For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వుల నూనెలో దాగున్న ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్

|

అనేక చర్మ సంబంధిత సమస్యలకు సూచించదగిన సహజ సిద్దమైన గృహ చిట్కాలలో నువ్వుల నూనె కూడా ఒకటిగా ఉంటుంది. ఇది చర్మానికి, శరీరానికి, జుట్టు సంబంధిత సమస్యలకు కూడా ఒక చక్కటి పరిష్కారంగా ఉంటుందని చెప్పబడింది.

జిడ్డు చర్మం, పొడి చర్మం లేదా సాధారణ చర్మం కలిగి ఉన్నా కూడా ఈ చిట్కా ఉత్తమంగా పనిచేస్తుంది. అనగా అన్ని రకాల చర్మాలకు అత్యుత్తమంగా సహాయపడగలదని చెప్పబడింది. నువ్వుల నూనెను నేరుగా కానీ, ఇతర పదార్ధాలతో కానీ కలిపి వినియోగించవచ్చు. పైగా ఎటువంటి దుష్ప్రభావాలు లేనిదిగా సూచించబడుతుంది.

 Sesame Oil
 

వాస్తవానికి నువ్వుల నూనెను అనేకరకాల క్రీములు, మందులు, సబ్బులు, లోషన్స్ మరియు బాడీ స్క్రబ్స్ వంటి సౌందర్య సాధనాలలో ప్రముఖంగా వాడడం జరుగుతుంటుంది. దీనిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలే ఇందుకు కారణం. ఈ నువ్వుల నూనె మొటిమలు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు, ముడతలు, చారలు, బ్లాక్ హెడ్స్, డార్క్ సర్కిల్స్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలను చికిత్స చేసేందుకు వినియోగించబడుతుంది. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీచర్మానికి మంచి మాయిశ్చరైజర్ వలె పనిచేస్తూ, మరోపక్క చర్మాన్ని మృత కణాల బారినుండి కాపాడడంలో కూడా ఉత్తమంగా సహాయం చేస్తుంది.

ఈ కథనంలో నువ్వుల నూనెను ఉపయోగించి ఆచరించదగిన సౌందర్య ప్రయోజనాలను తెలుసుకుందాం. అలాగే, మనం తరచుగా ఎదుర్కొనే చర్మ సమస్యలను నువ్వుల నూనె ఉపయోగించి ఏవిదంగా పరిష్కరించవచ్చో ఇప్పుడు చూద్దాం.

1. మొటిమలను నయం చేస్తుంది :

1. మొటిమలను నయం చేస్తుంది :

చర్మం మీద పిహెచ్ బ్యాలెన్స్ నిర్వహించడం ద్వారా అదనపు నూనెలని నియంత్రించడానికి నువ్వుల నూనె ఉత్తమంగా సహాయపడుతుంది. క్రమంగా ఇది సెబం అధిక ఉత్పత్తిని నివారించి మొటిమలు మరియు మచ్చలను తగ్గించడంలో సహాయపడగలదని చెప్పబడింది.

రోజువారీ వినియోగంలో భాగంగా 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి అనుసరించాల్సి ఉంటుంది. మొటిమలు మరియు మచ్చలు ఉన్న ప్రభావిత ప్రాంతాలలో కాటన్ ప్యాడ్ ఉపయోగించి ఈ ద్రావణాన్ని అప్లై చేయండి. ఉత్తమ ప్రయోజనాల కొరకు ప్రతిరోజూ అనుసరించండి.

2. పొడి చర్మాన్ని నివారిస్తుంది :

2. పొడి చర్మాన్ని నివారిస్తుంది :

మనలో అత్యధికులు ఎదుర్కొనే ప్రధాన చర్మ సంబంధ సమస్యలలో పొడి చర్మం కూడా ఒకటి. డ్రై స్కిన్ నివారించడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. కానీ నువ్వుల నూనె ఒక టోనర్ రూపంలో కూడా వినియోగించగల ఉత్తమ చిట్కాగా ఉంటుంది. ఈ నువ్వుల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, చర్మాన్ని యవ్వనంగా మరియు తాజాగా కనిపించేలా చేస్తుంది.

ఒక స్ప్రే బాటిల్లో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, 1 చెంచా రోజ్ వాటర్ కలపండి. వాటిని బాగా మిక్స్ చేయండి. మాయిశ్చరైజర్ను అప్లై చేయడానికి ముందు టోనర్గా మీ ముఖంపై స్ప్రే చేస్తుండండి. ఇలా ప్రతిరోజూ అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించగలరు. దీన్ని రీఫ్రిజిరేటర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు.

3. పెదాలను మెత్తగా ఆరోగ్యవంతంగా చేస్తుంది :
 

3. పెదాలను మెత్తగా ఆరోగ్యవంతంగా చేస్తుంది :

నువ్వుల నూనె మీ పెదాలకు కూడా మంచి టోన్ ఇవ్వడంలో సహాయపడుతుంది, తద్వారా మీ పెదవుల రంగును సహజంగా ప్రకాశవంతంగా చేస్తుంది. సాధారణంగా నువ్వుల నూనెను తరచుగా మీ పెదాలపై వాడడం ద్వారా, మీ పెదాలు మృదువుగా, మంచి రంగుతో ఆరోగ్యంగా తయారవుతాయని చెప్పబడింది.

ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు నువ్వుల నూనెను పెదాలపై అప్లై చేయడం ఒక పద్ధతి. కానీ మీరు తక్షణ ఫలితాను కోరుకుంటున్న వారైతే, క్రింద పేర్కొన్న ప్రత్యామ్నాయాన్ని ప్రయత్నించవచ్చు.

కొన్ని బీట్రూట్ ముక్కలను కత్తిరించి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన ముక్కలను పొడి రూపంలోకి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని చిటికెడు తీసుకుని, 1 చెంచా నువ్వుల నూనెకు కలపండి. ఈ మందపాటి మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి 10 నిముషాలు ఆరనివ్వాలి. 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో కనీసం ఒకసారి అనుసరించండి.

4. మేకప్ రిమూవర్ :

4. మేకప్ రిమూవర్ :

మేకప్ రిమూవర్ కోసం పెట్టుబడి పెట్టే బదులుగా, మేకప్ తొలగించడానికి సులభమైన మరియు సహజమైన మార్గంగా నువ్వుల నూనె వాడకం ఉంటుంది.

ఒక కాటన్ బాల్ తీసుకుని నువ్వుల నూనెలో ముంచి, మేకప్ తొలగించడానికిగాను మీ ముఖాన్ని మృదువుగా తుడవండి. మేకప్ మొత్తం మీ ముఖం నుండి తొలగించేంత వరకు ఈ దశను పునరావృతం చేయండి. ప్రతిరోజూ, పడుకునే ముందు ఈ విధంగా అనుసరించడం ద్వారా, ఇది మేకప్ తొలగించడం కోసం మాత్రమే కాకుండా, మీ చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

5. పగిలిన మడమల చికిత్స కోసం :

5. పగిలిన మడమల చికిత్స కోసం :

నువ్వుల నూనె, రోజ్ వాటర్ వంటివి పగిలిన మడమల చికిత్సకి ఉత్తమంగా పనిచేస్తాయి. నువ్వుల నూనెను, రోజ్ వాటర్ను సమాన మోతాదులో తీసుకుని, ప్రతి రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మీ పాదాల మీద రుద్దండి. మరుసటి రోజు గోరువెచ్చని నీటితో రుద్ది కడగండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ అనుసరించండి. బెడ్ మీద నువ్వుల నూనె మరకలు పడకుండా, శుభ్రమైన కాటన్ సాక్సులు వాడడం, లేదా కాళ్ళ దగ్గర ఏదైనా షీట్ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.

6. టానింగ్ నివారిస్తుంది :

6. టానింగ్ నివారిస్తుంది :

వాస్తవానికి ఈ వేసవి కాలంలో టానింగ్ అతి పెద్ద చర్మ సంబంధిత సమస్యగా ఉంటుంది. ఏ కాలంలో ఎలా ఉన్నా, వేసవి కాలంలో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చర్మం మీది టానింగ్ సమస్యకు వ్యతిరేకంగా నువ్వుల నూనెను ఉపయోగించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఒక గిన్నెలో 1 చెంచా శెనగ పిండి తీసుకొని, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనెను చేర్చి చిక్కగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయండి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఉత్తమ ఫలితాల కోసం కనీసం రోజుకొకసారి అనుసరించండి.

7. జుట్టు చిక్కుపడడం తగ్గిస్తుంది :

7. జుట్టు చిక్కుపడడం తగ్గిస్తుంది :

ప్రతి మహిళకు పొడి మరియు దెబ్బతిన్న జుట్టు ఎల్లప్పుడూ ఒక పీడకలగానే ఉంటుంది. ఈ సమస్యకు గృహ చిట్కాగా నువ్వుల నూనె సహాయం చేస్తుంది. మీ జుట్టు పొడవును బట్టి, కొంత నువ్వుల నూనెను తీసుకోండి. దీన్ని తలపై మరియు జుట్టుకు పూర్తి స్థాయిలో అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. 30 నిమిషాలపాటు అలానే విడిచిపెట్టండి, తరువాత చల్లటి నీటితో దానిని శుభ్రం చేయండి. ఇలా వారానికి కనీసం ఒకసారి చేస్తే జుట్టు జీవాన్ని సంతరించుకుని మృదువుగా, సిల్కీగా తయారవుతుంది.

8. డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది :

8. డార్క్ సర్కిల్స్ ను తగ్గిస్తుంది :

మీరు అధిక పని ఒత్తిళ్ళకు గురవుతూ, తరచుగా కళ్ళు అలసటకు గురవుతూ ఉంటే, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటిని డార్క్ సర్కిల్స్ అని వ్యవహరిస్తారు. ఈ డార్క్ సర్కిల్స్ సమస్యకు నువ్వుల నూనె మీకు ఉత్తమ మార్గంగా సహాయం చేయగలదు. నువ్వుల నూనెను బాగా కులికించి, అందులో కాటన్ ప్యాడ్ ముంచి, కళ్ళ చుట్టూ ఉన్న వలయాల మీద సున్నితంగా అప్లై చేయాలి. ఇది మీ కళ్ళ కింద ఉన్న సంచులను తగ్గించడంతోపాటు, డార్క్ సర్కిల్స్ వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

పైన చెప్పిన చిట్కాలు ఎటువంటి దుష్ప్రభావాలు లేనివిగా ఉన్న కారణంగా, మీ సమస్యల ప్రకారం ఎంచుకోవడం మంచిది. మరియు ఉత్తమ ఫలితాల కోసం తరచుగా అనుసరించడం మేలు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Beauty Benefits Of Sesame Oil You Didn't Know

Sesame oil is one of the effective natural remedies for several beauty-related issues. It can be either used on its own or can be mixed with other ingredients for it to be more effective. For example, it can be used with rose water in order to attain smooth skin and hair. Sesame oil also can benefit in brightening lips.
Story first published: Saturday, March 23, 2019, 11:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more