For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మీ కాళ్ళు సెక్సీగా కన్పించేలా చేసే 7 సహజ చిట్కాలు

  |

  రన్ వేపై పొడవైన సెక్సీ కాళ్ళను చూసినప్పుడు మనందరికీ కూడా కొంచెం కాంప్లెక్స్ రావడం సహజమే. జుట్టు సరిగా కుదరని రోజులు చాలవన్నట్లు మనకి సరిగా కన్పించని కాళ్ళ రోజులు కూడానా! అక్కడక్కడా పెరిగిన వెంట్రుకలు, ఎండిపోయిన చర్మం, నల్ల మచ్చలు, ఇవన్నిటితో మీరు మీ హాట్ షార్టులు సౌకర్యంగా వేసుకోలేరు, కదూ? మీకు కావాల్సింది అందమైన కాళ్లని ఇచ్చే ఇంటిచిట్కాలు!

  మేము ఈ ఇంటి సహజ చిట్కాలేం మేకప్ చేసినట్లుండే ఎయిర్ బ్రష్ కాళ్ళ లుక్స్ ఇస్తాయని ఏం చెప్పట్లేదు కానీ దాని దరిదాపుల్లోనే మీ కాళ్ళు తయారవుతాయి.

  కాళ్లపై మీరు చూసే నల్లమచ్చలు చర్మం పైపొరపై పేరుకున్న రంగు గాఢత మాత్రమే.

  Home Remedies For Beautiful Legs | Natural Tricks For Blemish-Free Legs | How To Make Your Legs Smooth And Soft | Naturally, Homemade Masks For Smooth Legs | Natural Scrub For Shiny Legs | How To Exfoliate Legs |

  ఇంకా ముక్కలుగా కన్పించే పొర కూడా మీ చర్మం పొరలు విరిగిపోతున్నాయనటానికి, పోషణ అత్యవసరం అని తెలియచేస్తున్నాయి.

  మొదటి విషయం మొదట చెప్పుకుందాం, మీ చర్మాన్ని నేరుగా ఎండకి తగలనివ్వకండి, ఒకవేళ తప్పనిసరైతే, సరిపోయే సన్ స్క్రీన్ తప్పక రాసుకోండి. రెండవ నియమం, మీ చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోండి. దానికి మాయిశ్చరైజర్ ఎప్పుడూ అవసరమే.

  ఇక ఇవే కాక, మీ కాళ్ళు మెత్తగా, మృదువుగా మారటానికి ఈ కింద కొన్ని సహజ చిట్కాలు ఉన్నాయి చదవండి.

  బియ్యంతో మృతకణాల తొలగింపు

  బియ్యంతో మృతకణాల తొలగింపు

  మీ చర్మం శుభ్రంగా ఉన్నప్పుడు అదనపు పోషణను కూడా పీల్చుకుంటుంది. అందుకని సరైన పాలిషింగ్ అవసరం. బియ్యం రవ్వలో ఉండే కఠినమైన గ్రాన్యూల్స్ మృతకణాలను తొలగిస్తాయి, రంథ్రాలను శుభ్రపరుస్తాయి మరియు కొత్త కణాలు తిరిగి సృష్టించబడేలా చేస్తాయి.

  ఎలా పనిచేస్తాయి

  1చెంచా బియ్యంరవ్వను చిటికెడు పసుపు మరియు ఒక చెంచా పెరుగుతో కలపండి.మంచి పేస్టులా కలపండి. దీన్ని మీ కాళ్ళపై రాయండి. 30నిమిషాల పాటు అలా ఉంచేయండి. మీ చర్మాన్ని గుండ్రంగా రుద్దుతూ కాసేపయ్యాక కడగండి. తర్వాత పోషణనిచ్చే బాడీలోషన్ రాసుకోండి. ఈ సహజమైన స్క్రబ్ ను వారానికి రెండు సార్లు వాడి మంచి ఆకర్షణీయమైన ఫలితాలను చూడండి.

  గోధుమపిండితో పాలిష్

  గోధుమపిండితో పాలిష్

  గోధుమపిండిలో ఉండే బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు వాపును తగ్గించి, చర్మం రంగును తేలికచేసి, విరిగిపోయిన చర్మకణాలకు ఉపశమనం అందిస్తాయి.

  ఎలా పనిచేస్తాయి

  1 చెంచా గోధుమపిందిని అరచెంచా నిమ్మరసం, 1చెంచా తేనెతో కలపండి. వీటిని మెత్తని పేస్టుగా చేసి, మీ కాళ్లపై రాసి అరగంట అలా వదిలేయండి. తర్వాత శుభ్రంగా కడిగేయండి. ఈ ఇంటిచిట్కా మీకు అందమైన కాళ్ళను ఇచ్చి, లోపల పెరిగే వెంట్రుకలను తగ్గించి, కాళ్ళను మృదువుగా చేస్తుంది.

  రోజ్ వాటర్ టోనర్

  రోజ్ వాటర్ టోనర్

  మంచి వాసన రావడమేకాక,రోజ్ వాటర్ లో అవసరమైన ఉపశమనం ఇచ్చే లక్షణాలు మీ చర్మంపై మురికిని తొలగించి, తేమను పెంచి, రంధ్రాలను మూస్తుంది.

  ఎలా పనిచేస్తుంది

  రోజ్ వాటర్ లో దూదిని ముంచండి. ఎక్కువ నానితే పిండేయండి. దాన్ని మెల్లగా మీ చర్మంపై వత్తండి. మీ చర్మం రోజ్ వాటర్ యొక్క పోషక లక్షణాలను పీల్చుకోనివ్వండి. తర్వాత బాడీలోషన్ రాయండి, మీ చర్మం వెంటనే దాన్ని పీల్చేసుకుంటుంది! ఈ ఇంటి చిట్కా ప్రతిరోజూ ప్రయత్నిస్తే అద్భుతమైన ఫలితాలు కన్పిస్తాయి.

  అవకాడో నూనె మాయిశ్చరైజర్

  అవకాడో నూనె మాయిశ్చరైజర్

  యాంటీ ఆక్సిడెంట్లతో,అవసరమైన విటమిన్లు, ఖనిజలవణాలతో నిండివున్న అవకాడో నూనె చర్మం లోపలి పొరలకు కూడా ఇంకి, మీ చర్మాన్ని తిరిగి జీవం పొందేలా చేస్తుంది.

  ఎలా పనిచేస్తుంది

  మీ చర్మాన్ని ఆర్గానిక్ అవకాడో నూనెతో ప్రతిరాత్రి పడుకునేముందు మసాజ్ చేయండి. కాటన్ సాక్సులు వేసుకుని రాత్రంతా అలా వదిలేయండి. పొద్దున మృదువైన, మెత్తని చర్మాన్ని చూసి ఆనందించండి!

  మచ్చల కోసం ఉల్లిపాయ

  మచ్చల కోసం ఉల్లిపాయ

  మృదువైన కాళ్ళకోసం చాలామంది ప్రయత్నించి చూసిన ఇంటిమాస్క్ ఇది. ఉల్లిపాయలో అధికంగా సల్ఫర్ ఉంటుంది, ఇది చర్మంపై తీవ్రమైన మచ్చలను కూడా పల్చన చేస్తుంది.

  ఎలా పనిచేస్తుంది

  కొన్ని ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి, మీ కాళ్ళపై రుద్దండి. మీ కాళ్లలో కొంచెం ఏదో గుచ్చుకుంటున్న ఫీలింగ్ వచ్చేవరకు,చర్మం కొంచెం వెచ్చగా అన్పించేవరకు రుద్దండి. తర్వాత చల్లనీళ్లతో కడిగేయండి. ఈ పద్ధతిని వారానికి మూడుసార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం కన్పిస్తుంది.

  పుదీనా ఆకులతో మీ చర్మానికి ఉపశమనం ఇవ్వండి

  పుదీనా ఆకులతో మీ చర్మానికి ఉపశమనం ఇవ్వండి

  చర్మానికి పోషణ ఒకటే ఇస్తే సరిపోదు, అన్నిటినీ భరించే మీ చర్మానికి కొంత లాలన కూడా అవసరం. పుదీనా ఆకులలోని మెంథాల్ సరిగ్గా అదే చేస్తుంది!

  ఎలా పనిచేస్తుంది

  ఒక టబ్ లో వేడినీరు నింపి, కొన్ని చుక్కల పుదీనా నూనె మరియు పుదీనా ఆకులను వేయండి. మీ కాళ్ళను అందులో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచండి. తర్వాత చల్లని నీరులో కాళ్ళు కడిగేయండి. ఈ ఇంటి చిట్కాను వారానికి రెండు సార్లు పాటించి అందమైన కాళ్ళను పొందండి.

  ఓట్’స్ వెన్న

  ఓట్’స్ వెన్న

  చర్మంపై మృతకణాలను ఎలా తొలగించాలని మాట్లాడుతూ, ఓట్'స్ గురించి మాట్లాడకపోవటమా,అదెలా సాధ్యం? ఓట్లలో బ్యాక్టీరియా వ్యతిరేక మరియు ఫంగస్ వ్యతిరేక లక్షణాలుండి దురద పుట్టే చర్మాన్ని, దాని కఠినత్వం నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది, అలాగే లోపల మిగిలిపోయి పెరిగిపోయే వెంట్రుకలను కూడా తీసేస్తుంది.

  ఎలా పనిచేస్తుంది

  1 చెంచా ఓట్'స్ ను మరీ మెత్తని పొడి కాకుండా చేసి, ఒక చెంచా పచ్చిపాలు మరియు కొన్ని చుక్కల బాదం నూనెను అదనపు పోషణగా వేసి కలపండి. అది ఆరేవరకు మీ చర్మంపై ఉంచి, రుద్ది తర్వాత కడిగేయండి!

  English summary

  Home Remedies For Beautiful Legs | Natural Tricks For Blemish-Free Legs | How To Make Your Legs Smooth And Soft | Naturally, Homemade Masks For Smooth Legs | Natural Scrub For Shiny Legs | How To Exfoliate Legs |

  Long sexy legs strutting down the runway, can give us some major complex. And as if bad hair days was not enough, we are faced with bad legs day too! Bumpy stubbles, dry as chalk, riddled with black spots, not exactly a look you were planning to carry, is it? What you need is home remedies for beautiful legs!
  Story first published: Friday, February 2, 2018, 16:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more