For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సిటివ్ స్కిన్ కలిగిన అమ్మాయిలు పాటించవలసిన షేవింగ్ టిప్స్

సెన్సిటివ్ స్కిన్ కలిగిన అమ్మాయిలు పాటించవలసిన షేవింగ్ టిప్స్

|

షేవింగ్ తరువాత నొప్పి మిమ్మల్ని విపరీతంగా వేధిస్తుందా? మీ చర్మంపై దురద లేదా ఎర్రటి దద్దుర్లు షేవింగ్ తరువాత చర్మంపై దర్శనమిస్తున్నాయా? అయితే, మీది సెన్సిటివ్ స్కిన్ సమస్య. జీవితంలో ఒక వయసుకి రాగానే షేవింగ్ అనేది ఒక పార్ట్ గా మారుతుంది. చాలా మంది వారానికి రెండు సార్లు షేవింగ్ చేసుకుంటారు. అయితే, అత్యంత సున్నితమైన చర్మాన్ని షేవింగ్ చేయటం అత్యంత ఇబ్బందికర విషయం. ఈ సమస్యను సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు ఎక్కువగా ఫేస్ చేస్తారు.

సెన్సిటివ్ స్కిన్ ని అత్యంత మృదువుగా హ్యాండిల్ చేయాలి. చర్మానికి సంబంధించిన టూల్స్ ని లేదా ప్రోడక్ట్స్ వాడేటప్పుడు అత్యంత శ్రద్ధను కనబరచాలి. వాటిలో ఏవైనా తేడాలుంటే స్కిన్ దెబ్బతింటుంది. ఇంగ్రోన్ హెయిర్, బంప్స్, ర్యాషెస్ మరియు అలర్జిక్ రియాక్షన్స్ తో పాటు చర్మంపై ఎర్రదనం అలాగే దురద వంటి సమస్యలను సెన్సిటివ్ స్కిన్ కలిగిన అమ్మాయిలు ఎక్కువగా ఫేస్ చేస్తారు. అందువలన, ఈ నేచురల్ షేవింగ్ టిప్స్ అనేవి సెన్సిటివ్ స్కిన్ కలిగిన అమ్మాయిలకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటాయి.

Shaving Tips For Girls With Sensitive Skin Read more at: https://www.boldsky.com/beauty/2018/shaving-tips-for-girls-with-sensitive-skin-123610.html

సెన్సిటివ్ స్కిన్ కలిగిన అమ్మాయిలు ఇచీనెస్ ను దూరంగా ఉంచేందుకు ఈ అద్భుతమైన చిట్కాలను పాటించవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా చర్మం శుభ్రంగా, మృదువుగా అలాగే ఎటువంటి రియాక్షన్స్ లేకుండా ఉంటుంది. ఈ చిట్కాలను ఒకసారి పరిశీలించండి మరి.

చర్మాన్ని రోజుకు మూడు సార్లు క్లీన్స్ చేయండి:

చర్మాన్ని రోజుకు మూడు సార్లు క్లీన్స్ చేయండి:

ఇంతకు ముందు ప్రస్తావించిన విధంగానే, చర్మాన్ని ఎక్కువగా గారాబం చేయాలి. ముఖ్యంగా, సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారిలో చర్మం విషయంలో ఏ చిన్న అశ్రద్ధ అయినా సరే ఫ్లేకీనెస్ సమస్యతో పాటు ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తాయి. సెన్సిటివ్ స్కిన్ అనేది బయటి వాతావరణంలో దుమ్ముకు అలాగే ధూళికి త్వరగా ప్రభావితమవుతుంది. తద్వారా, బ్లాక్ హెడ్స్ తో పాటు లార్జ్ పోర్స్ సమస్య వేధిస్తుంది.

అంతేకాక, దీని వలన చర్మంపై ర్యాషెస్ అలాగే కట్స్ ఏర్పడతాయి. షేవింగ్ ప్రాసెస్ కి ఇవి అంతరాయంగా నిలుస్తాయి. అందువలన, మీ సెన్సిటివ్ స్కిన్ ను రోజుకు మూడు సార్లు శుభ్రపరుచుకోండి. నేచురల్ క్లీన్సర్స్ లేదా నేచురల్ ఎలిమెంట్స్ కలిగిన క్లీన్సింగ్ వైప్స్ ను వాడండి. కాస్మటిక్స్ అనేవి చర్మాన్ని మరింత ఇరిటేట్ చేసే ప్రమాదం ఉంది.

ఇరిటేషన్ ను అరికట్టేందుకు మాయిశ్చరైజ్ చేయండి:

ఇరిటేషన్ ను అరికట్టేందుకు మాయిశ్చరైజ్ చేయండి:

సెన్సిటివ్ స్కిన్ అనేది సాధారణంగా డ్రై గా ఉంటుంది. అందువలన, దీన్ని హైడ్రేట్ చేయడం అవసరం. డ్రైనెస్ అలాగే ఇచీనెస్ వలన షేవింగ్ ప్రాసెస్ అనేది కష్టతరంగా ఉంటుంది. షేవింగ్ తరువాత చర్మంపై కొన్ని రియాక్షన్స్ ఏర్పడతాయి. కాబట్టి, చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయటం ద్వారా చర్మం మరింత కాంతివంతంగా, మృదువుగా అలాగే పోషణతో నిండి ఉంటుంది.

సెన్సిటివ్ స్కిన్ కి పీహెచ్ బాలన్స్ అవసరం. తద్వారా, చర్మానికి పోషణ అందుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. దీనివలన, స్కిన్ ఇరిటేషన్ తో పాటు అలర్జిక్ రియాక్షన్స్ తగ్గుతాయి. చర్మాన్ని ప్రతి రోజూ మాయిశ్చరైజ్ చేయడం అవసరం. రోజుకి రెండుసార్లు మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవటం మరచిపోకండి. స్నానం తరువాత ఒకసారి అలాగే నిద్రపోవడానికి ముందు ఒకసారి చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి.

డెడ్ సెల్స్ ను తొలగించటానికి ఎక్స్ఫోలియేట్ చేయండి:

డెడ్ సెల్స్ ను తొలగించటానికి ఎక్స్ఫోలియేట్ చేయండి:

డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే చర్మంపై అవాంఛిత రోమాలు ఉన్నప్పుడు షేవింగ్ ప్రాసెస్ వలన చర్మం ఇరిటేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది. అందువలన, ఈ సమస్యను అరికట్టేందుకు షేవింగ్ ప్రాసెస్ కి ముందుగా చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి.

కాఫీ స్క్రబ్, షుగర్ స్క్రబ్ వంటి నేచురల్ ఎక్స్ఫోలియేటర్స్ ను మీరు వాడవచ్చు. అయితే, ఎక్స్ఫోలియేషన్ టైంలో చర్మంపై సున్నితంగా వ్యవహరించండి. లేదంటే, ఈ ప్రాసెస్ కూడా ఇరిటేషన్ ను కలిగించే ప్రమాదం ఉంది.

షేవింగ్ కి ముందుగా చర్మంపై వాటర్ ని రిన్స్ చేయండి

షేవింగ్ కి ముందుగా చర్మంపై వాటర్ ని రిన్స్ చేయండి

సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు చర్మాన్ని డ్రై గా ఉన్నప్పుడు షేవింగ్ చేయకూడదు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్ తో పాటు ఇతర చర్మ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, షేవింగ్ కి ముందుగా అయిదు నిముషాల పాటు వాటర్ రిన్స్ ను ప్రిఫర్ చేయండి. దీని వలన చర్మం తేమగా అలాగే శుభ్రంగా మారుతుంది. చర్మాన్ని స్మూత్ గా షేవ్ చేసుకోవచ్చు. చేతులపై డ్రై హెయిర్ అనేది షేవింగ్ కి కఠినంగా ఉంటుంది. దీనివలన కూడా చర్మం ఇరిటేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, కాస్తంత నీళ్లను చల్లి హెయిర్ ను సాఫ్ట్ గా మార్చుకోండి. షేవింగ్ కి అనువుగా హెయిర్ ను ప్రిపేర్ చేయండి.

స్మూత్ షేవింగ్ కోసం బేబీ ఆయిల్స్ ను ఉపయోగించండి:

స్మూత్ షేవింగ్ కోసం బేబీ ఆయిల్స్ ను ఉపయోగించండి:

ఇది ఇంకొక అద్భుతమైన షేవింగ్ టిప్. బంప్స్ తో పాటు ఇతర చర్మ సమస్యలను నిర్మూలించేందుకు కాస్తంత బేబీ ఆయిల్ లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ లేదా షీ బటర్ వంటి నేచురల్ ఇంగ్రిడియెంట్స్ లేదా హోమ్ మేడ్ షేవింగ్ క్రీమ్ వంటివాటిని షేవింగ్ కంటే ముందుగా చర్మంపై అప్లై చేయండి. దీని వలన షేవింగ్ ప్రాసెస్ స్మూత్ గా జరుగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ఇది సెన్సిటివ్ స్కిన్ అనేది పొడిబారకుండా సంరక్షిస్తుంది. తద్వారా, ఇరిటేషన్ తో పాటు ఇంజూరీస్ అనేవి అరికట్టబడతాయి.

హైజినిక్ షేవింగ్ టూల్స్ నే ఉపయోగించండి:

హైజినిక్ షేవింగ్ టూల్స్ నే ఉపయోగించండి:

స్కిన్ అలర్జీస్ తో పాటు ఇన్ఫెక్షన్ ను అరికట్టేందుకు హైజీన్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ముఖ్యంగా, సెన్సిటివ్ స్కిన్ కలిగిన వారు హైజీన్ కి అమితమైన ప్రాధాన్యతను ఇవ్వాలి. జెర్మ్స్ ను అరికట్టేందుకు అలాగే సెన్సిటివ్ స్కిన్ పై రియాక్షన్స్ కు అడ్డుకట్ట వేసేందుకు షేవింగ్ బ్లేడ్స్ ను ఎల్లవేళలా శుభ్రంగా ఉంచుకోవాలి.

మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించిన తరువాత అదే బ్లేడ్ ను ఉపయోగించకూడదు. ఆ బ్లేడ్ రఫ్ గా మారిపోయి చర్మం కట్ అయి బ్లీడింగ్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి, రేజర్ ను హాట్ వాటర్ లో నానబెట్టి అందులో పేరుకుపోయిన హెయిర్ ను తొలగించి శానిటైజ్ చేయండి. ప్రభావవంతమైన క్లీన్సర్స్ తో బ్లేడ్ ను వాష్ చేయండి.

హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో షేవింగ్ చేయకూడదు:

హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో షేవింగ్ చేయకూడదు:

హెయిర్ గ్రోత్ కు వ్యతిరేక దిశలో షేవింగ్ చేయడాన్ని షేవింగ్ ప్రాసెస్ లో ఒక టేక్నీక్ గా కొంతమంది మహిళలు పాటిస్తున్నారు. అయితే, సెన్సిటివ్ స్కిన్ కలిగిన మహిళలకు ఈ ప్రాసెస్ అనేది నొప్పితో కూడినది. దీనివలన బంప్స్ తో పాటు రాషెస్ సమస్య వేధిస్తుంది. కాబట్టి, హెయిర్ గ్రోత్ దిశలోనే షేవింగ్ ప్రాసెస్ ను ముందుకు సాగనివ్వాలి. సింగిల్ బ్లేడ్ రేజర్ ని వాడితే స్మూత్ షేవ్ జరుగుతుంది. స్మూత్ ఫినిష్ నిచ్చే హై ఇంపాక్ట్ రేజర్స్ ని ప్రిఫర్ చేయండి. అలాగే, గాయం జరిగిన చర్మం వద్ద షేవింగ్ ని అవాయిడ్ చేయండి.

షేవింగ్ తర్వాత చర్మ సంరక్షణ విధానాలు:

షేవింగ్ తర్వాత చర్మ సంరక్షణ విధానాలు:

షేవింగ్ తరువాత స్కిన్ కేర్ టిప్స్ ను పాటించాలి. అప్పుడే, చర్మం స్మూత్ గా నొప్పిలేకుండా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ కలిగిన మహిళలు షేవింగ్ తరువాత ఎక్కువగా స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ర్యాషెస్ అలాగే బర్నింగ్ సెన్సేషన్ వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కాబట్టి, మీది సెన్సిటివ్ స్కిన్ అయితే పోస్ట్ షేవింగ్ టిప్స్ ను పాటించండి.

• షేవింగ్ తరువాత చర్మాన్ని చల్లటి నీటితో శుభ్రపరుచుకోండి.

• చర్మంపై తడిని టవల్ తో తుడిచి ఆఫ్టర్ షేవ్ జెల్ ను అప్లై చేయండి. మీ చర్మం సెన్సిటివ్ అయితే, అలోవెరా, కొబ్బరి నూనె మరియు టీ ట్రీ ఆయిల్ వంటి సూతింగ్ ఎఫెక్ట్ కలిగిన నేచురల్ మాయిశ్చరైజర్స్ ను ఎంచుకోండి. బేబీ ఆయిల్ కూడా మంచిదే.

• ఒకవేళ మీ చర్మం ఇచీగా అలాగే ఇరిటేటెడ్ గా ఉంటే కోల్డ్ ప్యాక్స్ ను అప్లై చేయండి.

• మీ చర్మంపై చల్లటి క్లాత్ ను అమర్చి దానిని ఆరనివ్వండి. దీని వలన పెయిన్ తో పాటు ఇరిటేషన్ నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.

సన్ స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్ళకండి

షేవింగ్ ప్రాసెస్ కి సంసిద్ధమవుతున్నప్పుడు ఎండలోకి ఎక్కువగా వెళ్ళకండి. అలాగే, షేవింగ్ తరువాత కూడా ఎండలోకి వెళ్ళకండి. ఎండలోకి వెళితే చర్మం ఇరిటేట్ అవుతుంది. ఇచీనెస్ తో పాటు బర్నింగ్ సెన్సేషన్ వేధిస్తుంది.

English summary

Shaving Tips For Girls With Sensitive Skin

Shaving Tips For Girls With Sensitive Skin,Do you feel bursts of pain after shaving? Or does your skin itch or develop red rashes after shaving? That's probably because you have a sensitive skin. Shaving becomes a regular part of your life after you reach a certain age. Many of us shave at least twice a week. However,
Desktop Bottom Promotion