని తీసుకుని, ఒక బ్లెండర్ లో ఉంచండి. కొన్ని చుక్కల నిమ్మరసం వేసి, బ్లెండర్లో మిశ్రమంగా కలపండి. మీ కళ్ళ క్రింద ఈ పుదీనా పేస్ట్ ను వర్తించండి. ఈ మిశ్రమాన్ని దరఖాస్తు చేయడానికి ఒక కాటన్ బాల్ వినియోగించవచ్చు. అప్లై చేసిన తర్వాత 20 నిముషాల పాటు వదిలివేసి చల్లటి నీటితో శుభ్రం చేయండి.

పుదీనా ఆకులు మరియు రోజ్ వాటర్ :

పుదీనా ఆకులు మరియు రోజ్ వాటర్ :

ఈ సులభమైన మిశ్రమాన్ని తయారుచేసేందుకు, మీకు కావలసినదల్లా పుదీనా ఆకులు మరియు 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్. బ్లెండర్లో ఈ రెండు పదార్ధాలను మిశ్రమంగా చేయండి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచి, ఒక రాత్రి వదిలివేయండి. మరుసటి రోజు ఉదయం, ఈ మిశ్రమాన్ని కళ్ళ కింద వర్తించండి లేదా, రెండు కాటన్ బాల్స్ ఈ మిశ్రమంలో ముంచి, ఆపై మీ కళ్ళ మీద ఉంచి 15 నిముషాల పాటు అలాగే వదిలేయండి. 15 నిముషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాలకై వారంలో రెండు మూడు మార్లు ప్రయత్నించండి.

Most Read:పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొన్నాం,పిల్స్ వేసుకుంది, ఇప్పుడు ఎంత సెక్స్ చేసినా పిల్లలు పుట్టడంలేదుMost Read:పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొన్నాం,పిల్స్ వేసుకుంది, ఇప్పుడు ఎంత సెక్స్ చేసినా పిల్లలు పుట్టడంలేదు

పుదీనా ఆకులు, సెనగపిండి మరియు పసుపు :

పుదీనా ఆకులు, సెనగపిండి మరియు పసుపు :

ఈ మిశ్రమం చర్మంపై అదనపు దుమ్మును తొలగించడంలో సహాయపడుతుంది మరియు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయం చేస్తుంది. ఒక పేస్ట్ చేయడానికి ముందుగా పుదీనా ఆకుల మిశ్రమాన్ని సిద్దపరచుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సెనగపిండి, మరియు 1 స్పూన్ పసుపు వేసి మిశ్రమంలా కలపండి. మీ కళ్ళ క్రింద ఈ మిశ్రమాన్ని వర్తించి, 15 నిముషాల పాటు అలాగే వదిలివేయండి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం రెండు మార్లు ఈ మిశ్రమాన్ని ప్రయత్నించండి.

ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఈ మిశ్రమాలు, అందరికీ అందుబాటులోనే ఉంటూ, ఇతర రసాయనిక పదార్ధాలు, వైద్య చికిత్సలు, లేపనాల కన్నా ఉత్తమ ప్రయోజనాలను అందివ్వగలవు. కానీ, మీరు చేయవలసినదల్లా ఒక్కటే, కాస్త సమయాన్ని కేటాయించడం. వీటన్నిటితో పాటు, సరైన జీవన ప్రమాణాలను పాటించడం తప్పని సరి. అనగా వ్యాయామం, సరైన ఆహార ప్రణాళిక, తరచుగా నీటిని తాగడం, వ్యసనాలకు దూరంగా ఉండడం, సూర్యరశ్మి, కాలుష్యం దుమ్ము వంటి ప్రతికూల కారకాల నుండి అధికంగా ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. మొదలైనవి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How To Remove Dark Circles With Mint Leaves?

Dark circles under the eyes can make us worry to some extent because of the way we look. It often makes us look tired and lifeless. Mint leaves have menthol that helps in improving blood circulation that will even out the skin under the eyes. Also, vitamin C in mint leaves improves the elasticity of the skin.
Desktop Bottom Promotion