ఎల్లో నెయిల్స్ ని దూరం చేయడానికి అద్భుతమైన హోమ్ రెమెడీస్!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

సాధారణంగా అధికంగా నైల్ పైంట్స్ మరియు రిమూవర్లను వినియోగించే మహిళల్లో గోర్ల రంగు మారడం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ రకం గోర్లు చూడటానికి పాలిపోయి మరియు అనారోగ్యంగా కనిపిస్తాయి.

ఆ అసంఖ్యాక స్త్రీలలో మీరు కూడా ఒకరా? అయితే మీరు మీ గోళ్ళపై పసుపు పచ్చని మచ్చలని కలిగివుండటం వలన నైల్ పాలిష్ లేకుండా ఫ్రీగా ఉంచడానికి అయిష్టంగా మరియు ఇబ్బంది కరంగా ఫీల్ అవుతున్నారా? అయితే ఈ సమస్య నుండి వెంటనే బయట పడాల్సి వుంది.

మరియు, మీ గోర్లను స్టెయిన్ ఫ్రీ గా మార్చాలనుకుంటున్నారా అయితే కొన్ని హోమ్ రెమెడీస్ ని ఉపయోగించడం ద్వారా తిరిగి మీ గోర్లను ఆరోగ్యకరంగా మార్చవచ్చు.

మీ గోర్లను పసుపు రంగునుండి మృదువైన సాధారణ రంగులోకి తీసుకురావడానికి కొన్ని సులభమైన నివారణ పద్ధతులను మీ కోసం తెలియజేశాము అవేంటో ఇప్పడు చుద్ద్దాం.

క్రింద పేర్కొన్న అన్ని నివారణల పద్దతులలో గోళ్ళ చిగుర్లనుండి చెడు ని బయటకి పంపించి రంగు

మారే సమస్యను పరిష్కరించగల బ్లీచింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి. ఈ రెమెడీస్ ని ప్రయత్నించడానికి మీ సమయంలో కొన్ని నిముషాలు మాత్రం కేటాయిస్తే చాలు నైల్ పోలిష్ లేకుండా ఆరోగ్యకరమైన గోళ్ళని మీ సొంతం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఆ అద్భుతమైన నివారణ పద్ధతులను చూద్దాం:

1. బేకింగ్ సోడా

1. బేకింగ్ సోడా

బేకింగ్ సోడా లో ఎల్లో స్టైన్స్ ని తొలగించే సామర్థ్యాన్ని కలిగివుంటుంది ఇందులో ఇంకా ఎక్సఫోలియాటింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది. కేవలం 3-4 టీస్పూన్స్ మినరల్ వాటర్ లో 2 స్పూన్ల బేకింగ్ సోడాని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ గోళ్ళమీద అప్లై చేసి కాసేపు ఉండనిచ్చి తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. మీ గోళ్ళ నుండి పసుపు రంగు మచ్చలను దూరం చేసుకోవాలనుకుంటే వారానికి ఒకసారి దీనిని ప్రయత్నించండి.

2. టీ ట్రీ ఆయిల్

2. టీ ట్రీ ఆయిల్

ఎల్లో స్ట్రయిన్స్ ని తొలగించడానికి టీ ట్రీ ఆయిల్ మరొక ప్రభావవంతమైన రెమెడీ గా చెప్పవచ్చు. ఈ మిశ్రమాన్ని తయారుచేయడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం కొన్ని చుక్కల ఆయిల్ ఆయిల్ లో టీ ట్రీ ఆయిల్ ని కలిపి ప్రభావితమైన ప్రాంతాలలో అప్లై చేయండి. దీనిని 10-15 నిమిషాల పాటు పొడిగా ఉంచండి తర్వాత, గోరు వెచ్చని నీటితో మీ గోళ్ళతో శుభ్రం చేసుకోండి. స్టెయిన్ ఫ్రీ గోల్స్ సాధించడానికి ప్రతిరోజూ దీనిని ప్రయత్నిస్తూ వుండండి.

3. ఆపిల్ సైడర్ వినెగార్

3. ఆపిల్ సైడర్ వినెగార్

ఆపిల్ సైడర్ వినెగార్ లో వున్న ఆమ్ల లక్షణాలు మీ గోళ్ళపై ప్రభావవంతంగా పనిచేసి గోళ్లమీది పసుపురంగును సులభంగా పోగొడుతుంది. ఒక చిన్న గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో కేవలం ½ టీస్పూన్ ఆపిల్ సైడర్ వినెగార్ ని కలపండి. ఇప్పడు మీ గోర్లని అందులో 5-10 నిమిషాల పాటు ముంచండి. మీ గోర్లపై పసుపు రంగుని పోగొట్టడానికి ఈ సులభమైన హోమ్ రెమెడీ ని వీలున్నప్పుడల్లా ప్రయత్నిచండి.

4. హైడ్రోజన్ పెరాక్సైడ్

4. హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ గోర్లను తిరిగి ఆరోగ్యంగా చేయడానికి ఒక ప్రభావవంతమైన బ్లీచింగ్ ఎజెంట్లతో నిండి ఉంటుంది. వెచ్చని నీటితో నింపిన పెద్ద గిన్నెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ 1 టేబుల్ స్పూన్ కలపండి. ఇప్పుడు ఈ ద్రావణంలో మీ తడిసిన గోర్లు సోక్ చేయండి. ఇలా 3-4 నిమిషాలు పాటు ముంచి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. స్టెయిన్ లేని గోర్లు పొందడానికి ప్రతివారం ఈ ప్రక్రియను పునరావృతం చేయండి.

5. ఆరెంజ్ జ్యూస్

5. ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ లో సిట్రిక్ ఆమ్లం సమృద్ధిగా లభిస్తుంది. ఇది పసుపు రంగు గోర్లను తెల్లగా చేస్తుంది. తాజాగా సేకరించిన నారింజ రసంలో పత్తిని ముంచి మీ గోర్లపై రుద్దండి. మీ గోర్లను నీటితో కడగటానికి ముందు 4-5 నిముషాల పాటు రసాలను గోర్లపై ఉంచడం వలన అద్భుతమైన ఫలితాలని పొందుతారు. అనుకూలమైన ఫలితాల కోసం ఈ హోమ్ రెమెడీ ని ఒక వారంలో 2-3 సార్లు ప్రయత్నించవచ్చు.

6. విటెనింగ్ టూత్పేస్ట్

6. విటెనింగ్ టూత్పేస్ట్

విటెనింగ్ టూత్పేస్ట్ మీ గోళ్ళ మీద వున్న పసుపురంగుని తొలగించటానికి ఉపయోగపడుతుంది. జస్ట్ మీ గోర్ల పై ఈ టూత్ పేస్టు ని కొద్దిగా అప్లై చేసి మరియు గోరు వెచ్చని నీటితో కడగడానికి ముందు ఒక 10-15 నిమిషాలు ఆరనివ్వాలి. శుభ్రమైన మరియు స్పష్టమైన గోర్లని మీ సొంతం చేసుకోవడానికి ఒక వారంలో 2-3 సార్లు దీనిని ప్రయత్నించవచ్చు.

7. జునిపెర్ బెర్రీస్

7. జునిపెర్ బెర్రీస్

జునిపెర్ బెర్రీలు పసుపురంగు గోర్లపై అద్భుతాలను చేస్తాయి, ఎందుకంటే వీటిలో క్రిమిసంహారకాలను నాశనం చేసే మరియు వైటినింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి. 5-6 జునిపెర్ బెర్రీలను స్మాష్ చేసి 1 టీస్పూన్ రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని మీ గోళ్ళపై అప్లై చేసి, 20 నిమిషాలు అక్కడే వదిలేయండి. రంగుమారిన మీ గోర్లను ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఒక వారంలో ఈ 4-5 సార్లు ఈ ప్రక్రియని రిపీట్ చేయండి.

English summary

Wonderful Remedies For Yellow Nails That Actually Work

Excessive usage of nail paints and removers can lead to discolouration. And, stained nails look unappealing and unhealthy. Home remedies are the best ways to cure yellow nails, using home remedies such as baking soda, apple cider vinegar, etc., can quickly help you get rid of yellow nails.