For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోనే స్వయంగా ఫూట్ స్పా చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ గైడ్

|

నేటి జీవన విధానంలో అనేకరకాల పని ఒత్తిళ్ళు, తీరికలేని సమయం, బిజీ షెడ్యూల్స్ కారణంగా సరైన ఆరోగ్య సరళిని పాటించేందుకు కూడా సమయం కేటాయించలేని స్థితిలో ఉంటున్నామన్నది వాస్తవం. అందులోనూ మరీ ముఖ్యంగా మనం విస్మరిస్తున్న శరీర భాగం మన పాదాలు అని వేరే చెప్పనవసరం లేదు. తరచుగా మొహానికి సొగసులు అద్దడం, ఆరోగ్యకరమైన విధానాలను అనుసరించడం సర్వసాధారణంగా ఉంటుంది, కానీ పాదాల ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. పాదాలు ఆరోగ్యంగా లేకపోతే, తరువాతి కాలంలో అవి పెద్ద సమస్యగా రూపాంతరం చెంది చికాకుకు కారణమవుతాయి. కావున పాదాల పట్ల అశ్రద్ద తగదని గుర్తుంచుకోవాలి.

అంతేకాకుండా, మీ పాదాలను పట్టించుకోకపోవడం మూలంగా పగిలిన మడమలు, వాపు మరియు ఇతరత్రా అనేక అంటువ్యాధుల వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇవి నెమ్మదిగా అసౌకర్యం, చికాకును కలిగిస్తాయి. ఈ సమస్యలను అదుపులో ఉంచడానికి, మీ పాదాల పట్ల శ్రద్ద తీసుకోవడం, వాటికి కొంత సమయం కేటాయించడం ఎంతో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇందుకై వారాంతాన్ని ఎంచుకోవడం మంచిది.

Spa At Home

ముఖ్యంగా సెలూన్లోని ధరలు మీ జేబులకి కన్నాన్ని పెట్టేలా కనిపించవచ్చు, మీ పాదాల ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నారా, లేక వాళ్ళ లక్జరీ సెలూన్ నిర్వహణకు చందా ఇస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంటుంది. ఇదంతా మన సోమరితనం మూలంగా మనం చేసుకుంటున్న తప్పిదమే అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. మరో పక్క పాదాల ఆరోగ్యానికి సెలూన్లు మాత్రమే పరిష్కారం అనుకోవడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. పాదాల ఆరోగ్యాన్ని అనుసరించడం ప్రధానంగా రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ముందస్తు జాగ్రత్తలతో సమస్య జఠిలం కాకుండా నివారించడం. రెండవది, సమస్య ప్రారంభంలో ఉండగానే కొన్ని ప్రణాళికలు చేపట్టడం ద్వారా జాగ్రత్తపడడం.

ఈరోజు, మీ ఇంటి వద్దనే సౌకర్యవంతంగా స్పా అనుసరించడానికి గల దశల వారీ ప్రక్రియను మీముందు ఉంచబోతున్నాం. ఈ పద్ధతి మీకు పూర్తిగా సురక్షితమే కాకుండా, అన్ని సహజ పదార్థాలను కలిగి ఎటువంటి దుష్ప్రభావాలు, ప్రతిచర్యలు తలెత్తకుండా చూడగలదు.

మీ పాదాలకు అద్భుతమైన స్పా అనుభవాన్ని ఇచ్చేందుకు మీరు అనుసరించదగిన విధానాలేమిటో ఇప్పుడు చూద్దాం.

మీకు అవసరమైన పదార్ధాలు, వస్తువులు :

• ఒక పాత్ర నిండా వెచ్చని నీరు

• ఒక శుభ్రమైన టవల్

• 3 నుండి 4 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

• 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్

• 2 కప్పుల పచ్చిపాలు

• ఒక కప్పు గ్రాన్యులేటెడ్ షుగర్

• 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్

• 2 టేబుల్ స్పూన్ల తేనె

• 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం

• ఒక కప్పు ఉడికించిన ఓట్ మీల్

• బాదం నూనె (అవసరమైనప్పుడు)

• ప్యూమిస్ స్టోన్

• నెయిల్ కట్టర్

• నెయిల్ ఫిలర్

• నెయిల్ పెయింట్ రిమూవర్

• నెయిల్ పెయింట్

ఇంటి వద్దనే స్పా అనుసరించడానికి స్టెప్-బై-స్టెప్ గైడ్ :

1. గోళ్ళను ప్రెప్పింగ్ మరియు క్లిప్పింగ్ చేయాలి :

1. గోళ్ళను ప్రెప్పింగ్ మరియు క్లిప్పింగ్ చేయాలి :

స్పా అనుసరించడానికి మీరు చేయవలసిన మొదటి పని మీ కాలి గోళ్ళను సిద్దపరచడం. దీనికొరకు దిగువ పేర్కొన్న విధంగా అనుసరించండి.

అనుసరించవలసిన విధానం :

• మీ కాలి వేళ్ళ నుండి నెయిల్ పెయింట్ తొలగించడానికి నెయిల్ పెయింట్ రిమూవర్ ఉపయోగించండి.

• ఇప్పుడు మీ కాలి గోళ్ళను నెయిల్ కట్టర్ వినియోగించి కత్తిరించండి.

• మీ గోళ్లకు ఒక అందమైన ఆకృతి వచ్చేందుకు నెయిల్ ఫిలర్ ఉపయోగించండి. క్రమంగా వాటికి ఒక షేప్ ఇవ్వండి.

• మీరు గోళ్ళు కత్తిరించుకోకూడదు అని భావిస్తే, నెయిల్ ఫిలర్ ఉపయోగించి వాటిని కొద్దిగా చిన్నవిగా ఉండేలా చేయండి.

2. పాదాలను నానబెట్టుకోవాలి :

2. పాదాలను నానబెట్టుకోవాలి :

కొన్ని ముఖ్యమైన పదార్ధాలను కలిపిన వెచ్చని నీటిలో మీ పాదాలను కొంతసేపు నానబెట్టవలసి ఉంటుంది. మీ పాదాలను శుభ్రం చేసుకోవడం మరియు తరువాత దశలో వాటిని మృదువుగా చేయడం కొరకు ఈ పద్దతి మీకు సహాయపడుతుంది. ఇక్కడ మీరు అనుసరించదగిన విధానం ఏమిటో చూడండి.

అనుసరించవలసిన విధానం :

• ఒక వెచ్చని పాత్రలో నీటిని తీసుకోండి.

• ఈ నీటిలో పాలు, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మరియు నిమ్మరసం జోడించి బాగా మిళితం చేసి ఉంచండి.

• ఈ నీటిలో మీ పాదాలను నానబెట్టుకోవలసి ఉంటుంది.

• ఉత్తమ ఫలితాల కోసం కనీసం 20 నిముషాలు నాననివ్వండి.

• తరువాత, మీ పాదాలను బయటకు తీసి, టవల్ ఉపయోగించి వాటిని సున్నితంగా తుడవండి.

• ఇది మీ చర్మానికి మృదుత్వాన్ని ఇవ్వడమే కాకుండా, పోషణ కూడా అందిస్తుంది.

3. స్క్రబ్బింగ్ :

3. స్క్రబ్బింగ్ :

నానబెట్టి టవల్తో తుడిచిన తర్వాత మీ పాదాలను మరికొంత నునుపుగా చేసేందుకు, మరియు పాదాలనుండి మృతకణాలను తొలగించేందుకు స్క్రబ్ చేసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.

మీ పాదాల వేళ్ళ మీద కొన్ని ఫ్రెష్ క్రీములను అప్లై చేసి కొద్దిగా మసాజ్ చేయవలసి ఉంటుంది. తరువాత ఒక ప్యూమిస్ స్టోన్ ఉపయోగించి, మృత చర్మ కణాలు మరియు మీ పాదాలపై పేరుకున్న మురికిని తొలగించవలసి ఉంటుంది. ఇక్కడ మీ పాదాలలో, ప్రధానంగా అరికాళ్ల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించవలసి ఉంటుందని గుర్తుంచుకోండి, అవి తరచుగా మొద్దుబారుతూ ఉంటాయి. కావున వాటి పట్ల జాగ్రత్త అవసరం. ఇప్పుడు, మీరు మీ పాదాలను స్క్రబ్ చేయవలసి ఉంటుంది.

అనుసరించవలసిన విధానం :

• ఒక గిన్నెలో పంచదార, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలపి మిశ్రమంగా చేయండి.

• ఈ మిశ్రమాన్ని ఉపయోగించి కొన్ని నిమిషాలపాటు మీ పాదాలపై నలుదిక్కులా విస్తరించునట్లు రుద్దుతూ మసాజ్ చేయండి. మీ కాలి వేళ్ళ మద్యభాగంలో రుద్దడం మర్చిపోవద్దు.

• కాసేపటి తర్వాత నీటితో మీ పాదాలను శుభ్రపరచి, ఒక టవల్ తీసుకుని తడిని తీసివేయండి.

4. పాదాల మీద ప్యాక్ అప్లై చేయాలి :

4. పాదాల మీద ప్యాక్ అప్లై చేయాలి :

ఇప్పుడు మీ పాదాలకు ఎక్స్ట్రా డోస్ ఇవ్వాల్సిన సమయం. అనగా, ప్యాక్ అప్లై చేయవలసి ఉంటుంది.

అనుసరించదగిన విధానం :

• ఒక గిన్నెలో ఓట్ మీల్, తేనె, పాలు మిశ్రమంగా కలపాలి.

• ఈ మిశ్రమాన్ని మీ పాదాలకు మొత్తం అప్లై చేయాలి.

• దీనిని పొడిగా చేయడానికి సుమారు 20 నుండి 25 నిమిషాలపాటు అలాగే విడిచిపెట్టండి.

• గోరువెచ్చని నీటిని ఉపయోగించి బాగా రుద్ది శుభ్రం చేయాలి.

• టవల్ ఉపయోగించి మీ పాదాలను పొడిగా చేయండి.

5. మాయిశ్చరైజ్ :

5. మాయిశ్చరైజ్ :

పై పద్దతులన్నీ అనుసరించిన తర్వాత, మీ పాదాలను లోతుగా మాయిశ్చరైజ్ చేసుకోవలసి ఉంటుంది.

• మీ పాదాలను మాయిశ్చరైజ్ చేయడం కొరకు, మీ అరచేతులలో కొంత బాదం నూనెను తీసుకుని, గోరువెచ్చగా అయ్యేలా చేతుల మధ్య రుద్దండి.

• తరువాత మీ పాదాలకు 5 నుండి 10 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేయండి, తద్వారా అవి తేమను పొంది, పోషణను అందివ్వగలుగుతుంది.

6. గోళ్ల రంగు వేయండి :

6. గోళ్ల రంగు వేయండి :

• ఇది మన స్పాకు ముగింపు దశగా ఉంటుంది.

• మీకు నచ్చిన గోళ్ళ రంగును ఎంపిక చేసుకోండి. ఇక్కడ మంచి బ్రాండ్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

• మీ గోళ్ల మీద నెయిల్ పెయింట్ ను జాగ్రత్తగా అప్లై చేయండి, గోళ్ళ దగ్గరల్లో ఉన్న చర్మం ప్రభావితం కాకుండా చూసుకోండి.

• ఇది పూర్తి అయిన తరువాత, పెయింట్ ఎక్కువ కాలం కొనసాగేందుకు, మరియు చుట్టుపక్కలా విస్తరించకుండా ఉండేందుకు మీ పాదాలను చల్లటి నీటిలో ముంచండి.

ఈ ఫుట్ స్పా వలన కలిగే ప్రయోజనాలు :

ఇప్పుడు మీకు ఫుట్-స్పా ఎలా అనుసరించాలి, మరియు విధానాల గురించిన ఒక అవగాహన వచ్చింది కదా, ఇప్పుడు మీ పాదాలకు ఈ ఫుట్ స్పా అందించే మరిన్ని ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోండి.

• ఈ ప్రక్రియలో ఉపయోగించే పాలు మీ పాదాలను శుభ్రం చేసి, చర్మాన్ని తేమగా మారుస్తుంది. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ జోడించడం వల్ల మీ చర్మానికి శోధ నుండి ఉపశమనం కలుగుతుంది మరియు మీరు రిలాక్స్ అయ్యేందుకు దోహదపడుతుంది.

• నిమ్మకాయ చర్మాన్ని శుభ్రం చేస్తుంది, మరియు ఎక్స్ఫోలియేట్ చేయడంలో ఉపకరిస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియాను దూరంగా ఉంచుతుంది. క్రమంగా మీ పాదాలు ప్రకాశవంతంగా ఉండేలా సహాయపడుతుంది.

• చక్కెర ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలను కలిగి ఉంటుంది, ఇది చర్మాన్ని బయటకు తీసి, మృత చర్మ కణాలను తొలగిస్తుంది. అందువల్ల మీ పాదాల ఆరోగ్యానికి ఇది ఒక గొప్ప పదార్ధంగా చెప్పబడుతుంది.

• ఆలివ్ ఆయిల్, పంచదార మరియు నిమ్మరసం కలిపిన మిశ్రమం మీ చర్మాన్ని రక్షించడమే కాకుండా, మీ పాదాలకు పోషణను అందిస్తుంది.

• బాదం నూనె మీ పాదాలను లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది.

ఏదిఏమైనా ఇంట్లో అనుసరించదగిన ఈ స్పా, అన్ని రకాల సహజ పదార్థాలను కలిగి ఉండి, మీ పాదాలను ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. మృతకణాలను తొలగించి, చర్మం ప్రకాశవంతంగా మెరుగులు దిద్దుతుంది. ఇప్పుడు మీరు ఈ ఫుట్-స్పా గురించి, మరియు దాని అద్భుతమైన ప్రయోజనాల గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా, మరెందుకు ఆలస్యం? దీనిని ప్రయత్నించి, మరియు దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ అనుభవాన్ని పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర మేకప్, ఫాషన్, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

Step-By-Step Guide For Doing Foot Spa At Home

In the hustle and bustle of today's life, we tend to forget to take care of ourselves. And needless to say, what we ignore the most is our feet. A foot spa might seem like a luxury, especially when the prices in salons could burn a hole in your pockets. Knowing how essential taking proper care of your feet is, here is how you can do a foot spa at home.
Desktop Bottom Promotion