For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో తలెత్తే పాదాల దుర్వాసన సమస్యను తరిమికొట్టే తేనె-నిమ్మకాయ స్క్రబ్

|

బయట వర్షం కురుస్తుంటే, ఇంట్లో మీ చేతిలో వేడి వేడి టీ కప్పు చేతిలో పట్టుకుని, మెల్లగా తాగుతూ, మృదువైన సంగీతం వింటూ, కిటికీలోంచి, బయటకు చూస్తుంటే ఉంటుంది, అబ్బా! ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము. కానీ ఒక స్త్రీ అయినందున తీరికలేని పనిలో వర్షంలో తడుస్తూ, తడి బట్టలతో, బురద, పాదాల దుర్వాసనలతో ఆఫీస్ నుండి ఇంటికి చేరుకోవడం గుర్తుచేసుకుంటేనే, నీరసంగా ఉంది కదూ! అలా ఇంటికి చేరిన తరువాత కూడా బండెడు చాకిరి ఇంట్లో మీ కొరకు ఎదురుచూస్తూ ఉంటుంది.

వర్షాకాలం మన పరిసరాలను పచ్చగా మార్చి చెట్లను మెరిసేటట్టు చేస్తుంది. కానీ మన పాదాలు మాత్రం ఈ కాలంలో నరకయాతన అనుభవిస్తాయి. వర్షాకాలం తడి మరియు తేమతో కూడిన వాతావరణంతో ఉంటుంది. దీనికి చెమట కూడా జతకూడితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తడిసిన బూట్లు, సాక్సులు ధరించి గంటల తరబడి కార్యాలయంలో పని చేస్తే, ఆ తరువాత మన పాదాల నుండి వచ్చే దుర్వాసన భరించరానిదిగా ఉంటుంది.

పాదాల దుర్వాసనకు కారణాలేమిటి?

పాదాల దుర్వాసనకు కారణాలేమిటి?

పాదాల దుర్వాసన ప్రధానంగా, మీరు ధరించే పాదరక్షల వల్ల కలుగుతుంది. ఇది మీ పాదాలకు గాలి ఆడకపోవడం వలన ప్రధానంగా ఇది సంభవించవచ్చు. చెమట పట్టి, అది ఆరనపుడు, బ్యాక్టీరియా ఉత్పత్తికి అనువుగా మారుతుంది. పాదాలకు పట్టిన చెమట, బాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. తద్వారా ఐసోవలరిక్ యాసిడ్ ఉత్పత్తి జరిగి, దుర్వాసనను కలుగుతుంది.

• అథ్లెట్స్ ఫుట్ అనే శిలీంద్రాల వల్ల కలిగే చర్మ వ్యాధి కూడా పాదాల దుర్వాసనకు కారణమవుతుంది.

• నాణ్యత లేని మరియు పాత పాదరక్షలను ధరించడం.

• అపరిశుభ్రత మరియు కఠినమైన వాతావరణం.

• పాదాల మీద అధిక జుట్టు.

గృహవైద్య చిట్కాలను ఉపయోగించి పాదాల దుర్వాసన పోగొట్టడం ఎలా?

గృహవైద్య చిట్కాలను ఉపయోగించి పాదాల దుర్వాసన పోగొట్టడం ఎలా?

పాదాల దుర్వాసన నివారణకు గృహవైద్య చిట్కాలు ఉత్తమమైనవి. ఎందుకంటే, ఈ పదార్థాలు సహజమైనవి మరియు చర్మానికి హానికరం కాదు. పదార్థాలు పెప్పరమెంట్ , నిమ్మకాయ, ఆపిల్ సిడర్ వెనిగర్, ఎప్సోమ్ ఉప్పు, పంచదార, మొదలైనవి పాదాల దుర్వాసన నివారణకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ, ఈ రోజు మనం నిమ్మకాయ మరియు తేనెలను ఈ సమస్య పరిష్కారానికి ఎలా వినియోగించాలో తెలుసుకుందాం .

ప్రతి భారతీయ వంటగదిలో ఈ రెండు పదార్ధాలు తప్పనిసరిగా ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం? ఈ పదార్థాలను ఉపయోగించి మాయ చేసేద్దాం. మీ పాదాల దుర్వాసనకు టాటా చెపుదాం.

ఇంట్లో తేనె-నిమ్మకాయ స్క్రబ్ ను ఎలా తయారుచేయాలి?

ఇంట్లో తేనె-నిమ్మకాయ స్క్రబ్ ను ఎలా తయారుచేయాలి?

కావలసిన పదార్థాలు:

½ చెక్క తాజా నిమ్మకాయ.

½ కప్ గ్రాన్యులేటెడ్ చక్కెర.

1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె.

1 టేబుల్ స్పూన్ సేంద్రీయ తేనె

తయారీ విధానం:

తయారీ విధానం:

• ఒక గిన్నెలో, ఆలివ్ నూనె మరియు నిమ్మ రసం వేసి బాగా కలపాలి.

• ఇప్పుడు, ఈ మిశ్రమానికి తేనెను కలపాలి.

• ఇప్పుడు, దీనిలో పంచదార వేసి బాగా కలపాలి.

ఉపయోగించే విధానం:

ఉపయోగించే విధానం:

● ఒక పెద్ద టబ్ లో గోరు వెచ్చని నీటిని తీసుకోండి.

● ఇప్పుడు తేనె-నిమ్మకాయ మిశ్రమాన్ని తీసుకొని, మీ పాదాలను మర్దన చేసుకోండి. మృతకణాలు, పగిలిన చర్మం తొలగించడానికి, మీరు ఒక తడిగుడ్డను ఉపయోగించవచ్చు.

● మీ పాదాలపై మృతకణాలు, పగిలిన చర్మం తొలగిపోయాక, వాటిని తుడవకుండా గోరు వెచ్చని మీటి తొట్టిలో ఉంచండి.

● ఇప్పుడు 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.

● తరువాత మీ పాదాలను తుడుచుకుని పొడిగా ఉంచుకోండి.

● వారానికి మూడు సార్లు ఈ స్క్రబ్ ను ఉపయోగించండి.

ఇది ఎందుకు పనిచేస్తుంది?

ఇది ఎందుకు పనిచేస్తుంది?

నిమ్మకాయ:

• నిమ్మరసంలో పాదాలను మృదువుగా చేసే ముఖ్యమైన ఆమ్లాలు ఉంటాయి. దీనిలోని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు, సూక్ష్మక్రిములను నాశనం చేసి, వ్యాప్తి చెందకుండా వాటిని ఆపడానికి సహాయపడతాయి. నిమ్మకాయలోని యాస్ట్రిజెంట్ గుణాలు, చర్మరంధ్రాలను మూసివేసి అదనపు చెమట స్రవించకుండా ఆపే లక్షణాలను కలిగి ఉంటుంది.

• నిమ్మకాయ ఒక సహజ మృతకణ నివారిణిగా పనిచేస్తుంది. ఇది మృతచర్మకణాలు తొలగిస్తుంది మరియు చర్మాన్ని పునరుత్తేజితం చేస్తుంది.

• దీనిలోని ప్రకృతిసహజ ఆమ్ల లక్షణాలు, చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు తాజాగా ఉంచి, మరియు మృదువైన భావన కలిగిస్తుంది.

తేనె:

తేనె:

• తేనెలోని యాంటీసెప్టిక్ లక్షణాలు పాదాలపై ఏర్పడిన బొబ్బలు మరియు గాయాలు చికిత్సకు సహాయపడతాయి.

• తేనెలోని తేమను చేకూర్చే లక్షణాలు ఉన్నందున ఇది సహజంగా చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

• తేనె యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

వర్షాకాలంలో మీ పాదాల సంరక్షణ కొరకు తీసుకోవలసిన చిట్కాలు:

వర్షాకాలంలో మీ పాదాల సంరక్షణ కొరకు తీసుకోవలసిన చిట్కాలు:

మీరు ఆరోగ్యకరమైన మరియు దుర్వాసన లేని పాదాలను పొందడం, పరిశుభ్రమైన దినచర్య ద్వారా సాధ్యమవుతుంది. పాదాల దుర్వాసనను నివారించడానికి మీరు అనుసరించవలసిన కొన్ని చిట్కాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

• మీ పాదాలను పొడిగా ఉంచుకోండి మరియు మీ కాలివేళ్ళ మధ్య తడిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి.

• మీరు బయట నుండి ఇంటికి చేరుకున్న ప్రతిసారీ క్రిమినాశనితో మీ పాదాలను కడుక్కోండి. మురికిగా ఉండే పాదాల వలన రకరకాల జబ్బులు సంక్రమించే అవకాశం ఉంది.

• మీ చెప్పులను డిసిన్ఫెక్టెంట్ తో కడిగి, పొడిగా తుడవండి.

• పాదాలకు క్రమం తప్పకుండా ఇంటిలోనే పెడిక్యూర్ చేయండి. ఇలా చేస్తే మీ పాదాలు శుభ్రంగా ఉంటాయి.

• ఎల్లప్పుడూ రెండు జతల చెప్పులను ఉంచుకోండి. ఇలా చేస్తే వాటిని శుభ్రపరచేటప్పుడు మార్చుకోవచ్చు.

• ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి మీ పాదాలను రక్షించడానికి ఫంగల్ పౌడర్ ను ఉపయోగించండి.

• మీ బూట్లు లేదా చెప్పులు ధరించి ముందు, అవి శుభ్రంగా మరియు పొడిగా ఉన్నాయో, లేదో చూసుకోండి.

• గాలి ఆడేలా ఉండే కాటన్ సాక్స్ ధరించండి.

• వెచ్చని నీటిలో కొనెను చుక్కల సువాసన తైలం వేయి మీ పాదాలను అందులో నానబెట్టండి.

• విప్పిన వెంటనే, మీ బూట్లు మరియు చెప్పులు అల్మారాలో పెట్టకండి.

• కాన్వాస్ షూలను ధరించటం వలన కాళ్లకు చెమట అధికంగా పడుతుంది కనుక వాటిని నివారించండి.

ఆధునిక మహిళలారా! ప్రతి సమస్యను నివారించుకోవడానికి, చవకైన గృహ నివారణలు అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు వేచి చూస్తున్నారు? నిమ్మరసం, తేనె మరియు చక్కెరలలో ఉండే అద్భుతమైన లక్షణాలు ఖచ్చితంగా మీ పాదాల నుండి దుర్వాసన పారద్రోలుతాయి. కాబట్టి, ఈ వర్షాకాలంలో, అద్భుతమైన ఈ గృహ చికిత్స పద్దతులను పాటించి, మీ పాదాలను అందంగా మలుచుకోండి.

English summary

Smelly Feet During Monsoon? Try These Homemade Honey-Lemon Scrub

We all tend to take care of our face, hands and hair, but we often neglect our feet. No one likes smelly feet. Smelly feet are caused especially by the footwear you wear. It is caused primarily by a lack of ventilation for your feet. You can get rid of the smell with this simple home remedy: Lemon and honey.
Story first published: Monday, August 20, 2018, 11:15 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more