For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ మెడపై పేరుకున్న ట్యాన్ ను తొలగించడం ఎలా?

  |

  మీలో ఎంతమంది మీ మెడ యొక్క సంరక్షణకై సమయాన్ని వెచ్చిస్తున్నారు? మనం అందరం మన ముఖం మీది చర్మం ఎలా కనిపిస్తుందో అని ఆందోళన చెందుతాం కానీ మెడ మీద చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తాం. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే మన ముఖం మీది చర్మం మాదిరిగానే, మెడ మీది చర్మం కూడా ఎండకు కమిలి నల్లబడుతుంది.

  చర్మపొరలపై పేరుకున్న ట్యాన్ చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది. మెడను కప్పకుండా బయటకు కనిపించేటట్లు చూపే దుస్తులు ధరించినప్పుడు ఇది మరీ ప్రస్ఫుటంగా ఉంటుంది. మెడ ట్యాన్ అవ్వడానికి, అది కూడా ముఖ్యంగా వేసవిలో అవ్వడానికి కారణం అతిగా సూర్యతాపానికి గురవ్వడమే.

  How To Remove Tan From Neck?

  పరిశుభ్రత పాటించకపోవడం, వాతావరణ కాలుష్యం, ఊబకాయం, సౌందర్య ఉత్పత్తులలోని రసాయనాలు వంటి ఇతర కారణాల వలన కూడా ఇలా జరగవచ్చు.

  అధిక ట్యాన్ వలన ఏర్పడిన దురద మరియు మంటలతో కూడుకున్న గీతలు, కాలిన గాయాలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేస్తాయి.కనుక ఆరోగ్యకరమైన, అందమైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కొన్ని చర్మసంరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికై మన ఇంట్లో ఎప్పుడూ లభించే పదార్థాలను వాడుకోవచ్చు.

  ఇప్పుడు మనం మెడ పై ట్యాన్ ను ఇంట్లో కూర్చుని తొలగించుకోవడానికి ఉపకరించే కొన్ని అద్భుతమైన గృహవైద్య పరిష్కారాలను గురించి తెలుసుకుందాం. ఇకమీదట మీరెప్పుడైనా ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు ఈ చిట్కాలను పాటించి శాశ్వతంగా మీ మెడపై ట్యాన్ ను తొలగించుకోండి.

  1. తేనె మరియు నిమ్మరసం:

  1. తేనె మరియు నిమ్మరసం:

  తేనె మరియు నిమ్మరసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ట్యాన్ తొలగించి చర్మాన్ని తేటుగా మారుస్తాయి. దీనిలోని సహజంగా చర్మాన్ని తెల్లబరిచే గుణాలు మీకు మెరిసే తెల్లని చర్మాన్ని అందజేస్తాయి.

  కావలసిన పదార్థాలు:

  1 టేబుల్ స్పూన్ శనగపిండి.

  1 స్పూన్ తేనె

  2 స్పూన్ల నిమ్మరసం

  చిటికెడు పసుపు.

  వాడే విధానం: పైన చెప్పబడిన పదార్థాలు అన్నిటిని ఒక గిన్నెలో బాగా కలిపి మీ ముఖానికి శుభ్రంగా రాసుకోండి. ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఉత్తమ ఫలితాలు త్వరగా వస్తాయి.

  2. పాలు మరియు చందనం:

  2. పాలు మరియు చందనం:

  పాలు మన చర్మం యొక్క మెరుపును ఇనుమడింపజేస్తుందని మనకు తెలిసిందే. చందనంలో యాంటీ బాక్టీరియా తత్వాలు మీ చర్మాన్ని అన్ని రకాల సమస్యల నుండి కాపాడతాయి.

  కావలసిన పదార్థాలు:

  2 టేబుల్ స్పూన్లు చందనం పొడి

  4 టేబుల్ స్పూన్లు పచ్చి పాలు

  వాడే విధానం: 2 టేబుల్ స్పూన్లు చందనం పొడి మరియు 4 టేబుల్ స్పూన్లు పచ్చి పాలు తీసుకుని బాగా కలిపి చిక్కని పేస్టుగా తయారుచేయండి. దీనిని మెడకు పట్టించి 15-20 నిమిషాల పాటు క్రింది నుండి మీదకు మృదువుగా చర్మాన్ని మర్దన చేయండి. తరువాత చల్లని నీటితో కడుగేడుకోండి. ఇలా వారానికి ఒకసారి చేయండి.

  3. బంగాళాదుంపల రసం:

  3. బంగాళాదుంపల రసం:

  బంగాళాదుంపల రసంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి దోహదపడతాయి. బ్లీచింగ్ ఏజంట్లు ఉన్నందున బంగాళాదుంపల రసం చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగిస్తుంది.

  కావలసిన పదార్థాలు:

  1 బంగాళాదుంప

  వాడే విధానం: ఒక బంగాళాదుంపను చిన్న ముక్కలుగా చేసి తురమండి. ఈ తురుమును పిండి రసం తీయండి. ఇందులో ఒక దూది ఉండను ముంచి ముఖమంతటా రాసుకోండి. రాసుకున్నాక 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తరువాత నీటితో కడిగేయండి.

  కడుక్కున్నాక చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది కనుక మాయిశ్చరైసర్ ను రాసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేయండి.

  4. బొప్పాయి మరియు నిమ్మరసం:

  4. బొప్పాయి మరియు నిమ్మరసం:

  బొప్పాయి ట్యాన్ ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో కూడా మేనిఛాయను మెరుగుపరచే లక్షణాలు ఉంటాయి.

  కావలసిన పదార్థాలు:

  1-2 బొప్పాయి ముక్కలు

  2-3 చుక్కలు నిమ్మరసం

  వాడే విధానం: బొప్పాయి ముక్కలను బ్లెండ్ చేసి చిక్కని పేస్ట్ చేయండి. దీనికి నిమ్మరసం బాగా కలపండి. ఈ ముద్దను మెడకు రాసుకుని 15-20నిమిషాలు ఆరనివ్వండి. తరువాత చల్లని నీటితో కడిగి తుడుచుకోండి. ఈ ప్యాక్ నల్లని మచ్చలను కూడా తొలగిస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే తేడాను మీరే గమనించవచ్చు.

  5. పెరుగు:

  5. పెరుగు:

  పెరుగులో ఉండే సహజ ఎంజైములు నిమ్మరసం లో ఉండే ఆమ్లాలతో కలిసి మెడ మీద నల్లబడిన చర్మాన్ని తెల్లగా చేస్తుంది.

  కావలసిన పదార్థాలు:

  1-2 టేబుల్ స్పూన్లు పెరుగు

  2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం

  వాడే విధానం: పై రెండింటిని కలిపి ఆ మిశ్రమాన్ని మెడకు ప్యాక్ లా వేసుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచండి.తరువాత నీటితో కడిగేయండి. ఇలా ప్రతిరోజూ చేస్తే మెరుగైన ఫలితం త్వరగా వస్తుంది.

  6. పుచ్చకాయ మరియు తేనె:

  6. పుచ్చకాయ మరియు తేనె:

  ఈ మాస్క్ వలన మెడపై నలుపు త్వరగా తగ్గుతుంది. పుచ్చకాయ వలన ఎండకు కమిలిన చర్మంకు చల్లదనం చేకూరుతుంది.

  కావలసిన పదార్థాలు:

  2 టేబుల్ స్పూన్లు పుచ్చకాయ రసం

  2 టేబుల్ స్పూన్లు తేనె

  వాడే విధానం:చల్లని పుచ్చకాయ రసం మరియు తేనె సమపాళ్లలో కలపండి. మీ చర్మాన్ని శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మెడకు రాసుకోండి. 30 నిమిషాలు తరువాత కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయండి

  7. కీరా దోసకాయ:

  7. కీరా దోసకాయ:

  కీరా దోసకాయ చర్మంపై ట్యాన్ ను తొలగించి తాజాదనాన్ని ఇస్తుంది. ఇది చర్మానికి తేమ చేకూర్చి మాయిశ్చరైస్ చేస్తుంది.

  కావలసిన పదార్థాలు:

  ½ కీరా దోసకాయ

  1 స్పూన్ పంచదార

  వాడే విధానం:

  కీరా దోసకాయను బ్లెండ్ చేసి చిక్కని గుజ్జు తయారు చేయండి. కీరా గుజ్జు కు ఒక స్పూన్ పంచదార కలపండి. ఈ మాస్క్ మెడకు వేసుకుని పదినిమిషాల పాటు వదిలేయండి. తరువాత చల్లని నీటితో కడిగేసి తుడుచుకోండి. ఈ మాస్క్ ను ఒకసారి తయారుచేసుకుని ఫ్రిజ్ లో భద్రపరచుకోవచ్చు.

  8.తినే సోడా:

  8.తినే సోడా:

  తినే సోడాలో మృతకణాలను తొలగించి, బాక్టీరియా ను నాశనం చేసే గుణాలున్నందున చర్మం కాంతివంతంగా, తాజాగా తయారవుతుంది.

  కావలసిన పదార్థాలు:

  2 టేబుల్ స్పూన్లు తినే సోడా

  నీరు

  వాడే విధానం: ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ తినే సోడా మరియు నీటిని కలపండి. దీనితో మెడపై మృదువుగా వలయాకారంలో మర్దన చేసుకోండి. తరువాత నీటితో కడుక్కుని చర్మాన్ని మాయిశ్చరైస్ చేసుకోండి.

  ఇలా రెండువారాలపాటు ప్రతిరోజూ చేస్తే తేడా స్పష్టంగా కనపడుతుంది. కానీ మొటిమలు సమస్య ఉన్నవారు ఈ పద్దతిని అనుసరించరాదు.

  9.పసుపు మరియు శనగపిండి:

  9.పసుపు మరియు శనగపిండి:

  శనగపిండి చర్మం పై మృతకణాలను మరియు పసుపు చర్మం పై ఉన్న మలినాలను తొలగిస్తాయి. పసుపు ట్యాన్ ను తొలగించి చర్మమంటానికి ఒకటే ఛాయను చేకూరుస్తుంది.

  కావలసిన పదార్థాలు:

  1 టేబుల్ స్పూన్ శనగపిండి.

  1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్

  1 టేబుల్ స్పూన్ పాలు

  చిటికెడు పసుపు.

  వాడే విధానం: పైన చెప్పిన పదార్థాలను అన్నింటిని బాగా కలపండి. చర్మాన్ని శుభ్రపరచుకుని తరువాత ఈ మిశ్రమాన్ని రాసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి. ఈ ప్యాక్ ఆరిన తరువాత నీటితో తడిపి మెత్తగా అయ్యాక మొదట సవ్యదిశగా తరువాత అపసవ్య దిశగా నెమ్మదిగా రుద్దుకుంటు తొలగించండి.

  English summary

  How To Remove Tan From Neck?

  How To Remove Tan From Neck? ,How many of you take out your time in taking care of your neck? All of us are worried on how the skin on our face appears but we neglect about the skin on our neck. Like face, the skin on the neck also turns out to be tanned and dark if we do not take care of it properly.
  Story first published: Saturday, April 21, 2018, 11:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more