మోచేతుల నలుపు తగ్గించి, కాంతివంతంగా మార్చే 10 న్యాచురల్ రెమెడీస్

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

అమ్మాయిలు అందం విషయంలో ఏ మాత్రం రాజీపడరు అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే టాప్ టు బాటమ్ అందంగా అలంకరించుకోవడం, బాడీషేప్ ను మెయింటైన్ చేయడం అమ్మాయిలకే తగును. అందమైన ముఖం కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందమైన ముఖంతో పాటు, అందమైన చేతులు కూడా కలిగి ఉంటే మరింత అందం వస్తుంది. అయితే కొంతమందిని గమనించినట్లైతే చేతులు తెల్లగానే కనబడతాయి, కానీ మోచేతుల వద్ద నల్లగా కనబడితే అసహ్యంగా కనబడితుంది.

మోచేతులు నల్లగా కనబడటం అనేది స్త్రీ, పురుషుల్లో ఉండే ఒక సాధారణ సమస్య, ఇలాంటి సమస్యతో బాధపడే వారిలో మీరు ఒకరైతే , ఈ రోజు ఈ ఆర్టికల్ మీకోసమే. మోచేతుల వద్ద నలుపును తగ్గించి, చేతులు తెల్లగా మెరిపించడానికి, నునుపుగా మార్చడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.

simple remedies to lighten dark elbows

ఈ హోం రెమెడీస్ లో స్కిన్ బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. అలాంటి న్యాచురల్ రెమెడీస్ లో బియ్యం పిండి, బంగాళదుంప రసం, నిమ్మరసం, ఆరెంజ్ పీల్ పౌడర్ మొదలగునవి ఉన్నాయి. ఇవి మోచేతుల వద్ద నల్లని చర్మాన్ని ఎఫెక్టివ్ గా తొలగించి స్కిన్ టోన్ మార్చుతుంది.

మోచేతులు మిళమిళా మెరిసిపోవాలంటే.. ?

ఈ న్యాచురల్ పదార్థాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్ పదార్థాలు, ఖరీదు తక్కువ, మోచేతుల నలుపు తగ్గించుకోవడానికి డైలీ డైట్ లో చేర్చుకోవచ్చు.

1. బియ్యం పిండి

1. బియ్యం పిండి

ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో 3,4 టీస్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. రెండూ బాగా పేస్ట్ అయ్యే వరకూ కలపాలిజ తర్వాత మోచేతులకు అప్లై చేసి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. పొడి టవల్ తో తేమను పూర్తిగా తొలగించి మాయిశ్చరైజింగ్ అప్లై చేయాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. బంగాళదుంప జ్యూస్

2. బంగాళదుంప జ్యూస్

తాజాగా ఉండే బంగాళదుంప తీసుకుని ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసి రసం తీసి మోచేతులకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజులో రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

3. బేకింగ్ సోడ

3. బేకింగ్ సోడ

అరటీస్పూన్ బేకింగ్ సోడాకు ఒక చెంచా డిస్టిల్డ్ వాటర్ కలపాలి. ఈ పేస్ట్ ను మోచేతులకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి. ఈ ప్రత్యేకమైన రెమెడీని రోజుకు ఒకసారి అప్లై చేస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

4. పెరుగు

4. పెరుగు

తాజా పెరుగును మోచేతులకు మొదటి సారి అప్లై చేయాలి. తర్వాత చర్మం మీద అలాగా ఉండనివ్వాలి. 20-25 నిముషాల తర్వాత ట్యాప్ నీళ్ళతో కడగాలి. మంచి ఫలితాలను పొందగోరు వారు రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. అలోవెర జెల్

5. అలోవెర జెల్

ఫ్రెష్ అలోవెర లీఫ్ ను స్పూన్ తో జెల్ తీసుకోవాలి. దీన్ని మోచేతులకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రోజుకు కనీసం రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మోచేయి నలుపును నివారించడానికి 9సులభ చిట్కాలు

6. ఆరెంజ్ తొక్క పౌడర్

6. ఆరెంజ్ తొక్క పౌడర్

ఆరెంజ్ తొక్కను మెత్తగా పొడి చేసి, అందులో రెండు, మూడు టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. మెత్తగా పేస్ట్ లా అయిన తర్వాత మోచేతులకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారంలో 5,6 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

7. నిమ్మరసం

7. నిమ్మరసం

నిమ్మకాయను రెండుగా కట్ చేసి, మోచేతులకు అప్లై చేసి మర్దన చేయాలి. నిమ్మతొక్కతో మర్దన చేసిన తర్వాత అరగంట అలాగే ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. కొబ్బరి నూనె

8. కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను మోచేతులకు అప్లై చేసి మసాజ్ చేయాలి. రాత్రి నిద్రించే ముందు ఇలా చేసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మోచేతుల నలుపు తగ్గుతుంది. తర్వాత లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచిది. ఈ రెమెడీని రోజూ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

9. ఓట్ మీల్

9. ఓట్ మీల్

రెండు టీ స్పూన్ల ఉడికించిన ఓట్ మీల్ తీసుకుని అందులో 3 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత చన్నీటితో కడగాలి. ఈ రెమెడిని వారంలో రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

10. పసుపు

10. పసుపు

అరటీస్పూన్ పసుపుకు ఒక టేబుల్ స్పూన్ స్వచ్చమైన నీళ్ళు కలపాలి. మెత్తగా పేస్ట్ చేసి మోచేతులకు అప్లై చేయాలి. అప్లై చేసిన 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ సంప్రదాయ రెమెడీ రోజూ ఉపయోగిస్తుంటే , అతి తక్కువ రోజుల్లోనే మోచేతులు తళతళ మెరుస్తాయి.

English summary

10 Natural Remedies That Can Lighten Your Dark Elbows

Dark elbows is a highly common skin problem that a majority of men and women are plagued with. If you too are someone who wishes to lighten the skin on their elbows, then here is the best solution. By using these remedies you can actually lighten your dark elbows..
Story first published: Thursday, January 4, 2018, 16:30 [IST]