For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తెలుసుకోవలసిన ఐలైనర్ చిట్కాలు మరియు ఉపాయాలు.

|

"పక్షి రెక్కల వలె అందమైన "విన్గ్డ్ ఐలైనర్" కలిగి ఉన్న ఏ మహిళను కూడా ఎందుకు ఆలస్యమైంది అని అస్సలు అడగవద్దు". ఆ అందం వెనుక ఉన్న కష్టం వారికి మాత్రమే తెలుసు. మేకప్ వేసుకోవడం అనుకున్నంత తేలికైన విషయమైతే కాదు. దీని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. చర్మం ఎటువంటి అనర్ధాల బారిన పడకుండా, ముఖాన్ని అందంగా కనిపించేలా చేయడం దృష్ట్యా, ఎన్నోప్రణాళికలు, మెళకువలు, విజ్ఞానం అవసరమవుతుంది. ఆ క్రమంలో భాగంగానే, ఈ వ్యాసానికి ఉపక్రమించడం జరిగింది.

ఇక ఐలైనర్ విషయానికి వస్తే, పరిపూర్ణంగా ఐలైనర్ దిద్దడమనేది మేకప్లో ఎంతో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఈ ఐ లైనర్ కళ్ళకు మాత్రమే కాకుండా, మిగిలిన మేకప్ మొత్తానికి అదనపు సొగసును అద్దినట్లుగా ఉంటుంది. క్రమంగా ముఖాన్ని అద్భుతంగా చూపడంలో ఐలైనర్ కీలకపాత్ర పోషిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఒక చిన్న మార్పు లేదా, తేడా మిగిలిన మేకప్ మొత్తం మీద సానుకూల లేక ప్రతికూల ప్రభావాన్ని చూపగలదు. కావున మేకప్ విషయంలో ఐలైనర్ దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కొంత మంది మహిళలకైతే, కేవలం ఒక్క ఐలైనర్ మొత్తం మేకప్ పూర్తి చేసిన రూపాన్ని అందిస్తుంది. ఇక మీరే అర్ధం చేసుకోవచ్చు, ఐలైనర్ ప్రాముఖ్యత ఎలాంటిదో.

మహిళలు మేకప్ అనుసరించినా, అనుసరించకపోయినా ఐలైనర్ మాత్రం తప్పనిసరిగా వినియోగించడం జరుగుతుంటుంది. అవునా ? కాకపోతే దీనికి సంబంధించిన మెళుకువలు తప్పనిసరిగా తెలిసిఉండాలి. క్రమంగా కొందరు ఐలైనర్ కి దూరంగా కూడా ఉంటుంటారు. అందులోనూ విన్గ్డ్ ఐలైనర్ అప్లై చేయడం కొంచం కష్టతరం. అయితే ఆ కష్టాలకు ఇప్పుడు చెక్ పెట్టబోతున్నాం. ఈరోజు ఈ వ్యాసం ద్వారా, కను రెప్పల మీద ఐలైనర్ అప్లై చేయడంలో పాటించాల్సిన చిట్కాల గురించిన వివరాలను సంపూర్ణంగా తెలుసుకుందాం. కళ్ళకే కాకుండా, మీ ముఖాన్ని ఉన్నతంగా చూపడంలో సహాయం చేసే ఐలైనర్ సంబందిత చిట్కాలు మరియు ఉపాయాల గురించిన సమగ్ర వివరణను తెలుసుకునే క్రమంలో భాగంగా వ్యాసంలో ముందుకు సాగండి.

ఖచ్చితమైన ఐలైనర్ అప్లై చేయడానికి సూచించదగిన చిట్కాలు :

1. మీ ఐలైనర్ ఎంచుకోవడం :

1. మీ ఐలైనర్ ఎంచుకోవడం :

ఇప్పుడు మార్కెట్లో వివిధ రకాల ఐలైనర్లు అందుబాటులో ఉన్నాయి. అవి వరుసగా పెన్సిల్ ఐలైనర్, లిక్విడ్ ఐలైనర్ మరియు జెల్ ఐలైనర్. సాధారణంగా పెన్సిల్ ఐలైనర్లు వినియోగించడం తేలికగా ఉంటుంది, కానీ లిక్విడ్ ఐలైనర్ వినియోగించడం కష్టతరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఐలైనర్ వినియోగించడం మొదటిసారైతే, మీరు పెన్సిల్ ఐలైనర్ తో ప్రారంభించడం ఉత్తమం. క్రమంగా, అలవాటైన తరువాత జెల్ మరియు లిక్విడ్ ఐలైనర్లకు మారవచ్చు. తరచుగా మహిళలు పెన్సిల్ ఐలైనర్ల వైపే ఎక్కువగా మొగ్గుచూపడం కూడా గమనించవచ్చు. దీనికి కారణం, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడమే. కానీ సమయం ఉన్నప్పుడు పలురకాలు ప్రయత్నించి, మీకు ఉత్తమమైన ఐలైనర్ ఎంపిక చేసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. ఈ పెన్సిల్ ఐలైనర్ అప్లై చేయడం ద్వారా, ఇది మీకు గ్రిప్ అందించడమే కాకుండా, మీ మేకప్ దృష్ట్యా ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది. కావున ఐలైనర్ అప్లై చేసేటప్పుడు పాటించవలసిన మొదటి నియమంగా ఐలైనర్ ఎంపిక ఉంటుంది.

2. చేతులు నిలకడగా ఉండేలా జాగ్రత్త పడడం :

2. చేతులు నిలకడగా ఉండేలా జాగ్రత్త పడడం :

ఐలైనర్ అప్లై చేస్తున్నప్పుడు మనం చేసే పెద్ద పొరపాటు మన చేతులను కదిలించడం. మీరు ఐలైనర్ ఈ మద్యనే ప్రారంభించిన వారైతే ఈ సమస్యను తరచుగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే, చేతులను స్థిరంగా ఉపయోగించి ఒక ఖచ్చితమైన ఐలైనర్తో మాత్రమే అప్లై చేయాలని గుర్తుంచుకోండి. ఐలైనర్ అప్లై చేయునప్పుడు, మీ చేతులు సాధ్యమైనంత నిలకడగా ఉండేలా ప్రయత్నించండి. లేనిచో ఎగుడు దిగుడులకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. చేతులను నిలకడగా ఉంచడం అసాధ్యమైన విషయమేమీ కాదు. కాకపోతే కొంచం పట్టుదల అవసరమని గుర్తుంచుకోండి.

3. మిమ్మల్ని మీరు సౌకర్యవంతంగా మలచుకోండి :

3. మిమ్మల్ని మీరు సౌకర్యవంతంగా మలచుకోండి :

ఐలైనర్ అప్లై చేసేటప్పుడు మిమ్ములను మీరు సౌకర్యవంతమైన భంగిమలో ఉండునట్లు చూసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. ఇది ఐలైనర్ మృదువుగా వచ్చేందుకు సహాయం చేస్తుంది. సరైన లైటింగ్ మరియు అద్దం కలిగి ఉండడంతో పాటుగా, మీరు సౌకర్యవంతమైన పొజిషన్లో ఉన్నట్లుగా ధృవీకరించుకోండి. ఐలైనర్ అప్లై చేసేటప్పుడు మీ దేహం ఒత్తిడికి లోనుకాకూడదని గుర్తుంచుకోండి.

4. కళ్ళను స్ట్రెచ్ చేయకండి :

4. కళ్ళను స్ట్రెచ్ చేయకండి :

ఐలైనర్ వర్తించునప్పుడు, తరచుగా కొందరు కంటి చర్మం లాగేందుకు మొగ్గు చూపుతుంటారు. కొందరికి ఈ పద్దతి ఐలైనర్ అప్లై చేయడానికి ఒక మంచి మార్గంగా కనిపించవచ్చు, అయితే, ఐలైనర్ అప్లై చేసిన తర్వాత, చర్మాన్ని విడిచిపెట్టిన వెంటనే మీ ఐలైనర్ గందరగోళంగా ఉంటుంది. పైగా తరచుగా చర్మాన్ని లాగడం మంచిది కాదు. కాబట్టి కళ్ల మీద ఎటువంటి ఒత్తిడి కలుగజేయకుండా, మరియు వాటిని పట్టి లాగకుండా యధాస్థానంలోనే ఉంచి ఐలైనర్ వేసేందుకు ఉపక్రమించండి. క్రమంగా, ఈ పద్దతి మీకు మరింత ఖచ్చితమైన ఐలైనర్ ఇస్తుంది.

5. పరిపూర్ణమైన ఐలైనర్ కొరకు టైట్ లైనింగ్ :

5. పరిపూర్ణమైన ఐలైనర్ కొరకు టైట్ లైనింగ్ :

మీ కంటి వాటర్ లైన్ మీదుగా, ఐలైనర్ దట్టంగా అప్లై చేయడాన్ని టైట్ లైనర్ అని వ్యవహరించడం జరుగుతుంది. వాటర్ లైన్ మీద టైట్ లైనర్ చేయడం ద్వారా అది మరింత దట్టంగా అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఐలైనర్ ఎక్కువగా వినియోగించకూడదు అని భావించేవారికి, ఈ ట్రిక్ బాగా పనిచేస్తుంది.

6. ఐషాడో ని ఐలైనర్ గా వినియోగించడం :

6. ఐషాడో ని ఐలైనర్ గా వినియోగించడం :

మీరు ఒక బ్లాక్ ఐషాడో లేదా ఏదేని ఇతర డార్క్ ఐషాడోని లైనర్ వలె ఉపయోగించవచ్చు. ఐలైనర్ బ్రష్ ఉపయోగించి, ఐషాడోను ఐలైనర్ వలె అప్లై చేయండి. ఈ ట్రిక్ ఐలైనర్ చక్కగా వచ్చేందుకు దోహదపదడమే కాకుండా, మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుంది. మీరు కోరుకున్న స్థాయికి చేరుకోవాలంటే, పలుమార్లు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.

7. పెన్సిల్ లైనర్ను బేస్ గా ఉపయోగించాలి :

7. పెన్సిల్ లైనర్ను బేస్ గా ఉపయోగించాలి :

మనం ముందు చెప్పుకున్నట్లుగా పెన్సిల్ లైనర్లు ఉపయోగించడం అత్యంత సులువుగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక గొప్ప ట్రిక్ వలె పనిచేస్తుంది. క్రమంగా ఇక్కడ మీ బేస్ గా పెన్సిల్ లైనర్ వినియోగించడం ఉత్తమంగా సూచించబడింది. మొదట పెన్సిల్ లైనర్ ఉపయోగించి కళ్లకు లైన్ ఇవ్వండి. ఆ లైన్ తో మీరు సంతృప్తి చెందిన తర్వాత, పరిపూర్ణత కోసం జెల్ లేదా లిక్విడ్ లైనర్ అప్లై చేయవలసి ఉంటుంది. కానీ మొదటి సారి ఐలైనర్ వాడకం ప్రారంభించిన వారు, జెల్ మరియు లిక్విడ్ లైనర్లకు కాస్త దూరంగా ఉండడమే మంచిది.

8. చుక్కలను అనుసంధానించే పద్ధతి :

8. చుక్కలను అనుసంధానించే పద్ధతి :

మీరు ఐలైనర్ ఉపయోగించడంలో ప్రధమ దశలోనే (న్యూబీ) ఉన్న ఎడల, ఐలైనర్ వినియోగించడం కొంచం కష్టతరంగా ఉంటుంది. మరియు మీ ఐలైనర్ సరిగ్గా అప్లై కాకపోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే పద్దతి అనేక మంది పరీక్షించి, ప్రయత్నించి ఫలితాలు సాధించిన ఉత్తమమైన పద్దతిగా చెప్పబడుతుంది. ఇక్కడ మనం చేయవలసిన పని ఏమిటంటే, అప్పర్ లాష్ లైన్ మీద పరిమిత దూరంలో డాట్ మార్క్స్ ఉంచి, ఐలైనర్తో ఆ డాట్స్ కలపండి. కానీ ఈ పద్దతిలో మీ చేతులు నిలకడగా, స్థిరంగా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. మీరు కోరుకునే రూపంలోకి వచ్చే వరకు ఒకటికి రెండు సార్లు ఐలైనర్ వర్తించండి.

9. వింగ్ డిజైన్ గురించి :

9. వింగ్ డిజైన్ గురించి :

వింగ్ డిజైన్ (పక్షి రెక్కల వలె) కోసం వెళ్ళడానికి ముందు మీరు కోరుకునే వింగ్ పొడవును నిర్ధారించుకోండి. మీకు ఆ వింగ్ డిజైన్ చిన్నదిగా ఉండాలా, మధ్యస్థంగా ఉండాలా లేదా పొడవాటి వింగ్ కావాలా అనేది మొదటగా నిర్ణయించుకోవలసిన అంశంగా ఉంటుంది. తరచుగా కొందరు కంటి ఆకారం లేదా మనం కోరుకునే లుక్ పరంగా ప్రణాళికలు చేస్తున్నామా లేదా, అన్న విషయాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోకుండా ఐలైనర్ వర్తిస్తుంటారు. ఒకవేళ మీరు డ్రమటిక్ లైనర్ కోరుకునే వారిగా ఉన్న ఎడల, లాంగ్ వింగ్ లైనర్ అనుసరించండి. ఒకవేళ రోజూవారీ మేకప్లో భాగంగా లేదా కార్యాలయం పరంగా మేకప్ చేసుకునేవారైతే, వింగ్ డిజైన్ చిన్నదిగా ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. కావున మీకు ఎటువంటి లైనర్ కావాలి., అన్న ఆలోచన మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా కళ్ళ మీదుగా మరొక లేయర్ (హూడెడ్ ఐ) ఎక్కువగా కనిపిస్తున్న వారికి, మందపాటి వింగ్ డిజైన్ నప్పక పోవచ్చు.

10. పంక్తి, పూరణ :

10. పంక్తి, పూరణ :

ఒకవేళ మీరు విన్గ్డ్ లైనర్ కోసం ఆలోచిస్తుంటే, ముందుగా దాన్ని గీసి, ఆపై గ్యాప్ నింపేలా ప్లాన్ చేయండి. దీనికోసం కంటి కొన నుంచి లైనింగ్ ప్రారంభించి, మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా, మీ కనుబొమ్మ చివరి వరకు, వింగ్ లైన్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వింగ్ కొన నుంచి, మీ అప్పర్ ల్యాష్ లైన్ వైపుకు ఒక చిన్న లైన్ గీయండి. అప్పర్ లాష్ లైన్ మీద, మధ్య చేరిన ఖాళీలను నింపి స్ట్రోక్ ఇవ్వండి. క్రమంగా దట్టమైన ఆకృతిలో, మీరు కోరుకున్న రీతిలో వింగ్డ్ లైన్ పొందగలరు. ఓవర్ బోర్డ్ వెళ్లకూడదని నిర్ధారించుకోండి, లేనిచో లైనర్ మరింత దట్టంగా తయారై మేకప్ మీద ప్రభావాన్ని చూపవచ్చు.

11.కాట్ ఐలైనర్ కొరకు టేప్ పద్ధతి :

11.కాట్ ఐలైనర్ కొరకు టేప్ పద్ధతి :

కాట్ వింగ్డ్ ఐలైనర్ కోసం ఒక వినూత్న పద్దతిని అనుసరించవలసి ఉంటుంది. కాట్ ఐలైనర్ అనుసరించడానికి ఒక టేప్ అవసరం ఉంటుంది. మీ కంటి కొనల నుండి చివరల వరకు ఒక పద్ధతి ప్రకారం టేప్ ఉపయోగించి, ఆపై ఐలైనర్ ఉపయోగించి గీతను గీయవలసి ఉంటుంది. ఆ తర్వాత పైన చెప్పినట్లు పంక్తి - పూరణ(10) విధానాన్ని అనుసరించవలసి ఉంటుంది. పదునైన ఐలైనర్ కోసం ఈ ట్రిక్ ఉత్తమంగా పనిచేస్తుంది.

12. చిన్న చిన్న తప్పులను సవరించడానికి కాన్సీలర్ వినియోగించండి :

12. చిన్న చిన్న తప్పులను సవరించడానికి కాన్సీలర్ వినియోగించండి :

మీరు కేవలం ఐలైనర్ తో మేకప్ మొదలు పెట్టిన పక్షంలో, మీరు తరచుగా తప్పులు చేయడం సుస్పష్టం. అయితే, అందుకు నిరుత్సాహపడనవసరం లేదు. మరియు పూర్తిగా తొలగించనవసరం కూడా లేదు. ఆ చిన్ని తప్పులను సవరించడానికి కాన్సీలర్ ఉపయోగించవచ్చు. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అయినప్పటికీ, ఉత్తమంగా పనిచేస్తుంది.

13. ఐషాడో వినియోగం ద్వారా ఐలైనర్ ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవచ్చు :

13. ఐషాడో వినియోగం ద్వారా ఐలైనర్ ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవచ్చు :

మీ ఐలైనర్ ఎక్కువసేపు ఉండేలా చూడడంలో ఈ ట్రిక్ ఏంతో ఉత్తమంగా పనిచేస్తుంది. మీ ఐలైనర్ మేకప్ పూర్తైన తరువాత, ముదురు నలుపు రంగులోని ఐషాడో తీసుకుని, ఐలైనర్ బ్రష్ సహాయంతో మీ ఐలైనర్ మీద మరల అప్లై చేయండి. ఇది ఐలైనర్ స్థానాన్ని లాక్ చేస్తుంది. మరియు ఎక్కువసేపు ఐలైనర్ ఉండేందుకు దోహదపడుతుంది.

14. మస్కారాను ఐలైనర్ వలె వినియోగించడం :

14. మస్కారాను ఐలైనర్ వలె వినియోగించడం :

మీరు సరైన ఐలైనర్ కోరుకుంటున్న ఎడల, ఇది ఒక ఉపయోగకరమైన మరియు అద్భుతమైన ట్రిక్ వలె పనిచేయవచ్చు. కానీ కేవలం మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, ఈ ట్రిక్ ఒక సూచనగా ఉంటుంది తప్ప, అన్ని వేళలా కాదు. కనురెప్పల మీద 2 నుండి 3 మార్లు మస్కారాను దరఖాస్తు చేయడం ద్వారా, కనురెప్పల కుదుళ్ళకు ప్రత్యేకమైన ఆకర్షణను అందివ్వగలరు. క్రమంగా ఇది ఐలైనర్ లుక్ ఇస్తుంది.

15. కనురెప్పల కర్లర్ ఉపయోగించడం :

15. కనురెప్పల కర్లర్ ఉపయోగించడం :

అత్యవసర సమయాలలో పాటించదగిన ట్రిక్స్ లో ఇది కూడా ఒకటి. సమయం తక్కువగా ఉన్న పక్షంలో ఐలైనర్ కోసం సమయం వెచ్చించడం జరగని పని. కావున. ఐలైనర్ కర్లర్ మీద ఐలైనర్ కోట్ వేసి, మీ కనురెప్పల మీద కర్లర్ ఉపయోగించి, నెమ్మదిగా అప్లై చేయండి. ఇక మీ ఐలైనర్ పని పూర్తైనట్లే.

16. సాధనమున పనులు …..

16. సాధనమున పనులు …..

సాధనమున పనులు సమకూరు ధరలోన అని అన్నాడు కవి వేమన. అలాగే, మీరు ఈ ఐలైనర్ పరంగా సాధన చేసే కొలదీ, మీకు మీరే కొత్త ట్రిక్స్ కనుగొనగలరు. మరియు నలుగురికీ తగిన సూచనలను ఇవ్వగలరు. ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ఎవరికీ తెలీదు కనుక. రేపు ఒక్కసారిగా, మీ పిల్లలకు మీరే బ్యూటీషియన్ కావలసిన పరిస్థితులు తలెత్తుతాయి. కావున సమయానుసారం మిమ్ములను మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి. ఈ కారణం చేతనే మా బోల్డ్స్కై టీం మీకు ఎప్పటికప్పుడు సామాజిక, జీవనశైలి అంశాల పరంగా తగిన చిట్కాలను అందజేస్తూనే ఉంటుందని మరువకండి.

పైన చెప్పిన ఈ 16 చిట్కాలు మాత్రమే ప్రామాణికాలు కాదు. కాకపోతే, మీకు పూర్తిస్థాయిలో ఐలైనర్ అలవాటు పడేందుకు మాత్రం ఖచ్చితంగా సహాయం చేయగలవని చెప్పగలం. ఒక్కసారి మీరు ఐలైనర్ అలవాటు పడితే, మీకు మీరే మేకప్ క్వీన్ అవగలరు. కాకపోతే పైనచెప్పినట్లు సాధన అవసరం.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

16 Eyeliner Tips That You Need To Know!

Applying a perfect liner can be a tricky and messy job. Here are some tips that will help you get perfectly lined eyes.
Desktop Bottom Promotion