బాడీపై స్ట్రెచ్ మార్క్స్ ను ఇలా పోగొట్టుకోవొచ్చు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

స్ట్రెచ్ మార్క్స్ అనేవి చర్మంపై పడి ఉండిపోయే సన్నని గీతల్లాంటి మచ్చలు, ఇవి చర్మం ఎక్కువగా సాగటం వలన ఏర్పడతాయి. ఇవి చాలా మొండివి, తొందరగా మచ్చలుగా ఉండకుండా కలసిపోవు. ఇవి సాధారణంగా పొట్ట, హిప్స్ మరియు తొడల ప్రాంతంలో వస్తుంటాయి.

అధికంగా స్ట్రెచింగ్ హఠాత్తుగా బరువు తగ్గటం వంటి కారణాల వలన రావచ్చు. ఇది మీ చర్మాన్ని పాడుచేసి, త్వరగా మళ్ళీ పెరిగే గుణంపై ప్రభావం చూపించి పైన ఇలా మచ్చలు పడేలా చేస్తుంది.ఈ వదలని మచ్చలను వదిలించుకోటానికి చాలామంది స్త్రీలు ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు. కానీ మీరు సహజ ప్రత్యామ్నాయం కోసం చూస్తుంటే, మీ కోసమే ఈ వ్యాసం. ఈ రోజు బోల్డ్ స్కైలో మీకు ఈ మొండి స్ట్రెచ్ మార్క్స్ కి సహజ సుగంధ నూనెలతో ఎలా ముగింపు పలకవచ్చో తెలియచెప్పబోతున్నాం.అన్ని బ్యూటీ ట్రీట్మెంట్లలో తరచుగా వాడే ఈ సుగంధ నూనెలలో కణాలను తిరిగి సృష్టించడానికి ప్రేరేపించే లక్షణాలుండి, పాడైన చర్మాన్ని తిరిగి సాధారణ రూపానికి తీసుకొస్తుంది.

అవేకాక, సుగంధనూనెలలో చర్మానికి పోషణ అందించే, మచ్చలకి వ్యతిరేక లక్షణాలుండి స్ట్రెచ్ మార్క్స్ ను ముఖ్యంగా తొలగించి, మొత్తంమీద సాగే గుణాన్ని చర్మంలో మెరుగుపరుస్తాయి. ఖరీదైన చికిత్సలు ప్రయత్నించేకన్నా, ఈ కింది సుగంధ నూనెలలో ఏవైనా ప్రయత్నించి మొండి స్ట్రెచ్ మార్క్స్ కి గుడ్ బై చెప్పండి.

1.రోస్ హిప్ సుగంధ నూనె

1.రోస్ హిప్ సుగంధ నూనె

గులాబి మొక్కల విత్తనాల నుంచి తీసే ఈ సుగంధ నూనెలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ శక్తివంతమైన లక్షణాలు చర్మం మళ్ళీ బాగయ్యేట్లా చేసి, స్ట్రెచ్ మార్క్స్ కన్పడనీయకుండా తగ్గిస్తుంది.

ఎలా వాడాలి; కొన్ని చుక్కల రోజ్ హిప్ సుగంధ నూనెను మీరు రోజూ వాడే నూనెలో కలిపి, స్ట్రెచ్ మార్క్స్ పై రోజూ మసాజ్ చేయండి.

2.జొజుబా సుగంధ నూనె

2.జొజుబా సుగంధ నూనె

విటమిన్ ఎ మరియు ఇ లతో నిండి ఉన్న జొజొబా సుగంధ నూనె పాడైన చర్మాన్ని బాగుచేసే మరో చిట్కా.ఇది చర్మం తిరిగి తన పాత రూపం పొందటానికి సాయపడుతుంది. ఈ సుగంధ నూనెను క్రమం తప్పకుండా వాడటం వలన మీ మొండి స్ట్రెచ్ మార్క్స్ పోతాయి.

ఎలా వాడాలి ;ఈ సుగంధ నూనె మరియు ఆలివ్ నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట మసాజ్ చేయండి.

3.ఫ్రాంకిన్సెస్ సుగంధ నూనె

3.ఫ్రాంకిన్సెస్ సుగంధ నూనె

సహజ చికిత్సా గుణాలకి ప్రసిద్ధమైన, ఫ్రాంకిన్సెన్స్ సుగంధ నూనె మొండి స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించే మరో అద్భుతమైన చిట్కా.

ఎలా వాడాలి ; కొన్ని చుక్కల సుగంధ నూనెను మీ ప్రతి రోజు వాడే మాయిశ్చరైజర్ లో కలిపి మచ్చలున్న చోటంతా రాయండి. క్రమం తప్పకుండా ఇలా చేసి మంచి ఫలితాలు పొందండి.

4.రోజ్ మేరీ సుగంధ నూనె

4.రోజ్ మేరీ సుగంధ నూనె

రోజ్ మేరీ సుగంధనూనె చర్మం రిపేరవ్వటంలో సాయపడి, సాగే గుణాన్ని తిరిగి అందిస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని వాడటం వలన స్ట్రెచ్ మార్క్స్ కూడా పల్చబడతాయి.

ఎలా వాడాలి ; కొన్ని చుక్కల ఈ రోజ్ మేరీ నూనెను కొబ్బరినూనెతో కలిపి, మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోటల్లా మొత్తం రాయండి. స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోటానికి వారానికి 2-3సార్లు ఈ చిట్కాను వాడండి.

5.లావెండర్ సుగంధ నూనె

5.లావెండర్ సుగంధ నూనె

లావెండర్ సుగంధ నూనె మరో తప్పక ప్రయత్నించాల్సిన పదార్థం. దీనిలోని మచ్చల వ్యతిరేక లక్షణాలు చర్మం తొందరగా పూడుకునేలా చేసి, చర్మంపై మచ్చల రంగును కూడా లేతగా మార్చి తొందరగా చర్మపు రంగులో కలిపేస్తుంది.

ఎలా వాడాలి ; కొన్ని చుక్కల లావెండర్ నూనెను విటమిన్ ఇ నూనెతో కలిపి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న అన్ని చోట్లా మెల్లగా మసాజ్ చేయండి.

6.నెరోలీ సుగంధ నూనె

6.నెరోలీ సుగంధ నూనె

ఈ సుగంధ నూనె చర్మాన్ని రిపేర్ చేయటానికి, జీవం తేవడానికి ప్రసిద్ధి. అదేకాక, అది కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచి, మీ చర్మపు సాగేగుణాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలా వాడాలి; కొన్ని చుక్కల సుగంధ నూనెను బాదం నూనెతో కలిపి స్ట్రెచ్ మార్క్ ఎక్కువ ఉన్న చోట మసాజ్ చేయండి.

7. గ్రేప్ సీడ్ సుగంధ నూనె

7. గ్రేప్ సీడ్ సుగంధ నూనె

గ్రేప్ సీడ్ నూనెలో ఉండే అన్ సాట్యురేటడ్ కొవ్వుపదార్థాలు మరియు విటమిన్ ఇ స్ట్రెచ్ మార్క్స్ కి ప్రభావవంతమైన చిట్కాగా పనిచేస్తుంది.

ఎలా వాడాలి; 3-4 చుక్కల సుగంధ నూనెను ఆలోవెరా జెల్ తో కలపండి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట మొత్తం మసాజ్ చేయండి. వారానికి 3-4సార్లు ఇలా చేయటం వలన వాటి రంగు పల్చబడుతుంది.

8.పాచౌలీ సుగంధ నూనె

8.పాచౌలీ సుగంధ నూనె

పాచౌలీ సుగంధనూనెలోని చర్మం తిరిగి జీవింపచేసే లక్షణాలు, పాడైన చర్మాన్ని బాగుచేసి, చర్మంపై చిరాగ్గా కన్పించే స్ట్రెచ్ మార్క్స్ ను ఎక్కువ పెరగకుండా తొలగిస్తాయి.

ఎలా వాడాలి ; కొన్ని చుక్కల సుగంధ నూనెను మీరు రోజూ వాడుకునే మాయిశ్చరైజర్ తో కలిపి మచ్చలపై మసాజ్ చేయండి. వారంలో 2-3సార్లు ఈ ఇంటిచిట్కా పాటించి వేగవంతమైన ఫలితాలు పొందండి.

English summary

simple home remedies to remove stretch marks

simple home remedies to remove stretch marks
Story first published: Monday, January 22, 2018, 13:30 [IST]
Subscribe Newsletter