ఎండవల్ల చేతులు,పాదాలు నల్లబడకుండా ఈ ఇంటిచిట్కాలతో కాపాడుకోండి

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

హానికారక యువి కిరణాల నుంచి కేవలం ముఖాన్ని, మెడని కాపాడుకుంటే సరిపోదు.నల్లబడ్డ చేతులు,కాళ్ళని ఈ సింపుల్ డిఐవై ఇంటి చిట్కాలతో రంగు మెరుగుపర్చుకోండి.

మొహం తెల్లగా, కాంతివంతంగా మెరుస్తూ,చేతులు,పాదాలు నల్లగా ఉంటే ఏం బాగోదు. వీటిని బాగుచేయటానికి సింపుల్ ఇంటిచిట్కాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. చర్మంపై ట్యాన్ ను తొలగించటానికి ఉబ్తన్ మంచి ప్యాక్ గా ఉపయోగపడుతుంది.

హానికారక యువి కిరణాల నుంచి కేవలం ముఖాన్ని, మెడని కాపాడుకుంటే సరిపోదు. అవి చాలామటుకు బట్టలు లేదా చెప్పుల వెనక కవర్ అయి ఉండవు కాబట్టి, యూవిఎ మరియు యూవిబి సూర్యకిరణాలు వాటిపై పడి మరింత మెలనిన్ ఉత్పత్తి అయి చర్మం నల్లగా మారుతుంది.

Remove Tan From Hands Using These Remedies

ఇవేకాక, చర్మం నల్లబడటానికి ఎక్కువగా కాలుష్యం,మురికి కూడా కారణం కావచ్చు. ప్రాథమికంగా అందరూ చెప్పే సలహాలలో స్కార్ఫ్ వేసుకోవటం, గొడుగు తీసుకెళ్ళడం, మండిపోతున్న ఎండలలో పై నుంచి కిందవరకూ ముసుగులు వేసుకుని తిరగటం ఉంటాయి. ఇలా చేయటం వలన సమస్య మరింత పెద్దదవుతుంది!

Remove Tan From Hands Using These Remedies

మీ చర్మం రంగు మరీ పాడవకుండా మానిక్యూర్, పెడిక్యూర్ లేదా ఫుట్ మసాజ్ చర్మాన్ని తెల్లబరుస్తాయి.కానీ ఎంత తరచూ మనం వీటికి డబ్బు తగలేయగలం? మంచివార్త ఏంటంటే సింపుల్ ఇంటి చిట్కాలను కూడా తెల్లని చేతులు,పాదాలు పొందటం కోసం వాడవచ్చు. పైగా ఇవి సురక్షితమైనవి, కాస్మెటిక్స్ ఉత్పత్తుల్లో వాడే రసాయనాలు కూడా ఉండవు.

మీ చర్మాన్ని ఈ కింది సింపుల్ డిఐవై చిట్కాలతో అదీ మీ వంటింటి పదార్థాలతో ప్రయత్నించి కాపాడుకోవచ్చు -

1.పచ్చిపాలు

1.పచ్చిపాలు

మృతకణాలను, మురికిని తొలగించటానికి ఉపయోగపడే చక్కటి చిట్కా పచ్చిపాలను వాడటం. పచ్చిపాలనే మొదటగా నల్లగా మారిన చేతులు,పాదాలపై వాడాలి. ఎందుకంటే దానికి లాక్టిక్ స్వభావం ఉండటం వలన, చర్మంపై చనిపోయిన కణాలను తొలగించి, చర్మరంథ్రాలలోకి వెళ్ళి లోపలినుంచి శుభ్రపరుస్తుంది. ఇది బ్లీచింగ్ ఏజెంట్ లా కూడా పనిచేసి చేతులు,కాళ్ల రంగును లేతపర్చి, వేళ్ళ కణుపులను కూడా మెత్తబరుస్తుంది.

2.సెనగపిండి ప్యాక్

2.సెనగపిండి ప్యాక్

రెండు చెంచాల సెనగపిండి, ఒక చెంచా పసుపు, రెండు చెంచాల పాలను, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి మందమైన చక్కని ప్యాక్ తయారుచేయండి. దీన్ని హిందీలో ఉబ్తన్ అంటారు,ఈ సెనగపిండి ప్యాక్ చర్మంపై టాన్ ను తొలగించటంలో చాలా మంచిగా పనిచేస్తుంది. కడిగేసాక మాయిశ్చరైజర్ రాసుకుని పొడిదనానికి దూరంగా ఉండండి.

3.నిమ్మకాయలు

3.నిమ్మకాయలు

విటమిన్ సి ఎక్కువగా ఉండే, మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసే నిమ్మకాయలు చర్మాన్ని శుభ్రపర్చుకోటానికి, చర్మం తెల్లబర్చుకోటానికి ఉపయోగపడతాయి. అరచెక్క నిమ్మకాయను తీసుకోని దానిపై కొంచెం పంచదారను వేసి చేతులు,పాదాలపై రుద్దండి. 10 నిమిషాలు అలా వదిలేసి తర్వాత కడిగేయండి. తర్వాత పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాసుకోండి. వారానికోసారి ఇదే పద్ధతి పాటించి ఫలితాలు చూడండి.

4.ఆలోవెరా

4.ఆలోవెరా

తెల్లని చేతులు,పాదాల కోసం ఇంటి చిట్కాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆలోవెరాను మర్చిపోలేం. మొక్కనుంచి ఒక ఆకును కోసి,అందులోంచి జెల్ ను మొత్తం తీయండి. ఈ జెల్ ను మీ చేతులు,పాదాలపై రాసుకోండి. పదినిమిషాలు అలానే వదిలేసి కడిగేయండి. రోజుకి రెండుసార్లు ఇలా చేస్తే కావాల్సిన ఫలితాలు వస్తాయి. మీరు ఆలోవెరాను బాదం నూనెతో కూడా కలిపి రాసుకోవచ్చు.

5. టమాటాలు

5. టమాటాలు

టమాటాలు సహజమైన బ్లీచింగ్ పదార్థం మాత్రమే కాదు, యువి కిరణాల నుంచి మీ చర్మం యొక్క సున్నితత్వాన్ని తగ్గిస్తుంది. టమాటా రసం లేదా అర చెక్క టమాటాను సమస్య ఉన్నచోట రుద్ది రెండు నిమిషాల తర్వాత కడిగేస్తే కావాల్సిన ఫలితం కన్పిస్తుంది. 2-3 నిమిషాలపాటు ఉంచితే చాలు.

English summary

Remove Tan From Hands Using These Remedies

Your tanned hands will be very distracting, especially when you are wearing a dress that does not cover your hands. One reason for your hands tanning can be due to over exposure to the sun, especially during the summers. Some ingredients like cucumber, honey and lemon juice can help you to solve this problem.